నా పాత్ర నచ్చుతుంది | All Accept My Character In Dhruva Natchathiram | Sakshi
Sakshi News home page

నా పాత్ర నచ్చుతుంది

Published Thu, Apr 12 2018 9:16 AM | Last Updated on Thu, Apr 12 2018 9:16 AM

All Accept My Character In Dhruva Natchathiram - Sakshi

తమిళసినిమా: నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో ఉంది నటి రీతువర్మ. ఈ హైదరాబాదీ బ్యూటీ షార్ట్‌ ఫిలింస్‌ నుంచి బిగ్‌ స్క్రీన్స్‌ పైకి వచ్చింది. అలా కొన్ని చిత్రాల్లో నటించినా ఈ భామకు హైప్‌ తీసుకొచ్చిన చిత్రం మాత్రం పెళ్లిచూపులే. దీంతో కోలీవుడ్‌ కాలింగ్‌ బెల్‌ కొట్టింది. అంతే టాలెంట్‌ను క్యాచ్‌ చేయడంలో ముందుండే దర్శకుడు గౌతమ్‌మీనన్‌ రితూవర్మకు చాన్స్‌ ఇచ్చేశారు. విక్రమ్‌కు జంటగా ధ్రువనక్షత్రం చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఈ అమ్మడికి ఆ చిత్ర విడుదల కాకుండానే ఇక్కడ మరో రెండు చిత్రాలు తలుపుతట్టాయి. దుల్కర్‌సల్మాన్‌కు జంటగా కన్నుమ్‌ కన్నుమ్‌ కొళ్‌లైయడిత్తాల్, కలైయరసన్‌ సరసన చైనా చిత్రాల్లో నటించేస్తోంది. ధ్రువనక్షత్రం చిత్రంలోని నా పాత్ర ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుందని అంటోంది.

దీని గురించి రీతువర్మ చెబుతూ గౌతమ్‌మీనన్‌ చిత్రం అనగానే మరో మాట లేకుండా ఎగిరి గంతేసి నటించడానికి అంగీకరించానని చెప్పింది. ఆయన చిత్రాల్లో  నటీనటులను చాలా స్టైలిష్‌గా చూపిస్తారని అంది. అదే విధంగా తాను ఆశించినట్లుగానే ధ్రువనక్షత్రం చిత్రంలో తనను చాలా స్టైలిష్‌గా నటింపజేశారని చెప్పింది. అంతే కాకుండా కథకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటింపజేశారని అంది. ఇందులోని తన పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రీతువర్మ కోలీవుడ్‌లో తెరపై కనిపించిన తొలి చిత్రంగా వేలైఇల్లాపట్టాదారి–2 చిత్రం నమోదైంది. అందులో ఒక చిన్న పాత్రలో కనిపించి మాయమైన రీతువర్మ విక్రమ్‌తో నటిస్తున్న ధ్రువనక్షత్రం చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే టాలీవుడ్‌ ఈ బ్యూటీని పక్కన పెట్టేసింది. పెళ్లిచూపులు వంటి పెద్ద సక్సెస్‌ చిత్రం తరువాత కూడా ఈ అమ్మడికి అక్కడ అవకాశాలు లేవు. దీంతో కోలీవుడ్‌నే నమ్ముకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement