Gautham Vasudev Menon Shares Photo With Chiyaan Vikram, Goes Viral - Sakshi
Sakshi News home page

Dhruva Natchathiram: ధ్రువ నక్ష్రత్రానికి గ్రహణం వీడనుందా?

Published Wed, Aug 3 2022 2:54 PM

Gautham Vasudev Menon Shares Photo With Chiyaan Vikram - Sakshi

Gautham Vasudev Menon Shares Photo With Chiyaan Vikram: చియాన్‌ విక్రమ్, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'ధ్రువ నక్షత్రం'. ఐశ్వర్య రాజేష్, నీతూ వర్మ, సిమ్రాన్, నటుడు పార్తీపన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి హరీష్‌ జయరాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను చాలా భాగం విదేశాల్లో నిర్వహించడం, ఆ మధ్య విడుదలైన 'ఒరు మనం' అనే సింగిల్‌ సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 2017లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికీ షూటింగ్‌ దశలోనే ఉండటం విక్రమ్‌ అభిమానులను నిరాశ పరుస్తోంది. 

ఈ నేపథ్యంలో విక్రమ్‌ ఇటీవల దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ను కలిసి 'ధ్రువ నక్షత్రం' చిత్ర షూటింగ్‌ విషయాల గురించి చర్చించడం శుభ పరిణామం. వీరిద్దరూ కలిసిన ఫొటోలను దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై విక్రమ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం విక్రమ్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన 'కోబ్రా' చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అదే విధంగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన చరిత్రాత్మక కథా చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌' సినిమా తొలిభాగం సెప్టెంబర్‌ 30వ తేదీన విడుదల కానుంది. కాగా పా.రంజిత్‌ దర్శకత్వంలో నటించే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మరి 'ధ్రువ నక్షత్రం' ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి మరి.  

చదవండి: ఒక్క సినిమాకు రూ. 20 కోట్లు తీసుకున్న హీరోయిన్‌!
క్వాలిటీ శృంగారంపై హీరోయిన్‌కు నిర్మాత ప్రశ్న..
 హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్‌ చేసుకోవాలని ట్వీట్‌

Advertisement
 
Advertisement
 
Advertisement