Ravi Teja, Vishal, Aamir Khan And Other Heroes Injured In Shooting, Refuses To Halt Shooting - Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో ప్రమాదాలు.. అయినా ‘తగ్గేదే లే’ అంటున్న హీరోలు

Published Fri, Jul 15 2022 9:36 AM | Last Updated on Fri, Jul 15 2022 11:43 AM

Ravi Teja, Vishal, Aamir Khan And Other Heroes Injured In Shooting  - Sakshi

స్క్రీన్‌పై హీరో రిస్కీ ఫైట్స్‌ చేస్తుంటే ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌. అందుకే ఫ్యాన్స్‌ కోసం కూడా హీరోలు రిస్కులు తీసుకుంటుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి. అలా ఈ మధ్య షూటింగ్‌లో గాయపడిన హీరోలు కొందరు ఉన్నారు. డాక్టర్‌ విశ్రాంతి తీసుకోమన్నా ‘తగ్గేదే లే’ అంటూ షూటింగ్‌కి హాజరు అయ్యారు. ఆ హీరోల గురించి తెలుసుకుందాం. 

మనుషులకు దొరక్కుండా జాగ్రత్తగా జారుకునే పనిలో ఉన్నారు రవితేజ. ఎత్తయిన మేడల మీద నుంచి దూకడం, ఎత్తుపల్లాలు ఉన్న రోడ్డు మీద పరిగెత్తడం, అడ్డం వచ్చినవారిని ఇరగ్గొట్టడం... ఇదే పని. ఇదంతా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా కోసమే. వంశీ దర్శకత్వంలో స్టూవర్టుపురం దొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నాగేశ్వరరావు పాత్రను రవితేజ చేస్తున్నారు. దొంగ పాత్ర కాబట్టి సినిమాలో యాక్షన్‌ పార్ట్‌ ఎక్కువ. ఓ రిస్కీ ఫైట్‌ తీస్తున్నప్పుడు రవితేజ గాయాలపాలయ్యారు. ఫలితంగా పది  కుట్లు వరకూ పడ్డాయి. అయినా రెస్ట్‌ తీసుకోకుండా రవితేజ షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఇక రవితేజలానే గోపీచంద్‌ కూడా తన తాజా చిత్రం షూటింగ్‌లో గాయపడ్డారు. ఈ మూవీ కోసం మైసూర్‌లో ఓ టెంపుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌లో గోపీచంద్‌ పాల్గొన్నప్పుడు కాలుజారి ఎత్తయిన ప్రదేశం నుంచి జారిపడ్డారు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఎంత రిస్కీ ఫైట్‌ని అయినా డూప్‌ లేకుండా చేస్తుంటారు హీరో విశాల్‌. ఇప్పటికే పలు చిత్రాల షూటింగ్స్‌లో ఆయన గాయపడ్డారు. తాజాగా ‘లాఠీ’ సినిమా షూటింగ్‌ సెట్‌లో ఒక్కసారి కాదు.. పలుమార్లు ప్రమాదం బారినపడ్డారు.

ఈ చిత్రంలో విశాల్‌ది పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌. ఫైట్స్‌ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ ఒక్క సినిమా సెట్‌లోనే ఎక్కువసార్లు గాయపడినా షూటింగ్‌కి బ్రేక్‌ ఇవ్వకుండా చేస్తున్నారు విశాల్‌. మరోవైపు ‘కార్తికేయ 2’ కోసం యాక్షన్‌ సీన్‌ చేస్తున్నప్పుడు హీరో నిఖిల్‌ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చీలమండ బెణకడంతో డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి కూడా సూచించారు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ హీరోగా నటించిన ‘కార్తికేయ’ (2014)కి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ రూపొందుతోంది. చందూనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా సెట్స్‌లో ఉన్న కొన్ని చిత్రాల షూటింగ్స్‌లో గాయపడిన హీరోలు ఉన్నారు.    

       

పెయిన్‌ కిల్లర్‌తో... 
బాలీవుడ్‌లో ఆమిర్‌ ఖాన్‌ని ‘మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌’ అంటారు. పాత్ర ఎలా డిమాండ్‌ చేస్తే ఫిజిక్‌ని అలా మార్చేస్తుంటారు ఆమిర్‌. అందుకు ఒక ఉదాహరణ ‘దంగల్‌’. ఇక 57ఏళ్ల వయసులోనూ ఆయన రిస్క్‌ తీసుకున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. ఈ చిత్రం షూటింగ్‌లో లాంగ్‌ రన్‌ చేసే చేజింగ్‌ సీన్‌ ఒకటి ఉంది. ఆ సీన్‌ చేస్తున్నప్పుడు ఆమిర్‌ కాలికి గాయమైంది. ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన పరిస్థితిలో పెయిన్‌ కిల్లర్లు తీసుకుని, బ్రేక్‌ తీసుకోకుండా షూటింగ్‌ చేశారు ఆమిర్‌ ఖాన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement