పోలీసాఫీసర్‌ వీరశంకర్‌ | Ravi TEJA Krack Movie update | Sakshi
Sakshi News home page

పోలీసాఫీసర్‌ వీరశంకర్‌

Published Fri, Sep 4 2020 6:32 AM | Last Updated on Fri, Sep 4 2020 6:32 AM

Ravi TEJA Krack Movie update - Sakshi

‘డాన్‌శీను, బలుపు’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత హీరో రవితేజ – డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్‌’. సరస్వతీ ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నెగటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలోని రవితేజ కొత్త స్టిల్‌ను గురువారం రిలీజ్‌ చేశారు. ఇందులో ఏపీ పోలీసాఫీసర్‌ పి. వీరశంకర్‌గా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది.

గోపీచంద్‌ మలినేని, బి.మధు మాట్లాడుతూ– ‘‘ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకొని తయారు చేసిన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. చివరి షెడ్యూల్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. త్వరలో బ్యాలెన్స్‌ షెడ్యూల్‌ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమన్‌ స్వరపరచిన పాటల్లో ఓ పాటను త్వరలో విడుదల చేయనున్నాం. థియేటర్లు తెరుచుకోగానే ‘క్రాక్‌’ను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జి.కె. విష్ణు, సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement