reethu Varma
-
ఏడేళ్లుగా వాయిదా పడుతూ విడుదల రేసులోకి వచ్చిన విక్రమ్ సినిమా
నటుడు విక్రమ్ కథానాయకుడుగా నటించిన చిత్రం 'ధ్రువనక్షత్రం'. నటి రీతూవర్మ నాయకిగా నటించిన ఇందులో ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, పార్థిబన్, రాధికా శరత్‌కుమార్, వంశీకృష్ణ, ప్రియదర్శిని ముఖ్యపాత్రలు పోషించారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రారంభమై ఏడేళ్లు అయ్యింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్నా విడుదల విషయంలో పలు ఆటంకాలలను ఎదుర్కొంటూ వచ్చింది. పలుమార్లు విడుదల తేదీని ప్రకటించినా ఎదురవుతున్న సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. (ఇదీ చదవండి: రతిక మాజీ బాయ్‌ఫ్రెండ్ టాపిక్.. నాగ్ అలాంటి కామెంట్స్!) 'ధ్రువనక్షత్రం' విడుదలలో జాప్యం కారణంగా ఇటీవల చిత్రం కోసం కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఐశ్వర్య రాజేష్ నటించిన సన్నివేశాలను తొలగించారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఐశ్వర్య రాజేష్ గానీ, చిత్ర యూనిట్ గానీ స్పందించలేదు. అయితే హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. దీపావళి సందర్భంగా నవంబర్ 24న 'ధ్రువనక్షత్రం' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. కాగా దీపావళి రేస్‌లో నటుడు కార్తీ నటించిన జపాన్‌తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. విజయ్ నటించిన లియో చిత్రం అక్టోబర్ 19న తెరపైకి రానుంది. -
ఓటీటీలో శర్వానంద్ 'ఒకే ఒక జీవితం'.. రిలీజ్ డేట్ ఫిక్స్
శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో కీలక పాత్రలో నటించారు. మదర్సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్‌లో ఈనెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలోనూ 'కణం' పేరుతో విడుదలైంది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన “ఒకే ఒక జీవితం” ఈ నెల 20 నుండి మీ సోనీ LIV International లో#OkeOkaJeevithamOnSonyLIV #SonyLIVInternational #OkeOkaJeevitham pic.twitter.com/QMQPpxiCJq — SonyLIV International (@SonyLIVIntl) October 10, 2022 -
ఆ ఆలోచనతో ‘ఒకే ఒక జీవితం’ కథ రాసుకున్నాను: శ్రీకార్తీక్
‘‘మనం ఏదైనా పనిని నిజాయితీగా చేస్తుంటే ఈ విశ్వమే తోడై మనల్ని ముందుకు నడిపిస్తుంటుందని నా నమ్మకం. ‘ఒకే ఒక జీవితం’ సినిమా షూటింగ్ సమయంలో ఈ విషయం నాకు చాలా సందర్భాల్లో అనుభవంలోకి వచ్చింది. అలాగే అన్ని వేళలా సహనంతో ఉండాలని ఈ సినిమాతో నేర్చుకున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీ కార్తీక్. శర్వానంద్, రీతూ వర్మ జంటగా అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది (చదవండి: ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుంది) ఈ సందర్భంగా ఈ చిత్రదర్శకుడు శ్రీకార్తీక్ మాట్లాడుతూ – ‘‘నటుడిగా ట్రై చేసి, అవకాశాలు రాకపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో నేనే రాయాలి, నేనే తీయాలనుకుని కొన్ని షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫల్మ్స్ చేశాను. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు మా అమ్మగారు అపస్మారక స్థితిలో ఉన్నారు. నేను ఫిల్మ్‌మేకర్‌ను అవుతానని కూడా ఆమెకు తెలియదు. ఈ విషయంలో నాకు పశ్చాత్తాపం ఉండేది. దాంతో కాలాన్ని వెనక్కి తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ‘ఒకే ఒక జీవితం’ కథ రాసుకున్నాను. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని టైమ్ మిషన్ బ్యాక్‌డ్రాప్ పెట్టాను. ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. శర్వానంద్ లాంటి హీరో ఇలాంటి సినిమాను యాక్సెప్ట్ చేయడమే పెద్ద సక్సెస్. కథ విన్న వెంటనే అమలగారు ఒప్పుకున్నారు. ఇక అల్లు అర్జున్ గారి కోసం నా దగ్గర ఓ రియల్ ఫ్యాంటసీ కథ ఉంది’’ అన్నారు. -
‘వరుడు కావలెను’ సంగీత్ ఈవెంట్ ఫోటోలు
-
కోలీవుడ్ నుంచి మరో ఆఫర్ కొట్టేసిన శివాత్మిక
‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్న శివాత్మికకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ చిత్రంలో నటిస్తున్న శివాత్మక చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది‘ఆనందం విలయాడుమ్ వీడు’ సినిమాతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. గౌతమ్ కార్తిక్‌కి జోడిగా నటించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. అయితే మొదటి సినిమా విడుదల కాకముందే కోలీవుడ్ నుంచి మరో ప్రాజెక్టుకు సైన్ చేసింది. ఆర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రేమకథా చిత్రంలో శివాత్మిక కథానాయికగా నటించనుంది. ఆమెతో పాటు రీతూవర్మ, అపర్ణబాలమురళి కూడా ఈ సినిమాలో నటించనున్నారు. రోడ్ జర్నీ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు గురించి శివాత్మిక అధికారికంగా ప్రకటించింది. నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. అద్భుతమైన బృందంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ శివాత్మిక తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంతోషం వ్యక్తం చేసింది. My next in Tamil, This one is going to be special 💜 Can’t wait to work with this fab team!@AshokSelvan@riturv @Aparnabala2 @Rkarthik_dir@PentelaSagar @george_dop @GopiSundarOffl @editoranthony@riseeastcre@AndhareAjit #Viacom18Studios pic.twitter.com/lBezrbGzIK — Shivathmika Rajashekar (@ShivathmikaR) June 28, 2021 చదవండి : Shakuntalam: సమంత ఫస్ట్‌లుక్‌పై క్రేజీ అప్డేట్ పెళ్లికి రెడీ అయిపోయిన లవ్ బర్డ్స్ నయన్-విఘ్నేష్ -
భరతం పట్టడానికి రెడీ
‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదలకానుంది. ఈ నెల 24 నాని బర్త్‌డే. ఈ సందర్భంగా అదేరోజు ‘టక్ జగదీష్’ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ‘‘అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి..’ అంటూ సాగే మెలోడీ డ్యూయెట్ లిరికల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). -
ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్‌బుక్స్ తీస్తాను..
చిన్నప్పుడు అమ్మానాన్నలు చేయి పట్టి నడక నేర్పిస్తే.. కాస్త పెద్దయ్యాక అక్షరాలు దిద్దించి.. జ్ఞానమార్గం చూపించి జీవన ప్రదాతలుగా.. మన ఉన్నతికి మార్గదర్శకులుగా నిలిచేవారు గురువులు. ప్రతి మనిషి జీవితంలో వీరి స్థానం అనన్యం.. అసామాన్యం.తప్పటడుగుల్లో.. తప్పుటడుగుల్లోపయనించవద్దని.. నింగికి నిచ్చెలేసి..ఆకాశమే హద్దుగా.. ఆశలు.. ఆశయాలేసరిహద్దుగా మనల్ని తీర్చిదిద్దేది గురువులే. విద్యాబుద్ధులతో పాటు సరైన మార్గాన్నినిర్దేశించేదీ వారే. అలాంటి ఆచార్యులను మనసారా తల్చుకుంటున్నారు కొందరు ప్రముఖులు. నేడు గురువులను స్మరించుకునే రోజు.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమ మనోగతాలను ఇలా వెలిబుచ్చారు. అమ్మ గుర్తుకు వస్తే కన్నీరే.. మా అమ్మే నా గురువు. ఆమె ఇంగ్లిష్ ప్రొఫెసర్. నేను చదివిన స్కూల్, కాలేజ్ రెండూ ఒకే బిల్డింగ్‌లో ఉండేవి. ఒకరోజు నేను ఐదు నిమిషాల ఆలస్యంగా క్లాస్‌కి వెళ్లాను. అప్పుడు మా అమ్మ నన్ను గమనించింది. ఇంటికి వెళ్లాకా మమ్మీ.. సారీ ఫైవ్ మినిట్స్ లేట్‌గా క్లాస్‌కి వెళ్లాను అని చెప్పాను. నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని ‘చూడు నాన్నా.. చిన్నప్పటి నుంచి సమయం విలువ తెలియాలి. జీవితంలో మనకు సమయం ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది. ఇకపై స్కూల్‌కి లేటుగా వెళ్లొద్దు. టైమ్ కమిట్మెంట్ని ఇప్పటి నుంచే ఫాలో అవ్వాలి అంటూ తన నిమురుతూ చెప్పింది. నా లైఫ్‌లో నా గురువు, నా ఫ్రెండ్, మార్గదర్శకురాలు అమ్మనే. 2017లో ఆమె చనిపోయారు. ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ చిన్నప్పటి నోట్‌బుక్స్ బయటకు తీస్తాను. ఆ నోట్‌బుక్స్‌లో సమయం (టైమ్) గురించి ఆమె రాసిన కొటేషన్స్‌ని చదువుకుంటూ స్మరించుకుంటా. – సోనూసూద్, బాలీవుడ్ నటుడు సామాజిక దృక్పథాన్ని నేర్పారు చిన్నప్పటి నుంచి నా ఉత్తమ గురువు అమ్మ శైలజ. ట్యూషన్ లేకుండా ఆమెనే తన ఒడిలో కూర్చోబెట్టుకుని పాఠాలు నేర్పించారు. ఆదిలాబాద్‌లోని సెయింట్ పాల్స్ స్కూల్లో చదివేప్పుడు సిస్టర్ (టీచర్) రేణు ఉండేవారు. ఆమె నాతో ఫ్రెండ్లీగా ఉండేవారు. అన్నీ షేర్ చేసుకునేవారు. అంతేకాకుండా చాలా స్ట్రిక్ట్ కూడా. కాలేజీలో లైఫ్‌లో సెంట్ఆన్స్లో చదివేటప్పుడు లెక్చరర్ డాక్టర్ మాలిని నాకు సామాజిక దృక్పథాన్ని నేర్పించారు. నాతో సోషల్ వర్క్స్ ఎన్నో చేయించారు. తద్వారా ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఆశ కలిగింది. ఐఏఎస్ అవ్వడానికి కూడా కొంతవరకు మోటివేట్ కాగలిగాను ఆ సోషల్ యాక్టివిటీస్ ద్వారా. వీటితో పాటు గురువులు నేర్పిన సామాజిక దృక్పథం వల్ల బుక్స్, ఆర్టికల్స్ రాశాను. – హరిచందన దాసరి, జోనల్ కమిషనర్ ఓపిక నేర్చుకున్నా.. టీచర్స్‌కి చాలా ఓపిక ఉంటుంది. స్కూల్లో ఎంత అల్లరి చేసినా కొట్టకుండా, తిట్టకుండా అల్లరి చేయొద్దంటూ ఓపికతో నచ్చచెబుతారు. నేను స్కూల్ ఏజ్ నుంచి ఏంబీఏ వరకు నా గురువుల నుంచి నేర్చుకున్నది అదే. ఎంబీఏలో ఉన్నప్పుడు మోడలింగ్ కెరీర్‌ని స్టార్ట్ చేశా. అప్పట్లో కాలేజీకి డుమ్మా కొట్టాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పట్లో ఎంబీఏ లెక్చరర్ సుప్రియ మేడం, ప్రిన్సిపాల్ సర్.. నాకు బాగా సపోర్ట్‌గా నిలిచారు. మోడలింగ్‌కు వెళ్లే ప్రతిసారీ నాకు పర్మిషన్ ఇచ్చేవాళ్లు. వాళ్లు ఆరోజుల్లో నన్ను ఇలా ప్రోత్సహించబట్టే నేను ఈరోజు హీరోయిన్ని కాగలిగాను. – ఈషారెబ్బా, హీరోయిన్ అమ్మే నా బెస్ట్ టీచర్ అమ్మ సంగీత వర్మ స్కూల్ ప్రిన్సిపాల్. అదే స్కూల్లో నేను చదువుకున్నాను. టెన్త్ వరకు అమ్మ సమక్షంలోనే నా చదువు అంతా. ఆమె నుంచి లైఫ్ ఎలా బ్యాలెన్స్‌గా ఉండాలి. ఎదుటి వారిని ఎలా గౌరవించాలి. మనం మాట్లాడే తీరు, పద్ధతి అంతా నేర్పించారు. అమ్మ ఓ పక్క పర్సనల్ లైఫ్ మరో పక్క ప్రొఫెషనల్ లైఫ్‌ని చాలా బ్యాలెన్స్డ్గా చేయడం చూసి పెద్ద ఫ్యాన్‌ని కూడా అయ్యాను. నన్ను మా అక్కని ఏ రోజు చదువు విషయం, ఇతర విషయాల్లో బలవంతం పెట్టలేదు. నా ఎడ్వయిజర్. నా మోటివేటర్. నా ఇన్స్పిరేషన్ అమ్మ సంగీత వర్మనే. – రీతూవర్మ, హీరోయిన్ లీడర్ అవుతావన్నారు ఫస్ట్ డే స్కూల్‌కి వెళ్తున్నాను. వర్షం భారీగా వస్తోంది. ఆ టైంలో కురుస్తున్న భారీ వర్షానికి చాలా భయం వేసింది. కింద పడటంతో దుస్తులన్నీ మురికి అయ్యాయి. అప్పటికే 20 నిమిషాల ఆలస్యమైంది. లోపల తెలియని భయం. స్కూల్లోకి వెళ్లగానే కొండారెడ్డి (హెడ్మాస్టర్) సార్ నన్ను ఎత్తుకుని క్లాస్‌రూమ్‌కి తీసుకెళ్లారు. ఈ అమ్మాయికి చాలా గట్స్ ఉన్నాయి. పెద్దయ్యాక లీడర్ అవుతుందన్నారు. గురువుల నుంచి ఎంతోనేర్చుకున్నాను. – సుమతి ఐపీఎస్ దారి చూపే దీపం చిన్నప్పుడు దిద్దిన అక్షరం.. దిద్దించిన చేయి చిరకాలం మన ప్రవర్తనను దిద్దుతుంటుంది. గురువంటే గతం మాత్రమే కాదు మన వర్తమానం, భవిష్యత్తు కూడా. గురువును గౌరవించడం అంటే మన భూత భవిష్యత్ వర్తమానాలను గౌరవించడం. మన జీవితాన్ని గౌరవించడం. దీనిని గుర్తిస్తున్న నగరవాసులు తమ చిన్నప్పటి రోజులకు ప్రయాణం చేస్తున్నారు. టీచర్లను గుర్తు చేసుకుంటున్నారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. పదిహేనేళ్ల తర్వాత.. టీచర్లను కలిశాం... చదువులు పూర్తయిపోయి, ఎక్కడెక్కడికో భవిష్యత్తు వెతుక్కుంటూ వెళ్లిపోయాం. జీవితాల్లో స్థిరపడిన మా స్నేహితులం అందరం కలిసి ఇటీవలే మేం చదువుకున్న సూర్యాపేట జిల్లా త్రిపురవరం ఉన్నత పాఠశాలకు వెళ్లాం. అక్కడ ఒక రోజంతా గడిపాం. గత కాలపు స్మృతులను నెమరేసుకుంటూ మేం విద్యార్ధుల్లా మారిపోయి, టీచర్ల చేతిలో మొట్టికాయలు తిన్నాం. తిరిగి వచ్చే ముందు మనసారా టీచర్లను సన్మానించాం. ఆ సమయంలో వారిలో కనిపించిన తృప్తి, ఆనందం మాకు గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయింది. మమ్మల్ని అందరినీ పేరు పేరునా పిలిచి, మేం ఏం చేస్తున్నామో అడిగి తెలుసుకుని వారు పొందిన సంతోషంమాటల్లో చెప్పలేం. – వి.జయరామ్ శ్రీరామ్ వెంకటేష్‌కు ఉత్తమ అవార్డు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి (కంట్రోలర్) శ్రీరామ్ వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు. క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కాలేజీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 22 సంవత్సరాలుగా పని చేస్తున్న ఆయన బోధన, పరిశోధనలతో పాటు పలు పాలన పదవుల్లో చేయి తిరిగినవారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి చెందిన ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ 1997లో ఓయూ అధ్యాపకులుగా ఉద్యోగంలో చేరారు. -
ఈ దీపావళి కుటుంబసభ్యులతో..
హిమాయత్‌నగర్ :దీపావళి పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. కొత్త దుస్తులు ధరించి, స్వీట్లు ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకోవడంలో ఉండే ఆ ఆనందమే వేరు. సాయంత్రానికి టపాసులు కాల్చుతూ పండగను ఆస్వాదించడం ప్రతి ఏటా ఆనవాయితీ. అయితే ఈ బిజీ లైఫ్‌లో సెలబ్రిటీస్‌కు పండగను జరుపుకునేందుకు సమయమే దొరకట్లేదు. దొరికిన కొద్ది సమయంలో వేరే వేరు పనులతోనే సరిపోతుంది. ఎన్ని పనులున్నా..ఎంత బిజీ లైఫ్ అయినా ఈ దీపావళిని కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. మన టాలీవుడ్ హీరో, హీరోయిన్స్. పొద్దున్నే అమ్మ, నాన్నలకు విషెస్ చెప్పి, కొత్త దుస్తులు ధరించి, సాయంత్రానికి పూజల్లో పాల్గొని, ఆ తరువాత చిన్నపాటి టపాసులు కాల్చి పండగను ఎంతో సేఫ్‌గా జరుపుకోనున్నట్లు వివరించారు. దీపావళిని ఎలా జరుపుకోబోతున్నారు అనే విషయాలపై సెలబ్రిటీలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఈసారి అమ్మానాన్నలతో.. కొన్ని సంవత్సరాలుగా దీపావళి పండగకు అమ్మ,నాన్నలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. ఇక్కడ నేను స్నేహితులతో కలసి పండగ చేసుకునేవాడిని. గూఢచారి సినిమా విజయవంతం అవ్వడం ఒక ఆనందమైతే. ఈ దీపావళికి అమ్మానాన్నలు సిటీలోనే ఉండటం మరో ఆనందమైన విషయం. రెండు ఆనందాల మధ్య పంచెకట్టుతో దీపావళి చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. క్రాకర్స్‌కు నేను చాలా దూరం. చిన్నపిల్లలు సరదా కోసం క్రాకర్స్‌ను కాలుస్తారు. వారి విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. పొల్యూషన్ ఫ్రీగా పండగ జరుపుకోవడంతో పాటు రోడ్డుపై చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసుకుంటే మనకే బాగుంటుంది. –అడవి శేషు(సన్నీ), సినీ హీరో సేఫ్ దీపావళి జరుపుకుంటాం... దీపావళి అంటే ఆనందం, భయం కూడా ఉంటుంది. టపాసుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పాటు ప్రకృతికి కూడా హాని కలుగుతుంది. కాబట్టి కాకరపువ్వొత్తులు లాంటివి కాలుస్తా. ఉదయం నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులతో చెన్నైలో పండగ జరుపుకుంటా. మేముసేఫ్ దివాళీ జరుపుకుంటాం, మీరు కూడా సేఫ్‌గా, ఆనందంగా జరుపుకోవాలి.–విమలారామన్, హీరోయిన్ రెండో ఫెస్టివల్ పంజాబ్‌లో... నేను ఆల్రెడీ రెండ్రోజుల క్రితం సిటీలో స్నేహితులతో కలసి దీపావళి జరుపుకున్నా. మా అమ్మ, నాన్న, బంధువులు అంతా పంజాబ్‌లో ఉన్నారు. సో... రెండో ఫెస్టివల్‌ను కుటుంబ సభ్యులతో కలసి పంజాబ్‌లో జరుపుకుంటున్నా. పర్యావరణానికి హాని కలగకుండా ప్రతి ఒక్కరూ దీపావళి జరుపుకుంటే అందరూ బాగుంటారు. –సోనూసూద్, నటుడు ఈ దివాళీ ఎంతో ప్రత్యేకం ఈ దివాళీ నాకు ఎంతో ప్రత్యేకం. ఇటీవల విడుదలైన అరవిందసమేత, సవ్యసాచి సినిమాలు హిట్ అవ్వడం, షాపింగ్‌కు వెళ్లినప్పుడు బాగా యాక్ట్ చేశావ్ అని పబ్లిక్ విష్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంతో ఎంతో ఇష్టమైన దివాళీని ఇంట్లో అందరితో కలసి సెలబ్రేట్ చేసుకోబోతున్నా. క్రాకర్స్‌కి చాలా దూరం ఈసారి. అందరూ చక్కగా, సేఫ్‌గా పండగ చేసుకోవాలి. – ఈషారెబ్బ, హీరోయిన్ పోలాండ్‌లో తోటి ఆటగాళ్లతో లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ ఇక్కడే అమ్మ, అక్క, బావ, పిల్లలతో జరుపుకున్నా. క్రాకర్స్ కాల్చి పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశా. ఈసారి నాకు ఆ అదృష్టం లేదు. గేమ్స్ నిమిత్తం పోలాండ్‌లో ఉన్నా. అయితే మన సాంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి, ఇతర దేశాలకు చెందిన నా తోటి క్రీడాకారులుతో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యా. వాళ్లు కూడా దీపావళి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. –బుద్దా అరుణారెడ్డి, జిమ్నాస్టిక్ శబ్దం లేకుండా... పొద్దు, పొద్దున్నే అమ్మ, నాన్నలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పడం. ఆ తర్వాత పక్కంటి వాళ్లకు స్వీట్లు ఇచ్చి పండగ విషెస్ చెప్పడం. సాయంత్రానికి కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, వాళ్ల కుటుంబ సభ్యులందరం ఒక్క చోట కలుస్తాం. పూజలు చేసి, శబ్ధం లేని దీపావళిని ఘనంగా జరుపుకుంటాం. దీంతో పాటు మా నక్షత్ర ఫౌండేషన్ సభ్యులందరం కలసి పండగను జరుపుకోబోతున్నాం.– మాధవీలత, హీరోయిన్ -
నా పాత్ర నచ్చుతుంది
తమిళసినిమా: నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో ఉంది నటి రీతువర్మ. ఈ హైదరాబాదీ బ్యూటీ షార్ట్ ఫిలింస్ నుంచి బిగ్ స్క్రీన్స్ పైకి వచ్చింది. అలా కొన్ని చిత్రాల్లో నటించినా ఈ భామకు హైప్ తీసుకొచ్చిన చిత్రం మాత్రం పెళ్లిచూపులే. దీంతో కోలీవుడ్ కాలింగ్ బెల్ కొట్టింది. అంతే టాలెంట్‌ను క్యాచ్ చేయడంలో ముందుండే దర్శకుడు గౌతమ్‌మీనన్ రితూవర్మకు చాన్స్ ఇచ్చేశారు. విక్రమ్‌కు జంటగా ధ్రువనక్షత్రం చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఈ అమ్మడికి ఆ చిత్ర విడుదల కాకుండానే ఇక్కడ మరో రెండు చిత్రాలు తలుపుతట్టాయి. దుల్కర్‌సల్మాన్‌కు జంటగా కన్నుమ్ కన్నుమ్ కొళ్లైయడిత్తాల్, కలైయరసన్ సరసన చైనా చిత్రాల్లో నటించేస్తోంది. ధ్రువనక్షత్రం చిత్రంలోని నా పాత్ర ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుందని అంటోంది. దీని గురించి రీతువర్మ చెబుతూ గౌతమ్‌మీనన్ చిత్రం అనగానే మరో మాట లేకుండా ఎగిరి గంతేసి నటించడానికి అంగీకరించానని చెప్పింది. ఆయన చిత్రాల్లో నటీనటులను చాలా స్టైలిష్‌గా చూపిస్తారని అంది. అదే విధంగా తాను ఆశించినట్లుగానే ధ్రువనక్షత్రం చిత్రంలో తనను చాలా స్టైలిష్‌గా నటింపజేశారని చెప్పింది. అంతే కాకుండా కథకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటింపజేశారని అంది. ఇందులోని తన పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రీతువర్మ కోలీవుడ్‌లో తెరపై కనిపించిన తొలి చిత్రంగా వేలైఇల్లాపట్టాదారి–2 చిత్రం నమోదైంది. అందులో ఒక చిన్న పాత్రలో కనిపించి మాయమైన రీతువర్మ విక్రమ్‌తో నటిస్తున్న ధ్రువనక్షత్రం చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే టాలీవుడ్ ఈ బ్యూటీని పక్కన పెట్టేసింది. పెళ్లిచూపులు వంటి పెద్ద సక్సెస్ చిత్రం తరువాత కూడా ఈ అమ్మడికి అక్కడ అవకాశాలు లేవు. దీంతో కోలీవుడ్‌నే నమ్ముకుంది. -
తారలు దిగి వచ్చిన వేళ..
ఏలూరులో శుక్రవారం సినీ తారలు సందడి చేశారు. జీవీ మాల్ప్రారంభోత్సవానికి నటీమణులు రాశీఖన్నా, మెహరీన్ కౌర్, రీతూవర్మవిచ్చేశారు. వీరిని చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఏలూరు(సెంట్రల్): నగరంలో సినీ తారలు రాశీఖన్నా, మోహరీన్ కౌర్, పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ సందడి చేశారు. స్థానిక విజయవిహార్ సెంటర్లో నూతనంగా నిర్మించిన జీవీ మాల్‌ను వారు ప్రారంభించారు. షాపింగ్ మాల్లో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వస్త్రాలను పరిశీలించారు. మొదటి ఫ్లోర్‌ను స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి, రెండో ఫోర్ల్ను మేయరు షేక్ నూర్జహాన్, మూడో ఫ్లోర్‌ను వింగ్ కమాండర్ కలిదిండి ఆంజనేయరాజు, నాలుగో ఫ్లోర్‌ను ఎస్ఎంఆర్ ఎస్టేట్ అధినేత పెదబాబు ప్రారంభించారు. భద్రాద్రి కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి మొదటిగా కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్లు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతోగానో ఆదరిస్తారన్నారు. ఏలూరు ప్రజలు ఫ్యాషన్ వస్త్రాలను ఎంతోగానో ఇష్టాపడతారన్నారు. జీవీ మాల్లో మార్కెట్ కంటే తక్కువ ధరలకు అన్ని రకాల వస్త్రాలు లభిస్తాయని, వినియోగదారులు మార్కెట్లో ధరలను, జీవీ మాల్లో ధరలను పోల్చి చూస్తే అర్థమవుతుందన్నారు. సినీ తారలను చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
హీరోతో సమానంగా..!
‘పెళ్లి చూపులు’ సినిమాతో ప్రేక్షకుల చూపులతో పాటు సినీ ఇండస్ట్రీ వర్గాల చూపులను తనవైపు తిప్పుకున్నారు హీరోయిన్ రీతూ వర్మ. ఈ తెలుగు పిల్ల చేతిలో రెండు మూడు తమిళ సినిమాలున్నాయి. వాటిలో ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లై అడిత్తాల్’ అనే చిత్రం ఒకటి. అంటే... కళ్లూ కళ్లూ కొల్లగొడితే అని అర్థం. దేశింగ్ పెరియసామి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. నవంబర్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ గోవాలో జరుగుతోంది. ఈ సినిమాలో తన పాత్ర గురించి రీతూ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు పెరియసామి చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమాలో నా పాత్ర హీరో క్యారెక్టర్‌కు సమానంగా ఉంటుంది. దుల్కర్ సల్మాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ధృవనక్షత్రం’ సినిమాలోనూ రీతూ వర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నా క్యారెక్టర్‌కి సంబంధించి ఇంకా కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. విక్రమ్‌గారి యాక్టింగ్ సూపర్. గౌతమ్ మీనన్‌గారి దర్శకత్వంలో నటించాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది. ఆ అవకాశం నాకు హీరోయిన్ అయిన తక్కువ టైమ్‌లో రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
తెలుగులో బిజీ.. కోలీవుడ్‌కు రెఢీ
చెన్నై: పెళ్లిచూపులు సినిమా కథానాయకి రీతూవర్మకు కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కడుతున్నాయి. తమిళంలో వీఐపీ -2 చిత్రం ద్వారా చిన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలంగాణ జాణ ప్రస్తుతం విక్రమ్‌కు జంటగా నటిస్తున్న ధృవనక్షత్రం చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ చిత్రం కోసం ప్రస్తుతం టర్కీలో ఉన్న రీతూవర్మ చిన్న అనే మరో తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా మరో లక్కీ ఆఫర్‌ను దక్కించుకుంది. నటుడు దుల్కర్ సల్మాన్‌తో రొమాన్స్ చేసే అవకాశం ఈ బ్యూటీని వరించిందని తాజా సమాచారం. డేసింగ్ పెరియసామి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా నటి రీతూవర్మను ఎంపిక చేసినట్లు దర్శకుడు వెల్లడించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో రీతూవర్మ సోలో హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. అది పూర్తి కాగానే అక్టోబర్ నెలలో ప్రారంభం కానున్న డేసింగ్ పెరియసామి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించనున్నారు. ఈలోగా నటి రీతూవర్మ ధృవనక్షత్రం చిత్రాన్ని పూర్తి చేసుకుంటుందట. ఈ భామ తెలుగులోనూ బిజీగానే నటిస్తోందన్నది గమనార్హం. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతోందన్న మాట. -
హైదరాబాద్ థియేటర్లలో ‘కేశవ’ టీమ్ సందడి
హైదరాబాద్: రెగ్యులర్ కమర్సియల్ జానర్ కు భిన్నంగా వరుస ప్రయోగాలు చేస్తూ దూసుకెళ్తున్న యంగ్ హీరో నిఖిల్. మరో డిఫరెంట్ మూవీ ‘కేశవ’తో మన ముందుకు వచ్చాడు. ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ నేడు హైదరాబాద్ లోని పలు థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ రీతూ వర్మ, దర్శకుడు సుధీర్ వర్మలు నేటి సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా 70 ఎంఎం థియేటర్ లో అభిమానుల మధ్య మూవీ వీక్షించనున్నారు. ఈ విషయాన్ని హీరో నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘రీతూ వర్మ, సుధీర్ వర్మ, నేను.. మా కేశవ గ్యాంగ్ నేటి సాయంత్రం షోకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ కు వస్తున్నాం. మరికొన్ని థియేటర్లకు వెళ్లి అభిమానులను కలుస్తామని’ ట్వీట్లో రాసుకొచ్చారు నిఖిల్. ఇటీవల విశాఖపట్నంలోనూ కొన్ని థియేటర్లకు కేశవ గ్యాంగ్... హీరో నిఖిల్, హీరోయిన్ రీతూ వర్మ, డైరెక్టర్, మూవీ యూనిట్ సభ్యులు కొందరు వెళ్లి సందడి చేసిన విషయం తెలిసిందే. విశాఖలో ఈ టీమ్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా, ఇదే ఫార్ములాను హైదరాబాద్ లోనూ ఫాలో అవుతున్నారు. అరుదైన గుండె జబ్బుతో ఎక్కువగా ఆవేశపడలేని ఓ యువకుడు తన పగను ఎలా తీర్చుకున్నాడన్న కథతో తెరకెక్కిన కేశవ సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. Hello @riturv @sudheerkvarma The KESHAVA Gang nd me will b Visiting SANDHYA 70mm RtcX today evening show, nd other theatres too.. Com say Hi pic.twitter.com/2t2wA961Lg — Nikhil Siddhartha (@actor_Nikhil) 28 May 2017 -
'కేశవ' మూవీ రివ్యూ
టైటిల్ : కేశవ జానర్ : క్రైం థ్రిల్లర్ తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్, రీతూ వర్మ, ఇషా కొప్పీకర్, ప్రియదర్శి సంగీతం : సన్నీ ఎమ్.ఆర్ దర్శకత్వం : సుధీర్ వర్మ నిర్మాత : అభిషేక్ నామా రెగ్యులర్ కమర్సియల్ జానర్ కు భిన్నంగా వరుస ప్రయోగాలతో సక్సెస్ లు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్, మరో డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అరుదైన గుండె జబ్బుతో ఎక్కువగా ఆవేశపడలేని ఓ యువకుడు తన పగను ఎలా తీర్చుకున్నాడన్న కథతో తెరకెక్కిన కేశవ, మరోసారి నిఖిల్ మార్క్ చూపించిందా..? ఈ ప్రయోగంతో నిఖిల్ తన సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేశాడా..? లవర్ బాయ్ ఇమేజ్ నుండి బయటపడి పూర్తి సీరియస్ క్యారెక్టర్ లో నిఖిల్ ఎంత వరకు ఆకట్టుకున్నాడు..? కథ : కాకినాడ లా కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న పి. కేశవ శర్మ(నిఖిల్) అరుదైన గుండె జబ్బుతో ఇబ్బంది పడుతుంటాడు. అందరికీ ఎడమ పక్కన ఉండే గుండె, తనకు కుడి పక్కన ఉంటుంది. దీని కారణంగా ఏ మాత్రం ఆవేశపడినా, అలిసి పోయినా గుండె ఆగిపోయి చనిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కేశవ వరుసగా పోలీసు అధికారులను హత్య చేస్తుంటాడు. హత్య చేసిన తరువాత చిన్న క్లూ కూడా వదిలి పెట్టకుండా.. చనిపోయిన వారి శవాలను ఉరి వేసి వెళ్లిపోతాడు. అదే సమయంలో కాలేజ్ లో జాయిన్ అయిన కేశవ చిన్ననాటి స్నేహితురాలు సత్యభామ(రీతూ వర్మ), అతన్ని గుర్తు పట్టి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఈ హత్యలు చేస్తుంది ఎవరు..? కారణం ఏంటి..? అన్న విషయం కనిపెట్టేందుకు పోలీస్ డిపార్టెమెంట్ కేసును స్పెషల్ ఆఫీసర్ షర్మిలా మిశ్రా(ఇషా కొప్పికర్) కు అప్పగిస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన షర్మిలకు కేశవ మీద అనుమానం వస్తుంది. మరో పోలీస్ అధికారి హత్య సమయంలో కేశవను అరెస్ట్ చేస్తుంది. తన పగ తీరకుండానే అరెస్ట్ అయిన కేశవ ఎలా తప్పించుకున్నాడు..? అసలు కేశవ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..? స్పెషల్ ఆఫీసర్ షర్మిలా ఈ కేను ఎలా సాల్వ్ చేసింది..? ఇన్ని మర్డర్లు చేసిన కేశవ చివరకు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ప్రయోగాత్మక చిత్రాలు చేసినా.. లుక్ విషయంలో ఎప్పుడ లవర్ బాయ్ లానే కనిపిస్తూ వచ్చిన నిఖిల్.. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమా అంతా ఒకే ఎక్స్ప్రెషన్ తో బరువైన ఎమోషన్ ను మోస్తున్నట్టుగా మంచి నటన కనబరిచాడు. హీరోయిన్ రీతూవర్మ ఆకట్టుకుంది. అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఇషా కొప్పీకర్, పోలీస్ అధికారి పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. కామెడీకి పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, సుదర్శన్, సత్యల కామెడీ అలరిస్తుంది. ఇతర పాత్రల్లో అజయ్, బ్రహ్మాజీ, రావూ రమేష్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : నిఖిల్ తో రెండో సినిమా చేసిన సుధీర్ వర్మ మరోసారి అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. రోటీన్ రివేంజ్ కథను ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా మలిచాడు. సినిమాను రెండు గంటల లోపే ముగించిన సుధీర్, కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో అనవసరమైన కామెడీ, రొమాంటిక్ సీన్స్ ఇరికించకుండా సినిమాను ఒకే మూడ్ లో నడిపించాడు. చాప్టర్ లుగా కథను నడిపించడం, అందుకు తగ్గట్టుగా ఫ్లాష్ బ్యాక్ ను కూడా కొంచెం కొంచెంగా రివీల్ చేయటం సినిమా చివరి వరకు సస్పెన్స్ కొనసాగేలా చేసింది. తొలి భాగాన్ని ఎంతో గ్రిప్పింగ్ గా నడిపించిన సుధీర్, సెకండ్ హాఫ్ లో మాత్రం స్లో అయ్యాడు. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మరోసారి స్పీడందుకోవటం సినిమాకు ప్లస్ అయ్యింది. దివాకర్ మణి సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. తన ఫ్రేమ్స్, లైటింగ్ తో సినిమా మూడ్ ను క్యారీ చేశాడు. ఎడిటింగ్, మ్యూజిక్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నిఖిల్ నటన స్క్రీన్ ప్లే సినిమా నిడివి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ స్లో నారేషన్ రొటీన్ స్టోరి కేశవ... ఇంటెన్స్ క్రైం థ్రిల్లర్. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
హై లైఫ్‌స్టైల్
ఇంటర్నేషనల్ స్టైల్స్‌తో విభిన్నమైన ఫ్యాషన్స్ నగరవాసుల ముందు కొలువుదీరాయి. దేశంలోని 150 మందికి పైగా ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన లేటెస్ట్ ట్రెండ్స్ ఆకట్టుకొంటున్నాయి. మాదాపూర్ హోటల్ నోవాటెల్‌లో సోమవారం ప్రారంభమైన మూడు రోజుల ‘హైలైఫ్ ఎక్స్పో’ వైవిధ్యంగా ఉంది. డిజైనర్ శారీస్, సూట్స్, బ్లౌజెస్, హెయిర్ ఫ్యాషన్ యాక్సెసరీస్, యాంటిక్స్, బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఫర్నిషింగ్స్, గిఫ్టింగ్ సొల్యూషన్స్ వంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. టాలీవుడ్ ముద్దుగుమ్మ రీతూవర్మ, దర్శకుడు శ్రీను వైట్ల సతీమణి రూప ఇందులోని వెరైటీలు ఆసక్తిగా తిలకించారు. -
'నా రాకుమారుడు' సినిమా స్టిల్స్