సమయం దగ్గర పడుతోంది మిత్రమా..! | hero vikram acting in the movie dhruva nakshatram | Sakshi
Sakshi News home page

సమయం దగ్గర పడుతోంది మిత్రమా..!

Published Sun, Jul 16 2017 7:29 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

సమయం దగ్గర పడుతోంది మిత్రమా..!

సమయం దగ్గర పడుతోంది మిత్రమా..!

సమయం దగ్గర పడింది మిత్రమా ఇంకా 30 రోజులే అంటున్నారు దర్శకుడు గౌతమ్‌మీనన్‌. ఇంతకీ దేని గురించి ఆయన చెబుతున్నది. ఇంకా దేని గురించి ఆయన తాజా చిత్రం ధ్రువనక్షత్రం గురించే. విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా కోలివుడ్‌ నాయకి రీతువర్మ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ మొదటి నుంచి పలు ఒడిదుడుకులను ఎదుర్కొని ఎట్టకేలకు గాడిన పడిందనే చెప్పాలి. ఇటీవలే బల్గేరియాలో చిత్రీకరణను పూర్తి చేసుకుని  చిత్ర యూనిట్‌ చెన్నైకి తిరిగొచ్చింది.

ధ్రువనక్షత్రం చిత్రం ఎంతవరకు పూర్తి అయ్యింది, ఇంకా ఎంత చిత్రీకరణ జరుపుకోవలిసి ఉంది అన్న ఆసక్తి చాలా మంది ప్రేక్షకుల్లో నెలకొంది. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడానికేమో దర్శకుడు గౌతమ్‌మీనన్‌ చిత్రీకరణకు ఇంకా 30 రోజులే మిగిలి ఉంది. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌కు సిద్ధం అవుతున్నాం అని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అందులో భాగంగా రెండు చిత్ర పోటోలను కూడా విడుదల చేశారు. ధ్రువనక్షత్రం చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్‌ తదితర పోస్ట్‌ పొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయట.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement