
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’. ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజైన సాంగ్‌కు ఆడియన్స్‌ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మరో క్రేజీ పాటను మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా మజాకా మూవీ నుంచి అద్భుతమైన జానపద పాటను విడుదల చేశారు. సొమ్మసిల్లి పోతున్నావే.. ఓ చిన్నా రాములమ్మా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రాము రాథోడ్, ప్రసన్న కుమార్ బెజవాడ లిరిక్స్ అందించగా.. రేవంత్ ఆలపించారు. ఈ క్రేజీ ఫోక్ సాంగ్‌కు లియోన్ జేమ్స్ సంగీతమందించారు. ఈ చిత్రంలో మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నల్ల నల్లాని కళ్ళతో,
నాజూకు నడుముతో
నన్ను ఆగమే జేస్తివే 🎶❤️🔥
The Most Viral Folk Sensation Of The Year - #SommasilliPothunnave Out Now✨️
— https://t.co/JCqj0HaZyi
🎵 @leon_james
🎤 @singerrevanth
✍🏻#RamuRathod @KumarBezwada#MazakaOnFeb26th #Mazaka @sundeepkishan @riturv… pic.twitter.com/8gEID6cJL0— AK Entertainments (@AKentsOfficial) February 21, 2025
Comments
Please login to add a commentAdd a comment