హైదరాబాద్ థియేటర్లలో ‘కేశవ’ టీమ్ సందడి | Nikhil and keshava crew will will be Visiting SANDHYA 70mm | Sakshi
Sakshi News home page

నేటి సాయంత్రం కలుద్దాం: హీరో

Published Sun, May 28 2017 4:37 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

హైదరాబాద్ థియేటర్లలో ‘కేశవ’ టీమ్ సందడి

హైదరాబాద్ థియేటర్లలో ‘కేశవ’ టీమ్ సందడి

హైదరాబాద్: రెగ్యులర్ కమర్సియల్ జానర్ కు భిన్నంగా వరుస ప్రయోగాలు చేస్తూ దూసుకెళ్తున్న యంగ్ హీరో నిఖిల్. మరో డిఫరెంట్ మూవీ ‘కేశవ’తో మన ముందుకు వచ్చాడు. ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ నేడు హైదరాబాద్ లోని పలు థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ రీతూ వర్మ, దర్శకుడు సుధీర్ వర్మలు నేటి సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా 70 ఎంఎం థియేటర్ లో అభిమానుల మధ్య మూవీ వీక్షించనున్నారు. ఈ విషయాన్ని హీరో నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

‘రీతూ వర్మ, సుధీర్ వర్మ, నేను.. మా కేశవ గ్యాంగ్ నేటి సాయంత్రం షోకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ కు వస్తున్నాం. మరికొన్ని థియేటర్లకు వెళ్లి అభిమానులను కలుస్తామని’ ట్వీట్లో రాసుకొచ్చారు నిఖిల్. ఇటీవల విశాఖపట్నంలోనూ కొన్ని థియేటర్లకు కేశవ గ్యాంగ్... హీరో నిఖిల్, హీరోయిన్ రీతూ వర్మ, డైరెక్టర్, మూవీ యూనిట్ సభ్యులు కొందరు వెళ్లి సందడి చేసిన విషయం తెలిసిందే. విశాఖలో ఈ టీమ్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా, ఇదే ఫార్ములాను హైదరాబాద్ లోనూ ఫాలో అవుతున్నారు. అరుదైన గుండె జబ్బుతో ఎక్కువగా ఆవేశపడలేని ఓ యువకుడు తన పగను ఎలా తీర్చుకున్నాడన్న కథతో తెరకెక్కిన కేశవ సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement