Dhruva Natchathiram Teaser: Vikram Massive Class Cop Look, Watch Here - Sakshi
Sakshi News home page

Published Tue, Jun 5 2018 12:27 PM | Last Updated on Tue, Jun 5 2018 3:46 PM

Vikram Dhruva Natchathiram New Teaser - Sakshi

చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న విక్రమ్‌, గౌతమ్‌ మీనన్‌ల ధృవ నక్షత్రం సినిమా కాస్త కదిలింది. ఏడాది క్రితం ఓ టీజర్‌తో సందడి చేసిన గౌతమ్‌ టీం.. తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 12 ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే యాక్షన్‌ కథాంశంతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు.

గత ఏడాది ఆగస్టులోనే రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా విక్రమ్‌తో గౌతమ్‌ మీనన్‌కు వచ్చిన విబేధాల కారణంగా వాయిదా పడింది. ఫైనల్‌ గా గౌతమ్‌ మీనన్‌ ధృవనక్షత్రం సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేశారు. యాక్షన్‌ ప్యాక్డ్‌ థ్రిల్లింగ్‌ టీజర్‌తో అభిమానులకు సినిమాను గుర్తు చేశారు. పార్తీపన్‌, రాధికా శరత్‌ కుమార్‌, సిమ్రాన్‌, రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్‌లు ఇతర ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు హారిస్‌ జయరాజ్‌ సంగీతమందిస్తున్నారు. కొత్త టీజర్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధృవ నక్షత్రం టీం కొత్త రిలీజ్‌ డేట్‌ను మాత్రం ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement