Sandal Wood
-
పునీత్‌కు గుడి కట్టిన వీరాభిమాని
హుబ్లీ: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నడ వెండి తెరపై విరాజిల్లడంతో పాటు తన ఎనలేని సామాజిక సేవతో రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. ఆ అభిమానంతోనే హావేరి జిల్లాలో ఆయన పేరిట నిలువెత్తు విగ్రహంతో కూడిన ఆలయాన్ని గురువారం ఆయన సతీమణి అశ్విని ప్రారంభించారు. హావేరి జిల్లాలోని యలగట్టి గ్రామంలో పునీత్ వీరాభిమాని నిర్మించిన ఈ ఆలయంలో గురువారం నుంచి పూజలు ప్రారంభంఅయ్యాయి. ప్రకాష్ అనే అభిమాని తన ఇంటి ఎదురుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. జనం మెచ్చిన పునీత్‌లాంటి నటులతో తమ పిల్లల నామకరణం చేయడం ఆనవాయితీ. పునీత్‌ను కన్నడిగులు అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ క్రమంలో అభిమాని ప్రకాష్, ఆయన భార్య దీపాల బిడ్డకు అపేక్ష అనే పేరుని అశ్విని పెట్టారు. అప్పు సేవలను సహధర్మచారిణి అశ్విని ఎంతో ఆసక్తిగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తమ అభిమాని ప్రకాష్ ఆశయాన్ని కూడా నెరవేర్చారు.ఇలాంటి అభిమాని ఉండటం మా పుణ్యంఈ సందర్భంగా అశ్విని మీడియాతో మాట్లాడుతూ అభిమానులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ప్రకాష్ అనే అభిమాని సొంత స్థలంలో అప్పు ఆలయాన్ని నిర్మించారు. ఇలాంటి అభిమాని ఉండటం తమ పుణ్యం, ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆమె భావోగ్వేగానికి గురయ్యారు. అభిమాని సొంత డబ్బులతో సుమారు రూ.10 లక్షలు వ్యయం చేసి ఆలయాన్ని నిర్మించారు. పూజల ప్రారంభం సందర్భంగా వివిధ కళా బృందాలు, కుంభమేళా తదితర విశేష కార్యక్రమాలు జరిగాయి. విశేషంగా పునీత్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా నెరవేర్చి తమ అభిమాన నటుడిని స్మరించుకున్నారు. అనంతరం స్కూల్ మైదానంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు, మఠాధిపతులు పాల్గొన్నారు. కాగా చివరి విశేషంగా అన్నదానం కూడా నెరవేర్చారు. -
'మీ టాలెంట్‌ను చూపించండి.. మీ శరీరం కాదు'.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!
కిరిక్ పార్టీ సినిమా ద్వారా కన్నడ సినీ పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ సంయుక్తా హెగ్డే. సినిమాలే కాకుండా సంయుక్త కన్నడ, హిందీ రియాల్టీ షోలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ భామ ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ శ్రద్ధతో ఉంటోంది. ఎప్పటికప్పుడు వర్కవుట్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ షేర్ వీడియోలు చేస్తూ ఉంటోంది. ఇటీవల సంయుక్తా హెగ్డే సినిమాల కంటే ఇలాంటి వీడియోలతోనే ఎక్కువగా పాపులర్ అవుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తెగ వైరలవుతోంది. అయితే ఆమె తీరుపై నెటిజన్స్ ఫైరవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: హౌస్‌లో అందాల పోటీ.. నాకేం తక్కువా అంటూ అమర్ దీప్ ఫైర్!!) బిగ్ బాస్ కంటెస్టెంట్ సంయుక్త తాజాగా డ్యాన్సర్ కిషోర్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. జంగ్లీ సినిమాలోని సోనూ నిగమ్ పాడిన నాలో నువ్వే అనే పాటకు సంయుక్త, కిషన్ రీల్స్ చేస్తూ డ్యాన్స్ చేశారు. అయితే ఇందులో ఆమె వేసుకున్న డ్రెస్‌పై నెటిజన్స్ ఫైరవుతున్నారు. ఆమె డ్రెస్‌ను చూసిన కొందరు నెటిజన్స్ మీకు కనీసం సెన్స్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఒక నటిగా మీరు అందరికీ రోల్ మోడల్‌గా ఉండాలి కానీ.. మీరే ఇలా బరితెగించడమేంటని పోస్టులు పెడుతున్నారు. సంయుక్త అలాంటి డ్రెస్సులు ధరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మీ డ్యాన్స్ టాలెంట్‌ను చూపించండి.. మీ శరీరం కాదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. కాగా.. సంయుక్త గతంలో చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురైంది. 'కిరిక్ పార్టీ' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి సంయుక్త హెగ్డే.. సినిమాల కంటే వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. గతంలో బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌ను కొట్టినందుకు సంయుక్త వార్తల్లో నిలిచారు. అంతేకాదు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోలు, వీడియోలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. కాగా.. తమిళ చిత్రసీమలో కూడా సంయుక్తా హెగ్డే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చివరిసారిగా కన్నడ చిత్రం 'తుర్తు నిర్గమన'లో కనిపించింది. ప్రస్తుతం 'క్రీమ్' సినిమాతో బిజీగా ఉంది. (ఇది చదవండి: 'హ్యాపీ బర్త్ డే క్యూటీ'.. బన్నీ ఎమోషనల్ పోస్ట్!) View this post on Instagram A post shared by Kishen Bilagali (@kishenbilagali) -
బాలీవుడ్ ని బ్రేక్ చేసిన 2018 మూవీ
-
టాలీవుడ్ లో 2018 మూవీ సంచలనం తొలి రోజే కోటి రూపాయల గ్రాస్
-
కాంతారకు బిగ్ షాక్ ఇచ్చిన కేరళ హైకోర్ట్
-
పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే?
బనశంకరి(కర్ణాటక): కన్నడ నటి అదితి ప్రభుదేవా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టనున్నారు. సోమవారం ప్యాలెస్ మైదానంలో వివాహ వేడుక జరగనుంది. ఆమె శాండల్‌వుడ్‌లో డిమాండ్ ఉన్న నటి. కాగా, కాఫీ రంగ పారిశ్రామికవేత్త యశస్‌తో పెళ్లి జరగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన రిసెప్షన్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చదవండి: అలీ కూతురిని ఆశీర్వదించిన మెగాస్టార్, వీడియో వైరల్ -
స్క్రీన్ ప్లే @ 14th అక్టోబర్ 2022
-
చీటింగ్ కేసు.. నటుడు, నిర్మాత అరెస్ట్
యశవంతపుర(బెంగళూరు): మోసం కేసుకు సంబంధించి నటుడు, నిర్మాత వీరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు కోడిగేహళ్లి పోలీసుస్టేషన్లో బసవరాజ గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర జనహిత పార్టీని స్థాపించిన వీరేంద్రబాబు తనకు టికెట్ ఇస్తానని నమ్మించి 1.88 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అయనను అరెస్ట్ చేశారు. -
నటి మృతి కేసులో ఆస్పత్రికి నోటీసులు
యశవంతపుర: కన్నడ టీవీ నటి చేతనారాజ్ మృతికి కారణమైన ప్రైవేట్ ఆస్పత్రికి ఆరోగ్యశాఖ అధికారులు నోటీసులిచ్చారు. కొవ్వును కరిగించడానికి జరిగిన సర్జరీ విఫలమై నటి మూడు రోజుల కిందట మరణించడం తెలిసిందే. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రి ముఖ్య వైద్యుడు డాక్టర్ గౌడశెట్టికి నోటీసులిచ్చి ఆస్పత్రిని మూసివేశారు. నటి మృతిపై వివరణ ఇవ్వాలని సూచించారు. కూతురి మృతిపై అనేక అనుమానాలున్నయని మృతురాలి తండ్రి వరదరాజ్ సుబ్రమణ్యనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి డాక్టర్ గౌడశెట్టితో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. చదవండి: Actress Chethana Raj Death: కాస్మోటిక్ సర్జరీ వికటించి టీవీ నటి మృతి -
ఎన్టీఆర్ షేర్ చేసిన స్పెషల్ ఫొటో.. క్షణాల్లో వైరల్
Jr NTR Prashanth Neel Celebrate Wedding Anniversary: 'రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)' సక్సెస్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ పాన్ ఇండియా చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారాడు. మరోవైపు 'కేజీఎఫ్ 2'తో భారీ విజయం సాధించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సెలబ్రేషన్ సినిమా గురించి అనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఎవరికివారి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాన్ని ఒకే రోజు వేడుక చేసుకున్నారు. మే 5న ఇటు తారక్‌తోపాటు అటు ప్రశాంత్ నీల్ వివాహ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవాన్ని వారిద్దరు తమ ఫ్యామిలీలతో కలిసి జరుపుకున్నారు. ఈ విషయానికి సంబంధించిన ఒక స్పెషల్ ఫొటోను తారక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి దంపతులతోపాటు ప్రశాంత్ నీల్, ఆయన భార్య లిఖిత ఉన్నారు. ఈ రెండు జంటల వివాహ వార్షికోత్సవం మే 5న కావడంతో ఇరు జంటలు కలిసి ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఫొటోను షేర్ చేస్తూ 'ఒకే రోజు మా రెండు జంటల వివాహ వార్షికోత్సవం జరుపుకోవడం వేడుకగా ఉంది. ఇదొక కొత్త ఆరంభం.' అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రిహార్సల్స్‌కు రాలేదు: శేఖర్ మాస్టర్ View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పునీత్‌కు బసవశ్రీ అవార్డు
సాక్షి, బళ్లారి, యశవంతపుర: దివంగత పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం చిత్రదుర్గ మురుఘ మఠం 2021 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించడం తెలిసిందే. మంగళవారం బసవ జయంతి సందర్భంగా పునీత్ సతీమణి అశ్వినికి చిత్రదుర్గంలోని మురుఘ మఠంలో ప్రశస్తిని బహూకరించారు. అవార్డుతో పాటు రూ. 5 లక్షల చెక్కును పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి మురుఘ స్వామి ఆమెకు అందజేశారు. మంత్రి బీసీ పాటిల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. (చదవండి: పునీత్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న నమ్రత) -
గత 20 ఏళ్లుగా ఎన్టీఆర్ అభిమానిని: కేజీఎఫ్ డైరెక్టర్
Prashanth Neel Says He Is Jr Ntr For 20 Years: మామూలు సినిమాగా వచ్చి రికార్డులెన్నో బద్దలు కొట్టిన చిత్రం 'కేజీఎఫ్'. ఆ సినిమా చూసిన ఆడియన్స్ దానికి సీక్వెల్ ఎప్పుడెప్పుడూ వస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడనుంది. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా 'కేజీఎఫ్: చాప్టర్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇంతలా క్రేజ్ సంపాదించుకోవడానికి యశ్ యాక్టింగ్ ఒక కారణమైతే.. ఆ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరో ప్రధాన కారణం. ఈ ఒక్క సినిమాతో అటు యశ్, ఇటు ప్రశాంత్ నీల్ సూపర్ పాపులర్ అయ్యారు. దీంతో ప్రశాంత్ నీల్‌కు వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో 'సలార్' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: కేజీఎఫ్‌తో పాటు ‘సలార్’, ఆడియన్స్‌కి ప్రశాంత్ నీల్ డబుల్ ట్రీట్ ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ 'నేను గత 15, 20 ఏళ్లుగా ఎన్టీఆర్ అభిమానిని. మేము స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించాక 10 - 15 సార్లు కలిశాం. ఆయనకు స్క్రిప్ట్ నచ్చడంతో దానిపై పూర్తిగా వర్క్ చేస్తున్నాను. మేము గత రెండేళ్లుగా సన్నిహితులం. ఈ సినిమా గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను. దయచేసి అది ఏ జోనర్ అని నన్ను అడగొద్దు' అని తెలిపాడు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. The only soil that is worth remembering is the one soaked in blood!! Cant wait to make this one with the one and only force @tarak9999#NTR31 it is!! Wishing you a safe birthday brother 💫 Wishing for a successful collaboration @MythriOfficial @NTRArtsOfficial.#HappyBirthdayNTR pic.twitter.com/jtfYbZ1LCE — Prashanth Neel (@prashanth_neel) May 20, 2021 చదవండి: ప్రభాస్ హైఓల్టేజ్ యాక్షన్ సీన్స్.. అన్ని కోట్ల ఖర్చు -
బోల్డ్ సీన్స్‌పై ప్రశ్నించిన రిపోర్టర్, పెళ్లి తర్వాత మీరేం చేస్తారన్న హీరోయిన్
Kannada Actress Rachitha Ram Strong Counter To Reporter Who Questioned Her Bold Scenes: కన్నడ స్టార్ హీరోయిన్, ‘డింపుల్ క్వీన్’ రచిత రిపోర్టర్‌పై ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది. తన మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన రచిత ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తిరిగి దిమ్మతిరిగే ప్రశ్న వేయడం అందరిని షాక్ గురి చేసింది. రచిత తాజా చిత్రం ‘లవ్ యూ రచ్చు’. ఈ మూవీ త్వరలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీమ్ మీడియాతో ముచ్చటించింది. చదవండి: పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు ‘లవ్ యూ రచ్చు’లో రచిత చేసిన కొన్ని బోల్డ్ సీన్స్‌పై రిపోర్టర్ ప్రశ్నించగా అతడికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది రచిత. ఈ సినిమాలో హీరోహీరోయిన్ మధ్య కొన్ని శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయట. వీటిపై విలేకరులు అడగ్గా.. ‘కథ డిమాండ్ చేసినట్టుగా నేను నటించాను’ అని సమాధానం ఇచ్చింది. అయితే ఇంతకు ముందు బోల్డ్ సీన్స్ చేయనని చెప్పి ఇప్పుడు ఈ సినిమాలో ఎందుకు నటించారని ప్రశ్నించిన రిపోర్టర్‌కు రచిత ఊహించని రీతిలో జవాబిచ్చింది. చదవండి: దుల్కర్ చిత్రానికి రూ. 40 కోట్ల ఓటీటీ డీల్, ఒప్పందం రద్దు చేయించిన మమ్ముట్టి! అదేంటంటే ‘మిమ్మల్ని ఒకటి అడుగుతాను. పెళ్లి తర్వాత మీరు ఏం చేస్తారు? సాధారణంగా అందరూ చేసేది ఏంటి? రొమాన్సే కదా.. అదే మా సినిమాలో చూపించారు’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. అలాగే ‘గతంలో హీరో ఉపేంద్రతో ‘ఐ లవ్ యూ’ సినిమాలో కూడా ఇలాంటి సీన్స్‌లో నటించాను. అవి మా కుటుంబ సభ్యులను బాధించాయి. ఆ తర్వాత అలాంటి సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను. కానీ మళ్లీ అలాంటి సీన్స్‌లో నటించానంటే దానికి ఓ అర్ధం ఉంది. అదేంటో ఈ సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా రచిత మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్ హీరో వస్తున్న ‘సూపర్ మచ్చి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. చదవండి: Prabhas Adipurush Movie: 103 రోజుల్లోనే షూటింగ్ పూర్తి, ఆశ్చర్యంలో ఫ్యాన్స్ -
నటి మేఘనా రాజ్ మళ్లీ పెళ్లి..? స్పందించిన బిగ్‌బాస్ విన్నర్
నటి మేఘన రాజ్ కన్నడ, మలయాళ చిత్రసీమలోని అగ్ర కథానాయికలలో ఒకరు. ‘కాదల్ సొల్లా వందేన్’, 'నంద నందిత' వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలే. అయితే గతేడాది ఆమె భర్త కన్నడ స్టార్ హీరో చిరంజీవీ సర్జా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. ఆ సమయంలో నటి నాలుగు నెలల గర్భవతి. అనంతరం ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అయితే చిరు మరణించిన దాదాపు ఏడాది తర్వాత మేఘన, కన్నడ ‘బిగ్‌బాస్ 4’ విన్నర్ ప్రథమ్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిపై ప్రథమ్ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. ఆయన యూట్యూబ్‌లోని ఓ వీడియోని షేర్ చేశాడు. ‘వ్యూస్, డబ్బు కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించేలా రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి వరకు ఈ వీడియోను పట్టించుకోలేదు కానీ దాదాపు 2.7 లక్షలపైగా దీన్ని చూశారు. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు ఇలాంటివి పెట్టకుండా ఉంటారు’ అని ఆయన తెలిపాడు. (చదవండి: Keerthy Suresh: కమెడియన్‌కి జోడీగా కీర్తీ సురేష్..?) కాగా, మేఘనా రాజ్ ఇప్పటివరకు ఈ రూమర్స్‌పై స్పందించలేదు. కానీ తన దివంగత భర్త చిరంజీవి కోరిక మేరకు నటనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నటులు ఇద్దరూ దాదాపు పది సంవత్సరాలు ప్రేమించుకొని 2018లో వివాహం చేసుకున్నారు. భర్త అకాల మరణంతో నటి ఎంతో కుంగిపోయింది. ఈ తరుణంలో ఇటువంటి పుకార్లు రావడం ఆమెను ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి. చిరు మరణం అనంతరం తరచుగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భర్తపై ప్రేమని వ్యక్తం చేస్తుంటుంది. (చదవండి: కోర్టుపై నమ్మకం పోయింది: కంగనా రనౌత్) ನಾನ್ ನೋಡಿದ್ರೂ ignore ಮಾಡೋಣ ಅಂತಿದ್ದೆ!! But just one DAy ಲಿ 2.70 lakh views ಆಗಿದೆ!! Views ಆಗ್ಲಿ,#ದುಡ್ಡಾಗ್ಲಿ ಅಂತ ಈ ಮಟ್ಟಕ್ಕೆ ಈ youtube channel ಇಳಿದಾಗ ಸ್ವಲ್ಪ ಕಾನೂನಾತ್ಮಕವಗಿ ನೋಡಬೇಕಗುತ್ತದೆ!@meghanasraj ಇಂತಹ ಒಂದುchannel ನ ನೀವು ಕಾನೂನಾತ್ಮಕವಗಿ delete ಮಾಡ್ಸಿದ್ರೆ ಇನ್ನಷ್ಟು ಜನ ಎಚ್ಚೆತ್ತುಕೊಳ್ತರೆ! pic.twitter.com/mJUSH5Nxrb — Olle Hudga Pratham (@OPratham) September 14, 2021 -
కన్నడ నాట రెచ్చిపోయిన సుదీప్ ఫ్యాన్స్, కేసు నమోదు
తమ అభిమాన హీరోల పుట్టిన రోజు అంటే చాలు అభిమానులు చేసే రచ్చ అంతాఇంత కాదు. బర్త్‌డేకు పది రోజుల ముందు నుంచే నానా హంగామ చేస్తారు. ఫ్లెక్సీలు, భారీ భారీ కటౌట్స్, కేక్ కంటిగ్, బాణా సంచాలు పేల్చడంతో పాటు రక్తదానం చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు. ఇక కన్నడ స్టార్ హీరో సుదీప్ బర్త్‌డే(సెప్టెంబర్ 2) సందర్భంగా ఆయన అభిమానులు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఏడాది ఆయన పుట్టిన రోజున రక్తదానం ఇవ్వడం, బాణ సంచాలు పేలుస్తూ బహిరంగ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అంతేగాక వీధి వీధికి సుదీప్ కటౌట్స్, ఫ్లెక్సీలు కట్టి కేకులు కట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. చదవండి: హీరో సూర్య పాట విని కన్నీళ్లు ఆపుకోలేకపోయా: అమితాబ్ అయితే ఈ సారి వారి అభిమానం తారాస్థాయికి చేరింది. ఇటీవల(సెప్టెంబర్ 2) ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానులు మరింత రెచ్చిపోయారు. బళ్లారి జిల్లాలోని సండూరి తాలూక్ బండ్రి వద్ద సుదీప్ ఫ్లెక్సీ ముందు ఫ్యాన్స్ అంతా బహిరంగంగా చేరి దున్నపోతును బలిచ్చారు. సద్భావన పేరుతో జీవ హింసకు వ్యతిరేకంగా వారు జంతుబలి ఇవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో సుదీప్ ఫ్యాన్స్‌పై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: దమ్మున్న దర్శకుడు.. 14 ఏళ్లలో ఐదు బ్లాక్బస్టర్లు -
KGF Chapter2: రిలీజ్ డేట్ ఫిక్స్..ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ మొదటి భాగం ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ ఒక్క సినిమాతో యష్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక సీక్వెల్లో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. రవీనా టాండన్, రావు రమేష్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే..కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ రోజే ప్రభాస్ నటిస్తున్న సలార్ కూడా విడుదల కానుందని గతంలో చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను కూడా డైరెక్టర్‌గా ప్రశాంత్ నీల్ వ్యవహరిస్తున్నారు. దీంతో రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకేరోజు విడుదల అవుతాయా? లేదా సలార్ వాయిదా పడనుందా అన్నది తేలాల్సి ఉంది. చదవండి : టైగర్ 3 కోసం పూర్తిగా మారిపోయిన సల్మాన్.. ఫొటోలు లీక్ Chiru154 : పూనకాలు లోడింగ్.. అదిరిపోయిన పోస్టర్ #KGF2onApr14 pic.twitter.com/2DEW33do1q — Prashanth Neel (@prashanth_neel) August 22, 2021 -
గంధంతో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. ముఖ్యంగా అవి
►గంధం పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ వేసి పేస్టులా కలుపుకుని మొటిమలపై రాయాలి. ఈ పేస్టుని క్రమం తప్పకుండా మొటిమలపై అప్లై చేయడం వల్ల ముఖంపై అసహ్యంగా ఉన్న మొటిమలు పోతాయి. ►ముల్తాని మట్టి, గంధం పొడిని సమపాళ్లల్లో తీసుకుని రోజ్ వాటర్‌తో పేస్టులా కలపాలి. దీనిని ముఖంపై ప్యాక్‌లా అప్లై చేసి ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జిడ్డుకారుతున్న చర్మం తాజాగా మారడంతోపాటు నిగారింపును సంతరించుకుంటుంది. ►శరీరం వేడిగా అనిపిస్తే.. గంధం నూనెను నీటిలో వేసి స్నానం చేస్తే శరీరం చల్లబడుతుంది. ►చర్మ తత్వం ఎటువంటిదైనా తాజాగా ఉండాలంటే 50 ఎమ్ఎల్ రోజ్ వాటర్‌లో పది చుక్కల గంధం నూనె వేసి కలిపి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తాజాదనంతోపాటు, రక్షణ కలుగుతుంది. ► బాగా ఒత్తిడికి గురైనప్పుడు మూడు చుక్కల గంధం నూనెను టీ లో వేసుకుని తాగితే ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. -
ప్రముఖ నటుడు సంచారి విజయ్ బ్రెయిన్ డెడ్
జాతీయ అవార్డు గ్రహిత, ప్రముఖ కన్నడ నటుడు సంచారి విజయ్ కన్నుమూశారు. శనివారం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం(జూన్ 14) ఆయన మృతి చెందారు. విజయ్‌ది బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ధృవీకరించారని, తమ కుటుంబం ఆయన అవయవాలను దానం చేయాలని నిర్ణయించినట్లు విజయ్ సోదరుడు సిద్దేశ్ వెల్లడించారు. కాగా విజయ్ మృతి వార్తతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. స్టార్ హీరోలు సుదీప్, రాక్‌స్టార్ యశ్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా శనివారం (జూన్ 12) రాత్రి రేషన్ పంపిణి చేసేందుకు వెళ్లిన విజయ్ తన స్నిహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వస్తుండగా వారి వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విజయ్ తీవ్రంగా గాయపడటంతో స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యలు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైందని, పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు ఆదివారం వెల్లడించారు. కాగా విజయ్ 'రంగప్ప హోంగ్బిట్నా' అనే సినిమాతో 2011లో వెండితెరపై అరంగేట్రం చేశారు. 'హరివూ', 'ఒగ్గరానే' సినిమాలతో స్టార్ హోదా పొందాడు. తను ట్రాన్స్‌జెండర్‌గా నటించిన 'నాను అవనల్ల.. అవలు' సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. తను చివరిసారిగా 'యాక్ట్ 1978' చిత్రంలో నటించారు. Very very disheartening to accept that Sanchari Vijay breathed his last. Met him couple of times just bfr this lockdown,,,, all excited about his nxt film,, tats due for release. Very sad. Deepest Condolences to his family and friends. RIP 🙏🏼 — Kichcha Sudeepa (@KicchaSudeep) June 14, 2021 చదవండి: రోడ్డుప్రమాదానికి గురైన నటుడు, పరిస్థితి విషమం -
టీవీ నటితో ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ హీరో పెళ్లి.. ఫోటోలు వైరల్
టీవీ నటుడు, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ హీరో బాలు (చందన్ కుమార్), నటి కవిత గౌడలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కేవలం ఇరుకుంటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్య శుక్రవారం వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇటీవల వీరి నిశ్చితార్థం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో రహస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. కన్నడ లక్ష్మీ బారమ్మ(2013) సీరియల్లో వీరిద్దరూ చిన్ను, చందుగా ప్రధాన పాత్రలు పోషించారు. అదే సమయంలో ప్రేమలో పడిన చందన్, కవితలు అప్పటి నుంచి డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న(మే 14) పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. దీంతో వీరికి సినీ ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పెళ్లి అనంతరం చందన్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఆంక్షలు అన్ని ఎత్తివేసి, సాధారణ పరిస్థితులు రాగానే అందరిని పిలిచి గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపాడు. తమ పెళ్లిని ముందుగా అనుకున్న ముహుర్తానికే జరిపించాలని కుటుంబ సభ్యులంతా నిర్ణయించారని, దీంతో కరోనా ప్రొటోకాల్ నడుమ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ తమ వివాహ తంతు జరిపించినట్లు చందన్ వెల్లడించాడు. అయితే మాస్క్‌తో తమ వివాహ శుభకార్యంలో పాల్గొన్న వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసిన అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతుంటే, మరికొందరూ ‘మాస్క్‌తో ఒక్కటైన జంట’ అంటూ చమత్కరిస్తున్నారు. -
సీనియర్ నటి భర్త, ప్రముఖ నిర్మాత మృతి
బెంగుళూరు: కన్నడ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి మాలా శ్రీ భర్త, నిర్మాత కొణిగల్ రాము(52) కన్నుమూశారు. గత వారం ఆయనకు కరోనా సోకగా బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ సోమవారం (ఏప్రిల్26) సాయంత్రం తుది శ్వాస విడిచారు. కొణిగల్ రాము కన్నడ సినీ ఇండస్ర్టీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తీశారు. 1990ల కాలంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి మాలాశ్రీని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె. కొణిగల్ రాము ఏ సినిమా తీసినా బడ్జెట్ మాత్రం కోట్లల్లో ఉండేది. అందుకే కన్నడ నాట ఆయన్ను కోటి రాము అని పిలుస్తారు. శాండల్ వుడ్లో ఏకే 47, లాకప్ డెత్, సీబీఐ దుర్గ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. కొణిగల్ రాము మృతిపై కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నటుడు పునీత్ రాజ్‌కుమార్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. One of the most passionate Movie Producers of KFI, Ramu Sir is no more. RIP — Puneeth Rajkumar (@PuneethRajkumar) April 26, 2021 -
డ్రగ్స్ కేసు: తెరపైకి ప్రముఖుల పేర్లు..
యశవంతపుర: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల బెయిల్ పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు ఆవరణలోని 33వ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు శనివారం విచారించింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాల నమోదుకు రెండురోజులు గడువు కోరడంతో జడ్జి విచారణను 21వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు. దీంతో నటీమణులకు నిరాశ ఎదురైంది. డ్రగ్స్ విక్రేతలతో నటులకు లింక్ ఉందని, బెయిలును మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీసీబీ తరఫు న్యాయవాది వాదించారు. రాగిణి, సంజనల సన్నిహితులు రవిశంకర్, రాహుల్‌తో పాటు మరో ఇద్దరి బెయిల్ పిటిషన్లు కూడా సోమవారం కోర్టు ముందుకు వస్తాయి. సీసీబీ విచారణకు ఆ ముగ్గురు డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్, నటుడు అకుల్ బాలాజీ, నటుడు సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే దేవరాజ్ కొడుకు యువరాజ్లు శనివారం సీసీబీ విచారణకు హాజరయ్యారు. వీరు సీసీబీ ఆఫీసులోకి వస్తుండగానే మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు డ్రగ్స్ పార్టీలలో పాల్గొని మత్తు పదార్థాలను సేవిస్తున్నారా, పార్టీల నిర్వాహకులు ఎవరు, డ్రగ్స్‌ను ఎవరు సప్లై చేసేవారు తదితర కోణాల్లో ప్రశ్నించారు. ఎన్ని ఏళ్లు నుంచి డ్రగ్స్ పారీ్టలకు వెళ్తున్నారు అని ప్రశ్నించారు. ఎక్కడెక్కడ పారీ్టలను ఏర్పాటు చేసేవారో ఆరా తీశారు. యాంకర్ అకుల్ బాలాజీకి ముఖ్య నిందితుడు వీరేన్ ఖన్నా ఎన్నేళ్ల నుంచి పరిచయం. మీ ఫాం హౌస్‌ను ఎన్నికాలం వరకు లీజుకు ఇచ్చారు అని అకుల్‌ను ప్రశ్నించారు. ప్రముఖులతో జాబితా డ్రగ్స్ కేసులో పెద్ద పెద్ద అధికారుల పుత్రులు, స్టార్ నటులు, ప్రైవేట్ టీవీ చానల్స్‌కు చెందిన యాంకర్ల పేరు బయటకు వస్తున్నాయి. వీరేన్‌ఖన్నా తనకు పరిచయమైన వారందరి పేర్లను సీసీబీకి వివరించినట్లు తెలిసింది. విలాసంతమైన హోటల్స్, పబ్, అపార్ట్మెంట్లలో జరిగే విందు వినోదాల్లో పోలీసు అధికారు, యాంకర్లు, రాజకీయ నాయకుల తనయులు పాల్గొనేవారి జాబితాను సీసీబీ సిద్ధం చేసింది. వారికి కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్‌పంత్ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. -
డ్రగ్స్ కేసు: ప్రముఖుల జాబితా సిద్ధం
యశవంతపుర: శాండిల్‌వుడ్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం చేసిన సీసీబీ పోలీసులు ఇప్పటికే పలువురు ప్రముఖులను అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. తాజాగా సీసీబీ పోలీసులు పబ్‌లు, క్లబ్‌లకు వచ్చే ప్రముఖుల జాబితాను సిద్ధం చేశారు. రేవ్ పార్టీలను నిర్వహిస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడి సిబ్బంది, మేనేజర్, సెక్యూరిటీ గార్డుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. పబ్‌ల్లో ఎన్ని గంటల వరకు పారీ్టలను నిర్వహిస్తున్నారు. సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ఎవరెవరు వచ్చేవారని ఆరా తీస్తున్నారు. (చదవండి: శాంపిల్స్‌లో చీటింగ్ చేసిన నటి రాగిణి ద్వివేదీ) యాంకర్‌తో పాటు ముగ్గురికి నోటీసులు డ్రగ్స్ దందా కేసులో సీసీబీ పోలీసులు నటుడు, యాంకర్ అకుల్ బాలాజీ, మాజీ ఎమ్మెల్యే ఆర్వీ దేవరాజ్ మగ ఆర్ వీ.యువరాజ్, నటుడు సంతోషకుమార్లకు నోటీసులిచ్చారు. శనివారం 10 గంటలకు సీసీబీ కార్యాలయానికి హాజరు కావాలని సూచించినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. తాను హైదరాబాద్‌లో ఉన్నా విచారణకు హాజరవుతున్నట్లు యాంకర్ అకుల్ బాలాజీ తెలిపారు. నటుడు దిగంత్, ఆయన భార్య ఐంద్రితా రైలకు మళ్లీ సీసీబీ నోటీసులిచ్చి విచారణ చేసింది. మరోసారి నోటీసులిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంజనా బెయిల్ పిటిషన్ విచారణ నేటికి వాయిదా డ్రగ్స్ కేసులో అరెస్ట్‌యిన నటి సంజన బెయిల్ పిటిషన్‌ను ఇక్కడి ఎన్డీపీఎస్ సెషన్స్ కోర్టు విచారణ శనివారానికి వాయిదా వేసింది. బెంగళూరు 1వ ఏసీఏఎం కోర్టులోనూ బెయిల్ కోసం దరఖాస్తు చేయగా రెండు రోజులకు వాయిదా వేసింది. దీంతో రెండు కోర్టుల్లోనూ ఆమెకు నిరాశ ఎదురైంది. బెయిల్ దొరికే వరకు సంజన జైలులో ఉండక తప్పదు. ఇక తప్పించుకు తిరుగుతున్న శివప్రకాశ్, ఆదిత్య ఆళ్వ, షేఖ్ ఫాజిల్ కోసం సీసీబీ బృందాలు గాలింపు చేపడుతున్నాయి. -
డ్రగ్స్ కేసు: రాగిణి ద్వివేదీ చీటింగ్
బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో నటి సంజన గల్రానీతో పాటు ఆమె తల్లి, మరో నటి రాగిణి ద్వివేదీలు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ వారిని అరెస్టు చేసి విచారిస్తున్న నేపథ్యంలో ఇవాళ(శనివారం) వీరిని పరీక్షల నిమిత్తం బెంగళూరులోని కేపీ జనరల్ ఆసుపత్రికి పంపారు. ఈ క్రమంలో డోప్ టెస్టు కోసం ఇచ్చిన యూరిన్ శాంపిల్‌లో తన గుట్టు రట్టు కాకుండా ఉండేదుందుకు రాగిణి నీరు కలిపినట్లు తెలుస్తోంది. తన యూరిన్ శాంపిల్స్‌లో నీరు కలిసినట్లు డాక్టర్లు గుర్తించారు. (చదవండి: నటి రాగిణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు) దీంతో రాగిణి నుంచి మరోసారి వైద్యులు శాంపిల్స్ తీసుకున్నట్లు సమాచారం. అయితే మరోవైపు సుశాంత్ మృతి కేసులో బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కూడా వెలుగు చూసిన క్రమంలో కన్నడ పరిశ్రమలో కూడా ఈ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. దీనిపై ఇటీవల కన్నడ చిత్రనిర్మాత, జర్నలిస్ట్ ఇంద్రజిత్ లంకేష్ మాదకద్రవ్యాల గురించి బెంగళూరు సీసీబీకి ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. అంతేగాక ఇండస్ట్రీలో కనీసం 15 మంది ఈ డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం) -
కష్టాల్లో హీరోలు
వెండి తెరపై సాహసోపేతంగా పోరాటాలు చేసి అభిమానులను మైమరిపించే ఇద్దరు సినీ హీరోలు నిజజీవితంలో కేసుల సుడిలో చిక్కుకున్నారు. మీ టూ కేసులో అర్జున్ సర్జా, కూతురు ఫిర్యాదు చేయడంతో దునియా విజయ్‌లకు తాఖీదులందాయి. పోలీసుపై దాడి కేసులో దునియాపై కోర్టులో చార్జిషీటు కూడా దాఖలైంది. సోమవారం కబ్బన్‌పార్క్ పీఎస్‌కు జెంటిల్మెన్ వస్తారా?, లేదా? అన్నది సస్పెన్స్. సాక్షి బెంగళూరు/ యశవంతపుర : చిత్రసీమలో సంచలనం సృష్టించిన మీ టూ లైంగిక వేధింపుల వ్యవహారంలో ప్రముఖ నటుడు అర్జున్ సర్జాపై నటి శ్రుతి హరిహరన్ దాఖలు చేసిన కేసు విచారణను కబ్బన్ పార్కు పోలీసులు ముమ్మరం చేశారు. అర్జున్ సర్జాకు ఆదివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాలని అందులో సూచించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్‌పై కేంద్రీకృతమైంది. అర్జున్ సోమవారం విచారణకు హాజరవుతారా?, లేదా అన్నది తెలియాల్సి ఉంది. రెండేళ్ల కిందట విస్మయ చిత్రం షూటింగ్ సమయంలో అర్జున్ తనపై లైంగికంగా వేధించారని శ్రుతి రెండువారల కిందట ఆరోపించడం తెలిసిందే. ప్రముఖ నటుడు అంబరీష్ సహా సినీపెద్దలు రాజీ ప్రయత్నం చేసినా ఇద్దరూ మెట్టుదిగలేదు. శ్రుతి కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో అర్జున్‌పై ఫిర్యాదు చేయడం కేసు నమోదు చేశారు. శ్రుతి పేర్కొన్న సాక్షులను కూడా విచారించారు. దునియా విజయ్‌కు మహిళా కమిషన్ నోటీస్ పానిపూరి కిట్టిపై దాడి, మొదటి భార్య, కూతురిపై దౌర్జన్యం తదితర కేసులతో సతమతమవుతున్న హీరో దునియా విజయ్‌కు మహిళ కమిషన్ నోటీసులను జారీ చేసింది. ఇటీవల మొదటి భార్య నాగరత్న, కూతురు మోనికాలతో విజయ్ గొడవ జరగడం తెలిసిందే. తనకు తండ్రి నుండి రక్షణ లేదని ఆరోపిస్తూ కూతురు మోనికా మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నెల 12 లేదా 13న తమ ముందు హాజర్ కావాలని మహిళా కమిషన్ నోటీస్‌లో ఆదేశించింది. దునియా–మోనికా ఇద్దరిని ఒకచోట చేర్చి న్యాయ పంచాయితీ చేసే అవకాశం ఉంది. చార్జిషీటు దాఖలు దర్శకుడు సుందరగౌడను పోలీసులు అరెస్ట్ చేయటానికి వెళ్లగా దునియా విజయ్ పోలీసులకు ఆటంకం కలిగించిన కేసులో చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులు కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించారు. తనను అడ్డుకుని దాడి చేశాడని హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌పై 65 పేజీల అభియోగపత్రాన్ని సమర్పించారు. -
మళ్లీ వీధికెక్కిన హీరో కుటుంబం
యశవంతపుర : కన్నడ హీరో దునియా విజయ్ మొదటి భార్య నాగరత్న ఉంటున్న కత్రిగుప్పె ఇంటి వద్ద ఆదివారం హైడ్రామా చోటు చేసుకొంది. సెప్టెంబర్ 23న దునియా రెండో భార్య కీర్తిగౌడపై దాడి చేసిన వీడియోను దునియా, కీర్తిగౌడ మాధ్యమాలకు విడుదల చేశారు. విషయం తెలుసుకున్న తక్షణమే గిరినగర పోలీసులు నాగరత్న, మోనికపై కేసు నమోదు చేశారు. విచారణకు పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న నాగరత్న, మోనికలు ఇంటికి తాళం వేసుకుని పోలీసులను అడ్డుకున్నారు. కిటికీలో నుండి పోలీసులతో మాట్లాడిన మోనిక తన తల్లి ఇంటిలో లేదని చెప్పి పంపారు. తమను అరెస్టు చేయటానికి వారెంట్ ఏమైనా తెచ్చారా అంటూ మోనిక ప్రశ్నించారు. గిరినగర పోలీసులు మధ్యాహ్నం వరకు నాగరత్న కోసం వేచి ఉండి వెళ్లిపోయారు. అంతలోనే నాగరత్న తరపున లాయర్ ఆదివారం మధ్యాహ్నం నేరుగా స్టేషన్‌కు వెళ్లి నాగరత్న మారణాయుధాలతో దాడి చేయలేదని, చేతితో కొట్టడం వల్లే గాయమైందని, ఆమెకు స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసి వెళ్లిపోయారు. మోనికను అదుపులోకి తీసుకున్న పోలీసులు కీర్తిగౌడపై దాడి చేసినందుకు నాగరత్న ఇంటిలో లేక పోవటంతో దునియా కూతురు మోనికను గిరినగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దునియా విజయ్ రెండో భార్య కీర్తిగౌడతో కలిసి గిరినగర పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. కూతురును పోలీసులు అదుపులోకి తీసుకోవటంపై దునియా కన్నీరు పెట్టారు. అమ్మ చేసిన తప్పునకు కూతురుకు శిక్షవేయటం మంచిది కాదని, తమను కొట్టేంత ద్వేషం పెచ్చుకోవటం పద్దతికాదన్నారు. ఇంత జరిగినా పిల్లల భవిష్యత్ గురించి నాగరత్న పట్టించుకోవటంలేదని విజయ్ తరపు న్యాయవాది శివకుమార్ పేర్కొన్నారు. పిల్లలను అడ్డు పెట్టుకుని నాగరత్న నాటకాలు తనపై లేనిపోని అరోపణలు చేస్తున్న నాగరత్న పిల్లలను అడ్డం పెట్టుకుని తనను వేధిస్తున్నట్లు దు నియా విజయ్ అరోపించారు. ఇకనైనా బుద్ధిగా పి ల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసుల ముందుకు రావాలన్నారు. అయన ఆదివారం బెం గళూరులో విలేకర్లతో మాట్లాడారు. కీర్తిగౌడపై దా డి వీడియోను విడుదల చేసిన తక్షణం ఆమె ఇంటి నుండి పారిపోయారు. కూతురు మోనికను పోలీ సులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. మోనికను ఇలా స్టేష న్కు తీసుకురావటాన్ని తాను చూడలేకపోతున్నా ... చట్టం అందరికీ సమానం అనే విషయంను నా గరత్న మరిచారు. కూతురికి 18 ఏళ్ల నిండుతున్నా యి. ఇలాంటి వాతావరణంలో పిల్లలు ఉండటం చెడు ప్రభావానికి దారితీస్తుందని మీడియా ముం దు కన్నీరుమున్నీరయ్యారు. కూతురిపై ఆరోపణలు రావటంవల్ల మీరు రాజీఅవుతరా...అంటూ విలేకర్ల ప్రశ్నించగా అన్నింటికి పిల్లలను ముందుపెట్టి నాటకాలుచేయడం మంచిది కాదన్నారు. అరెస్ట్‌కు అదేశం కీర్తిగౌడపై దాడికి సంబంధించి నాగరత్నను అరెస్ట్ చేయటానికి గిరినగర పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్ 23న దునియాతో కలిసి ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి అసభ్యంగా నిందించటంతో పాటు తనను చెప్పుతో కొట్టినట్లు కీర్తిగౌడ గిరినగర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమెను అరెస్ట్ చేస్తామని డీసీపీ అణ్ణామలై విలేకర్లకు తెలిపారు.