Kirrak Party Review | Kirrak Party Movie Review in Telugu | కిరాక్ పార్టీ తెలుగు రివ్యూ
Sakshi News home page

Published Fri, Mar 16 2018 12:40 PM | Last Updated on Fri, Mar 16 2018 4:17 PM

Kirrack Party Movie Review - Sakshi

టైటిల్ : కిరాక్‌ పార్టీ
జానర్ : యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్‌, సిమ్రాన్‌ పరీన్జా, సంయుక‍్త హెగ్డే
సంగీతం : బి. అజనీష్‌ లోక్‌నాథ్‌
దర్శకత్వం : శరన్‌ కొప్పిశెట్టి
నిర్మాత : రామబ్రహ్మం సుంకర

వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కిరాక్‌ పార్టీ. ప్రయోగాలను పక్కన పెట్టి కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన కిరిక్‌ పార్టీ సినిమాను తెలుగులో కిరాక్‌ పార్టీ పేరుతో రీమేక్‌ చేశాడు నిఖిల్. శరన్‌ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా నిఖిల్ ఖాతాలో మరో సక్సెస్‌ గా నిలిచిందా..? ప్రయోగాలను పక్కన పెట్టి కమర్షియల్‌ సినిమా చేసిన నిఖిల్ మరో విజయం సాధించాడా..?

కథ :
కృష్ణ (నిఖిల్ సిద్ధార్థ్) మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్‌. తన ఫ్రెండ్స్‌తో కలిసి కాలేజ్‌ లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తుంటాడు. కాలేజ్‌ బంక్‌ కొట్టడం, గొడవలు చేయటం ఇదే కృష్ణ లైఫ్‌. ఆ సమయంలో సీనియర్‌ మీరా (సిమ్రాన్‌ పరీన్జా)ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఎలాగైన తనకు దగ్గరకావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా తన లైఫ్‌ తాను ఎంజాయ్‌ చేసే కృష్ణను మీరా కూడా ఇష్టపడుతుంది. (సాక్షి రివ్యూస్‌) కానీ అనుకోండా ఓ ప్రమాదంలో మీరా చనిపోతుంది. మీరాను ప్రాణంగా ప్రేమించిన కృష్ణ, పూర్తిగా మారిపోతాడు. కాలేజ్‌ లో అందరితో గొడవపడుతూ రౌడీలా మారిపోతాడు. మూడేళ్లు గడిచిపోతాయి. కృష్ణ గ్యాంగ్‌ ఫైనల్‌ ఇయర్‌కు వస్తుంది. కృష్ణ హీరోయిజం చూసి జూనియర్‌ సత్య (సంయుక్త హెగ్డే) కృష్ణను ఇష్టపడుతుంది. ఎలాగైన కృష్ణను మామూలు మనిషిగా మార్చాలని, జీవితంలోని కొన్ని చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ముందుకు సాగాలని గుర్తు చేయాలనుకుంటుంది. మరి సత్య ప్రయత్నం ఫలించిందా..? కృష్ణ మీరాను మర్చిపోయి సత్యకు దగ్గరయ్యాడా..? ఈ కాలేజ్‌ లైఫ్‌ కృష్ణకు ఎలాంటి అనుభవాలను ఇచ్చింది..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
కృష్ణ పాత్రలో నిఖిల్ మంచి నటన కనబరిచాడు. స్టూడెంట్‌ గా తనకు అలవాటైన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌ తో మెప్పించటంతో పాటు సెకండ్‌ హాఫ్‌లో మెచ్యూర్డ్‌ గా కనిపించి ఆకట్టుకున్నాడు. లుక్‌ విషయంలోనూ మంచి వేరియేషన్‌ చూపించాడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో పాటు క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ లో నిఖిల్ నటన చాలా బాగుంది. సినిమా సినిమాకు మంచి పరిణతి కనబరుస్తున్నాడు నిఖిల్‌. ఫస్ట్‌హాఫ్ లో హీరోయిన్‌ గా కనిపించిన సిమ్రాన్‌ హుందాగా కనిపించింది. సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. (సాక్షి రివ్యూస్‌)మరో హీరోయిన్‌ సంయుక్త హెగ్డే బబ్లీ గర్ల్ గా కనిపించి సెంకడ్‌హాఫ్‌ లో జోష్ నింపే ప్రయత్నం చేసింది. బ్రహ్మాజీది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో మంచి కామెడీ పండించాడు. ఫ్రెండ్స్ పాత్రలో కనిపించిన నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు.

విశ్లేషణ :
తెలుగులో ఈ తరహా కథలు చాలా కాలం క్రితమే వచ్చాయి. హ్యాపిడేస్‌ లాంటి సినిమాలు సంచలనాలు సృష్టించాయి. మరోసారి అదే తరహా కాలేజ్‌ డేస్‌ను గుర్తు చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు శరన్‌. అయితే ఎక్కడా కొత్తదనం కనిపించకపోవటం నిరాశపరుస్తుంది. అక్కడక్కడ కథనంలో మెరుపులు కనిపించినా.. గతంలో తెలుగు తెర మీద వచ్చిన చాలా కాలేజ్‌ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. కన్నడ ప్రేక్షకులకు ఈ తరహా కథలు కొత్త అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం రొటీన్‌ ఫార్ములా సినిమాలాగే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ బాగున్నా, కథనం నెమ్మదిగా సాగటం ఇబ్బంది పెడుతుంది. (సాక్షి రివ్యూస్‌)ఇలాంటి రొటీన్‌ కథను చెప్పటడానికి 2 గంటల 45 నిమిషాల సమయం తీసుకున‍్న దర్శకుడు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఒరిజినల్‌ వర్షన్ కు సంగీత మందిచిన అజనీష్ తెలుగు వర్షన్‌కు కూడా మంచి సంగీతాన్ని అందించాడు. పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నిఖిల్‌ నటన
సంగీతం

మైనస్ పాయింట్స్ :
సినిమా నిడివి


- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement