క్యారెక్టర్స్ మార్చుకున్న సౌత్ స్టార్స్ | Prithviraj villain in Vikram Dhruva Natchathiram | Sakshi
Sakshi News home page

క్యారెక్టర్స్ మార్చుకున్న సౌత్ స్టార్స్

Published Sat, Apr 29 2017 10:50 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

క్యారెక్టర్స్ మార్చుకున్న సౌత్ స్టార్స్

క్యారెక్టర్స్ మార్చుకున్న సౌత్ స్టార్స్

ఇరుముగన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ధృవ నక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో విక్రమ్ డిఫరెంట్ లుక్ లో అలరించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. అయితే రెండు టీజర్స్ లోనూ విలన్ ఎవరన్నది రివీల్ చేయలేదు. విలన్ వాయిస్ ను మాత్రమే ప్రజెంట్ చేశారు.

అయితే టీజర్ లో వినిపిస్తున్న విలన్ వాయిస్ మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ దే.. అన్న ప్రచారం జరుగుతోంది. గౌతమ్ మీనన్, విక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో పృథ్విరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే అది విలన్ రోల్ అని మాత్రం రివీల్ చేయలదే. టీజర్ లో వాయిస్ ని బట్టి పృథ్వి చేస్తున్నది విలన్ రోల్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్.

గతంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన విలన్ సినిమా కోసం పృథ్విరాజ్ హీరోగా నటించగా విక్రమ్ విలన్ గా అలరించాడు. ఇప్పుడు మరో ఆ ఇద్దరు నటులు తమ పాత్రలను మార్చుకొని విక్రమ్ హీరోగా పృథ్విరాజ్ విలన్ గా నటిస్తుండటంతో ధృవ నక్షత్రం సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement