Kirrak Party
-
మాజీ ప్రియుడితో మళ్లీ కలవనున్న రష్మిక?
సినీ పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరని గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్లో ప్రస్తుతం రష్మిక మందనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఛలోతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో వరుస సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయ్యింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. అయితే కన్నడంలో ‘కిరాక్ పార్టీ’తో చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో తనతో జోడి కట్టిన రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. అయితే కొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరూ బ్రేకప్ అయ్యారు. (తండ్రిపై రష్మిక ఎమోషనల్ పోస్ట్..) అయితే తాజాగా లీకువీరులు అందిస్తున్న సమాచారం ప్రకారం రష్మిక, రక్షిత్ శెట్టిలు మళ్లీ కలవనున్నారు. ఎందుకంటే కన్నడంలో సూపర్‌డూపర్ హిట్ సాధించిన కిరాక్ పార్టీ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సినిమాలో రక్షిత్ శెట్టినే హీరో. అయితే హీరోయిన్గా రష్మికను కాకుండా కొత్తవాళ్లని ఎవరినైనా తీసుకోవాలని రక్షిత్ భావిస్తున్నాడట. అయితే నిర్మాతలు మాత్రం రష్మిక అయితేనే బాగుంటుందని హీరోకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కిరాక్ పార్టీ సీక్వెల్లో రక్షిత్‌తో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభిప్రాయం లేదని రష్మిక తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అయితే రష్మిక-రక్షిత్‌లో మరోసారి ఆన్‌స్క్రీన్‌పై చూడాలని అక్కడి అభిమానులు తెగ కోరుకుంటున్నారంట. మరి కిరాక్ పార్టీ సీక్వెల్ కోసం ఈ మాజీ ప్రేమికులు కలుస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. (పెంగ్విన్ మూవీ రివ్యూ) -
బిజీ బీజీ!
సంయుక్తా హెగ్డే.. పేరు ఎక్కడో విన్నారు కదూ. కన్నడ ‘కిర్రిక్ పార్టీ’ సినిమాలో ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో ఆమె హైపర్‌కు థియేటర్స్‌లో మంచి మార్కులు పడ్డాయి. ఎంతలా అంటే.. ఈ కన్నడ ‘కిర్రిక్ పార్టీ’ సినిమాను తెలుగులో ‘కిర్రాక్ పార్టీగా’ రీమేక్ చేయాలనుకున్నప్పుడు సేమ్ రోల్‌కు సంయుక్తానే తీసుకునేంతగా. ఈ సినిమాతో తెలుగులోనూ మార్కులు కొట్టేశారామె. ఇప్పుడీ కన్నడ బ్యూటీ కోలీవుడ్‌లో బిజీ బీజీగా ఉన్నారట. ‘జయం’ రవి, కాజల్ ఓ తమిళ సినిమా కోసం జోడీ కట్టారు. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో స్క్రిప్ట్ పరంగా సెకండ్ హీరోయిన్‌కు చాన్స్ ఉందట. దీంతో మేకర్స్ సంయుక్తాను సంప్రదించడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నీ చకా చకా జరిగిపోయాయట. ఇది కాకుండా తమిళ సినిమా ‘పప్పీ’లో నటిస్తున్నారీ బ్యూటీ. -
మిస్ డీసెంట్
కన్నడ చిత్రం ‘కిర్రిక్ పార్టీ’లో డీసెంట్ గాళ్‌గా రష్మిక మండన్నా నటించారు. ఇప్పుడు ఇదే పాత్రను చేయడానికి బాలీవుడ్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రెడీ అవుతున్నారు. ‘కిర్రిక్ పార్టీ’ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిషేక్ జైన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో ఒక కథానాయికగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకున్నారు. ‘కిర్రిక్ పార్టీ’ సినిమా తెలుగులో ‘కిరాక్ పార్టీ’ టైటిల్‌తో రీమేక్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హిందీలో ‘డ్రైవ్’ సినిమాతో బిజీగా ఉన్నారు జాక్వెలిన్. -
షూటింగ్ మొదలుకాకుండానే బిజినెస్
విభిన్న చిత్రాలతో వరుస విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ ఇటీవల కిరాక్ పార్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కన్నడ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోసారి రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు నిఖిల్. తమిళ్లో ఘనవిజయం సాధించిన కనితన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు నిఖిల్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముద్ర అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే షూటింగ్ మొదలవటానికి ముందే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. స్టార్ మా సంస్థ ఈ సినిమా తెలుగు, హిందీ శాటిలైట్ హక్కులను 5.5 కోట్లకు సొంతం చేసుకుంది. -
కిరాక్ ఉందంటున్నారు – నిఖిల్
నిఖిల్, సిమ్రాన్, సంయుక్తా హెగ్డే ముఖ్య తారలుగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కిరాక్ పార్టీ’. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ‘కిరాక్ పార్టీ’ నిఖిల్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ను సాధించి, విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ –‘‘కిరాక్ పార్టీ’ చిత్రానికి అన్ని చోట్లా విశేష స్పందన లభిస్తోంది. స్టూడెంట్స్‌కి బాగా కనెకై్టంది. నిర్మాతగా మాకు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఇచ్చిన చిత్రమిది. ఓవర్సీస్లో అరమిలియన్ వసూళ్లను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి విజయ యాత్ర నిర్వహించనున్నాం’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. కిరాక్ ఉందంటున్నారు. మౌత్‌టాక్‌తో రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సినిమా ఆడుతోంది. క్లైమాక్స్‌కి ముందు నా నటన బాగుందని అందరూ మెచ్చుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు నిఖిల్. ‘‘హ్యాపీడేస్ తర్వాత కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మంచి సినిమా ఇది’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘ప్రతి విద్యార్థి తమ కథగానే భావించి సినిమాను పెద్ద హిట్ చేశారు’’ అన్నారు శరణ్. ‘‘తెలుగులో తొలి అడుగుతోనే మంచి విజయం దక్కడం ఆనందంగా ఉంది’’ అన్నారు సంయుక్తా హెగ్డే. ఈ కార్యక్రమంలో హేమంత్, రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - కిరాక్ పార్టీ
-
దుమ్ములేపుతున్న కిరాక్‌పార్టీ వసూళ్లు
స్వామిరారా సినిమాతో మళ్లీ సక్సెస్ రుచి చూసిన నిఖిల్... విజయరహస్యమేంటో తెలుసుకున్నాడు. అప్పటినుంచీ వైవిధ్యభరితమైన కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. అదే తరహాలో కన్నడ రీమేక్‌లో నటించాడు. కిరాక్పార్టీగా శుక్రవారం(మార్చి 16) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా వసూళ్లలో దూసుకెళ్లిపోతోంది. ఈ వారం కిరాక్‌పార్టీ మినహా ఏ సినిమాకు పాజిటివ్టాక్ రాకపోవడం...నిఖిల్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా వీకెండ్లో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ముదులిపింది. దీంతో మూడు రోజుల్లో దాదాపు పదికోట్ల వసూళ్లను సాధించింది. కిరాక్‌పార్టీ హవా ఇలాగే కొనసాగితే...వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ స్క్రిప్ట్‌ను, చందూ మొండేటి మాటలను అందించగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. -
‘కిరాక్ పార్టీ’ మూవీ రివ్యూ
టైటిల్ : కిరాక్ పార్టీ జానర్ : యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్, సిమ్రాన్ పరీన్జా, సంయుక్త హెగ్డే సంగీతం : బి. అజనీష్ లోక్‌నాథ్ దర్శకత్వం : శరన్ కొప్పిశెట్టి నిర్మాత : రామబ్రహ్మం సుంకర వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కిరాక్ పార్టీ. ప్రయోగాలను పక్కన పెట్టి కన్నడలో సూపర్ హిట్ అయిన కిరిక్ పార్టీ సినిమాను తెలుగులో కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ చేశాడు నిఖిల్. శరన్ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా నిఖిల్ ఖాతాలో మరో సక్సెస్ గా నిలిచిందా..? ప్రయోగాలను పక్కన పెట్టి కమర్షియల్ సినిమా చేసిన నిఖిల్ మరో విజయం సాధించాడా..? కథ : కృష్ణ (నిఖిల్ సిద్ధార్థ్) మెకానికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. తన ఫ్రెండ్స్‌తో కలిసి కాలేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. కాలేజ్ బంక్ కొట్టడం, గొడవలు చేయటం ఇదే కృష్ణ లైఫ్. ఆ సమయంలో సీనియర్ మీరా (సిమ్రాన్ పరీన్జా)ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఎలాగైన తనకు దగ్గరకావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా తన లైఫ్ తాను ఎంజాయ్ చేసే కృష్ణను మీరా కూడా ఇష్టపడుతుంది. (సాక్షి రివ్యూస్) కానీ అనుకోండా ఓ ప్రమాదంలో మీరా చనిపోతుంది. మీరాను ప్రాణంగా ప్రేమించిన కృష్ణ, పూర్తిగా మారిపోతాడు. కాలేజ్ లో అందరితో గొడవపడుతూ రౌడీలా మారిపోతాడు. మూడేళ్లు గడిచిపోతాయి. కృష్ణ గ్యాంగ్ ఫైనల్ ఇయర్‌కు వస్తుంది. కృష్ణ హీరోయిజం చూసి జూనియర్ సత్య (సంయుక్త హెగ్డే) కృష్ణను ఇష్టపడుతుంది. ఎలాగైన కృష్ణను మామూలు మనిషిగా మార్చాలని, జీవితంలోని కొన్ని చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ముందుకు సాగాలని గుర్తు చేయాలనుకుంటుంది. మరి సత్య ప్రయత్నం ఫలించిందా..? కృష్ణ మీరాను మర్చిపోయి సత్యకు దగ్గరయ్యాడా..? ఈ కాలేజ్ లైఫ్ కృష్ణకు ఎలాంటి అనుభవాలను ఇచ్చింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కృష్ణ పాత్రలో నిఖిల్ మంచి నటన కనబరిచాడు. స్టూడెంట్ గా తనకు అలవాటైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో మెప్పించటంతో పాటు సెకండ్ హాఫ్‌లో మెచ్యూర్డ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. లుక్ విషయంలోనూ మంచి వేరియేషన్ చూపించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో నిఖిల్ నటన చాలా బాగుంది. సినిమా సినిమాకు మంచి పరిణతి కనబరుస్తున్నాడు నిఖిల్. ఫస్ట్‌హాఫ్ లో హీరోయిన్ గా కనిపించిన సిమ్రాన్ హుందాగా కనిపించింది. సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. (సాక్షి రివ్యూస్)మరో హీరోయిన్ సంయుక్త హెగ్డే బబ్లీ గర్ల్ గా కనిపించి సెంకడ్‌హాఫ్ లో జోష్ నింపే ప్రయత్నం చేసింది. బ్రహ్మాజీది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో మంచి కామెడీ పండించాడు. ఫ్రెండ్స్ పాత్రలో కనిపించిన నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు. విశ్లేషణ : తెలుగులో ఈ తరహా కథలు చాలా కాలం క్రితమే వచ్చాయి. హ్యాపిడేస్ లాంటి సినిమాలు సంచలనాలు సృష్టించాయి. మరోసారి అదే తరహా కాలేజ్ డేస్‌ను గుర్తు చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు శరన్. అయితే ఎక్కడా కొత్తదనం కనిపించకపోవటం నిరాశపరుస్తుంది. అక్కడక్కడ కథనంలో మెరుపులు కనిపించినా.. గతంలో తెలుగు తెర మీద వచ్చిన చాలా కాలేజ్ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. కన్నడ ప్రేక్షకులకు ఈ తరహా కథలు కొత్త అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం రొటీన్ ఫార్ములా సినిమాలాగే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నా, కథనం నెమ్మదిగా సాగటం ఇబ్బంది పెడుతుంది. (సాక్షి రివ్యూస్)ఇలాంటి రొటీన్ కథను చెప్పటడానికి 2 గంటల 45 నిమిషాల సమయం తీసుకున్న దర్శకుడు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఒరిజినల్ వర్షన్ కు సంగీత మందిచిన అజనీష్ తెలుగు వర్షన్‌కు కూడా మంచి సంగీతాన్ని అందించాడు. పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నిఖిల్ నటన సంగీతం మైనస్ పాయింట్స్ : సినిమా నిడివి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
పార్టీలో మేం ఉన్నందుకు హ్యాపీ
‘‘కిరాక్ పార్టీ’ చిత్రంలో నా పాత్ర పేరు మీరా. ఎంతమంది అబ్బాయిలు వెంట పడ్డా పట్టించుకోని పాత్ర. కన్నడలో ఈ పాత్రను రష్మికా చేశారు. నేను ఆమెను ఫాలో కాకుండా దర్శకుడు చెప్పినట్టు కొత్తగా చేశా. నిఖిల్ నన్నెప్పుడూ కొత్త హీరోయిన్ని చూసినట్టు చూడలేదు. చాలా సరదాగా, ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. టైటిల్‌కి తగ్గట్టుగానే మంచి పార్టీలా ఉంటుంది’’ అని కథానాయిక సిమ్రన్ అన్నారు. నిఖిల్, సిమ్రన్, సంయుక్త హెగ్డే హీరో హీరోయిన్లుగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘కిరాక్ పార్టీ’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంయుక్త హెగ్డే మాట్లాడుతూ– ‘‘కన్నడ ‘కిరిక్ పార్టీ’లో నేను నటించా. నా పాత్ర నచ్చి దర్శక–నిర్మాతలు ‘కిరాక్ పార్టీ’కి తీసుకున్నందుకు హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా విషయంలో నాకు నేనే పోటీ. నా పాత్ర పేరు సత్య. ఫన్ లవింగ్ బబ్లీ గర్ల్. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉన్న పాత్ర ఇది. మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అందులోని ట్విస్ట్ ఏంటన్నది సినిమాలో చూడాలి. తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నా. తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఇంకా ఏదీ అంగీకరించలేదు. ‘కిరాక్ పార్టీ’ విడుదలయ్యాక చూడాలి’’ అన్నారు. -
కాలేజీ రోజులు గుర్తుకువస్తాయి! – అనిల్ సుంకర
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఏటీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘కిరాక్ పార్టీ’. సిమ్రాన్, సంయుక్తా హెగ్డే కథానాయికలు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో థియేట్రికల్ ట్రైలర్‌ను తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేత జి. కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సినిమాను శుక్రవారం విడుదల చేయనున్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘నిఖిల్ ఎనర్జిటిక్ హీరో. సినిమా ఎంత కిరాక్‌గా ఉన్నా కూడా మంచి మెసేజ్ ఉంటుందని భావిస్తున్నా. దర్శకుడికి మంచి పేరు, నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కార్తీకేయ’ సినిమాకు శరణ్ నాతో వర్క్ చేశాడు. ఇప్పుడు తన డైరెక్షన్లో నేను వర్క్ చేశాను. మేమిద్దరం కలిసి చేసిన చిత్రమిది’’ అన్నారు దర్శకుడు చందు మొండేటి. ‘‘ఈ సినిమా చూసిన వారందరూ... సినిమాతో ప్రేమలో పడిపోతారు. కాలేజీ రోజులు గుర్తుకు వస్తాయి. కిషోర్‌గారు ప్రొడక్షన్లో సహకారం అందించారు’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘హ్యాపీడేస్ ఎన్ని రోజులు ఆడిందో.. అంతకంటే ఎక్కువ రోజులు ‘కిరాక్ పార్టీ’ ఆడుతుంది’’ అన్నారు నాగశౌర్య. ‘‘మహిళలకు గౌరవం ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాం. అనిల్‌గారు, కిషోర్‌గారి వల్లే ఈ సినిమా స్టారై్టంది. సుధీర్‌వర్మ మంచి డైలాగ్స్ అందించారు. చందు బౌండెడ్ స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు. చరణ్ అద్భుతంగా తీశాడు’’ అన్నారు నిఖిల్. ‘‘టీమ్ అంతా కష్టపడి చేసిన సినిమా ఇది’’ అన్నారు శరణ్. -
‘కిరాక్ పార్టీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
అందుకే కొత్తవాళ్లను తీసుకుంటా
‘‘నేను దర్శకుణ్ణి అవ్వాలనే ఇండస్ట్రీకొచ్చా. కానీ, డైరెక్టర్‌గా విఫలమయ్యా. నిర్మాతగా సక్సెస్ అయ్యా. అందుకే నిర్మాతగా ఉండటమే ఇష్టం’’ అన్నారు అనిల్ సుంకర. నిఖిల్ హీరోగా, సంయుక్తా హెగ్డే, సిమ్రన్ పరింజ హీరోయిన్స్‌గా శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘కిరాక్ పార్టీ’ ఈ నెల 16న విడుదలకానుంది. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ–‘‘ నాకు ఎప్పటి నుంచో ‘శివ’ లాంటి సినిమా చేయాలని ఆశ. కన్నడ ‘కిరిక్ పార్టీ’ కథాంశం ‘శివ’ చిత్రానికి కొంత దగ్గరగా ఉండటంతో ‘కిరాక్ పార్టీ’ గా తెలుగులో రీమేక్ చేశా. ఈ చిత్రానికి తొలుత దర్శకునిగా రాజుసుందరం అనుకున్నాం. ఆయన తెలుగు, తమిళ భాషల్లో చేద్దామన్నారు. రెండు భాషల్లో ఒకేసారి ఫోకస్ చేయలేమని శరన్‌కి అవకాశం ఇచ్చాం. చాలా మంది కుర్రాళ్లు పల్లెటూరి నుంచి ఇంజనీరింగ్ చేయడానికి సిటీకొస్తారు. మొదటి సంవత్సరం భయంగా ఉంటారు. చివరి సంవత్సారానికి పూర్తీగా మారిపోతారు. అదెలా అన్నదే కథాంశం. మా సినిమాల్లో కొత్త వాళ్లను ఎక్కువగా తీసుకోవడానికి కారణం రెమ్యునరేషన్ తక్కువనే(నవ్వుతూ). ఫ్రెష్‌నెస్ కోసమే కొత్త వాళ్లను తీసుకుంటాం. శర్వానంద్– ‘దండుపాళ్యం’ డైరెక్టర్ శ్రీనివాసరాజుతో ఓ సినిమా అనుకున్నాం. కథ పూర్తయ్యాక వివరాలు చెబుతా’’ అన్నారు. -
అటెండెన్స్ వేయించే బాధ్యత నాది– ‘అల్లరి’ నరేశ్
‘‘స్టూడెంట్స్ ఎవ్వరూ ఈనెల 16న అటెండెన్స్ గురించి పట్టించుకోకండి. ఆరోజు అటెండెన్స్ వేయించే బాధ్యత నాది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. నిఖిల్, సిమ్రాన్ పరింజా, సంయుక్తా హెగ్డే ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘కిరాక్ పార్టీ’. కన్నడ ‘కిరిక్ పార్టీ’ కి రీమేక్. శరణ్ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలవుతోంది. అజనీష్ లోక్నాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను విజయవాడలో రిలీజ్ చేశారు. ముఖ్య అతిథి ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘నిఖిల్‌ను చూస్తే నాకు డ్యూరోసెల్ బ్యాటరీ గుర్తొస్తుంటుంది. అంత ఎనర్జిటిక్‌గా ఉంటాడు. కన్నడలో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులోనూ అంతే హిట్ అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ ఉన్న సినిమా ఇది. ఈ చిత్రంలో నటించే అవకాశాన్నిచ్చిన అనిల్ సుంకరగారికి థ్యాంక్స్. చందు మొండేటికి ‘కార్తికేయ’, సుధీర్ వర్మకు ‘స్వామి రారా’ ఎంత పేరు తెచ్చాయో, ‘కిరాక్ పార్టీ’ శరణ్‌కి అంతే పేరు తీసుకొస్తుంది’’ అన్నారు నిఖిల్. ‘‘టీమ్ అంతా ఎంతో కష్టపడి పని చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘ప్రతి స్టూడెంట్ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. 16న బంక్ కొట్టి మరీ ఈ సినిమా చూస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు శరణ్. దర్శకుడు సుధీర్ వర్మ, సిమ్రాన్ పరింజా, సంయుక్తా హెగ్డే తదితరులు పాల్గొన్నారు. -
కిరాక్ పార్టీ ఆడియో రిలీజ్
-
కిరాక్ పుట్టించిన నిఖిల్
కిరాక్ పార్టీ సినిమా ప్రమోషన్లో భాగంగా శుక్రవారం నగరానికి వచ్చేసిన ఆ చిత్ర హీరో నిఖిల్‌తో సహా యూనిట్ సభ్యులు అవంతి ఇంజినీరింగ్ కళాశాలతోపాటు సీఎంఆర్ సెంట్రల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని అభిమానులను ఉర్రూతలూగించారు. తగరపువలస (భీమిలి) / మద్దిలపాలెం(విశాఖ తూర్పు):ఈ నెల 16న విడుదల కానున్న కిరాక్‌పార్టీ సినిమా హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సిమ్రాన్ పరీంజా, సంయుక్త హెగ్డేలు చెరకుపల్లి అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో సందడి చేశారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చేరుకున్న వీరు విద్యార్థులను ఆటా, పాటలతో అలరించారు. హుషారైన పాటలకు స్టెప్పులు వేశారు. వీరితో సెల్ఫీలు దిగడానికి విద్యార్థులు పోటీపడ్డారు. హాస్య నటుడు రఘు కొంతసేపు విద్యార్థులను నవ్వించాడు. డైరెక్టర్ కొప్పశెట్టి శరణ్ మాట్లాడుతూ కళాశాల నేపథ్యంలో విద్యార్థులను ఆకట్టుకునేవిధంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పాడు. తమ కిర్రాక్ పార్టీని అందరూ ఆదరించాలని కోరారు. అనంతరం ఈ నెల 16, 17 తేదీలలో కళాశాలలో జరుగనున్న జాతీయస్థాయి యూత్ లెవెల్ ఫెస్టివల్ అవెన్సిస్ పోస్టర్‌ను హీరో నిఖిల్ అవిష్కరించారు. కిరాక్ పార్టీ చిత్ర యూనిట్ మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో శుక్రవారం సందడి చేసింది. హీరో నిఖిల్, హీరోయిన్ సిమ్రాన్ పరీంజా, హాస్యనటుడు రఘు చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రిలీజ్ ఫీవర్ స్టార్ట్ అయింది ‘‘కిరాక్ పార్టీ’
నా 15వ సినిమా. సినిమాకు పది రోజుల ముందు నుంచి నా ఫస్ట్ సినిమా, 15 సినిమా అనే డిఫరెన్స్ తెలీదు. హ్యాపీడేస్ అప్పుడు ఎలా నెర్వస్‌గా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. రిలీజ్ ఫీవర్ స్టార్ట్ అయింది’’ అన్నారు హీరో నిఖిల్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా సిమ్రాన్, సంయుక్తా హెగ్డే హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కిరాక్ పార్టీ’. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా మార్చి16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► కొన్ని సినిమాలు మనకు స్పెషల్‌గా ఉండిపోతాయి. ‘హ్యాపిడేస్, యువత, కార్తికేయ’ ఇప్పుడు ఈ సినిమా. మిగతా సినిమాలు హిట్స్ అయినా కూడా కొన్ని క్యారెక్టర్స్‌ను బాగా లవ్ చేస్తాం. ఇది నా ఫెవరెట్ రోల్. నేను కాలేజ్ మూవీ చేసి ఆల్మోస్ట్ 11ఇయర్స్ అయిపోతోంది. ► ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్ నుంచి స్టూడెంట్ లీడర్ ఎలా అయ్యాడు అనేది కథాంశం. నేను చేసిన అన్నింట్లో పెర్ఫార్మన్స్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఇచ్చింది. షూటింగ్ అప్పుడు కూడా అందరి కంటే ముందే సెట్‌కి వెళ్లిపోయేవాణ్ణి. ఈ క్యారెక్టర్ చాలా ఇష్టపడి చేశాను. ► ఈ సినిమా చేస్తుప్పుడు ‘హ్యాపీడేస్’ ఫీల్ వచ్చింది. ‘హ్యాపీడేస్’ తర్వాత ఫుల్ లెంగ్త్ కాలేజ్ ఫిల్మ్ రాలేదు. స్టార్ట్ టూ ఎండ్ వరకు కాలేజ్‌లోనే ఈ సినిమా నడుస్తుంది. అమ్మాయిల గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడితే ఆ అమ్మాయి ఎంత సఫర్ అవుతుందనే సెన్సిటీవ్ టాఫిక్ సినిమాలో ఉంటుంది. ► నా కాలేజ్ లైఫ్‌లో రెండు మూడు సార్లు గొడవలు అయ్యాయి. పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. స్టూడెంట్స్ అని వదిలేశారు. అలాంటి మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి. నేను, మా డైరెక్టర్, చందూ మెండేటి, సుధీర్ వర్మ, నిర్మాతలు అందరూ ఇంజినీర్సే. ► కన్నడ ‘కిర్రిక్ పార్టీ’ లాంటి క్యూట్ సినిమా మన తెలుగు ఆడియన్స్ మిస్ కావద్దని రిమేక్ చేశాం. ఈ సినిమాలో మార్చనవి రెండే రెండు. ఒకటి హీరోయిన్ సంయుక్త హెగ్డే, రెండు మ్యూజిక్. సంయుక్త బెస్ట్ డ్యాన్సర్, ఫుల్ ఎనర్జిటిక్. సో ఆమెను రీప్లేస్ చేయదలుచుకోలేదు. అలాగే ఇదొక మ్యూజికల్ ఫిల్మ్. అంజనీష్ లోకనాథ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ► అనిల్ సుంకరగారు ఈ సినిమా డైరెక్షన్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు. కొబ్బరికాయ కొట్టిన రోజు, మధ్యలో ఏదో ఒకసారి వచ్చారు అంతే. చందూ మొండేటి (డైలాగ్స్), సుధీర్ వర్మ (స్క్రీన్ ప్లే)లతో శరణ్ వర్క్ చేశాడు. వాళ్లిద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. అలా వాళ్లు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ► తమిళ ‘కణిదన్’ రీమేక్, కార్తికేయ సీక్వెల్లో నటిస్తున్నాను. -
పార్టీకి టైమ్ అయ్యింది
పార్టీకి డేట్ ఫిక్సైంది. ఆ పార్టీ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్‌కు వెళ్లాల్సిందే. నిఖిల్ హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్స్, ఏటీవీ బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘కిర్రాక్‌పార్టీ’. శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ నిర్మాతలు. సంయుక్త హెగ్డే, సిమ్రాన్ కథానాయికలు. కన్నడ హిట్ ‘కిర్రిక్ పార్టీ’కి ఇది రీమేక్. ఈ సినిమాను ఈ నెల 16న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘‘నిఖిల్ స్టైలిష్ మ్యాచో లుక్స్ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. కాలేజీ క్యాంపస్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం ‘హ్యాపీడేస్’ తరహాలో నిఖిల్‌కు మరో విజయం అందిస్తుంది. ఆల్రెడీ టీజర్, సాంగ్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్‌ప్లే అందించగా, దర్శకుడు చందూ మొండేటి మాటలు సమకూర్చారు’’ అని నిర్మాత తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి. -
'కిరాక్ పార్టీ' మూవీ స్టిల్స్
-
మార్చి 16న ‘కిర్రాక్ పార్టీ’
నిఖిల్ హీరోగా తెరెకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కిర్రాక్ పార్టీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. నిఖిల్ స్టైలిష్ మ్యాచో లుక్స్ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసాయి. కన్నడ సినిమా కిరిక్ పార్టీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమా నిఖిల్‌కు మరో హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కిర్రాక్ పార్టీ సినిమాతో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిఖిల్ తో ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకులు సుధీర్ వర్మ, చందూ మొండేటి ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ నిఖిల్ సరసన హీరోయిన్ లు గా నటిస్తుండగా రామబ్రహ్మం సుంకర, కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర, అభిషేక్ అగ్రవాల్ నిర్మాతలుగా ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏటివి బ్యానర్ ల పై నిర్మిస్తున్న కిర్రాక్ పార్టీ మార్చ్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల కానుంది. -
హోలీ సంబరాల్లో కిరాక్ పార్టీ హీరో
-
ముందే వస్తోన్న యంగ్ హీరో
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్ త్వరలో కిరాక్ పార్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను మార్చి 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రీ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారట. మార్చి 16న పెద్ద సినిమాల రిలీజ్ లేవి లేకపోవటంతో అదే రోజు సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ముందే రిలీజ్ చేస్తే మార్చి 30న రంగస్థలం రిలీజ్ అయ్యే వరకు సమయం కలిసొస్తుందన్న ఆలోచనలో ఉన్నారట. కన్నడ సూపర్ హిట్ కిరిక్ పార్టీ సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్ పరీన్జా, సంయుక్త హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. -
పార్టీకి తయార్
కాలేజీ స్టూడెంట్‌గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు సిద్ధార్థ్ మల్హోత్రా. అదేనండీ.. కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా ద్వారా సిద్ధార్థ్ సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం అయ్యారని చెబుతున్నాం. ఆల్మోస్ట్ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ స్టూడెంట్‌గా క్లాస్‌రూమ్‌కి వెళ్లేందుకు సిద్ధార్థ్ చర్చలు జరుపుతున్నాడని బీటౌన్ టాక్. అంతేకాదు సిద్ధార్థ్‌తో పాటు సినిమాలో ఉండబోయే గ్యాంగ్ మెంబర్స్ అడ్మిషన్స్ కోసం ఆల్రెడీ ఆడిషన్స్‌ను కూడా స్టార్ట్ చేశారట. మరి.. కాలేజీలో గ్యాంగ్‌ని మెయిన్టైన్ చేస్తారు కదా. కన్నడ సూపర్ హిట్ ‘కిర్రిక్ పార్టీ’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్‌తో పాటు నటించబోయే స్టూడెంట్స్ కోసం అడ్మిషన్స్.. అదేనండీ.. సెలెక్షన్స్ ఓపెన్ అన్నమాట. ‘కిర్రిక్ పారీ’్ట హిందీ రీమేక్ రైట్స్ దక్కించుకున్న అజయ్‌కపూర్ ఆల్రెడీ సిద్ధార్థ్‌తో మాట్లాడారని, స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ‘కిర్రిక్ పార్టీ’ తెలుగులో నిఖిల్ హీరోగా ‘కిరాక్ పార్టీ’గా రీమేక్ అయింది. ఇందులో సిమ్రన్, సంయుక్తా హెగ్డే కీలక పాత్రలు చేశారు. -
నిఖిల్ కూడా లవ్ ఫెయిల్యూరే..
రోజా పువ్వు ప్రేమకు సంకేతం. ఎవరైనా వారి ప్రేమను ప్రేమికుల రోజున ఒక రోజా పువ్వు ఇచ్చి తెలియజేస్తారు. యంగ్ హీరో నిఖిల్ కూడా లవ్ ఫెయిల్యూర్రే. నిఖిల్ గర్ల్‌ఫ్రెండ్ తన ప్రేమను తిరస్కరించింది. ఇది నిజజీవితంలో కాదు. కిరాక్ పార్టీ అనే మూవీలో. యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న కిరాక్ పార్టీలోని ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ప్రేమికుల రోజున విడుదల చేశారు. ఆ పోస్టర్లో నిఖిల్ దిగులుగా, వంగిపోయినా రోజా పువ్వుతో కనిపించారు. ఈ సినిమాలో హీరో లవ్ ఫెయిల్యూర్ పాత్రలో నటిస్తున్నారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న నిఖిల్‌కు ఈ సినిమా మరో విజయాన్ని అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
బొమ్మలాట
సినిమా అంటే బొమ్మ. బొమ్మ ఎప్పుడు థియేటర్లో పడుతుందా అని ఎదురు చూస్తారు. అయితే ఎదురు చూసే బొమ్మ ఒకటి.. వచ్చే బొమ్మ ఇంకోటి! ఒకరి బొమ్మ వస్తుందని ఇంకొకరు ఈ మధ్య తమ బొమ్మలను వాయిదా వేస్తున్నారు. ఈ బొమ్మలాట కుర్చీలాటలా మారింది. ఒకరు కూర్చునే లోపు ఇంకొకరు... మ్యూజికల్ చైర్లో కుర్చీ కోసం పరిగెడతారు. కుర్చీలో కూర్చునే బొమ్మ ఏదో తెర మీద పడేవరకూ కన్ఫ్యూజనే. ఈ బొమ్మలాట కహానీపై ఓ కన్నేద్దాం. జనవరి 26... దేశ ప్రజలందరూ పండగ చేసుకునే రోజు. ఈసారి సినిమా లవర్స్కీ పండగ రోజే. ఎందుకంటే రిపబ్లిక్ డే సరిగ్గా శుక్రవారం వచ్చింది. సెలవు రోజు. కొత్త బొమ్మ పడుతుంది. థియేటర్ నిండుతుంది. క్యాష్ చేసుకోవడానికి ఇది సరైన టైమ్. అయితే ఇదే రోజు రిలీజ్ కావాల్సిన కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘మనసుకు నచ్చింది’ సినిమాలు వాయిదా పడ్డాయి. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా రూపొందిన చిత్రం ‘ఆచారి ఆమెరికా యాత్ర’. కృష్ణమాచారి (మంచు విష్ణు) తప్పులు, అప్పలాచారి తిప్పలతో సాగే ఈ నవ్వుల యాత్రను జనవరి 26న చూపిద్దామనుకు న్నారు. అయితే యాత్రను పోస్ట్‌పోన్ చేసి, తర్వాత చూపించాలనుకుంటున్నారు. ఇక, ‘మనసుకు నచ్చింది’ విషయానికొస్తే.. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ ఇది. పెళ్లికూతురో లేదా పెళ్లి కొడుకో పెళ్లి టైమ్‌కి పారిపోవడం వింటుంటాం. అలాంటిది పెళ్లికొడుకే పెళ్లికూతుర్ని లేపుకుపోతే కాస్త డిఫరెంట్ కదా! ఈ కాన్సెప్ట్‌తోనే ప్రేక్షకులను థియేటర్స్‌లో కూర్చొబెట్టాలని డిసైడయ్యారు మంజుల. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని గత నెల 26న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఫిబ్రవరి 16కి వాయిదా వేశారు. ఈ రెండు సినిమాలూ ఎందుకు వాయిదా పడ్డాయి? అంటే ప్రధానంగా చెబుతున్న కారణం ‘భాగమతి’, హిందీ ‘పద్మావత్’. ఈ రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. మరోవైపు ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘మనసుకు నచ్చింది’ కూడా ఆల్రెడీ పోస్టర్లు, టీజర్ల ద్వారా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలైతే కలెక్షన్స్ డివైడ్ అవ్వడంతో పాటు, థియేటర్లు తక్కువగా దొరుకుతాయి. అందుకే ఈ రెండు సినిమాలూ వాయిదా పడ్డాయి. చెన్నై పోలామ్ వాంగ అటు చెన్నై పోలామ్ (వెళదాం) వాంగ (రండి). జనవరి 26న విడుదల కావాల్సిన విశాల్ ‘ఇరంబుదురై’ వరలే (రాలేదు). ఆడ విడుదల కావాల్సిన ‘ఇరుంబుదురై’ ఈడ ‘అభిమన్యుడు’గా రిపబ్లిక్‌డేకి రావాల్సింది. కానీ రాలేదు. మరి.. ఎప్పుడు ఆగుమ్ (అవుతుంది) అనేది ఇంకా చిత్రబృందం ప్రకటించలేదు. ఇంకో సినిమా ‘జయం’ రవి నటించిన ‘టిక్. టిక్. టిక్’. ఇండియన్ స్క్రీన్‌పై ప్రేక్షకులు చూడబోతున్న ఫస్ట్ స్పేస్ మూవీ ఇది. ముందు అనుకున్నట్లుగా విడుదల చేసి ఉంటే జనవరి 26న తమిళ ప్రేక్షకులు చూసేవాళ్లు. అయితే వాయిదా పడింది. రిలీజ్ చేసేద్దామనుకుని ప్రమోషన్ కూడా భారీగా చేశారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమాని అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ చేయలేదు. న్యూ రిలీజ్ డేట్‌ను ఇంకా ఎనౌన్స్ చేయలేదు. ఇలాగే మమ్ముట్టీ మలయాళ సినిమా ‘స్ట్రీట్‌లైట్స్’ విషయంలోనూ జరిగింది. జనవరి 26న రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా వాయిదా పడి, ఈ నెల 2న రిలీజైంది. సీన్ రిపీటైంది! ఒకేరోజు రెండుకి మించి సినిమాలు విడుదలైతే వసూళ్లు డివైడ్ అవుతాయి కాబట్టి, జనవరి 26కి విడుదల కావాల్సిన రెండు మూడు సినిమాలు వెనక్కి తగ్గాయి. సేమ్ సీన్ ఫిబ్రవరి 9న కూడా రిపీట్ అయ్యింది. మోహన్‌బాబు ‘గాయత్రి’, వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’, నిఖిల్ ‘కిరాక్ పార్టీ’, సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’, నాగశౌర్య ‘కణం’ సినిమాల రిలీజ్ డేట్‌ను ముందుగా ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. ఒకే రోజు ఐదు సినిమాల రిలీజ్ అయితే లెక్కల్లో తేడాలు వస్తాయి. కనీసం రెండు సినిమాలన్నా వాయిదా పడతాయనుకున్నారు. అనుకున్నట్లే ‘కణం’ సినిమా ఫిబ్రవరి 23కు వాయిదా పడింది. అనుకున్నట్లుగానే ‘గాయత్రి’, ‘ఇంటిలిజెంట్’ 9కి వస్తున్నాయి. ‘తొలిప్రేమ’ ఒక్క రోజు వాయిదా పడి ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ‘కిరాక్ పార్టీ’ చేసుకోవడానికి ఇంకాస్త టైముంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చిత్రనిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర పేర్కొన్నారు. వార్ వేడి తగ్గేలా లేదు! ఏప్రిల్ వార్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ సినిమాతో ఏప్రిల్ వార్కి నాని సై అంటున్నారు. నితిన్ కూడా తన సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నాడు. ఆల్రెడీ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో నాగార్జున, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ చిత్రంతో మహేశ్ బాబు, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అంటూ అల్లు అర్జున్ ఏప్రిల్ వార్కి కర్చీఫ్ వేశారు. యాక్చువల్లీ సినిమాల రిలీజ్‌కి బెస్ట్ సీజన్స్‌లో ఏప్రిల్ ఒకటి. సెలవులను క్యాష్ చేసుకోవచ్చు. ఎన్ని సినిమాలు విడుదలైనా ఫర్వాలేదు. అయితే ఒకేరోజు ఎక్కువ సినిమాలు రిలీజైతే కలెక్షన్స్ డివైడ్ అవుతాయి. మరి.. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా తమ సినిమాను వాయిదా వేసుకుంటారా? చూడాలి. చిట్టికి ఫ్రీడమ్ ఆ రోజేనా? గతేడాది దీపావళికి రిలీజ్ అన్నారు. థియేటర్లో బొమ్మపడలేదు. మళ్లీ జనవరి 25 అని మనసు మార్చుకున్నారు. ఇదంతా ‘2.0’ సినిమా రిలీజ్ గురించే. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్యతారలుగా రూపొందిన సినిమా ‘2.0’. ఆల్మోస్ట్ 400 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందింది. జనవరిలో చిట్టి మిస్సయ్యాడు. ఏప్రిల్‌లో చూపిస్తామని చిత్రబృందం ఎనౌన్స్ చేసింది. ఇప్పుడు సమ్మర్‌కి కూడా రోబో సందడి లేదట. సినిమా వచ్చేది ఆగస్టు 15నే అని ట్రేడ్ విశ్లేషకులు తాజాగా మంగళవారం న్యూ డేట్‌ని తెర మీదకు తీసుకొచ్చారు. అదే నిజమైతే అప్పుడు అక్షయ్‌కుమార్ ‘గోల్డ్’ ఇరుకుల్లో పడ్డట్లే. అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా ఆగస్ట్ 15కి రావాలి. మరి.. చిట్టికి ఫ్రీడమ్ ఆ రోజేనా? అంటే... థియేటర్లోకి వచ్చేది ఆ రోజేనా? మరి.. చిట్టి అదే రోజున వస్తే.. హిందీలోనూ బొమ్మ పడుతుంది కాబట్టి.. ‘గోల్డ్’ డేట్ మారుతుందా? వెయిట్ అండ్ సీ. సౌత్‌లో థియేటర్స్క్లోజ్! రిలీజ్ కావడానికి ఇన్ని సినిమాలు పోటీ పడుతుంటే మార్చి 1నుంచి థియేటర్స్ మూతపడనున్నాయన్న వార్తలు వస్తున్నాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఛార్జీల వైఖరికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అభ్యంతరం తెలిపింది. ముందుగా సూచించిన సమయానికి కల్లా డిజిల్ సర్వీస్ ప్రొవైడర్లు చర్చలకు రాకపోతే మార్చి1 నుంచి రెండు రాష్ట్రాల్లోని థియేటర్స్‌ను మూసివేయాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి.కిరణ్ తెలిపారు. ఇది మాత్రమే కాదు.. తమిళ, మలయాళం, కన్నడ పరిశ్రమల్లో కూడా ఇదే పరిస్థితి. ఒకవేళ ఈ ఇష్యూ ఒక కొలిక్కి రాక.. సౌత్‌లో థియేటర్స్ షట్ డౌన్ అయితే అసలుకే ఎసరు వస్తుందేమో! బాలీవుడ్ సినిమాలూ కుర్చీలాట ఆడుతున్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడి ‘పద్మావత్’ తెరకొచ్చింది. ‘బజార్’, ‘సూర్మ’, ‘సోనూ కే టిట్టు కీ స్వీటీ’ వంటి సినిమాలూ వాయిదా పడ్డాయి. పోస్ట్‌పోన్ అయిన మరికొన్ని సినిమాలు.. - ముసిమి శివాంజనేయులు -
కృష్ణుడొచ్చాడు.. ఇక కురుక్షేత్రమేనట!
‘కృష్ణుడొచ్చాడురా... ఇక కురుక్షేత్రమే’ అంటున్నాడు హీరో నిఖిల్. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా ‘కిరాక్ పార్టీ’. కాలేజీ రాజకీయాలు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడంలో ఘనవిజయం సాధించిన 'కిరిక్ పార్టీ'కి రీమేక్. నిఖిల్, సంయుక్తా హెగ్డే, సిమ్రన్ పరీంజా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం టీజింగ్ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. నిమిషం నిడిడి ఉన్న ఈ ట్రైలర్.. ప్రేక్షకులకు మరోసారి కాలేజీ రోజుల్లోని మధురానుభూతులను గుర్తుతెచ్చేలా ఉంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాలీగా, అల్లరిచిల్లరిగా కాలేజీ జీవితాన్ని ఎంజాయ్ చేసే విద్యార్థిగా, మాస్ లుక్ కలిగిన స్టూడెంట్ లీడర్‌గా విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రను నిఖిల్ పోషిస్తున్నట్టు కనిపిస్తోంది.