
సముద్రఖని
తెలుగులో ‘శంభో శివ శంభో, జెండాపై కపిరాజు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు సముద్రఖని. తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఆ తర్వాత నటుడిగా మారారు. వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సముద్రఖని తాజాగా రవితేజ–గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. ‘డాన్ శీను, బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.
లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘బలుపు’ తర్వాత ఈ చిత్రంలో రవితేజతో జోడీ కట్టారు శ్రుతీహాసన్. ఇదిలా ఉంటే సముద్రఖని దర్శకత్వంలో రవితేజ, ‘అల్లరి’ నరేశ్, శివబాలాజీ, ప్రియమణి తదితరుల కాంబినేషన్‌లో వచ్చిన ‘శంభో శివ శంభో’ చిత్రం మంచి విజయం సాధించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు దర్శకుడిగా రవితేజ సినిమా చేస్తే ఇప్పుడు నటుడిగా రవితేజ సినిమాలో నటించనున్నారు సముద్రఖని.
Comments
Please login to add a commentAdd a comment