dhruva nakshatram
-
ఆ చిత్రాలను మళ్లీ ఆరంభించాలని ప్లాన్
కొబ్బరికాయ కొట్టారు.. వీలైనంత త్వరగా షూటింగ్ ముగించాలనుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇలా బ్రేక్ పడిన చిత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’, ‘శభాష్ నాయుడు’, విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు పలు అంచనాల నడుమ ఆరంభమయ్యాయి. అయితే చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇప్పుడు ‘రీ స్టార్ట్’ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. ‘విక్రమ్’ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్నారు కమల్‌హాసన్. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంత బంపర్ హిట్ సాధించారు కాబట్టే కమల్ తన తదుపరి చిత్రాల షూటింగ్స్ని, ఆగిపోయిన చిత్రాలను మళ్లీ ఆరంభించాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. నిజానికి అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ‘విక్రమ్’ కంటే ముందు కమల్ ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2) రిలీజ్ అయ్యుండేది. కానీ దర్శకుడు శంకర్‌కు, ఈ చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య విభేదాలు, ‘ఇండియన్ 2’ సెట్స్‌లో ప్రమాదం జరిగి క్రూ మెంబర్స్ చనిపోవడం వంటి కారణాల చేత ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే కమల్ చొరవతో ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుందని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబరులో ఆరంభం కానుందని తెలిసింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా తొలుత కాజల్ అగర్వాల్ ఉన్నారు. కాజల్ తల్లి అయిన విషయం తెలిసిందే. మరి.. ఆమె ఈ చిత్రంలో ఉంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక మరో కీలక పాత్రధారి వివేక్ చనిపోయారు. ఆయన పాత్రకు నటుణ్ణి ఎంపిక చేసే పనిలో ఉందట ‘ఇండియన్ 2’ టీమ్. 1986లో కమల్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్’కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక కమల్ చిత్రాల్లో ఆగిన మరో సినిమా ‘శభాష్ నాయుడు’. 2016లో ఈ సినిమా ఆరంభమైన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్, బ్రహ్మానందం కీలక పాత్రధారులు. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కమల్ గాయపడ్డారు. దీంతో ఈ సినిమా ఆగింది. ‘భారతీయుడు 2’ని మళ్లీ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లే ‘శభాష్ నాయుడు’ని పట్టాలెక్కించాలనుకుంటున్నారట కమల్. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదే ఆరంభం కానున్నట్లు తెలిసింది. మరోవైపు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవ నక్షత్రం’ అనే సినిమా నాలుగేళ్ల క్రితం మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ వివిధ కారణాల వల్ల నిలిచిపోయింది. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ కూడా ఓ నిర్మాత. షూటింగ్‌కి బ్రేక్ పడటానికి ఆర్థిక ఇబ్బందులు ఓ కారణం అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాను రీ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారట. ఇక ‘ఇండియన్ 2, శభాష్ నాయుడు, ధృవ నక్షత్రం’ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. -
తెలుగులో బిజీ.. కోలీవుడ్‌కు రెఢీ
చెన్నై: పెళ్లిచూపులు సినిమా కథానాయకి రీతూవర్మకు కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కడుతున్నాయి. తమిళంలో వీఐపీ -2 చిత్రం ద్వారా చిన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలంగాణ జాణ ప్రస్తుతం విక్రమ్‌కు జంటగా నటిస్తున్న ధృవనక్షత్రం చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ చిత్రం కోసం ప్రస్తుతం టర్కీలో ఉన్న రీతూవర్మ చిన్న అనే మరో తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా మరో లక్కీ ఆఫర్‌ను దక్కించుకుంది. నటుడు దుల్కర్ సల్మాన్‌తో రొమాన్స్ చేసే అవకాశం ఈ బ్యూటీని వరించిందని తాజా సమాచారం. డేసింగ్ పెరియసామి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా నటి రీతూవర్మను ఎంపిక చేసినట్లు దర్శకుడు వెల్లడించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో రీతూవర్మ సోలో హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. అది పూర్తి కాగానే అక్టోబర్ నెలలో ప్రారంభం కానున్న డేసింగ్ పెరియసామి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించనున్నారు. ఈలోగా నటి రీతూవర్మ ధృవనక్షత్రం చిత్రాన్ని పూర్తి చేసుకుంటుందట. ఈ భామ తెలుగులోనూ బిజీగానే నటిస్తోందన్నది గమనార్హం. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతోందన్న మాట. -
సమయం దగ్గర పడుతోంది మిత్రమా..!
సమయం దగ్గర పడింది మిత్రమా ఇంకా 30 రోజులే అంటున్నారు దర్శకుడు గౌతమ్‌మీనన్. ఇంతకీ దేని గురించి ఆయన చెబుతున్నది. ఇంకా దేని గురించి ఆయన తాజా చిత్రం ధ్రువనక్షత్రం గురించే. విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా కోలివుడ్ నాయకి రీతువర్మ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్ర షూటింగ్ మొదటి నుంచి పలు ఒడిదుడుకులను ఎదుర్కొని ఎట్టకేలకు గాడిన పడిందనే చెప్పాలి. ఇటీవలే బల్గేరియాలో చిత్రీకరణను పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ చెన్నైకి తిరిగొచ్చింది. ధ్రువనక్షత్రం చిత్రం ఎంతవరకు పూర్తి అయ్యింది, ఇంకా ఎంత చిత్రీకరణ జరుపుకోవలిసి ఉంది అన్న ఆసక్తి చాలా మంది ప్రేక్షకుల్లో నెలకొంది. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడానికేమో దర్శకుడు గౌతమ్‌మీనన్ చిత్రీకరణకు ఇంకా 30 రోజులే మిగిలి ఉంది. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌కు సిద్ధం అవుతున్నాం అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో భాగంగా రెండు చిత్ర పోటోలను కూడా విడుదల చేశారు. ధ్రువనక్షత్రం చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్ తదితర పోస్ట్ పొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయట. -
నాలుగు దేశాల్లో ఫైట్ చిత్రీకరణ
ధ్రువనక్షత్రం చిత్రం కోసం సిమాన్ విక్రమ్ నాలుగు దేశాల్లో ఫైట్ చేశారు. ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత విక్రమ్ నటిస్తున్న రెండు చిత్రాల్లో ధ్రువనక్షత్రం ఒకటి. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాజేశ్, రీతువర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. కొన్ని రోజులు చిత్రీకరణ తర్వాత ఆగిపోవడంతో ధ్రువనక్షత్రం చిత్రం తెరెకెక్కుతుందా లేదా అన్న ప్రశ్న సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనికి పుల్‌స్టాప్ పెట్టేలా ఈ చిత్రం మరిన్ని ప్రత్యేకతలతో, మరింత భారీగా చిత్రీకరణను జరుపుకుంటోంది. మొదట్లో ప్రకటించిన తారల జాబితాలో తాజాగా ఒకనాటి కథానాయికలు రాధికాశరత్‌కుమార్, సిమ్రాన్‌లతోపాటు నటుడు పార్థిబన్, డీడీగా ప్రాచుర్యం పొందిన దివ్యదర్శిని, వంశీ వచ్చి చేరారు. స్లొవేనియా, బల్గేరియా, టర్కీ, అబుదుబాయ్ దేశాల్లో 22 రోజుల్లో బ్రహ్మాండమైన పోరాట దృశ్యాన్ని దేశవిదేశాలకు చెందిన 12మందితో కూడిన చిత్ర యూనిట్ చిత్రీకరించింది. ఈ పోరాట దృశ్యాలను ఛాయాగ్రాహకుడు మనోజ్ నేతృత్వంలో తిశారు. ఇప్పటివరకు ఈ నాలుగు దేశాల్లో దక్షిణాదికి చెందిన వారెవరూ షూట్ చేయని లొకేషన్లను ఎంపిక చేసి తిశారు. ఇలా ఒక ఫైట్‌ను నాలుగు దేశాల్లో చిత్రీకరించడం అరుదైన రికార్డు అంటున్నారు ధ్రువనక్షత్రం చిత్ర వర్గాలు.