Samudrakhani
-
తమిళ డైరెక్టర్ కొడుకు హీరోగా ‘ హిట్ లిస్ట్’
తమిళ స్టార్ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా నటించిన చిత్రం ‘హిట్ లిస్ట్’. సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలు పోషించారు. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు.యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. కాగా నేడు ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా శ్రీ మురళీమోహన్ గారు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు విచ్చేశారు. వీరితోపాటు నిర్మాత, దర్శకుడు కె. ఎస్. రవికుమార్ గారు, హీరో విజయ్ కనిష్క, దర్శకులు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్, తెలుగు రిలీజ్ నిర్మాతలు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు బెక్కం రవీంద్ర గారు పాల్గొన్నారు.శ్రీ మురళీమోహన్ గారు మాట్లాడుతూ : హీరో విజయ్ కనిష్క నాన్నగారు విక్రమన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా నటించాడు. నాకు బాగా సన్నిహితుడు కె. ఎస్. రవికుమార్ గారు ఈ సినిమాకి నిర్మాతక వ్యవహరించడం మంచి విషయం. ట్రైలర్ చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా మన సక్సెస్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మాట్లాడుతూ : నన్ను ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కె. ఎస్. రవికుమార్ గారికి టీం కి నా అభినందనలు తెలుపుతున్నాను. మంచి నిర్మాత దర్శకులు కె. ఎస్. రవికుమార్ గారు. విజయ్ కనిష్కకి ఈ సినిమా మంచి విజయం అవుతుందని టీమ్ అందరికీ మంచి సక్సెస్ అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష
త్రిష జీవితంలో సమస్యలు అనేవి కొత్తేమీ కాదు. ఈమె ఒక్కో స్టేజ్‌లో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిని ఎదురొడ్డి ముందుకు సాగుతున్నారు. ఆ మధ్య వరుస ఫ్లాప్‌లతో కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ చైన్నె సుందరి ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆ తరువాత లియో చిత్రంలో విజయ్‌తో జతకట్టి కమర్షియల్ హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి చిత్రం, కమలహాసన్‌కు జంటగా థగ్స్ లైఫ్ వంటి భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ అగ్రకథానాయకిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. (ఇదీ చదవండి: జయలలిత ఆస్తుల వేలం.. కోర్టుకు చెల్లించాల్సిన డబ్బు ఎంత..?) తాజాగా టాలీవుడ్‌లోనూ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యక్తి గత ఆరోపణలకు గురవుతున్నారు. అన్నాడీఎంకే బహిష్కరణ కార్యనిర్వాహకుడు ఏవీ రాజు త్రిషను అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆమె పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది త్రిషను మానసిక క్షోభకు గురి చేసిన విషయం తెలిసిందే. కూవత్తూర్ సంఘటన సమయంలో నటుడు, రాజకీయ నాయకుడు కరుణాస్, నటి త్రిషతో పాటు మరికొందరిని గెస్ట్ హౌస్‌కి పంపారన్నదే ఏవీ.రాజు వేసిన నింద. దీన్ని తీవ్రంగా ఖండించిన త్రిష అతనిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ముఖ్యంగా దర్శకుడు చేరన్, సముద్రఖని, నాజర్ త్రిషపై ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దీనికి స్పందించిన త్రిష తనకు సపోర్ట్‌గా నిలిచిన ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు అంటూ ఆమె పేర్కొన్నారు. -
మంచి సినిమాకి ఆదరణ ఉంటుంది
‘‘డైరెక్టర్ శివ ప్రసాద్‌గారు తొలి సినిమా ‘విమానం’తో మంచి హిట్ అందుకున్నందుకు అభినందనలు. మంచి సినిమాకు ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయాన్ని ‘విమానం’ మరోసారి నిరూపించింది’’ అని నటుడు, దర్శకుడు సముద్ర ఖని అన్నారు. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘విమానం’ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే కొత్త దర్శకులకు ఇంకా మంచి ఉత్సాహం వస్తుంది’’ అన్నారు. ‘‘విమానం’ చిత్రం చూశాక ‘మా నాన్న గుర్తుకొచ్చాడు’ అంటూ మా నాన్న, అమ్మ చెప్పడంతో చాలా ఆనందం వేసింది’’ అన్నారు శివప్రసాద్ యానాల. నటుడు ధనరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, రైటర్ హను, సినిమాటోగ్రాఫర్ వివేక్, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్ మాట్లాడారు. -
ట్రైలర్ చూస్తుంటే కన్నీళ్లొచ్చాయి
‘విమానం’ ట్రైలర్ చూస్తుంటే మంచి భావోద్వేగాలతో సినిమా ఉంటుందని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ని దర్శకుడు శివ ప్రసాద్ ట్రైలర్లో అద్భుతంగా చూపించాడు. ట్రైలర్ నా మనసును కదిలించింది.. నాకు కన్నీళ్లొచ్చాయి’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, మాస్టర్ ధ్రువన్ కీలక పాత్రల్లో శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ‘విమానం’ సినిమా చూడాలి.. అప్పుడే పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుందో తెలుస్తుంది’’ అన్నారు. జీ స్టూడియో సౌత్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వివేక్ కాలేపు. -
ఆకట్టుకుంటున్న బ్రహ్మానందం ‘పంచ తంత్రం’ ట్రైలర్
బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటిస్తున్న యాంథాలజీ ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న విడుదల చేసిన చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేసింది. ‘పంచతంత్రం’ ట్రైలర్‌ను గమనిస్తే.. ఇది 5 జంటలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. డా.బ్రహ్మానందం ఈ ఐదు కథలకు పంచేద్రియాలు అనే పేరు పెట్టి తన కోణంలో స్టార్ట్ చేస్తారని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధలు కూడా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరించాం. మన పనులను ఎంత బాధ్యతగా పూర్తి చేస్తూ ముందుకెళ్లామనేది కథాంశం అని క్లియర్‌గా తెలుస్తుంది. సినిమాలో మనకు కనిపించబోయే ఐదు జంటలకు ఒక్కో కథ .. ఒక్కో రకమైన ప్రయాణం.. అవన్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయనే ‘పంచతంత్రం’ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో ముందుకు సాగుతుంది. ప్రతి కథలో మన చుట్టూ ఉన్న సమాజాన్ని అందులో వ్యక్తుల వ్యక్తిత్వాలను దర్శకుడు హర్ష ఎంతో అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లిన్నట్లు తెలుస్తోంది. అర్థవంతమైన సంభాషణలు ప్రతి పాత్రలోని భావోద్వేగాలను సెన్సిబుల్‌గా ఎలివేట్ చేస్తున్నాయి. డిసెంబర్9న ఈ చిత్రం విడుదల కాబోతంది. -
కలెక్టర్‌గా నితిన్ మెప్పించాడా? 'మాచర్ల నియోజకవర్గం' మూవీ రివ్యూ
టైటిల్: మాచర్ల నియోజకవర్గం నటీనటులు: నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా, సముద్ర ఖని, వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి దర్శకత్వం: ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి సంగీతం: మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరేళ్ల విడుదల తేది: ఆగస్టు 12, 2022 నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా హీరోహీరోయిన్లుగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘'మాచర్ల నియోజకవర్గం'’. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్టు 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ: సిద్ధార్థ రెడ్డి (నితిన్) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ పొందుతాడు. అక్కడ కొన్ని ఏళ్లపాటు ఎన్నికలు జరగవు. అందుకు కారణం రాజప్ప అని తెలుసుకున్న సిద్ధార్థ రెడ్డి ఏం చేశాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో సిద్ధార్థ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: ఎప్పుడు ప్రేమకథా చిత్రాలతో అలరించిన నితిన్.. అందుకు భిన్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ముందుకొచ్చాడు. సినిమాలో పాలిటిక్స్, కలెక్టర్ విధులు చూపిస్తూనే కామెడీని పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి. కొత్త డైరెక్టర్ కొత్త ఫార్ములాతో వస్తే బాగుండేది. కానీ రెగ్యూలర్ రొటీన్ ఫార్ములాతో తెరపై 'మాచర్ల నియోజకవర్గం'ను ఆవిష్కరించాడు. అక్కడక్కడ స్క్రీన్‌ప్లే కొద్దిగా స్లో కావడంతో సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇక నితిన్‌ను కొత్తగా చూపించారు. కలెక్టర్‌గా నితిన్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎవరెలా చేశారంటే? గుంటూరు కలెక్టర్ సిద్ధార్థ రెడ్డిగా నితిన్ కొత్తగా కనిపించాడు. స్టైలిష్ లుక్ నుంచి నటన, అభినయం వరకు ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాలతోపాటు ఫైటింగ్ సీన్లలో మెప్పించాడు. ఇక స్వాతి పాత్రలో హీరోయిన్ కృతీశెట్టి నటన అలరిస్తుంది. కేథరీన్ థ్రేసా తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్ర ఖని విలనిజం, వెన్నెల కిశోర్ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. తదితర పాత్రలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సన్నివేశాలు తగినట్లుగా బీజీఎం ఆకట్టుకుంది. ఇక అంజలి మెరిసిన రారా రెడ్డి ప్రధానాకర్షణగా నిలిచింది. ఫైనల్‌గా రొటీన్ ఫార్ములాతో నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' ఉంది. -
'మాచర్ల నియోజకవర్గం' నటుడిగా సంతృప్తినిచ్చింది: సముద్ర ఖని
మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు థియేరట్స్కి వస్తారు. రీసెంట్గా 'సీతారామం', 'బింబిసార' చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. ఈ సక్సెస్‌ను మాచర్ల నియోజకవర్గం కొనసాగిస్తుందని నమ్ముతున్నాను అన్నారు దర్శక, రచయిత-నటుడు సముద్ర ఖని. నితిన్, కృతిశెట్టి జంటగా ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేసిన సముద్ర ఖని మాట్లాడుతూ.. ''ఇందులో రాజప్ప అనే పాత్ర చేశాను. నటనకు మంచి ఆస్కారం ఉండటంతో సవాల్‌గా తీసుకొని నటించాను. ఈ చిత్రకథ తరమాలోనే తమిళనాడులోని ఓ ప్రాంతంలో 25 ఏళ్లు ఎలక్షన్స్ జరగలేదు. చివరికి ఉదయ్‌శంకర్ అనే ఓ ఐఏఎస్ ఆఫీసర్ చొరవ తీసుకుని స్థానికులతో మాట్లాడి ఎలక్షన్స్ జరిగేలా చేశారు. ఈ అంశాన్ని రాజశేఖర్‌తో షేర్ చేసుకున్నాను అన్నారు. ఇంకా మాట్లాడుతూ రచన అంటే నాకు ప్రాణం. లొకేషన్లో ఖాళీ సమయం దొరికినప్పుడు కథలు రాస్తుంటాను. ప్రస్తుతం చిరంజీవిగారి గాడ్‌ఫాదర్, నానీ దసరా సినిమాల్లో నటిస్తున్నాను'' అన్నారు. -
'ఆర్ఆర్ఆర్'లో అలరించే కీలక పాత్రధారులు వీరే..
RRR Movie Main Key Characters: ప్రస్తుతం యావత్ భారతదేశం వేయి కళ్లతో ఎదురుచూసిన తరుణం సమీపించింది. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం 'రౌద్రం.. రణం.. రుధిరం'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ నటనను వీక్షించేందుకు ఇంకా ఒక్క రోజే మిగిలింది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ శుక్రవారం అంటే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్, సీతగా బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ అలరించనున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్లో ఈ ఇద్దరే కాకుండా ఇతర కీలక పాత్రలు కూడా సందడి చేయనున్నాయి. ఆ పాత్రలేంటో చూద్దామా ! 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువకానున్నాడు. ఇందులో ఆయనది పవర్ఫుల్ రోల్ అని తెలుస్తోంది. 'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయ్..', 'నేనంటేనే ఓ పోరాటం' అంటూ తన చుట్టూ ఉన్న ప్రజల కోసం భార్యాబిడ్డల్ని వదిలి యుద్ధభూమిలోకి అడుగు పెట్టిన పోరాటయోధుడిగా అజయ్ దేవగన్ కనిపించనున్నారు. ఈ రోల్‌కు అజయ్ ఎలాంటి రెమ్మ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. అజయ్ దేవగన్‌కు సతీమణిగా సరోజిని పాత్రలో అలరించనుందని స్టార్ హీరోయిన్ శ్రియ సరన్. 'ఛత్రపతి' తర్వాత రాజమౌళి సినిమాలో మళ్లీ కనిపిస్తోంది శ్రియ. భర్త అడుగుజాడల్లో పోరాటంలోకి అడుగుపెట్టిన స్త్రీగా ఆమె పండించిన హావాభావాలు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యేలా ఉన్నాయి. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని నటించారు. ఇందులో ఆయన పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో రామ్‌చరణ్‌కు సన్నిహితుడిగా కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. బ్రిటీష్ వారికి ఎదురుతిరిగేందుకు చెర్రీ సిద్ధమవుతుండగా 'చాలా ప్రమాదం.. ప్రాణాలు పోతాయిరా..' అని ఆయన ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ మెప్పించింది. ఇంకా ఈ మూవీలో రాజీవ్ కనకాల నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళికి ఆయనకు మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంది. జక్కన్న తెరకెక్కించిన ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. వీళ్లే కాకుండా ఎన్టీఆర్‌కు లవర్‌గా విదేశీ భామ ఒలివీయా మోరీస్ కొన్ని సన్నివేశాల్లో తళుక్కున మెరిసి ఆకట్టుకోనుంది. విలనిజంతో కూడకున్న పాత్రలో ఐరిష్ నటి అలిసన్ డూడీ నటించారు. లేడీ స్కాట్‌గా ఆమె తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. కమెడియన్, నటుడు రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ వెంట ఉండే వ్యక్తిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. -
మీడియా సమావేశంలో రైటర్ చిత్ర యూనిట్
చెన్నై సినిమా: తన భావాలతో ఏకీభవిస్తేనే ఎవరికైనా తన కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని దర్శక నిర్మాత పా.రంజిత్ అన్నారు. 'అట్టకత్తి'తో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత మద్రాస్, కబాలి, కాలా, సర్పట్టా వంటి విజయవంత చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే విధంగా నిర్మాతగానూ నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నవ దర్శకులకు అవకాశం కల్పిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను నిర్మిస్తున్నారు. నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రాటీయో ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం 'రైటర్'. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఇనియా నాయికగా నటించారు. ఈ చిత్రం ద్వారా ఫ్రాంక్లిన్ జాకోబ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోవింద్ వసంత సంగీతాన్ని అందించిన 'రైటర్' చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం మీడియో సమావేశంలో పా.రంజిత్ మాట్లాడుతూ.. సమాజంలోని సమస్యలను ఆవిష్కరించే విధంగా తన చిత్రాలు ఉంటాయన్నారు. -
సంక్రాంతిని ముందే తెస్తున్నాం
‘‘రవితేజగారితో ఇంతకుముందు ‘డా¯Œ శీను, బలుపు’ వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాను. ప్రస్తుతం రియలిస్టిక్ స్టోరీస్‌కి మంచి ఆదరణ లభిస్తుండటంతో మూడో చిత్రంగా ఒక రియలిస్టిక్ అప్రోచ్‌తో సినిమా చేస్తే బాగుంటుందనిపించి ‘క్రాక్’ చేశా’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా, సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్రాక్’. బి. మధు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని చెప్పిన విశేషాలు. ► రియల్ క్యారెక్టర్స్‌ను కమర్షియల్ సినిమాలోకి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ‘క్రాక్’. నేను చదువుకునే రోజుల్లో ‘ఒంగోలులో రాత్రి కరెంట్ పోతే హత్య జరుగుతుంది’ అని చెప్పుకునే వారు.. మా ఊరి దగ్గరలో కొంతమంది గాడిద రక్తం తాగేవారు. అలా తాగిన తర్వాత ఒళ్లంతా చెమటలు పట్టేలా పరిగెత్తకపోతే రక్తం గడ్డకట్టుకు పోతుందని కొద్దిసేపు వేగంగా పరిగెత్తే వారు. అలా చేస్తే బాడీ స్ట్రాంగ్‌గా తయారవుతుందని వాళ్ల నమ్మకం. అలాంటి కొన్ని అంశాలకు ఒంగోలులో జరిగే మర్డర్స్‌కి లింక్ చేస్తూ థ్రిల్లింగ్‌గా కథ రాసుకున్నాం. ► 2021లో సంక్రాంతికి వస్తోన్న మొదటి చిత్రం మాదే కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని 2019 మే 8న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా ప్రభావం వల్ల వాయిదా వేశాం. అయితే ఒక మంచి సినిమా పండగకి రావాలని రాసిపెట్టిందేమో.. కాకపోతే ఈసారి సంక్రాంతిని కొంచెం ముందుగానే మీ ముందుకు తీసుకువస్తున్నాం. రవితేజగారి కెరీర్లో అత్యధికంగా 1000కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ► ఒక సీఐ పాత్రని స్ఫూర్తిగా తీసుకుని రవితేజగారి పాత్ర తీర్చిదిద్దాను. కర్నూల్ నేపథ్యం కూడా సినిమాలో ఉంటుంది. కామెడీ, యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘బలుపు’ తర్వాత రవితేజగారు అంత అందంగా, ఎనర్జిటిక్‌గా కనిపించిన చిత్రమిదే. ‘మెర్సల్, బిగిల్’ ఫేమ్ జీకే విష్ణుగారు ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమవుతున్నారు. ► ఈ సినిమాలో హీరో కొడుకు పాత్రలో మా అబ్బాయి సాత్విక్ నటించాడు.. కావాలని తీసుకోలేదు.. ఆ పాత్రకు సరిపోతాడనే తీసుకున్నాం. సముద్రఖని, వరలక్ష్మి పాత్రలు బాగుంటాయి. నేను అసోసియేట్‌గా ఉన్నప్పుడు మణిశర్మగారి దగ్గర పని చేసేవాడు తమన్. అప్పటి నుండి మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. నా సినిమా అంటే తమన్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడని నేను నమ్ముతాను. ► ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై బాగా ఆడటం దేశమంతా హాట్ టాపిక్ అయింది. తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఎంత ఇష్టపడతారనేది నిరూపితం అయింది. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాను. నా తర్వాతి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌లో ఉంటుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. -
అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు నటుడు
తెలుగులో ‘శంభో శివ శంభో, జెండాపై కపిరాజు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు సముద్రఖని. తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఆ తర్వాత నటుడిగా మారారు. వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సముద్రఖని తాజాగా రవితేజ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. ‘డాన్ శీను, బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘బలుపు’ తర్వాత ఈ చిత్రంలో రవితేజతో జోడీ కట్టారు శ్రుతీహాసన్. ఇదిలా ఉంటే సముద్రఖని దర్శకత్వంలో రవితేజ, ‘అల్లరి’ నరేశ్, శివబాలాజీ, ప్రియమణి తదితరుల కాంబినేషన్లో వచ్చిన ‘శంభో శివ శంభో’ చిత్రం మంచి విజయం సాధించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు దర్శకుడిగా రవితేజ సినిమా చేస్తే ఇప్పుడు నటుడిగా రవితేజ సినిమాలో నటించనున్నారు సముద్రఖని. -
బాబాయ్‌గా...!
నటుడిగా, డైరెక్టర్‌గా సముద్రఖని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కాలా’ చిత్రంలో రజనీకాంత్ ఫ్రెండ్‌గా, ‘రఘవరన్ బీటెక్’ చిత్రంలో ధనుశ్ తండ్రిగా సముద్రఖనిని చూసే ఉంటారు. తెలుగులో వచ్చిన రవితేజ ‘శంభో శివ శంభో’, నాని ‘జెండాపై కపిరాజు’ సినిమాలకు ఆయనే దర్శకుడు. ఇప్పుడు ఓ కీలక పాత్రతో ఆయన తెలుగు తెరపై మరోసారి కనిపించబోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రఖని ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారన్నది తాజా ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో ఆయన రామ్‌చరణ్ పాత్రకు బాబాయ్‌గా కనిపిస్తారట. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ జనవరిలో స్టార్ట్ కానుంది. ఇందులో హీరోయిన్లుగా కీర్తీ సురేశ్, కియారా అద్వానీ పేర్లు వినిపిస్తున్నాయి. -
శశికుమార్, నానిలతో ద్విభాషాచిత్రం?
చెన్నై: తమిళనటుడు శశికుమార్, తెలుగు నటుడు నానిలతో దర్శకుడు సముద్రఖని ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. నటుడు, దర్శకుడు అంటూ జోరు గుర్రాల స్వారీ చేస్తున్న సముద్రఖని ఇటీవల స్వీయ దర్శకత్వంలో నటించిన అప్పా, తొండన్ చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి. మరో పక్క ఇతర చిత్రాలలో ముఖ్య పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్న సముద్రకని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈయన తమిళంలో దర్శకత్వం వహించిన నాడోడిగళ్ చిత్రాన్ని తెలుగులో శంభో శివ శంభో పేరుతో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. అదే విధంగా జయంరవి ద్విపాత్రాభినయం చేసిన నిమిర్న్దు నిల్ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందించారు. తెలుగులో జెండాపై కపిరాజు పేరుతో తెరకెక్కిన ఇందులో నాని కథానాయకుడిగా నటించారు. ఇదే విధంగా మరో సారి సముద్రకని ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో తమిళవెర్షన్లో శశికుమార్, తెలుగులో నాని హీరోలుగా నటించనున్నట్లు సమాచారం. నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన నటించిన తెలుగు చిత్రం నిన్నుకోరి శుక్రవారం తెరపైకి రానుంది. కాగా నాని అక్కడ వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. సముద్రకని దర్శకత్వంలో ఎప్పుడు నటిస్తారన్న విషయం గురించి క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అదే విధంగా శశికుమార్ ప్రస్తుతం కొడివీరన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.