Dhruva Natchathiram
-
స్టార్ హీరో మూవీ వాయిదా.. డైరెక్టర్ ఆసక్తికర పోస్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం చిత్రం ధృవనచ్చితిరం. స్పై, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని ధృవనక్షత్రం పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. అయితే ఊహించని విధంగా సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన గౌతమ్ మీనన్ అభిమానులకు షాకిచ్చాడు. అయితే తాజాగా ఆయన ఓ లేఖను పోస్ట్ చేశారు. ధృవనచ్చితిరం త్వరలోనే మీ ముందుకు వస్తుందని గుడ్ న్యూస్ చెప్పారు. దర్శకుడు లేఖలో రాస్తూ.. ''ఒక విజన్, అభిరుచి, అంకితభావంతో ధృవ నచ్చితిరాన్ని తెరకెక్కించాం. మాకు ఎంత వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మీ ముందుకు తీసుకురావడానికి యత్నిస్తున్నాం. నవంబర్ 24న విడుదల చేయనందుకు అభిమానులు నిరాశకు గురైన మాట వాస్తవమే. ఇప్పటికీ మేము సినిమా రిలీజ్ విషయంలో ప్రేక్షకులకు భరోసా ఇవ్వడానికే పోస్ట్ చేస్తున్నా. మూవీకి ఉన్న అడ్డంకులను తొలగించి ధృవ నచ్చితిరమ్‌ను త్వరలోనే మీముందుకు తీసుకొస్తాం' అని అన్నారు. ఈ విషయంలో ప్రేక్షకుల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఇప్పటికైనా వివాదాలు తొలగిపోయి మూవీ రిలీజ్ కావాలని విక్రమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఆర్. పార్తిబన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, వినాయకన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. #DhruvaNatchathiram@OndragaEnt @oruoorileoru pic.twitter.com/Bbcn32sgWM — Gauthamvasudevmenon (@menongautham) November 28, 2023 -
విక్రమ్ 'ధ్రువ నక్షత్రం' వాయిదా.. చివరి క్షణంలో నిర్ణయం!
కోలీవుడ్ టాప్ హీరో 'విక్రమ్' నటించిన చిత్రం 'ధ్రువ నక్షత్రం'. స్పై, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో 'గౌతమ్ మేనన్' దీనిని సిద్ధం డైరెక్ట్ చేశారు. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కిన ఈ చిత్రాన్ని 2017లో విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. చిత్రీకరణ పూర్తైనప్పటికీ అనుకోని కారణాలతో ఈ చిత్రం వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. నేడు నవంబర్ 24న ఇది ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే విక్రమ్ అభిమానులు టికెట్లు కూడా కొన్నారు. కొన్ని గంటల్లో బొమ్మ థియేటర్లలో పడుతుండగా తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు గౌతమ్ మేనన్ ప్రకటించారు. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గౌతమ్ మేనన్ ఏం చెప్పారంటే ఈరోజు విడుదల కానున్న ధ్రువ నక్షత్రం చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల నేడు ఈ సినిమా విడుదల చేయడం లేదు. అందుకు గాను నన్ను క్షమించండి. సినిమా విడుదల కోసం చాలా ప్రయత్నించాను. మరో రెండు రోజుల్లో ఈ సినిమాపై ప్రకటన ఇస్తాం. ఈ సినిమా అందరికీ అందుబాటులోకి రావాలని నేను కోరుకుంటున్నాను.' అని ఆయన అన్నారు. కారణం ఏంటి..? కోలీవుడ్‌లో శింబు నటించిన 'సూపర్ స్టార్' చిత్రానికి దర్శకత్వం వహించేందుకు వాసుదేవ్ మీనన్ ఆల్ ఇన్ పిక్చర్స్ నుంచి రూ.2.40 కోట్లు తీసుకున్నారని, అయితే ఆ సినిమా పనులు పూర్తి చేయలేదని, సంస్థకు డబ్బులు తిరిగి చెల్లించలేదని గతంలో వార్తలు వచ్చాయి. తదనంతరం, డబ్బు తిరిగి ఇవ్వకుండా ధృవ నక్షత్రం విడుదల చేయవద్దని నిర్మాణ సంస్థ ఆల్ ఇన్ పిక్చర్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈరోజు (నవంబర్ 24) ఉదయం 10.30 గంటలలోపు ఆన్ ఇన్ పిక్చర్స్‌కు రూ. 2 కోట్ల రూపాయలను తిరిగి ఇస్తే సినిమా విడుదల చేస్తామని కోర్టు షరతులు విధించింది. దీంతో ధ్రువ నక్షత్రం సినిమాకు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. #DhruvaNatchathiram #DhruvaNakshathram pic.twitter.com/dmD4ndEnp9 — Gauthamvasudevmenon (@menongautham) November 23, 2023 -
'ఆయనతో పని చేయడం చాలా కష్టం'.. జైలర్ విలన్‌పై డైరెక్టర్ కామెంట్స్!
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కించిన తాజా చిత్రం 'ధృవ నచ్చిత్తిరం'. తెలుగులో ధృవ నక్షత్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. విక్రమ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వాసుదేవ్ మీనన్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా వినాయకన్‌తో పనిచేయడం చాలా కష్టమని తెలిపారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. 'వినాయకన్‌ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే క్యారెక్టర్ స్టైల్, కాస్ట్యూమ్, క్యారెక్టర్‌కి ఎలాంటి మూడ్ ఇవ్వాలనుకుంటున్నానో అతనికి స్పష్టంగా వివరించాలి. ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో వినాయకన్‌కి విక్రమ్ మేకప్ వేయాల్సి వచ్చింది. వినాయకన్ సర్ ఓ ఫైట్ సీన్లో గాయపడ్డారు. ఆ తర్వాత విక్రమ్, వినాయకన్ ఇద్దరూ కలిసి ఆ సీన్ ఎలా చేయాలో చర్చించుకున్నారు. అయితే వినాయకన్ ఇంత స్టైలిష్‌గా మరే సినిమాలోనూ కనిపించలేదు. అతని డైలాగ్స్, స్వాగ్, మ్యానరిజమ్ అద్భుతంగా ఉన్నాయని' అన్నారు. మొదట ఈ సినిమాలో విలన్ కోసం వెతుకుతున్నప్పుడు అతని పేరును నటి దివ్యదర్శిని సూచించింది. అతని సినిమాలు చూశాక.. విలన్‌గా ది బెస్ట్ అనిపించించిదని గౌతమ్ మీనన్ తెలిపారు. ఈ సినిమాలో అతనే బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చాడు. ఇటీవలే డబ్బింగ్ చెప్పి వెళ్లిపోయాడు. కానీ నేను అతని నుంచి మరో రోజు ఆశించా. కానీ దొరకలేదు. వినాయకన్‌కి ఫోన్లో మెసేజ్ పెట్టా. సార్ మీరు ఈ సినిమాలో ఎంత బాగా చేశారో మీకు తెలియదు. ఈ విషయం సినిమా విడుదలయ్యాక మీకే అర్థమవుతుంది. ఇందులో విక్రమ్ సార్ హీరోగా నటించడం నా అదృష్టం.' అని గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. కాగా.. జైలర్ తర్వాత వినాయకన్ మరోసారి విలన్‌గా అలరించనున్నారు. తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ధృవ నచిత్తిరం'. విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్‌లో వినాయకన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు విశేష ఆదరణ లభించింది. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా కనిపించనున్నారు. పార్తీపన్, మున్నా, సిమ్రాన్, రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
ఏడేళ్లుగా వాయిదా పడుతూ విడుదల రేసులోకి వచ్చిన విక్రమ్ సినిమా
నటుడు విక్రమ్ కథానాయకుడుగా నటించిన చిత్రం 'ధ్రువనక్షత్రం'. నటి రీతూవర్మ నాయకిగా నటించిన ఇందులో ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, పార్థిబన్, రాధికా శరత్‌కుమార్, వంశీకృష్ణ, ప్రియదర్శిని ముఖ్యపాత్రలు పోషించారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రారంభమై ఏడేళ్లు అయ్యింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్నా విడుదల విషయంలో పలు ఆటంకాలలను ఎదుర్కొంటూ వచ్చింది. పలుమార్లు విడుదల తేదీని ప్రకటించినా ఎదురవుతున్న సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. (ఇదీ చదవండి: రతిక మాజీ బాయ్‌ఫ్రెండ్ టాపిక్.. నాగ్ అలాంటి కామెంట్స్!) 'ధ్రువనక్షత్రం' విడుదలలో జాప్యం కారణంగా ఇటీవల చిత్రం కోసం కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఐశ్వర్య రాజేష్ నటించిన సన్నివేశాలను తొలగించారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఐశ్వర్య రాజేష్ గానీ, చిత్ర యూనిట్ గానీ స్పందించలేదు. అయితే హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ స్పై థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. దీపావళి సందర్భంగా నవంబర్ 24న 'ధ్రువనక్షత్రం' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. కాగా దీపావళి రేస్‌లో నటుడు కార్తీ నటించిన జపాన్‌తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. విజయ్ నటించిన లియో చిత్రం అక్టోబర్ 19న తెరపైకి రానుంది. -
ధ్రువ నక్షత్రం చిత్రంలో ఐశ్వర్య రాజేష్ సీన్స్ కట్?
ధ్రువ నక్షత్రం చిత్రంలో నటి ఐశ్వర్య రాజేష్ నటించిన సన్నివేశాలను తొలగించారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ధ్రువ నక్షత్రం. ఇందులో నటి రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, నటుడు పార్టీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం 2017లో ప్రారంభమైంది. షూటింగ్ కూడా పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం విడుదల కావాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల చిత్రం విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అలా అటకెక్కిన ఈ చిత్రాన్ని దాదాపు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు బూజు దులుపుతున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని మనం అనే పాటను విడుదల చేశారు. తాజాగా హిజ్ నేమ్ ఈజ్ జాన్ అనే మరో పాటను విడుదల చేశారు. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్ర కథను దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే చిత్రీకరించిన నటి ఐశ్వర్య రాజేష్‌కు సంబంధించిన సన్నివేశాలు అన్నింటిని తొలగించినట్లు, ఆమె లేకుండా మళ్లీ కొంత భాగాన్ని చిత్రీకరించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదు. కాగా పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. -
ఐదేళ్ల క్రితం ఆగిపోయిన విక్రమ్ సినిమాకు మోక్షం..
విక్రమ్ 'పొన్నియిన్ సెల్వన్' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ జోష్‌తో ఇప్పుడు వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఈయన తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న తంగలాన్ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా విక్రమ్ ఐదేళ్ల క్రితం నటించిన చిత్రం ధృవనక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలు సమస్యల కారణంగా ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ ధృవనక్షత్రం చిత్రానికి సంబంధించిన ప్యాచ్‌వర్క్ షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పుటికే కంప్లీట్ అయిన షూటింగ్‌కు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కావచ్చినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాలకు నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతోందని సమాచారం. కాగా ఇందులో విక్రమ్‌తో పాటు నటి రీతూవర్మ, ఐశ్వర్యరాజేశ్, సిమ్రాన్, పార్తీపన్, వినాయగం, రాధికాశరత్‌కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: ఆదిపురుష్ హీరోయిన్‌తో ప్రభాస్ పెళ్లి? వాస్తవమిదే! -
చియాన్ విక్రమ్ 'ధ్రువ నక్షత్రం' చిత్రీకరణ పూర్తి కానుందా?
Gautham Vasudev Menon Shares Photo With Chiyaan Vikram: చియాన్ విక్రమ్, దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ధ్రువ నక్షత్రం'. ఐశ్వర్య రాజేష్, నీతూ వర్మ, సిమ్రాన్, నటుడు పార్తీపన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను చాలా భాగం విదేశాల్లో నిర్వహించడం, ఆ మధ్య విడుదలైన 'ఒరు మనం' అనే సింగిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2017లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికీ షూటింగ్ దశలోనే ఉండటం విక్రమ్ అభిమానులను నిరాశ పరుస్తోంది. ఈ నేపథ్యంలో విక్రమ్ ఇటీవల దర్శకుడు గౌతమ్ మీనన్‌ను కలిసి 'ధ్రువ నక్షత్రం' చిత్ర షూటింగ్ విషయాల గురించి చర్చించడం శుభ పరిణామం. వీరిద్దరూ కలిసిన ఫొటోలను దర్శకుడు గౌతమ్ మీనన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిపై విక్రమ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం విక్రమ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన 'కోబ్రా' చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అదే విధంగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన చరిత్రాత్మక కథా చిత్రం 'పొన్నియిన్ సెల్వన్' సినిమా తొలిభాగం సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కానుంది. కాగా పా.రంజిత్ దర్శకత్వంలో నటించే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మరి 'ధ్రువ నక్షత్రం' ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి మరి. చదవండి: ఒక్క సినిమాకు రూ. 20 కోట్లు తీసుకున్న హీరోయిన్! క్వాలిటీ శృంగారంపై హీరోయిన్‌కు నిర్మాత ప్రశ్న.. హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్ చేసుకోవాలని ట్వీట్ View this post on Instagram A post shared by Gautham Menon (@gauthamvasudevmenon) -
‘అందుకే రజనీ నా సినిమా చేయలేదు’
విభిన్న చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. చేసినవి తక్కువ సినిమాలే అయిన గౌతమ్ చిత్రాలంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి స్టార్ డైరెక్టర్‌కు ఓ చేదు అనుభవం ఎదురైందట. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినిమాలో నటిస్తానని ముందు మాట ఇచ్చి తరువాత వెనక్కి తగ్గారని గౌతమ్ వెల్లడించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ధృవ నక్షత్రం. దేశ రక్షణ బాధ్యతలు నిర్వహించే ఇంటిలిజెన్స్ అధికారుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ముందుగా ఈ సినిమాను కథను గౌతమ్ రజనీకాంత్‌కు వినిపించారట. రజనీ కూడా చాలా ఆసక్తిగా.. సినిమా చేద్దామని డేట్స్, బడ్జెట్ లాంటి విషయాలను కూడా ఆరా తీశారట. అయితే తరువాత రజనీకి ఎవరో గౌతమ్ గురించి తప్పుగా చెప్పటంతో ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించలేదని గౌతమ్ వెల్లడించారు. ధృవ నక్షత్రం సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాను ముందుగా సూర్య హీరోగా ప్రారంభించారు. సూర్యతో విభేదాలు రావటంతో విక్రమ్ చేతికి వెళ్లింది. షూటింగ్ కూడా చాలా ఆలస్యమైంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా గౌతమ్ మీనన్ ఈ విషయాలను వెల్లడించారు. -
ఏడాది తరువాత మరో టీజర్
చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న విక్రమ్, గౌతమ్ మీనన్‌ల ధృవ నక్షత్రం సినిమా కాస్త కదిలింది. ఏడాది క్రితం ఓ టీజర్‌తో సందడి చేసిన గౌతమ్ టీం.. తాజాగా మరో ఇంట్రస్టింగ్ టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 12 ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే యాక్షన్ కథాంశంతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. గత ఏడాది ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విక్రమ్‌తో గౌతమ్ మీనన్‌కు వచ్చిన విబేధాల కారణంగా వాయిదా పడింది. ఫైనల్ గా గౌతమ్ మీనన్ ధృవనక్షత్రం సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేశారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లింగ్ టీజర్‌తో అభిమానులకు సినిమాను గుర్తు చేశారు. పార్తీపన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్‌లు ఇతర ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు. కొత్త టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధృవ నక్షత్రం టీం కొత్త రిలీజ్ డేట్‌ను మాత్రం ప్రకటించలేదు. -
ధృవ నక్షత్రం టీజర్ విడుదల
-
నా పాత్ర నచ్చుతుంది
తమిళసినిమా: నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో ఉంది నటి రీతువర్మ. ఈ హైదరాబాదీ బ్యూటీ షార్ట్ ఫిలింస్ నుంచి బిగ్ స్క్రీన్స్ పైకి వచ్చింది. అలా కొన్ని చిత్రాల్లో నటించినా ఈ భామకు హైప్ తీసుకొచ్చిన చిత్రం మాత్రం పెళ్లిచూపులే. దీంతో కోలీవుడ్ కాలింగ్ బెల్ కొట్టింది. అంతే టాలెంట్‌ను క్యాచ్ చేయడంలో ముందుండే దర్శకుడు గౌతమ్‌మీనన్ రితూవర్మకు చాన్స్ ఇచ్చేశారు. విక్రమ్‌కు జంటగా ధ్రువనక్షత్రం చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఈ అమ్మడికి ఆ చిత్ర విడుదల కాకుండానే ఇక్కడ మరో రెండు చిత్రాలు తలుపుతట్టాయి. దుల్కర్‌సల్మాన్‌కు జంటగా కన్నుమ్ కన్నుమ్ కొళ్లైయడిత్తాల్, కలైయరసన్ సరసన చైనా చిత్రాల్లో నటించేస్తోంది. ధ్రువనక్షత్రం చిత్రంలోని నా పాత్ర ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుందని అంటోంది. దీని గురించి రీతువర్మ చెబుతూ గౌతమ్‌మీనన్ చిత్రం అనగానే మరో మాట లేకుండా ఎగిరి గంతేసి నటించడానికి అంగీకరించానని చెప్పింది. ఆయన చిత్రాల్లో నటీనటులను చాలా స్టైలిష్‌గా చూపిస్తారని అంది. అదే విధంగా తాను ఆశించినట్లుగానే ధ్రువనక్షత్రం చిత్రంలో తనను చాలా స్టైలిష్‌గా నటింపజేశారని చెప్పింది. అంతే కాకుండా కథకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటింపజేశారని అంది. ఇందులోని తన పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రీతువర్మ కోలీవుడ్‌లో తెరపై కనిపించిన తొలి చిత్రంగా వేలైఇల్లాపట్టాదారి–2 చిత్రం నమోదైంది. అందులో ఒక చిన్న పాత్రలో కనిపించి మాయమైన రీతువర్మ విక్రమ్‌తో నటిస్తున్న ధ్రువనక్షత్రం చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే టాలీవుడ్ ఈ బ్యూటీని పక్కన పెట్టేసింది. పెళ్లిచూపులు వంటి పెద్ద సక్సెస్ చిత్రం తరువాత కూడా ఈ అమ్మడికి అక్కడ అవకాశాలు లేవు. దీంతో కోలీవుడ్‌నే నమ్ముకుంది. -
1 కాదు... 3 నక్షత్రాలు
‘వన్, టు, త్రీ... రేస్ స్టార్ట్ అవ్వకముందు ఇలానే చెబుతారు. ఇప్పుడు చెబుతున్నది రేస్ గురించి కాదు.. గౌతమ్ మీనన్ తీస్తున్న ‘ధృవనక్షత్రం’ గురించి. ‘ఘర్షణ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘ఏమాయ చేసావే, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి హిట్ చిత్రాలు తీసిన గౌతమ్ ప్రస్తుతం విక్రమ్ హీరోగా తీస్తున్న సినిమా ఇది. విశేషం ఏంటంటే... ఈ సినిమాను ఒకటి కాదు... మూడు భాగాలుగా తీయాలని ఫిక్సయ్యారు. కథ అంత పెద్దది. అందుకేగా ‘బాహుబలి’ని కూడా రెండు భాగాలుగా తీశారు. ఒకే సినిమాలో కథ మొత్తం చెప్పలేకపోతే... ఇలా పార్టులు ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం ‘ధృవనక్షత్రం’ ఫస్ట్ పార్ట్ రూపొందుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మొదటి భాగాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సెకండ్, థర్డ్ పార్ట్‌లకు పెద్ద గ్యాప్ తీసుకోకుండానే తెరపైకి తెస్తారట. కథ విషయానికి వస్తే.. పదిమంది కలిసి మేము సైతం అంటూ ఒక టీమ్‌గా స్టార్ట్ అయ్యి దేశాన్ని ఓ పెద్ద ప్రమాదం నుంచి ఎలా కాపాడారు? అనే కథాంశంతో రూపొందుతోందని సమాచారం. సో.. దేశభక్తి సినిమా కావచ్చు. -
క్యారెక్టర్స్ మార్చుకున్న సౌత్ స్టార్స్
ఇరుముగన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ధృవ నక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో విక్రమ్ డిఫరెంట్ లుక్ లో అలరించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. అయితే రెండు టీజర్స్ లోనూ విలన్ ఎవరన్నది రివీల్ చేయలేదు. విలన్ వాయిస్ ను మాత్రమే ప్రజెంట్ చేశారు. అయితే టీజర్ లో వినిపిస్తున్న విలన్ వాయిస్ మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ దే.. అన్న ప్రచారం జరుగుతోంది. గౌతమ్ మీనన్, విక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో పృథ్విరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే అది విలన్ రోల్ అని మాత్రం రివీల్ చేయలదే. టీజర్ లో వాయిస్ ని బట్టి పృథ్వి చేస్తున్నది విలన్ రోల్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. గతంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన విలన్ సినిమా కోసం పృథ్విరాజ్ హీరోగా నటించగా విక్రమ్ విలన్ గా అలరించాడు. ఇప్పుడు మరో ఆ ఇద్దరు నటులు తమ పాత్రలను మార్చుకొని విక్రమ్ హీరోగా పృథ్విరాజ్ విలన్ గా నటిస్తుండటంతో ధృవ నక్షత్రం సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
చియాన్ విక్రమ్‌తో ఐశ్వర్య రాజేష్
నటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె నటనా ప్రతిభ ఏమిటో కాక్క ముట్టై చిత్రంతోనే రుజువైంది. ఆ చిత్రంలో నటనకు గానూ ఐశ్వర్య రాజేష్‌కు జాతీయ అవార్డు వస్తుందని చాలా మంది భావించారు. అలాంటి మంచి నటికి తాజాగా సియాన్ విక్రమ్‌కు జంటగా నటించే అవకాశం వరించింది. బహుశా ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోతో నటిస్తున్న చిత్రం ఇదే అవుతుందనుకుంటా. విక్రమ్ ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధ్రువనక్షత్రం చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన వైవిధ్యభరిత పాత్రలో పెప్పర్ సాల్ట్ గెటప్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయనకు సం బంధించిన కొన్ని సన్ని వేశాలను దర్శకుడు చిత్రీకరించారు. రెండవషెడ్యూల్ మొదలై వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కథానాయకిగా మొదట అను ఇమ్మానుయేల్‌ను ఎంపి క చేశారు. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా ఆమె చిత్రం నుంచి వైదొలగడంతో ఆ పాత్రలో నటిం చే అదృష్టాన్ని టాలీవుడ్ నటి రీతువర్మ పొందారు. ఇకపోతే సాధారణంగా దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రాల్లో ఇద్దరు కథానాయికలు ఉంటారు. ఇందులోనూ మరో నాయకిగా నటి ఐశ్వర్యరాజేష్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఈ బ్యూటీనే స్పష్టం చేశారు. తాను విక్రమ్‌కు జంటగా నటించనున్న మాట నిజమేనని ఐశ్వర్య అన్నారు. అయితే ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది, ఎప్పుడు షూటింగ్లో పాల్గొననున్నానన్న విషయాల గురించి ఇప్పుడేమీ చెప్పలేనని అన్నారు. అయితే ధ్రువనక్షత్రం చిత్ర నిర్మాణ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి ఆగస్ట్‌లో తెరపైకి తీసుకురావాలన్నది చిత్ర యూనిట్ ప్లాన్ అని సమాచారం. -
విక్రమ్ హీరోగా ధృవ నక్షత్రం
-
గౌతమ్‌మీనన్ చిత్రం చేయడం లేదు: సూర్య
దర్శకుడు గౌతమ్‌మీనన్ చిత్రం నుంచి వైదొలగినట్లు సూర్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి గత ఏడాది జూన్‌లో అంగీకరించానని తెలిపారు. అయితే తన సినీ అనుభవం దృష్ట్యా కథ పూర్తిగా సంతృప్తినిస్తేనే షూటింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గౌతమ్‌మీనన్‌కు తెలియజేశానని వివరించారు. అందుకు ఆయన సమ్మతించిన తర్వాతే కలిసి పని చేయడానికి సిద్ధమయ్యామని తెలిపారు. అయితే ఒప్పందం జరిగి ఏడాదైనా పూర్తి కథను తనకు సంతృప్తి కలిగేలా చెప్పలేదని పేర్కొన్నారు. సింగం-2 తర్వాత గౌతమ్ కథ కోసం ఆరు నెలలు వేచి ఉన్నానని వెల్లడించారు. తమ మధ్యనున్న స్నేహం కారణంగా చిత్ర పూజా, ఫొటోషూట్ కార్యక్రమాలకు సహకరించానని తెలియజేశారు. తర్వాత కొన్ని నెలలు షూటింగ్ లేకుండా ఖాళీగా ఉండిపోయామని వివరించారు. ఎంతకీ గౌతమ్ నుంచి సంతృప్తికరమైన కథ లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌతమ్‌మీనన్, తన భావాలు విరుద్ధంగా ఉండడంతో ఇక కలసి పని చేయడం సాధ్యం కాదని భావించానన్నారు. ఒక నటుడిగా తనకు నమ్మకం లేని చిత్రాలు చేసి గుణ పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. ఈ దృష్ట్యా గౌతమ్ మీనన్ చిత్రం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.