'మీ టాలెంట్‌ను చూపించండి.. మీ శరీరం కాదు'.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్! | Samyuktha Hegde Latest Video Gets Trolls In Social Media | Sakshi
Sakshi News home page

Samyuktha Hegde: మీరే ఇలా బరితెగిస్తే ఎలా?.. సంయుక్తపై మండిపడుతున్న నెటిజన్స్!

Published Fri, Sep 29 2023 2:36 PM | Last Updated on Fri, Sep 29 2023 3:27 PM

Samyuktha Hegde Latest Video Gets Trolls In Social Media - Sakshi

కిరిక్ పార్టీ సినిమా ద్వారా కన్నడ సినీ పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ సంయుక్తా హెగ్డే. సినిమాలే కాకుండా సంయుక్త కన్నడ, హిందీ రియాల్టీ షోలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ భామ ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ శ్రద్ధతో ఉంటోంది. ఎప్పటికప్పుడు వర్కవుట్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ షేర్ వీడియోలు చేస్తూ ఉంటోంది. ఇటీవల సంయుక్తా హెగ్డే సినిమాల కంటే ఇలాంటి వీడియోలతోనే ఎక్కువగా పాపులర్ అవుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో  షేర్ చేసిన వీడియో తెగ వైరలవుతోంది. అయితే ఆమె  తీరుపై నెటిజన్స్ ఫైరవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఓ లుక్కేద్దాం. 

(ఇది చదవండి: హౌస్‌లో అందాల పోటీ.. నాకేం తక్కువా అంటూ అమర్‌ దీప్‌ ఫైర్!!)

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ సంయుక్త తాజాగా డ్యాన్సర్ కిషోర్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. జంగ్లీ సినిమాలోని సోనూ నిగమ్ పాడిన నాలో నువ్వే అనే పాటకు సంయుక్త, కిషన్ రీల్స్ చేస్తూ డ్యాన్స్ చేశారు. అయితే ఇందులో ఆమె వేసుకున్న డ్రెస్‌పై నెటిజన్స్ ఫైరవుతున్నారు. ఆమె డ్రెస్‌ను చూసిన కొందరు నెటిజన్స్ మీకు కనీసం సెన్స్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఒక నటిగా మీరు అందరికీ రోల్ మోడల్‌గా ఉండాలి కానీ.. మీరే ఇలా బరితెగించడమేంటని పోస్టులు పెడుతున్నారు.  సంయుక్త అలాంటి డ్రెస్సులు ధరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.  మీ డ్యాన్స్ టాలెంట్‌ను చూపించండి.. మీ శరీరం కాదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. కాగా.. సంయుక్త గతంలో చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ గురైంది.

'కిరిక్ పార్టీ' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి సంయుక్త హెగ్డే.. సినిమాల కంటే వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. గతంలో బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌ను కొట్టినందుకు సంయుక్త వార్తల్లో నిలిచారు. అంతేకాదు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోలు, వీడియోలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. కాగా.. తమిళ చిత్రసీమలో కూడా సంయుక్తా హెగ్డే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చివరిసారిగా కన్నడ చిత్రం 'తుర్తు నిర్గమన'లో కనిపించింది. ప్రస్తుతం 'క్రీమ్' సినిమాతో బిజీగా ఉంది. 

(ఇది చదవండి: 'హ్యాపీ బర్త్‌ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement