'తంగలాన్‌' విడదలపై ప్రకటన.. రెండు తెలుగు సినిమాలతో పోటీ | Thangalaan Movie Release Date Locked | Sakshi
Sakshi News home page

రెండు తెలుగు సినిమాలకు పోటీగా దిగుతున్న 'తంగలాన్‌'

Published Fri, Jul 19 2024 5:16 PM | Last Updated on Fri, Jul 19 2024 5:23 PM

Thangalaan Movie Release Date Locked

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'తంగలాన్‌' విడుదల తేదీ ప్రకటన వచ్చేసింది. విక్రమ్‌- పా.రంజిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టూడియో గ్రీన్‌ సంస్థ నుంచి కేఈ జ్ఞానవేల్‌రాజా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై భారీ బజ్‌ క్రియేట్‌ అయింది.

కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆగష్టు 15న తంగలాన్‌ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. బంగారం కోసం అన్వేషణ అందుకోసం జరుగుతున్న పోరాటం ఆసక్తి కలిగించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తంగలాన్‌లో మాళవిక మోహనన్‌, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు.

తంగలాన్‌ చిత్రాన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా  తెరకెక్కించారు.  కేజీఎఫ్ గోల్డ్‌ మైన్స్ ను బ్రిటీష్ వాళ్ల నుంచి  తంగలాన్‌ అనే ఒక తెగ ఎలా కాపాడుకున్నదో ఈ చిత్రంలో చూపించనున్నారు. 19వ శతాబ్దంలో జరిగిన ఘటనలను ఈ సినిమాలో మేకర్స్‌ చూపించనున్నారు. ఈ మూవీలో విక్రమ్ లుక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విక్రమ్‌ ప్రయోగాత్మక లుక్‌లో కనిపించనున్నారు.

తంగలాన్‌కు పోటీగా ఆగష్టు 15న రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. రామ్ పోతినేని, పూరీల డబల్ ఇస్మార్ట్ అందరి కంటే ముందుగా ఆగస్టు 15న విడుదల అని తెలియచేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక మరో పెద్ద సినిమా మాస్ మహారాజ రవితేజ, పీపుల్స్ మీడియాల MR. బచ్చన్ ఆగస్టు 15న విడుదలకు సన్నాహాలు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement