
నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ధ్రువనక్షత్రం. నటి రీతూ వర్మ నాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు పార్తీపన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, ఐశ్వర్య రాజేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం 2017లోనే ప్రారంభం అయ్యింది. షూటింగ్ కొంత భాగం లండన్‌లో జరుపుకుంది.
(ఇదీ చదవండి: మిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ కోసం అర్ధరాత్రి వెళ్లే వాళ్లం)
ఇందులో నటుడు విక్రమ్ జాన్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించారు. 2018లో విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వల్ల కాలేదు. ఈ చిత్రం విడుదల గురించి పలుమార్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఐదేళ్లు దాటినా ధ్రువనక్షత్రం ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. ఇంతకు ముందే చిత్రం లోని ఒక పాటను విడుదల చేశారు.
తాజాగా రెండో పాటను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో త్వరలోనే జాన్‌ను చూస్తారు అని పేర్కొన్నారు. దీంతో ధ్రువనక్షత్రం చిత్రానికి త్వరలోనే మోక్షం లభిస్తుందని తెలుస్తోంది. దీంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రం తర్వాత ధ్రువనక్షత్రం రాబోతోందని విక్రమ్ అభిమానులు ఆనందంతో ఎదురు చూస్తున్నారు.
(ఇదీ చదవండి: త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్ హిట్ డైరెక్టర్)
Comments
Please login to add a commentAdd a comment