‘‘రవితేజగారితో ఇంతకుముందు ‘డా¯Œ శీను, బలుపు’ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేశాను. ప్రస్తుతం రియలిస్టిక్ స్టోరీస్‌కి మంచి ఆదరణ లభిస్తుండటంతో మూడో చిత్రంగా ఒక రియలిస్టిక్ అప్రోచ్‌తో సినిమా చేస్తే బాగుంటుందనిపించి ‘క్రాక్’ చేశా’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా, సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్రాక్’. బి. మధు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని చెప్పిన విశేషాలు.
► రియల్ క్యారెక్టర్స్‌ను కమర్షియల్ సినిమాలోకి పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ‘క్రాక్’. నేను చదువుకునే రోజుల్లో ‘ఒంగోలులో రాత్రి కరెంట్ పోతే హత్య జరుగుతుంది’ అని చెప్పుకునే వారు.. మా ఊరి దగ్గరలో కొంతమంది గాడిద రక్తం తాగేవారు. అలా తాగిన తర్వాత ఒళ్లంతా చెమటలు పట్టేలా పరిగెత్తకపోతే రక్తం గడ్డకట్టుకు పోతుందని కొద్దిసేపు వేగంగా పరిగెత్తే వారు. అలా చేస్తే బాడీ స్ట్రాంగ్‌గా తయారవుతుందని వాళ్ల నమ్మకం. అలాంటి కొన్ని అంశాలకు ఒంగోలులో జరిగే మర్డర్స్‌కి లింక్ చేస్తూ థ్రిల్లింగ్‌గా కథ రాసుకున్నాం.
► 2021లో సంక్రాంతికి వస్తోన్న మొదటి చిత్రం మాదే కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని 2019 మే 8న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా ప్రభావం వల్ల వాయిదా వేశాం. అయితే ఒక మంచి సినిమా పండగకి రావాలని రాసిపెట్టిందేమో.. కాకపోతే ఈసారి సంక్రాంతిని కొంచెం ముందుగానే మీ ముందుకు తీసుకువస్తున్నాం. రవితేజగారి కెరీర్‌లో అత్యధికంగా 1000కి పైగా థియేటర్‌లలో ఈ సినిమా విడుదలవుతోంది.
► ఒక సీఐ పాత్రని స్ఫూర్తిగా తీసుకుని రవితేజగారి పాత్ర తీర్చిదిద్దాను. కర్నూల్ నేపథ్యం కూడా సినిమాలో ఉంటుంది. కామెడీ, యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ‘బలుపు’ తర్వాత రవితేజగారు అంత అందంగా, ఎనర్జిటిక్‌గా కనిపించిన చిత్రమిదే. ‘మెర్సల్, బిగిల్’ ఫేమ్ జీకే విష్ణుగారు ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమవుతున్నారు.
► ఈ సినిమాలో హీరో కొడుకు పాత్రలో మా అబ్బాయి సాత్విక్ నటించాడు.. కావాలని తీసుకోలేదు.. ఆ పాత్రకు సరిపోతాడనే తీసుకున్నాం. సముద్రఖని, వరలక్ష్మి పాత్రలు బాగుంటాయి. నేను అసోసియేట్‌గా ఉన్నప్పుడు మణిశర్మగారి దగ్గర పని చేసేవాడు తమన్. అప్పటి నుండి మా ఇద్దరికి మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. నా సినిమా అంటే తమన్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడని నేను నమ్ముతాను.
► ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై బాగా ఆడటం దేశమంతా హాట్ టాపిక్ అయింది. తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఎంత ఇష్టపడతారనేది నిరూపితం అయింది. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాను. నా తర్వాతి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌లో ఉంటుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
సంక్రాంతిని ముందే తెస్తున్నాం
Published Sat, Jan 9 2021 12:27 AM | Last Updated on Sat, Jan 9 2021 1:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment