
తెలుగులో బిజీ.. కోలీవుడ్‌కు రెఢీ
డేసింగ్ పెరియసామి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా నటి రీతూవర్మను ఎంపిక చేసినట్లు దర్శకుడు వెల్లడించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో రీతూవర్మ సోలో హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. అది పూర్తి కాగానే అక్టోబర్ నెలలో ప్రారంభం కానున్న డేసింగ్ పెరియసామి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించనున్నారు. ఈలోగా నటి రీతూవర్మ ధృవనక్షత్రం చిత్రాన్ని పూర్తి చేసుకుంటుందట. ఈ భామ తెలుగులోనూ బిజీగానే నటిస్తోందన్నది గమనార్హం. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతోందన్న మాట.