తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇటీవలే విడుదల పార్ట్-2తో (viduthala Part-2) ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్‌లో వచ్చిన విడుదల పార్ట్- 1 సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.
(ఇది చదవండి: ఓటీటీలో విడుదల 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
అయితే తాజాగా విజయ్ సేతుపతికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్తున్న విజయ్‌ని వెనక నుంచి దూసుకొచ్చిన ఓ వ్యక్తి కాలితో తన్నాడు. పక్కనే సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా అక్కడే వారంతా ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ఘటన మూడేళ్ల క్రితం జరగ్గా.. తాజాగా ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అప్పట్లో బెంగళూరులో ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Ithu eppa nadanthathu..🥹🙄..
Enna @VijaySethuOffl sollave illa..🤭..
But it was a nice Kick 😉..#BiggBossTamil #BiggBossTamil8 #BiggBoss8Tamil #BiggBossTamilSeason8
#BiggBossTamil8Season #VijaySethupathi #VJS pic.twitter.com/XRtsMl31yo— BiggBossTamil8 (@BigBossTamilOTT) January 28, 2025
Comments
Please login to add a commentAdd a comment