ముందే వస‍్తోన్న యంగ్ హీరో | Nikhils Kirrak Party Release Preponed | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 21 2018 4:06 PM | Last Updated on Wed, Feb 21 2018 5:02 PM

విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్ త్వరలో కిరాక్‌ పార్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను మార్చి 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రీ పోన్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. మార్చి 16న పెద్ద సినిమాల రిలీజ్‌ లేవి లేకపోవటంతో అదే రోజు సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ముందే రిలీజ్ చేస్తే మార్చి 30న రంగస్థలం రిలీజ్‌ అయ్యే వరకు సమయం కలిసొస్తుందన్న ఆలోచనలో ఉన్నారట. కన్నడ సూపర్‌ హిట్‌ కిరిక్‌ పార్టీ సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్‌ పరీన్జా, సంయుక్త హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకె ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement