రష్మిక, శ్రీలీల ఔట్‌.. కృతి, సాక్షి ఇన్‌ | Rashmika Mandanna Out From Gopichand Malineni,Raviteja Latest Film | Sakshi
Sakshi News home page

రష్మిక, శ్రీలీల ఔట్‌.. కృతి, సాక్షి ఇన్‌

Oct 29 2023 1:10 PM | Updated on Oct 29 2023 2:20 PM

Rashmika Mandanna Out From Gopichand Malineni,Raviteja Latest Film - Sakshi

క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే స్టార్‌ హీరోల సినిమాలకు ట్రెండింగ్‌ హీరోయిన్లను సెట్‌ చేయడానికి దర్శకులు ప్రయత్నిస్తుంటారు. కానీ ఒక్కోసారి అంతా ఫిక్స్‌ అయి.. సినిమా సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత కూడా.. క్యాస్టింగ్‌ మార్పులు జరుగుతుంటాయి. దానికి ముఖ్య కారణం డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడం. ముఖ్యంగా హీరోయిన్ డేట్స్ లాక్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఆ కష్టాలను యంగ్‌ డైరెక్టర్స్‌ గోపీచంద్ మలినేని, గౌతమ్‌ తిన్నానూరి పడుతున్నారు. 

వీర సింహారెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని రవితేజతో పవర్ ఫుల్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. రవితేజకు జోడిగా రష్మిక పేరును ఆల్ మోస్ట్ ఫైనల్ చేశారు. అయితే షూటింగ్ ప్రారంభం అయ్యే నాటికి డేట్స్ ఇష్యూ వల్ల రష్మిక తప్పుకుంది. ఇప్పుడు రష్మిక స్థానంలో కృతి శెట్టి లేదా ప్రియాంక అరుల్ మోహన్‌ ఎంపిక చేయాలనుకుంటున్నాడు గోపీచంద్ మలినేని.

ఇక జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్నానూరి ఇప్పుడు విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ముందుగా టాలీవుడ్ హార్ట్ త్రోబ్ శ్రీలీలను అనుకున్నారు. కాని ఖుషి ఫ్లాప్ తో దేవరకొండ తన డేట్స్ మొత్తాన్ని ‘ఫ్యామిలీ స్టార్’ కు డైవర్ట్ చేయడంతో గౌతమ్ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దాంతో శ్రీలీల ఇప్పుడు డేట్స్ లేవు అనే రీజన్ తో ఈ ప్రాజెక్ట్  నుంచి తప్పుకుంది. దర్శకుడు గౌతమ్ ఇప్పుడు శ్రీలీల స్థానంలో ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్యను ఎంపిక చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement