స్టార్ హీరో సినిమా ఆగిపోయింది..! | Vikram Stopped Dhuruva Natchathiram Shooting | Sakshi
Sakshi News home page

స్టార్ హీరో సినిమా ఆగిపోయింది..!

Published Wed, Jun 7 2017 11:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

స్టార్ హీరో సినిమా ఆగిపోయింది..!

స్టార్ హీరో సినిమా ఆగిపోయింది..!

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధృవ నక్షత్రం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ఇటీవలే రిలీజ్ అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. షూటింగ్ సమయంలో గౌతమ్ మీనన్ కథలో మార్పులు చేయటం నచ్చని విక్రమ్.. షూటింగ్ ఆపేశాడన్న టాక్ వినిపిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన గౌతమ్ మీనన్... ఇప్పటికీ షూట్ చేస్తూనే ఉన్నాడు. అసలు ఈ ధృవనక్షత్రం కథను ముందుగా మహేష్ బాబుకు వినిపించాడు. తరువాత హీరో సూర్యతో చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించాడు. చివరి నిమిషంలో సూర్య తప్పుకోవటంతో విక్రమ్ హీరోగా సినిమా స్టార్ట్ చేశాడు. జేమ్స్ బాండ్ తరహా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విక్రమ్ డిఫరెంట్ లుక్లోకి మారిపోయాడు.

అయితే గౌతమ్ మీనన్.. షూటింగ్ సగానికి పైగా పూర్తయిన తరువాత కథలో మార్పులు చేస్తుండటంతో అది నచ్చని విక్రమ్ ధృవనక్షత్రం సినిమాను పక్కన పెట్టేశాడట. ఈ సినిమా కోసం ఇచ్చిన డేట్స్ను స్కెచ్ షూటింగ్ పూర్తి చేసేందుకు కేటాయించాడు. గతంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా సమయంలో కూడా గౌతమ్ మీనన్ ఇలాగే చేశాడు. సినిమా షూటింగ్ సగం పూర్తయిన తరువాత క్లైమాక్స్ను కొత్తగా రాసి షూటింగ్ కంప్లీట్ చేశాడు. దీంతో సినిమా ఆలస్యమయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement