
ఇందూజ రవిచంద్రన్, సెల్వ రాఘవన్, రవితేజ, వీవీ వినాయక్
హీరో రవితేజ కెరీర్‌లో కొత్త చిత్రం ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అన్మోల్ శర్మ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు.
దర్శకుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘ఒక పవర్‌ఫుల్ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చూడని ఒక కొత్త పాత్రలో ప్రేక్షకులు రవితేజను చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. సెల్వ రాఘవన్, ఇందూజ రవి చంద్రన్ కీ రోల్స్ చేయనున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జీకే విష్ణు.
Comments
Please login to add a commentAdd a comment