
విభిన్న చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. చేసినవి తక్కువ సినిమాలే అయిన గౌతమ్ చిత్రాలంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి స్టార్ డైరెక్టర్‌కు ఓ చేదు అనుభవం ఎదురైందట. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమాలో నటిస్తానని ముందు మాట ఇచ్చి తరువాత వెనక్కి తగ్గారని గౌతమ్ వెల్లడించారు.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ధృవ నక్షత్రం. దేశ రక్షణ బాధ్యతలు నిర్వహించే ఇంటిలిజెన్స్ అధికారుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ముందుగా ఈ సినిమాను కథను గౌతమ్ రజనీకాంత్‌కు వినిపించారట. రజనీ కూడా చాలా ఆసక్తిగా.. సినిమా చేద్దామని డేట్స్, బడ్జెట్ లాంటి విషయాలను కూడా ఆరా తీశారట.
అయితే తరువాత రజనీకి ఎవరో గౌతమ్ గురించి తప్పుగా చెప్పటంతో ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించలేదని గౌతమ్ వెల్లడించారు. ధృవ నక్షత్రం సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాను ముందుగా సూర్య హీరోగా ప్రారంభించారు. సూర్యతో విభేదాలు రావటంతో విక్రమ్ చేతికి వెళ్లింది. షూటింగ్ కూడా చాలా ఆలస్యమైంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా గౌతమ్ మీనన్ ఈ విషయాలను వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment