చియాన్ విక్రమ్‌తో ఐశ్వర్య రాజేష్
నటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె నటనా ప్రతిభ ఏమిటో కాక్క ముట్టై చిత్రంతోనే రుజువైంది. ఆ చిత్రంలో నటనకు గానూ ఐశ్వర్య రాజేష్‌కు జాతీయ అవార్డు వస్తుందని చాలా మంది భావించారు. అలాంటి మంచి నటికి తాజాగా సియాన్ విక్రమ్‌కు జంటగా నటించే అవకాశం వరించింది. బహుశా ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోతో నటిస్తున్న చిత్రం ఇదే అవుతుందనుకుంటా. విక్రమ్ ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధ్రువనక్షత్రం చిత్రంలో నటిస్తున్నారు.
ఇందులో ఆయన వైవిధ్యభరిత పాత్రలో పెప్పర్ సాల్ట్ గెటప్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయనకు సం బంధించిన కొన్ని సన్ని వేశాలను దర్శకుడు చిత్రీకరించారు. రెండవషెడ్యూల్ మొదలై వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కథానాయకిగా మొదట అను ఇమ్మానుయేల్‌ను ఎంపి క చేశారు. అయితే కాల్‌షీట్స్ సమస్య కారణంగా ఆమె చిత్రం నుంచి వైదొలగడంతో ఆ పాత్రలో నటిం చే అదృష్టాన్ని టాలీవుడ్ నటి రీతువర్మ పొందారు. ఇకపోతే సాధారణంగా దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రాల్లో ఇద్దరు కథానాయికలు ఉంటారు.
ఇందులోనూ మరో నాయకిగా నటి ఐశ్వర్యరాజేష్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఈ బ్యూటీనే స్పష్టం చేశారు. తాను విక్రమ్‌కు జంటగా నటించనున్న మాట నిజమేనని ఐశ్వర్య అన్నారు. అయితే ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది, ఎప్పుడు షూటింగ్‌లో పాల్గొననున్నానన్న విషయాల గురించి ఇప్పుడేమీ చెప్పలేనని అన్నారు. అయితే ధ్రువనక్షత్రం చిత్ర నిర్మాణ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి ఆగస్ట్‌లో తెరపైకి తీసుకురావాలన్నది చిత్ర యూనిట్ ప్లాన్ అని సమాచారం.