విక్రమ్‌ 'ధ్రువ నక్షత్రం' వాయిదా.. చివరి క్షణంలో నిర్ణయం! | Vikram Dhruva Natchathiram Movie Again Postponed | Sakshi
Sakshi News home page

Dhruva Natchathiram: విక్రమ్‌ 'ధ్రువ నక్షత్రం' వాయిదా.. గౌతమ్‌ మీనన్‌ చుట్టూ డబ్బు వివాదం

Published Fri, Nov 24 2023 11:02 AM | Last Updated on Fri, Nov 24 2023 11:35 AM

Vikram Dhruva Natchathiram Movie Again Postponed - Sakshi

కోలీవుడ్‌ టాప్‌ హీరో  'విక్రమ్‌' నటించిన చిత్రం 'ధ్రువ నక్షత్రం'.  స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో 'గౌతమ్‌ మేనన్‌' దీనిని సిద్ధం డైరెక్ట్‌ చేశారు. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కిన ఈ చిత్రాన్ని 2017లో విడుదల చేయాలని మేకర్స్‌ ప్రకటించారు. చిత్రీకరణ పూర్తైనప్పటికీ అనుకోని కారణాలతో ఈ చిత్రం  వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. నేడు నవంబర్‌ 24న ఇది ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటన కూడా చేశారు.

ఇప్పటికే విక్రమ్‌ అభిమానులు టికెట్లు కూడా కొన్నారు. కొన్ని గంటల్లో బొమ్మ థియేటర్‌లలో పడుతుండగా తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ ప్రకటించారు. దీంతో విక్రమ్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

గౌతమ్‌ మేనన్‌ ఏం చెప్పారంటే
ఈరోజు విడుదల కానున్న ధ్రువ నక్షత్రం చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం.  కొన్ని కారణాల వల్ల నేడు ఈ సినిమా విడుదల చేయడం లేదు. అందుకు గాను నన్ను క్షమించండి. సినిమా విడుదల కోసం చాలా ప్రయత్నించాను. మరో రెండు రోజుల్లో ఈ సినిమాపై ప్రకటన ఇస్తాం. ఈ సినిమా అందరికీ అందుబాటులోకి రావాలని నేను కోరుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.

కారణం ఏంటి..?
కోలీవుడ్‌లో శింబు నటించిన 'సూపర్ స్టార్' చిత్రానికి దర్శకత్వం వహించేందుకు వాసుదేవ్ మీనన్ ఆల్ ఇన్ పిక్చర్స్ నుంచి రూ.2.40 కోట్లు తీసుకున్నారని, అయితే ఆ సినిమా పనులు పూర్తి చేయలేదని, సంస్థకు డబ్బులు తిరిగి చెల్లించలేదని గతంలో వార్తలు వచ్చాయి. తదనంతరం, డబ్బు తిరిగి ఇవ్వకుండా ధృవ నక్షత్రం విడుదల చేయవద్దని నిర్మాణ సంస్థ ఆల్‌ ఇన్ పిక్చర్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ కేసులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈరోజు (నవంబర్ 24) ఉదయం 10.30 గంటలలోపు ఆన్ ఇన్ పిక్చర్స్‌కు రూ. 2 కోట్ల రూపాయలను తిరిగి ఇస్తే సినిమా విడుదల చేస్తామని కోర్టు షరతులు విధించింది. దీంతో ధ్రువ నక్షత్రం సినిమాకు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement