Simran Pareenja
-
‘కిరాక్ పార్టీ’ మూవీ రివ్యూ
టైటిల్ : కిరాక్ పార్టీ జానర్ : యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్, సిమ్రాన్ పరీన్జా, సంయుక్త హెగ్డే సంగీతం : బి. అజనీష్ లోక్‌నాథ్ దర్శకత్వం : శరన్ కొప్పిశెట్టి నిర్మాత : రామబ్రహ్మం సుంకర వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కిరాక్ పార్టీ. ప్రయోగాలను పక్కన పెట్టి కన్నడలో సూపర్ హిట్ అయిన కిరిక్ పార్టీ సినిమాను తెలుగులో కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ చేశాడు నిఖిల్. శరన్ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా నిఖిల్ ఖాతాలో మరో సక్సెస్ గా నిలిచిందా..? ప్రయోగాలను పక్కన పెట్టి కమర్షియల్ సినిమా చేసిన నిఖిల్ మరో విజయం సాధించాడా..? కథ : కృష్ణ (నిఖిల్ సిద్ధార్థ్) మెకానికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. తన ఫ్రెండ్స్‌తో కలిసి కాలేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. కాలేజ్ బంక్ కొట్టడం, గొడవలు చేయటం ఇదే కృష్ణ లైఫ్. ఆ సమయంలో సీనియర్ మీరా (సిమ్రాన్ పరీన్జా)ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఎలాగైన తనకు దగ్గరకావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా తన లైఫ్ తాను ఎంజాయ్ చేసే కృష్ణను మీరా కూడా ఇష్టపడుతుంది. (సాక్షి రివ్యూస్) కానీ అనుకోండా ఓ ప్రమాదంలో మీరా చనిపోతుంది. మీరాను ప్రాణంగా ప్రేమించిన కృష్ణ, పూర్తిగా మారిపోతాడు. కాలేజ్ లో అందరితో గొడవపడుతూ రౌడీలా మారిపోతాడు. మూడేళ్లు గడిచిపోతాయి. కృష్ణ గ్యాంగ్ ఫైనల్ ఇయర్‌కు వస్తుంది. కృష్ణ హీరోయిజం చూసి జూనియర్ సత్య (సంయుక్త హెగ్డే) కృష్ణను ఇష్టపడుతుంది. ఎలాగైన కృష్ణను మామూలు మనిషిగా మార్చాలని, జీవితంలోని కొన్ని చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ముందుకు సాగాలని గుర్తు చేయాలనుకుంటుంది. మరి సత్య ప్రయత్నం ఫలించిందా..? కృష్ణ మీరాను మర్చిపోయి సత్యకు దగ్గరయ్యాడా..? ఈ కాలేజ్ లైఫ్ కృష్ణకు ఎలాంటి అనుభవాలను ఇచ్చింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కృష్ణ పాత్రలో నిఖిల్ మంచి నటన కనబరిచాడు. స్టూడెంట్ గా తనకు అలవాటైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో మెప్పించటంతో పాటు సెకండ్ హాఫ్‌లో మెచ్యూర్డ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. లుక్ విషయంలోనూ మంచి వేరియేషన్ చూపించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో నిఖిల్ నటన చాలా బాగుంది. సినిమా సినిమాకు మంచి పరిణతి కనబరుస్తున్నాడు నిఖిల్. ఫస్ట్‌హాఫ్ లో హీరోయిన్ గా కనిపించిన సిమ్రాన్ హుందాగా కనిపించింది. సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. (సాక్షి రివ్యూస్)మరో హీరోయిన్ సంయుక్త హెగ్డే బబ్లీ గర్ల్ గా కనిపించి సెంకడ్‌హాఫ్ లో జోష్ నింపే ప్రయత్నం చేసింది. బ్రహ్మాజీది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో మంచి కామెడీ పండించాడు. ఫ్రెండ్స్ పాత్రలో కనిపించిన నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు. విశ్లేషణ : తెలుగులో ఈ తరహా కథలు చాలా కాలం క్రితమే వచ్చాయి. హ్యాపిడేస్ లాంటి సినిమాలు సంచలనాలు సృష్టించాయి. మరోసారి అదే తరహా కాలేజ్ డేస్‌ను గుర్తు చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు శరన్. అయితే ఎక్కడా కొత్తదనం కనిపించకపోవటం నిరాశపరుస్తుంది. అక్కడక్కడ కథనంలో మెరుపులు కనిపించినా.. గతంలో తెలుగు తెర మీద వచ్చిన చాలా కాలేజ్ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. కన్నడ ప్రేక్షకులకు ఈ తరహా కథలు కొత్త అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం రొటీన్ ఫార్ములా సినిమాలాగే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నా, కథనం నెమ్మదిగా సాగటం ఇబ్బంది పెడుతుంది. (సాక్షి రివ్యూస్)ఇలాంటి రొటీన్ కథను చెప్పటడానికి 2 గంటల 45 నిమిషాల సమయం తీసుకున్న దర్శకుడు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఒరిజినల్ వర్షన్ కు సంగీత మందిచిన అజనీష్ తెలుగు వర్షన్‌కు కూడా మంచి సంగీతాన్ని అందించాడు. పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నిఖిల్ నటన సంగీతం మైనస్ పాయింట్స్ : సినిమా నిడివి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
పార్టీలో మేం ఉన్నందుకు హ్యాపీ
‘‘కిరాక్ పార్టీ’ చిత్రంలో నా పాత్ర పేరు మీరా. ఎంతమంది అబ్బాయిలు వెంట పడ్డా పట్టించుకోని పాత్ర. కన్నడలో ఈ పాత్రను రష్మికా చేశారు. నేను ఆమెను ఫాలో కాకుండా దర్శకుడు చెప్పినట్టు కొత్తగా చేశా. నిఖిల్ నన్నెప్పుడూ కొత్త హీరోయిన్ని చూసినట్టు చూడలేదు. చాలా సరదాగా, ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. టైటిల్‌కి తగ్గట్టుగానే మంచి పార్టీలా ఉంటుంది’’ అని కథానాయిక సిమ్రన్ అన్నారు. నిఖిల్, సిమ్రన్, సంయుక్త హెగ్డే హీరో హీరోయిన్లుగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘కిరాక్ పార్టీ’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంయుక్త హెగ్డే మాట్లాడుతూ– ‘‘కన్నడ ‘కిరిక్ పార్టీ’లో నేను నటించా. నా పాత్ర నచ్చి దర్శక–నిర్మాతలు ‘కిరాక్ పార్టీ’కి తీసుకున్నందుకు హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా విషయంలో నాకు నేనే పోటీ. నా పాత్ర పేరు సత్య. ఫన్ లవింగ్ బబ్లీ గర్ల్. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉన్న పాత్ర ఇది. మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అందులోని ట్విస్ట్ ఏంటన్నది సినిమాలో చూడాలి. తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నా. తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఇంకా ఏదీ అంగీకరించలేదు. ‘కిరాక్ పార్టీ’ విడుదలయ్యాక చూడాలి’’ అన్నారు. -
‘కిరాక్ పార్టీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
అందుకే కొత్తవాళ్లను తీసుకుంటా
‘‘నేను దర్శకుణ్ణి అవ్వాలనే ఇండస్ట్రీకొచ్చా. కానీ, డైరెక్టర్‌గా విఫలమయ్యా. నిర్మాతగా సక్సెస్ అయ్యా. అందుకే నిర్మాతగా ఉండటమే ఇష్టం’’ అన్నారు అనిల్ సుంకర. నిఖిల్ హీరోగా, సంయుక్తా హెగ్డే, సిమ్రన్ పరింజ హీరోయిన్స్‌గా శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘కిరాక్ పార్టీ’ ఈ నెల 16న విడుదలకానుంది. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ–‘‘ నాకు ఎప్పటి నుంచో ‘శివ’ లాంటి సినిమా చేయాలని ఆశ. కన్నడ ‘కిరిక్ పార్టీ’ కథాంశం ‘శివ’ చిత్రానికి కొంత దగ్గరగా ఉండటంతో ‘కిరాక్ పార్టీ’ గా తెలుగులో రీమేక్ చేశా. ఈ చిత్రానికి తొలుత దర్శకునిగా రాజుసుందరం అనుకున్నాం. ఆయన తెలుగు, తమిళ భాషల్లో చేద్దామన్నారు. రెండు భాషల్లో ఒకేసారి ఫోకస్ చేయలేమని శరన్‌కి అవకాశం ఇచ్చాం. చాలా మంది కుర్రాళ్లు పల్లెటూరి నుంచి ఇంజనీరింగ్ చేయడానికి సిటీకొస్తారు. మొదటి సంవత్సరం భయంగా ఉంటారు. చివరి సంవత్సారానికి పూర్తీగా మారిపోతారు. అదెలా అన్నదే కథాంశం. మా సినిమాల్లో కొత్త వాళ్లను ఎక్కువగా తీసుకోవడానికి కారణం రెమ్యునరేషన్ తక్కువనే(నవ్వుతూ). ఫ్రెష్‌నెస్ కోసమే కొత్త వాళ్లను తీసుకుంటాం. శర్వానంద్– ‘దండుపాళ్యం’ డైరెక్టర్ శ్రీనివాసరాజుతో ఓ సినిమా అనుకున్నాం. కథ పూర్తయ్యాక వివరాలు చెబుతా’’ అన్నారు. -
అటెండెన్స్ వేయించే బాధ్యత నాది– ‘అల్లరి’ నరేశ్
‘‘స్టూడెంట్స్ ఎవ్వరూ ఈనెల 16న అటెండెన్స్ గురించి పట్టించుకోకండి. ఆరోజు అటెండెన్స్ వేయించే బాధ్యత నాది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. నిఖిల్, సిమ్రాన్ పరింజా, సంయుక్తా హెగ్డే ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘కిరాక్ పార్టీ’. కన్నడ ‘కిరిక్ పార్టీ’ కి రీమేక్. శరణ్ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలవుతోంది. అజనీష్ లోక్నాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను విజయవాడలో రిలీజ్ చేశారు. ముఖ్య అతిథి ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘నిఖిల్‌ను చూస్తే నాకు డ్యూరోసెల్ బ్యాటరీ గుర్తొస్తుంటుంది. అంత ఎనర్జిటిక్‌గా ఉంటాడు. కన్నడలో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులోనూ అంతే హిట్ అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ ఉన్న సినిమా ఇది. ఈ చిత్రంలో నటించే అవకాశాన్నిచ్చిన అనిల్ సుంకరగారికి థ్యాంక్స్. చందు మొండేటికి ‘కార్తికేయ’, సుధీర్ వర్మకు ‘స్వామి రారా’ ఎంత పేరు తెచ్చాయో, ‘కిరాక్ పార్టీ’ శరణ్‌కి అంతే పేరు తీసుకొస్తుంది’’ అన్నారు నిఖిల్. ‘‘టీమ్ అంతా ఎంతో కష్టపడి పని చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘ప్రతి స్టూడెంట్ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. 16న బంక్ కొట్టి మరీ ఈ సినిమా చూస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు శరణ్. దర్శకుడు సుధీర్ వర్మ, సిమ్రాన్ పరింజా, సంయుక్తా హెగ్డే తదితరులు పాల్గొన్నారు. -
నాగశౌర్యకు జోడీగా సిమ్రాన్..?
ఛలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ సాధించిన ఈ యువ కథానాయకుడు తన సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు నర్తనశాల అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా నిఖిల్ కిరాక్ పార్టీ ఫేం సిమ్రాన్ పరీన్జాను ఫైనల్ చేశారట. హిందీ సీరియల్స్‌తో పాపులర్ అయిన సిమ్రాన్.. కిరాక్ పార్టీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. నాగశౌర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన కణం త్వరలో రిలీజ్ అవుతుండగా మరిన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. -
శివ, హ్యాపీడేస్ స్టైల్లో ఉంటుంది
‘‘శివ, హ్యాపీడేస్’ స్టైల్లో సాగే పూర్తి స్థాయి కాలేజ్ చిత్రమిది. ఆ బ్యాక్‌డ్రాప్ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ‘కిరాక్ పార్టీ’ తప్పకుండా ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు అనిల్ సుంకర. నిఖిల్, సిమ్రాన్ పరింజా, సంయుక్తా హెగ్డే హీరో హీరోయిన్లుగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కిరాక్ పార్టీ’. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా మార్చి 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో చిత్రబృందం సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘‘16న సినిమా విడుదల అవుతుంది. ఇంటర్ ఎగ్జామ్స్ 15తో అయిపోయిన వెంటనే మా సినిమా రావటం ఆనందంగా ఉంది. ప్రొమోషన్స్లో భాగంగా ఓ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. అందులో విజేతలకు సినిమాలో వాడిన కారును బహుమతిగా అందజేస్తాం. గురువారం నుంచి రెండు రాష్ట్రాల్లో టూర్ చేయనున్నాం. 10న విజయవాడలో ఆడియో, 13న ప్రీ–రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తాం. ‘శివ’ సినిమా చూసినప్పుడు అలాంటి సినిమా తీయగలనా లేదా అనుకునేవాణ్ణి. ఆ ఆలోచనతోనే ‘కిరిక్ పార్టీ’ సినిమాను రీమేక్ చేశాం. శరణ్ సినిమాను బాగా తీశాడు. సుధీర్ వర్మ, చందూ మొండేటి సహకారం అందించారు’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘నా సినిమాల్లో నా హార్ట్‌కు దగ్గరైన సినిమాల్లో ఇదొకటి. సినిమా ఇంకా బాగా రీచ్ కావడానికి టూర్ ప్లాన్ చేశాం. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు హీరో నిఖిల్. ‘‘శివ, హ్యాపీడేస్’ ఇన్స్పిరేషన్తో కన్నడ ‘కిరిక్ పార్టీ‘ని తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా తీశాం. స్టూడెంట్స్ అందరూ వాళ్లని స్క్రీన్‌పై చూసుకున్నట్టు ఉంటుంది’’ అన్నారు దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. ఈ కార్యక్రమంలో సిమ్రాన్, సంయుక్తా, ఆర్య, రాకేందు మౌళి పాల్గొన్నారు. -
ముందే వస్తోన్న యంగ్ హీరో
విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్ త్వరలో కిరాక్ పార్టీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను మార్చి 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రీ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారట. మార్చి 16న పెద్ద సినిమాల రిలీజ్ లేవి లేకపోవటంతో అదే రోజు సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ముందే రిలీజ్ చేస్తే మార్చి 30న రంగస్థలం రిలీజ్ అయ్యే వరకు సమయం కలిసొస్తుందన్న ఆలోచనలో ఉన్నారట. కన్నడ సూపర్ హిట్ కిరిక్ పార్టీ సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్ పరీన్జా, సంయుక్త హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. -
’కిరాక్ పార్టీ’ ప్రీ టీజర్ విడుదల