Dhruvanaksatram
-
ఐదేళ్ల తర్వాత విక్రమ్ సినిమాకు మళ్లీ మోక్షం.. సంతోషంలో ఫ్యాన్స్
నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ధ్రువనక్షత్రం. నటి రీతూ వర్మ నాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు పార్తీపన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, ఐశ్వర్య రాజేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం 2017లోనే ప్రారంభం అయ్యింది. షూటింగ్ కొంత భాగం లండన్‌లో జరుపుకుంది. (ఇదీ చదవండి: మిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ కోసం అర్ధరాత్రి వెళ్లే వాళ్లం) ఇందులో నటుడు విక్రమ్ జాన్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించారు. 2018లో విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వల్ల కాలేదు. ఈ చిత్రం విడుదల గురించి పలుమార్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఐదేళ్లు దాటినా ధ్రువనక్షత్రం ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. ఇంతకు ముందే చిత్రం లోని ఒక పాటను విడుదల చేశారు. తాజాగా రెండో పాటను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో త్వరలోనే జాన్‌ను చూస్తారు అని పేర్కొన్నారు. దీంతో ధ్రువనక్షత్రం చిత్రానికి త్వరలోనే మోక్షం లభిస్తుందని తెలుస్తోంది. దీంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రం తర్వాత ధ్రువనక్షత్రం రాబోతోందని విక్రమ్ అభిమానులు ఆనందంతో ఎదురు చూస్తున్నారు. (ఇదీ చదవండి: త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్ హిట్ డైరెక్టర్) -
సమయం దగ్గర పడుతోంది మిత్రమా!
తమిళసినిమా: సమయం దగ్గర పడింది మిత్రమా ఇంకా 30 రోజులే అంటున్నారు దర్శకుడు గౌతమ్‌మీనన్. ఇంతకీ దేని గురించి ఈయన చెబుతున్నది. ఇంక దేని గురించి ఆయన తాజా చిత్రం ధ్రువనక్షత్రం గురించే. విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. ఆయనకు జంటగా రీతువర్మ కోలీవుడ్‌కు నాయకిగా ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్ర షూటింగ్ మొదటి నుంచి పలు ఒడిదుడుకులను ఎదుర్కొని ఎట్టకేలకు గాడిన పడిందనే చెప్పాలి. ఇటీవలే బల్గేరియాలో చిత్రీకరణను పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ చెన్నైకి తిరిగొచ్చారు. ధ్రువనక్షత్రం చిత్రం ఎంతవరకు పూర్తి అయ్యింది, ఇంకా ఎంత చిత్రీకరణ జరుపుకోవలసి ఉంది అన్న ఆసక్తి చాలా మంది ప్రేక్షకుల్లో నెలకొంది. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడానికేమో చిత్ర దర్శకుడు గౌతమ్‌మీనన్ ధ్రువనక్షత్రం షూటింగ్ కార్యక్రమాలు ఇంకా 30 రోజులే మిగిలి ఉంది. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌కు సిద్ధం అవుతున్నాం అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో భాగంగా రెండు చిత్ర ఫొటోలను కూడా ఆయన విడుదల చేశారు. కాగా ధ్రువనక్షత్రం చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయట.