Samyuktha Hegde
-
'మీ టాలెంట్‌ను చూపించండి.. మీ శరీరం కాదు'.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!
కిరిక్ పార్టీ సినిమా ద్వారా కన్నడ సినీ పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ సంయుక్తా హెగ్డే. సినిమాలే కాకుండా సంయుక్త కన్నడ, హిందీ రియాల్టీ షోలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ భామ ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ శ్రద్ధతో ఉంటోంది. ఎప్పటికప్పుడు వర్కవుట్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ షేర్ వీడియోలు చేస్తూ ఉంటోంది. ఇటీవల సంయుక్తా హెగ్డే సినిమాల కంటే ఇలాంటి వీడియోలతోనే ఎక్కువగా పాపులర్ అవుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తెగ వైరలవుతోంది. అయితే ఆమె తీరుపై నెటిజన్స్ ఫైరవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: హౌస్‌లో అందాల పోటీ.. నాకేం తక్కువా అంటూ అమర్ దీప్ ఫైర్!!) బిగ్ బాస్ కంటెస్టెంట్ సంయుక్త తాజాగా డ్యాన్సర్ కిషోర్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. జంగ్లీ సినిమాలోని సోనూ నిగమ్ పాడిన నాలో నువ్వే అనే పాటకు సంయుక్త, కిషన్ రీల్స్ చేస్తూ డ్యాన్స్ చేశారు. అయితే ఇందులో ఆమె వేసుకున్న డ్రెస్‌పై నెటిజన్స్ ఫైరవుతున్నారు. ఆమె డ్రెస్‌ను చూసిన కొందరు నెటిజన్స్ మీకు కనీసం సెన్స్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఒక నటిగా మీరు అందరికీ రోల్ మోడల్‌గా ఉండాలి కానీ.. మీరే ఇలా బరితెగించడమేంటని పోస్టులు పెడుతున్నారు. సంయుక్త అలాంటి డ్రెస్సులు ధరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మీ డ్యాన్స్ టాలెంట్‌ను చూపించండి.. మీ శరీరం కాదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. కాగా.. సంయుక్త గతంలో చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురైంది. 'కిరిక్ పార్టీ' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి సంయుక్త హెగ్డే.. సినిమాల కంటే వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. గతంలో బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌ను కొట్టినందుకు సంయుక్త వార్తల్లో నిలిచారు. అంతేకాదు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోలు, వీడియోలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. కాగా.. తమిళ చిత్రసీమలో కూడా సంయుక్తా హెగ్డే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చివరిసారిగా కన్నడ చిత్రం 'తుర్తు నిర్గమన'లో కనిపించింది. ప్రస్తుతం 'క్రీమ్' సినిమాతో బిజీగా ఉంది. (ఇది చదవండి: 'హ్యాపీ బర్త్ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!) View this post on Instagram A post shared by Kishen Bilagali (@kishenbilagali) -
ట్రెండీ లుక్‌లో రష్మీ గౌతమ్.. శారీలో కవ్విస్తోన్న ఉప్పెన భామ!
► కెన్యా వెకేషన్లో నిహారిక కొణిదెల్ చిల్! ► శ్రీ కృష్ణ జన్మాష్టమి ట్రెండీ లుక్‌లో రష్మీ గౌతమ్! ► పింక్ శారీలో మెరిసిపోతున్న ఉప్పెన భామ! ► సముద్రంలో స్విమ్మింగ్ చేస్తోన్న సంయుక్త హెగ్డే ► శారీలో యాంకర్ శ్రీముఖి హోయలు View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) -
కిరాక్ పార్టీ హీరోయిన్.. అలాంటి వీడియోలు అవసరమా నీకు!
కిరిక్ పార్టీ సినిమా ద్వారా కన్నడ సినీ పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ సంయుక్తా హెగ్డే. ప్రస్తుతం షూటింగ్‌లతో విదేశీల్లో బిజీగా ఉంది. సినిమాలే కాకుండా సంయుక్త కన్నడ, హిందీ రియాల్టీ షోలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ భామ ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. ఎప్పటికప్పుడు వర్కవుట్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తూ ఉంటోంది. ఇటీవల సంయుక్తా హెగ్డే సినిమాల కంటే వ్యక్తిగత సమస్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో సంయుక్తి షేర్ చేసిన వీడియో తెగ వైరలవుతోంది. దీనిపై ఆమెను కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరేమో తప్పుబడుతున్నారు. సంయుక్త లుక్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం. (ఇది చదవండి: ఆమె జీవితమంతా కష్టాలు, కన్నీళ్లే.. కానీ ఇప్పుడామె స్టార్ హీరోయిన్!) ఇన్‌స్టాలో వీడియో షేర్ చేసిన ముద్దుగుమ్మ.. 'మీ శరీరం మీ ఆస్తి. మనం ఎలాంటి సామాజిక నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. మహిళలు దృఢంగా, స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. బలమనేది పురుషులు లేదా స్త్రీలకు సంబంధించింది కాదు. బలం, విశ్వాసం మీ శక్తిని పెంచుకోవడానికి ప్రతిరూపం' అంటూ అర్ధనగ్నంగా ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండగా.. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. మీరు ఇతర మహిళలకు స్ఫూర్తి అని కొందరు వ్యాఖ్యానించగా.. మరికొందరు ఒక మహిళగా మీ శరీరాన్ని ఇలా ప్రదర్శించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఫేమ్ కోసం మీరు చేస్తున్న జిమ్మిక్కు అంటూ కామెంట్ చేస్తున్నారు. తరచుగా వివాదాలే బిగ్ బాస్ సీజన్ 5లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్‌గా వచ్చిన సంయుక్త హెగ్డే తన కంటెస్టెంట్ సమీర్‌ను చెంపపై కొట్టడంతో వార్తల్లో నిలిచింది. అప్పట్లో సంయుక్త ప్రవర్తనను అందరూ వ్యతిరేకించారు. తరువాత 2020లో.. బెంగళూరులోని ఒక పార్క్‌లో సంయుక్త తన స్నేహితులతో కలిసి హులా హూప్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు.. ఆమె దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళతో గొడవ పడ్డారు. అలాగే, గతేడాది కాంపౌండ్ పూల్ దగ్గర బ్లూ మైక్రో బికినీలో కనిపించి వార్తల్లో నిలిచింది. కాగా.. కర్ణాటకకు చెందిన సంయుక్త హెగ్డే రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కిరిక్ పార్టీ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సంయుక్త కోలేజ్ కుమార్ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో కిరాక్ పార్టీ ద్వారా అడుగు పెట్టారు. తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న సంయుక్త హెగ్డే చాలా ఏళ్ల తర్వాత రానా సినిమాతో మళ్లీ కన్నడలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన అర్జెంట్ ఎగ్జిట్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న క్రీమ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) (ఇది చదవండి: ఈ వారం కొత్త సినిమాల సందడి.. ఓటీటీలోనే ఎక్కువ!) -
స్విమ్ షూట్లో బిగ్ బాస్ బ్యూటీ.. నెటిజన్స్ ట్రోలింగ్!
ఈ తరం కథానాయకులు కొందరు సినిమా ఆకాశాల కోసమో, లేక వార్తల్లో ఉండడం కోసమో పడరాని పాట్లు పడుతున్నారు. అదేవిధంగా ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్స్ కోసం గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. చివరికి బికినీల్లోనూ కనిపించడానికి వెనుకాడడం లేదు. నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ఇదే. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ ఆ మధ్య బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొని హల్ చల్ చేసింది. (ఇది చదవండి: క్రికెట్ జట్టు కొనుగోలు చేయనున్న రామ్ చరణ్, ఐపీఎల్లోనా?) కన్నడలో కథానాయకిగా చిత్రాలు చేస్తున్న సంయుక్త హెగ్డే తమిళంలోనూ జి వీ.ప్రకాష్ కుమార్ సరసన వాచ్మెన్, జయం రవి తో కోమాలి, అశోక్ సెల్వన్ కు జంటగా మన్మధ లీలై, వరుణ్‌కు జతగా పప్పీ వంటి చిత్రాల్లో నటించింది. అయితే వీటిలో చాలావరకు సక్సెస్ అయిన సంయుక్తకు మాత్రం పెద్దగా క్రేజ్ తెచ్చి పెట్టలేదు. దీంతో ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రం కూడా లేదు. దీంతో మళ్లీ అవకాశాలను రాబట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా సామాజిక మాధ్యమాలను వేదికగా వాడుకుంటోంది. తన గ్లామరస్ ఫొటోలను ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాంటిది తాజాగా ఈత దుస్తుల్లో స్విమ్ చేస్తున్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. (ఇది చదవండి: క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ ఆర్టిస్టుగా మారిన రంగస్థలం మహేశ్) అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. నెటిజన్లు మాత్రం సంయుక్త హెగ్డేపై రకరకాల ట్రోలింగ్ చేస్తున్నారు. తను కోరుకున్నదీ ఇదే కాబట్టి ఈ అమ్మడు వాటిపై నోరు మెదపడం లేదని సమాచారం. మరి నటి సంయుక్త హెగ్డే ట్రిక్స్ ఎంతవరకు ఫలితానిస్తాయో కాలమో నిర్ణయించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) -
కాలు విరగ్గొట్టుకున్నా డోంట్ కేర్ అంటున్న హీరోయిన్స్
‘రిస్కీ ఫైట్ చేయాలా? డూప్ వద్దు.. చేసేస్తాం’ అని కొందరు హీరోయిన్లు యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో గాయాలపాలవుతుంటారు. అలా ఈ మధ్య టబు, శిల్పా శెట్టి, సంయుక్తా హెగ్డే షూటింగ్లో గాయపడ్డారు. అయితే వెనక్కి తగ్గేదే లే అంటున్నారు. కోలుకున్నాక డూప్ లేకుండానే ఫైట్స్ చేస్తాం అంటున్నారు. ‘ఆడపులులం మేము’ అంటూ ఇటీవల వీరు చేసిన రిస్కీ యాక్షన్ గురించి తెలుసుకుందాం. టబు పేరు గుర్తు రాగానే ‘కొత్త కొత్తగా ఉన్నది...’ అంటూ వెంకటేశ్‌తో ‘కూలీ నెం. 1’లో, ‘ఎటో వెళ్లిపోయింది మనసు..’ అంటూ ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జునతో రొమాంటిక్‌గా ఆడిపాడిన పాటలు గుర్తొస్తాయి. అలాంటి క్యూట్ రోల్స్ చేసిన టబు వీలు కుదిరినప్పుడల్లా పవర్ఫుల్ రోల్స్ చేస్తుంటారు. తాజాగా ‘భోలా’ చిత్రంలో ఆమె పోలీసాధికారి పాత్ర చేస్తున్నారు. పవర్ఫుల్ పోలీసాఫీసర్ అన్నమాట. ఈ సినిమా కోసం ఇటీవల టబు పాల్గొనగా ఓ ఛేజింగ్ సీన్ చిత్రీకరించారు. ఆ సమయంలో ఓ మోటారు సైకిల్, ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగలడంతో టబు నుదురు, కంటి దగ్గర గాయాలయ్యాయి. అయితే పెద్ద ప్రమాదం కాకపోవడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది. కానీ టబు కంటి దగ్గర గాయం కావడంతో అది తగ్గే వరకూ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ కథానాయకుడు. ఇక టబు గాయపడిన ఒకట్రెండు రోజులకు మరో నటి శిల్పాశెట్టి ప్రమాదం బారిన పడ్డారు. ప్రస్తుతం శిల్పా చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ ఒకటి. శిల్పాకి ఇది తొలి వెబ్ సిరీస్. ఇందులో శిల్పాది పోలీసాఫీసర్ క్యారెక్టర్. సో.. ఫైట్స్ ఉండటం సహజం. ‘ఒక యాక్షన్ సీన్ తీస్తూ.. యాక్షన్ అని చెప్పి, కాలు విరగ్గొట్టుకో అని నా యూనిట్ సభ్యులు అన్నారు. ఆ మాటలను సీరియస్‌గా తీసుకున్నాను. అంతే.. కాలికి బలమైన గాయం అయింది. ఫలితంగా ఆరు వారాలు షూటింగ్‌కి బ్రేక్. బలంగా తిరిగొస్తా.. ఫైట్ సీన్ చేస్తా’ అని పేర్కొన్నారు శిల్పా శెట్టి. మరోవైపు యువకథానాయిక సంయుక్తా హెగ్డే కూడా ఇటీవల షూటింగ్లో గాయపడ్డారు. ‘కిర్రాక్ పార్టీ’ చిత్రం ద్వారా ఈ కన్నడ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమయ్యారు. తాజాగా ‘క్రీమ్’ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారామె. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సంయుక్తాకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఈ సినిమాకి ఆమెను కథానాయికగా ఎంపిక చేయడానికి అదొక కారణం. కాగా, ‘క్రీమ్’ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌తో ప్రత్యర్థులను ఎదుర్కొనే ఫైట్ సీన్లో సంయుక్తా హెగ్డేకి బలమైన గాయం తగిలింది. కాలికి గాయం కావడంతో రెండు నెలలు విశ్రాంతి సూచించారు. ‘‘ఇంటిపట్టున కూర్చోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. అయితే ఇప్పుడు కాలు కదపలేని పరిస్థితి. ఈ రెండు నెలల్లో పాటలు పాడటం నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే గతంలో కొన్ని కథలు రాశాను. వాటికి స్క్రీన్‌ప్లే రాసే టైమ్ దొరకలేదు. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి చేయాలను కుంటున్నాను’’ అన్నారు సంయుక్తా. కథానాయికలకు గ్లామరస్ రోల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అందుకు భిన్నంగా చాలెంజింగ్ రోల్స్ వస్తే, ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. టబు, శిల్పా, సంయుక్తా ఇటీవల గాయపడిన తారలైతే గతంలో తాప్సీ, కంగనా రనౌత్ వంటి కథానాయికలు షూటింగ్స్‌లో ప్రమాదాల బారిన పడ్డారు. అయినప్పటికీ సవాల్‌లాంటి క్యారెక్టర్ అంటే ‘సై’ అంటున్నారు. ‘ఆడపులులు’ అంతే మరి.. -
షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్
-
షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్, వీడియో వైరల్
యంగ్ హీరో నిఖిల్ ‘కిరాక్ పార్టీ’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే. తాజాగా ఆమె షూటింగ్లో గాయపడింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న కన్నడ చిత్రం ‘క్రీమ్’. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ చేస్తుండగా ఆమె తీవ్రంగా గాయపడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఫైట్ సీన్స్ చేస్తుండగా తన కాలు సరిగా ల్యాండ్ అవ్వకపోవడం మోకాలి దగ్గర బలమైన గాయమైందని, వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు ఈ సందర్భంగా సంయుక్తి చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే తనకు గాయమైనప్పటికీ.. సినిమా విడుదలైన తర్వాత ఆ ఫైట్ సీన్ చూసి ప్రేక్షకులు తనని మెచ్చుకుంటారని పోస్ట్‌లో పేర్కొంది. కాగా ఇటీవల కాలేజ్ కుమార్ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఆమె ‘ఆహా’లో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా ‘మన్మథ లీలై’లో నటించింది. -
తన పేరెంట్స్‌ను కాపాడండి అంటూ హీరోయిన్ వేడుకోలు
బెంగళూరు: కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. అయితే తన తండ్రి ఆరోగ్యం ఏమీ బాగోలేదని ఆందోళన చెందుతోందీ హీరోయిన్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. "నా తల్లిదండ్రులకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నా తండ్రికి రెమిడెసివిర్ టీకా అత్యంత అవసరం. ఇప్పుడాయనకు ఆరు ఇంజక్షన్లు అవసరం. దానికోసం ఎంతోమందిని సంప్రదించాను కానీ దొరకడం లేదు. ప్రస్తుతానికైతే నా తండ్రిని బెంగళూరులోని స్వగృహంలో ఉంచి చూసుకుంటున్నాం. ఆస్పత్రికి వెళ్లడానికి ఆయన నిరాకరిస్తున్నారు. వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది." "ఆ ఇంజక్షన్లను ఇంటికి తెచ్చిచ్చేవాళ్లు ఎవరైనా మీకు తెలిస్తే వెంటనే నాకు మెసేజ్ చేయండి. నేను ప్రయత్నించిన ఫోన్ నెంబర్లు అన్నీ స్విచాఫ్ అని వస్తున్నాయి. దయచేసి నాకు సాయం చేసి నా తల్లిదండ్రులను కాపాడండి. ప్లీజ్.." అని వేడుకుంది. కాగా సంయుక్త హెగ్డే కోమలి, వాచ్‌మ్యాన్, పప్పీ వంటి పలు తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో కిరాక్ పార్టీలో యంగ్ హీరో నిఖిల్ సరసన తళుక్కున మెరిసింది. చదవండి: నటుడికి సీరియస్.. 2 నెలల బిడ్డను ఒంటరిగా వదిలి వెళ్లిన భార్య మనుషులకు మనుషులే సహాయం చేసుకోవాలి: ప్రగ్యా జైస్వాల్ -
క్షమాపణలు అంగీకరిస్తున్నా: నటి
బెంగుళూరు: కర్ణాటకలో నటి సంయుక్త హెగ్డే, కాంగ్రెస్ నేత కవిత రెడ్డి మధ్య నెలకొన్న వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కవిత రెడ్డి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పార్క్‌లో స్పోర్ట్స్‌వేర్ ధరించి సంయుక్త, ఆమె స్నేహితురాలు వ్యాయమం చేస్తుండగా అటుగా వెళ్లిన కాంగ్రెస్ నేత కవిత రెడ్డి వారిని వీడియో తీసి వారిపై దాడి చేశారు. ఈ వీడియోను నటి సంయుక్త హెగ్డే ఆమె సోషల్‌మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి ‘మహిళలు ఏం ధరిస్తున్నారు, ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అనే కారణాలతో వారిని హింసించడం సమాజం ఆపాలి’ అని ఆమె ట్వీట్ చేశారు. అదేవిధంగా కవిత మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దిగివచ్చిన కవిత సంయుక్తకు క్షమాపణలు చెప్పింది. తాను అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదని పేర్కొంది. ఇదిలా వుండగా కవిత క్షమాపణలను అంగీకరిస్తున్నట్లు సంయుక్త తెలిపింది. ఇదంతా మరిచిపోయి ముందుకు సాగుదామని కోరింది. ప్రతి చోట మహిళలకు భద్రత ఉండాలి తాను కోరుకుంటున్నట్లు పేర్కొంది. చదవండి: 'కిరాక్ పార్టీ' హీరోయిన్‌పై మూక దాడి -
'కిరాక్ పార్టీ' హీరోయిన్‌పై మూక దాడి
బెంగళూరు: కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై మూకదాడి జరిగింది. శుక్రవారం వర్కవుట్లు చేసేందుకు స్నేహితులతో కలిసి సంయుక్త బెంగళూరులోని ఓ పార్క్‌కు వెళ్లింది. అక్కడే ఉన్న ఓ మహిళ ఆమె వేసుకున్న దుస్తులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ దుస్తులు ధరించి పబ్లిక్‌లోకి ఎలా వస్తావంటూ దూషణలకు దిగింది. పార్కులో ఉన్న మరికొందరు కూడా సదరు మహిళతో కలిసి సంయుక్తతోపాటు ఆమె స్నేహితులపై దాడి చేశారు. కాగా దాడికి దిగిన మహిళను కవితారెడ్డిగా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనతో షాక్ తిన్న హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తనకు జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించారు. (చదవండి: కూతురుతో సహా సినీ నటి అదృశ్యం) The future of our country reflects on what we do today. We were abused and ridiculed by Kavitha Reddy at Agara Lake@BlrCityPolice @CPBlr There are witnesses and more video evidence I request you to look into this#thisisWRONG Our side of the storyhttps://t.co/xZik1HDYSs pic.twitter.com/MZ8F6CKqjw — Samyuktha Hegde (@SamyukthaHegde) September 4, 2020 "స్పోర్ట్స్ బ్రా వేసుకుని బయటకు వచ్చినందుకు చెప్పరాని మాటలు అన్నారు. నా స్నేహితురాలు ఏమీ అనకముందే ఆమెను కొట్టడానికి వెళ్లారు. ఇక్కడ ఇంత జరుగుతుంటే మాకు సహాయం చేయాల్సింది పోయి మరికొందరు మగవాళ్లు ఆమెకు తోడుగా నిలిచారు. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించారు" అని సంయుక్త వాపోయారు. ట్విటర్లోనూ తనపై దాడి చేసిన కవితారెడ్డి అనే మహిళ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా బెంగళూరు పోలీసులను కోరారు. తమ దగ్గర మరిన్ని సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. కాగా సంయుక్త హెగ్డే తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తున్నారు. తెలుగులో 'కిరాక్ పార్టీ' చిత్రంలో నటించారు. (చదవండి:మానసిక సమస్యలలో అమితాబ్ మనవరాలు) View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) on Sep 4, 2020 at 5:38am PDT -
ఆనందం తొమ్మిదింతలు!
సినిమాలో ఒకటీ, రెండు గెటప్స్‌లో కనిపిస్తేనే ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుంది. అదే తొమ్మిది గెటప్స్‌లో తమ హీరో కనిపిస్తే ఆనందం తొమ్మిదింతలైనట్టే. ఇప్పుడు అలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు ‘జయం’ రవి. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో ‘జయం’ రవి నటిస్తున్న చిత్రం ‘కోమలి’. ఇందులో కాజల్ అగర్వాల్, సంయుక్తా హెగ్డే కథానాయికలు. ఈ సినిమాలో ‘జయం’ రవి దాదాపు 9 గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ విషయం గురించి దర్శకుడు ప్రదీప్ మాట్లాడుతూ – ‘‘ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండే కామెడీ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నాం. ‘జయం’ రవిగారు పోషించే తొమ్మిది పాత్రల్లో ముఖ్యంగా 1990ల్లో గెటప్ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని అన్నారు. -
స్కూల్ స్టూడెంట్‌గా...
సినిమా సినిమాకు డిషరెంట్ జానర్స్తో ప్రయోగాలు చేస్తుంటారు తమిళ నటుడు ‘జయం’ రవి. తాజాగా మరో ప్రయోగానికి రెడీ అయ్యారట. ప్రదీప్ రంగనాథన్ అనే నూతన దర్శకుడితో తన కొత్త సినిమా స్టార్ట్ చేశారు ‘జయం’ రవి. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. సంయుక్తా హెగ్డే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో స్కూల్ యువకుడిగా కనిపిస్తారట ‘జయం’ రవి. దాని కోసం బరువు తగ్గుతున్నారట. ఈ పాత్ర కోసం సుమారు 20 కిలోల పైనే తగ్గుతారట. ఈ నెలాఖరులో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే బరువు పరంగా ‘జయం’ రవి తన టార్గెట్‌ని దాదాపు చేరుకున్నారట. -
బిజీ బీజీ!
సంయుక్తా హెగ్డే.. పేరు ఎక్కడో విన్నారు కదూ. కన్నడ ‘కిర్రిక్ పార్టీ’ సినిమాలో ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో ఆమె హైపర్‌కు థియేటర్స్‌లో మంచి మార్కులు పడ్డాయి. ఎంతలా అంటే.. ఈ కన్నడ ‘కిర్రిక్ పార్టీ’ సినిమాను తెలుగులో ‘కిర్రాక్ పార్టీగా’ రీమేక్ చేయాలనుకున్నప్పుడు సేమ్ రోల్‌కు సంయుక్తానే తీసుకునేంతగా. ఈ సినిమాతో తెలుగులోనూ మార్కులు కొట్టేశారామె. ఇప్పుడీ కన్నడ బ్యూటీ కోలీవుడ్‌లో బిజీ బీజీగా ఉన్నారట. ‘జయం’ రవి, కాజల్ ఓ తమిళ సినిమా కోసం జోడీ కట్టారు. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో స్క్రిప్ట్ పరంగా సెకండ్ హీరోయిన్‌కు చాన్స్ ఉందట. దీంతో మేకర్స్ సంయుక్తాను సంప్రదించడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నీ చకా చకా జరిగిపోయాయట. ఇది కాకుండా తమిళ సినిమా ‘పప్పీ’లో నటిస్తున్నారీ బ్యూటీ. -
హిందీ కిర్రాక్ పార్టీ
‘టెంపర్, ప్రస్థానం, అర్జున్ రెడ్డి, విక్రమ్ వేదా’ వంటి దక్షిణాది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి కన్నడ హిట్ ‘కిర్రిక్ పార్టీ’ చేరింది. ఈ హిందీ రీమేక్‌కు అభిషేక్ జైన్ దర్శకత్వం వహిస్తారు. ‘సోను కే టిట్టు కీ స్వీటీ’ ఫేమ్ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించనున్నారు. అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలుత ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రాను సంప్రదించారట. ఆయన డేట్స్ కుదరక పోవడంతో ఆ చాన్స్ ఆర్యన్‌ను వరించిందని టాక్. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, రష్మిక మండన్నా, సంయుక్తా హెగ్డే ముఖ్య తారలుగా నటించిన ‘కిర్రిక్ పార్టీ’ చిత్రం తెలుగులో ‘కిర్రాక్ పార్టీ’ పేరుతో రీమేక్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. -
‘కిరాక్ పార్టీ’ మూవీ రివ్యూ
టైటిల్ : కిరాక్ పార్టీ జానర్ : యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్, సిమ్రాన్ పరీన్జా, సంయుక్త హెగ్డే సంగీతం : బి. అజనీష్ లోక్‌నాథ్ దర్శకత్వం : శరన్ కొప్పిశెట్టి నిర్మాత : రామబ్రహ్మం సుంకర వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం కిరాక్ పార్టీ. ప్రయోగాలను పక్కన పెట్టి కన్నడలో సూపర్ హిట్ అయిన కిరిక్ పార్టీ సినిమాను తెలుగులో కిరాక్ పార్టీ పేరుతో రీమేక్ చేశాడు నిఖిల్. శరన్ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా నిఖిల్ ఖాతాలో మరో సక్సెస్ గా నిలిచిందా..? ప్రయోగాలను పక్కన పెట్టి కమర్షియల్ సినిమా చేసిన నిఖిల్ మరో విజయం సాధించాడా..? కథ : కృష్ణ (నిఖిల్ సిద్ధార్థ్) మెకానికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. తన ఫ్రెండ్స్‌తో కలిసి కాలేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. కాలేజ్ బంక్ కొట్టడం, గొడవలు చేయటం ఇదే కృష్ణ లైఫ్. ఆ సమయంలో సీనియర్ మీరా (సిమ్రాన్ పరీన్జా)ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఎలాగైన తనకు దగ్గరకావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా తన లైఫ్ తాను ఎంజాయ్ చేసే కృష్ణను మీరా కూడా ఇష్టపడుతుంది. (సాక్షి రివ్యూస్) కానీ అనుకోండా ఓ ప్రమాదంలో మీరా చనిపోతుంది. మీరాను ప్రాణంగా ప్రేమించిన కృష్ణ, పూర్తిగా మారిపోతాడు. కాలేజ్ లో అందరితో గొడవపడుతూ రౌడీలా మారిపోతాడు. మూడేళ్లు గడిచిపోతాయి. కృష్ణ గ్యాంగ్ ఫైనల్ ఇయర్‌కు వస్తుంది. కృష్ణ హీరోయిజం చూసి జూనియర్ సత్య (సంయుక్త హెగ్డే) కృష్ణను ఇష్టపడుతుంది. ఎలాగైన కృష్ణను మామూలు మనిషిగా మార్చాలని, జీవితంలోని కొన్ని చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ముందుకు సాగాలని గుర్తు చేయాలనుకుంటుంది. మరి సత్య ప్రయత్నం ఫలించిందా..? కృష్ణ మీరాను మర్చిపోయి సత్యకు దగ్గరయ్యాడా..? ఈ కాలేజ్ లైఫ్ కృష్ణకు ఎలాంటి అనుభవాలను ఇచ్చింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కృష్ణ పాత్రలో నిఖిల్ మంచి నటన కనబరిచాడు. స్టూడెంట్ గా తనకు అలవాటైన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో మెప్పించటంతో పాటు సెకండ్ హాఫ్‌లో మెచ్యూర్డ్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. లుక్ విషయంలోనూ మంచి వేరియేషన్ చూపించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో నిఖిల్ నటన చాలా బాగుంది. సినిమా సినిమాకు మంచి పరిణతి కనబరుస్తున్నాడు నిఖిల్. ఫస్ట్‌హాఫ్ లో హీరోయిన్ గా కనిపించిన సిమ్రాన్ హుందాగా కనిపించింది. సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. (సాక్షి రివ్యూస్)మరో హీరోయిన్ సంయుక్త హెగ్డే బబ్లీ గర్ల్ గా కనిపించి సెంకడ్‌హాఫ్ లో జోష్ నింపే ప్రయత్నం చేసింది. బ్రహ్మాజీది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో మంచి కామెడీ పండించాడు. ఫ్రెండ్స్ పాత్రలో కనిపించిన నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు. విశ్లేషణ : తెలుగులో ఈ తరహా కథలు చాలా కాలం క్రితమే వచ్చాయి. హ్యాపిడేస్ లాంటి సినిమాలు సంచలనాలు సృష్టించాయి. మరోసారి అదే తరహా కాలేజ్ డేస్‌ను గుర్తు చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు శరన్. అయితే ఎక్కడా కొత్తదనం కనిపించకపోవటం నిరాశపరుస్తుంది. అక్కడక్కడ కథనంలో మెరుపులు కనిపించినా.. గతంలో తెలుగు తెర మీద వచ్చిన చాలా కాలేజ్ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. కన్నడ ప్రేక్షకులకు ఈ తరహా కథలు కొత్త అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం రొటీన్ ఫార్ములా సినిమాలాగే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నా, కథనం నెమ్మదిగా సాగటం ఇబ్బంది పెడుతుంది. (సాక్షి రివ్యూస్)ఇలాంటి రొటీన్ కథను చెప్పటడానికి 2 గంటల 45 నిమిషాల సమయం తీసుకున్న దర్శకుడు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఒరిజినల్ వర్షన్ కు సంగీత మందిచిన అజనీష్ తెలుగు వర్షన్‌కు కూడా మంచి సంగీతాన్ని అందించాడు. పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నిఖిల్ నటన సంగీతం మైనస్ పాయింట్స్ : సినిమా నిడివి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
కాలేజీ రోజులు గుర్తుకువస్తాయి! – అనిల్ సుంకర
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఏటీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘కిరాక్ పార్టీ’. సిమ్రాన్, సంయుక్తా హెగ్డే కథానాయికలు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో థియేట్రికల్ ట్రైలర్‌ను తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేత జి. కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సినిమాను శుక్రవారం విడుదల చేయనున్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘నిఖిల్ ఎనర్జిటిక్ హీరో. సినిమా ఎంత కిరాక్‌గా ఉన్నా కూడా మంచి మెసేజ్ ఉంటుందని భావిస్తున్నా. దర్శకుడికి మంచి పేరు, నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కార్తీకేయ’ సినిమాకు శరణ్ నాతో వర్క్ చేశాడు. ఇప్పుడు తన డైరెక్షన్లో నేను వర్క్ చేశాను. మేమిద్దరం కలిసి చేసిన చిత్రమిది’’ అన్నారు దర్శకుడు చందు మొండేటి. ‘‘ఈ సినిమా చూసిన వారందరూ... సినిమాతో ప్రేమలో పడిపోతారు. కాలేజీ రోజులు గుర్తుకు వస్తాయి. కిషోర్‌గారు ప్రొడక్షన్లో సహకారం అందించారు’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘హ్యాపీడేస్ ఎన్ని రోజులు ఆడిందో.. అంతకంటే ఎక్కువ రోజులు ‘కిరాక్ పార్టీ’ ఆడుతుంది’’ అన్నారు నాగశౌర్య. ‘‘మహిళలకు గౌరవం ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాం. అనిల్‌గారు, కిషోర్‌గారి వల్లే ఈ సినిమా స్టారై్టంది. సుధీర్‌వర్మ మంచి డైలాగ్స్ అందించారు. చందు బౌండెడ్ స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు. చరణ్ అద్భుతంగా తీశాడు’’ అన్నారు నిఖిల్. ‘‘టీమ్ అంతా కష్టపడి చేసిన సినిమా ఇది’’ అన్నారు శరణ్. -
అందుకే కొత్తవాళ్లను తీసుకుంటా
‘‘నేను దర్శకుణ్ణి అవ్వాలనే ఇండస్ట్రీకొచ్చా. కానీ, డైరెక్టర్‌గా విఫలమయ్యా. నిర్మాతగా సక్సెస్ అయ్యా. అందుకే నిర్మాతగా ఉండటమే ఇష్టం’’ అన్నారు అనిల్ సుంకర. నిఖిల్ హీరోగా, సంయుక్తా హెగ్డే, సిమ్రన్ పరింజ హీరోయిన్స్‌గా శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘కిరాక్ పార్టీ’ ఈ నెల 16న విడుదలకానుంది. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ–‘‘ నాకు ఎప్పటి నుంచో ‘శివ’ లాంటి సినిమా చేయాలని ఆశ. కన్నడ ‘కిరిక్ పార్టీ’ కథాంశం ‘శివ’ చిత్రానికి కొంత దగ్గరగా ఉండటంతో ‘కిరాక్ పార్టీ’ గా తెలుగులో రీమేక్ చేశా. ఈ చిత్రానికి తొలుత దర్శకునిగా రాజుసుందరం అనుకున్నాం. ఆయన తెలుగు, తమిళ భాషల్లో చేద్దామన్నారు. రెండు భాషల్లో ఒకేసారి ఫోకస్ చేయలేమని శరన్‌కి అవకాశం ఇచ్చాం. చాలా మంది కుర్రాళ్లు పల్లెటూరి నుంచి ఇంజనీరింగ్ చేయడానికి సిటీకొస్తారు. మొదటి సంవత్సరం భయంగా ఉంటారు. చివరి సంవత్సారానికి పూర్తీగా మారిపోతారు. అదెలా అన్నదే కథాంశం. మా సినిమాల్లో కొత్త వాళ్లను ఎక్కువగా తీసుకోవడానికి కారణం రెమ్యునరేషన్ తక్కువనే(నవ్వుతూ). ఫ్రెష్‌నెస్ కోసమే కొత్త వాళ్లను తీసుకుంటాం. శర్వానంద్– ‘దండుపాళ్యం’ డైరెక్టర్ శ్రీనివాసరాజుతో ఓ సినిమా అనుకున్నాం. కథ పూర్తయ్యాక వివరాలు చెబుతా’’ అన్నారు. -
అటెండెన్స్ వేయించే బాధ్యత నాది– ‘అల్లరి’ నరేశ్
‘‘స్టూడెంట్స్ ఎవ్వరూ ఈనెల 16న అటెండెన్స్ గురించి పట్టించుకోకండి. ఆరోజు అటెండెన్స్ వేయించే బాధ్యత నాది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. నిఖిల్, సిమ్రాన్ పరింజా, సంయుక్తా హెగ్డే ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘కిరాక్ పార్టీ’. కన్నడ ‘కిరిక్ పార్టీ’ కి రీమేక్. శరణ్ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలవుతోంది. అజనీష్ లోక్నాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను విజయవాడలో రిలీజ్ చేశారు. ముఖ్య అతిథి ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘నిఖిల్‌ను చూస్తే నాకు డ్యూరోసెల్ బ్యాటరీ గుర్తొస్తుంటుంది. అంత ఎనర్జిటిక్‌గా ఉంటాడు. కన్నడలో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులోనూ అంతే హిట్ అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ ఉన్న సినిమా ఇది. ఈ చిత్రంలో నటించే అవకాశాన్నిచ్చిన అనిల్ సుంకరగారికి థ్యాంక్స్. చందు మొండేటికి ‘కార్తికేయ’, సుధీర్ వర్మకు ‘స్వామి రారా’ ఎంత పేరు తెచ్చాయో, ‘కిరాక్ పార్టీ’ శరణ్‌కి అంతే పేరు తీసుకొస్తుంది’’ అన్నారు నిఖిల్. ‘‘టీమ్ అంతా ఎంతో కష్టపడి పని చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘ప్రతి స్టూడెంట్ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. 16న బంక్ కొట్టి మరీ ఈ సినిమా చూస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు శరణ్. దర్శకుడు సుధీర్ వర్మ, సిమ్రాన్ పరింజా, సంయుక్తా హెగ్డే తదితరులు పాల్గొన్నారు. -
శివ, హ్యాపీడేస్ స్టైల్లో ఉంటుంది
‘‘శివ, హ్యాపీడేస్’ స్టైల్లో సాగే పూర్తి స్థాయి కాలేజ్ చిత్రమిది. ఆ బ్యాక్‌డ్రాప్ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ‘కిరాక్ పార్టీ’ తప్పకుండా ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు అనిల్ సుంకర. నిఖిల్, సిమ్రాన్ పరింజా, సంయుక్తా హెగ్డే హీరో హీరోయిన్లుగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కిరాక్ పార్టీ’. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా మార్చి 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో చిత్రబృందం సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘‘16న సినిమా విడుదల అవుతుంది. ఇంటర్ ఎగ్జామ్స్ 15తో అయిపోయిన వెంటనే మా సినిమా రావటం ఆనందంగా ఉంది. ప్రొమోషన్స్లో భాగంగా ఓ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. అందులో విజేతలకు సినిమాలో వాడిన కారును బహుమతిగా అందజేస్తాం. గురువారం నుంచి రెండు రాష్ట్రాల్లో టూర్ చేయనున్నాం. 10న విజయవాడలో ఆడియో, 13న ప్రీ–రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తాం. ‘శివ’ సినిమా చూసినప్పుడు అలాంటి సినిమా తీయగలనా లేదా అనుకునేవాణ్ణి. ఆ ఆలోచనతోనే ‘కిరిక్ పార్టీ’ సినిమాను రీమేక్ చేశాం. శరణ్ సినిమాను బాగా తీశాడు. సుధీర్ వర్మ, చందూ మొండేటి సహకారం అందించారు’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘నా సినిమాల్లో నా హార్ట్‌కు దగ్గరైన సినిమాల్లో ఇదొకటి. సినిమా ఇంకా బాగా రీచ్ కావడానికి టూర్ ప్లాన్ చేశాం. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు హీరో నిఖిల్. ‘‘శివ, హ్యాపీడేస్’ ఇన్స్పిరేషన్తో కన్నడ ‘కిరిక్ పార్టీ‘ని తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా తీశాం. స్టూడెంట్స్ అందరూ వాళ్లని స్క్రీన్‌పై చూసుకున్నట్టు ఉంటుంది’’ అన్నారు దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. ఈ కార్యక్రమంలో సిమ్రాన్, సంయుక్తా, ఆర్య, రాకేందు మౌళి పాల్గొన్నారు. -
రిలీజ్ ఫీవర్ స్టార్ట్ అయింది ‘‘కిరాక్ పార్టీ’
నా 15వ సినిమా. సినిమాకు పది రోజుల ముందు నుంచి నా ఫస్ట్ సినిమా, 15 సినిమా అనే డిఫరెన్స్ తెలీదు. హ్యాపీడేస్ అప్పుడు ఎలా నెర్వస్‌గా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. రిలీజ్ ఫీవర్ స్టార్ట్ అయింది’’ అన్నారు హీరో నిఖిల్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా సిమ్రాన్, సంయుక్తా హెగ్డే హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కిరాక్ పార్టీ’. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా మార్చి16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► కొన్ని సినిమాలు మనకు స్పెషల్‌గా ఉండిపోతాయి. ‘హ్యాపిడేస్, యువత, కార్తికేయ’ ఇప్పుడు ఈ సినిమా. మిగతా సినిమాలు హిట్స్ అయినా కూడా కొన్ని క్యారెక్టర్స్‌ను బాగా లవ్ చేస్తాం. ఇది నా ఫెవరెట్ రోల్. నేను కాలేజ్ మూవీ చేసి ఆల్మోస్ట్ 11ఇయర్స్ అయిపోతోంది. ► ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్ నుంచి స్టూడెంట్ లీడర్ ఎలా అయ్యాడు అనేది కథాంశం. నేను చేసిన అన్నింట్లో పెర్ఫార్మన్స్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఇచ్చింది. షూటింగ్ అప్పుడు కూడా అందరి కంటే ముందే సెట్‌కి వెళ్లిపోయేవాణ్ణి. ఈ క్యారెక్టర్ చాలా ఇష్టపడి చేశాను. ► ఈ సినిమా చేస్తుప్పుడు ‘హ్యాపీడేస్’ ఫీల్ వచ్చింది. ‘హ్యాపీడేస్’ తర్వాత ఫుల్ లెంగ్త్ కాలేజ్ ఫిల్మ్ రాలేదు. స్టార్ట్ టూ ఎండ్ వరకు కాలేజ్‌లోనే ఈ సినిమా నడుస్తుంది. అమ్మాయిల గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడితే ఆ అమ్మాయి ఎంత సఫర్ అవుతుందనే సెన్సిటీవ్ టాఫిక్ సినిమాలో ఉంటుంది. ► నా కాలేజ్ లైఫ్‌లో రెండు మూడు సార్లు గొడవలు అయ్యాయి. పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. స్టూడెంట్స్ అని వదిలేశారు. అలాంటి మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి. నేను, మా డైరెక్టర్, చందూ మెండేటి, సుధీర్ వర్మ, నిర్మాతలు అందరూ ఇంజినీర్సే. ► కన్నడ ‘కిర్రిక్ పార్టీ’ లాంటి క్యూట్ సినిమా మన తెలుగు ఆడియన్స్ మిస్ కావద్దని రిమేక్ చేశాం. ఈ సినిమాలో మార్చనవి రెండే రెండు. ఒకటి హీరోయిన్ సంయుక్త హెగ్డే, రెండు మ్యూజిక్. సంయుక్త బెస్ట్ డ్యాన్సర్, ఫుల్ ఎనర్జిటిక్. సో ఆమెను రీప్లేస్ చేయదలుచుకోలేదు. అలాగే ఇదొక మ్యూజికల్ ఫిల్మ్. అంజనీష్ లోకనాథ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ► అనిల్ సుంకరగారు ఈ సినిమా డైరెక్షన్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు. కొబ్బరికాయ కొట్టిన రోజు, మధ్యలో ఏదో ఒకసారి వచ్చారు అంతే. చందూ మొండేటి (డైలాగ్స్), సుధీర్ వర్మ (స్క్రీన్ ప్లే)లతో శరణ్ వర్క్ చేశాడు. వాళ్లిద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. అలా వాళ్లు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ► తమిళ ‘కణిదన్’ రీమేక్, కార్తికేయ సీక్వెల్లో నటిస్తున్నాను. -
'కిరాక్ పార్టీ' మూవీ స్టిల్స్