
విక్రమ్ 'పొన్నియిన్ సెల్వన్' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ జోష్‌తో ఇప్పుడు వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఈయన తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న తంగలాన్ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా విక్రమ్ ఐదేళ్ల క్రితం నటించిన చిత్రం ధృవనక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలు సమస్యల కారణంగా ఆగిపోయింది. దాన్ని ఇప్పుడు పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం గౌతమ్‌మీనన్ ధృవనక్షత్రం చిత్రానికి సంబంధించిన ప్యాచ్‌వర్క్ షూటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పుటికే కంప్లీట్ అయిన షూటింగ్‌కు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కావచ్చినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాలకు నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతోందని సమాచారం. కాగా ఇందులో విక్రమ్‌తో పాటు నటి రీతూవర్మ, ఐశ్వర్యరాజేశ్, సిమ్రాన్, పార్తీపన్, వినాయగం, రాధికాశరత్‌కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment