Kirrak Party Collections | కిరాక్ పార్టీ కలెక్షన్స్ | Creates Records At Telugu Box Office
Sakshi News home page

దుమ్ములేపుతున్న కిరాక్‌పార్టీ వసూళ్లు

Published Mon, Mar 19 2018 10:09 AM | Last Updated on Mon, Mar 19 2018 1:13 PM

Kirrak Party poster - Sakshi

కిరాక్‌పార్టీ చిత్రం

స్వామిరారా సినిమాతో మళ్లీ సక్సెస్‌ రుచి చూసిన నిఖిల్‌... విజయరహస్యమేంటో తెలుసుకున్నాడు. అప్పటినుంచీ వైవిధ్యభరితమైన కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. అదే తరహాలో కన్నడ  రీమేక్‌లో నటించాడు. కిరాక్‌పార్టీగా శుక్రవారం(మార్చి 16) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా వసూళ్లలో దూసుకెళ్లిపోతోంది.

ఈ వారం కిరాక్‌పార్టీ మినహా ఏ సినిమాకు పాజిటివ్‌టాక్‌ రాకపోవడం...నిఖిల్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా వీకెండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌ పరంగా దుమ్ముదులిపింది. దీంతో మూడు రోజుల్లో దాదాపు పదికోట్ల వసూళ్లను సాధించింది. కిరాక్‌పార్టీ హవా ఇలాగే కొనసాగితే...వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సుధీర్‌ వర్మ స్క్రిప్ట్‌ను, చందూ మొండేటి మాటలను అందించగా శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement