
బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో నటి సంజన గల్రానీతో పాటు ఆమె తల్లి, మరో నటి రాగిణి ద్వివేదీలు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ వారిని అరెస్టు చేసి విచారిస్తున్న నేపథ్యంలో ఇవాళ(శనివారం) వీరిని పరీక్షల నిమిత్తం బెంగళూరులోని కేపీ జనరల్ ఆసుపత్రికి పంపారు. ఈ క్రమంలో డోప్ టెస్టు కోసం ఇచ్చిన యూరిన్ శాంపిల్‌లో తన గుట్టు రట్టు కాకుండా ఉండేదుందుకు రాగిణి నీరు కలిపినట్లు తెలుస్తోంది. తన యూరిన్ శాంపిల్స్‌లో నీరు కలిసినట్లు డాక్టర్లు గుర్తించారు. (చదవండి: నటి రాగిణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు)
దీంతో రాగిణి నుంచి మరోసారి వైద్యులు శాంపిల్స్ తీసుకున్నట్లు సమాచారం. అయితే మరోవైపు సుశాంత్ మృతి కేసులో బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కూడా వెలుగు చూసిన క్రమంలో కన్నడ పరిశ్రమలో కూడా ఈ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. దీనిపై ఇటీవల కన్నడ చిత్రనిర్మాత, జర్నలిస్ట్ ఇంద్రజిత్ లంకేష్ మాదకద్రవ్యాల గురించి బెంగళూరు సీసీబీకి ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. అంతేగాక ఇండస్ట్రీలో కనీసం 15 మంది ఈ డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం)
Comments
Please login to add a commentAdd a comment