ragini dwivedi
-
Ragini Dwivedi: స్టన్నింగ్ ఫోజులతో కుర్రకారుకు దడ పుట్టిస్తున్న రాగిణి ద్వివేది.. పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
చీరలో 'ప్రేమలు' మమిత అలా.. ముక్కెరతో సుప్రీత ఇలా!
కాటన్ చీరలో 'ప్రేమలు' బ్యూటీ మమిత గ్లామర్ టచ్అందాల విందుతో అబ్బా అనిపిస్తున్న నభా నటేశ్కొంగు చాటు పోజుల్లో బిగ్ బాస్ భామ రతికా రోజ్నవ్వుతూ మాయలో పడేస్తున్న హాట్ బ్యూటీ సుప్రీతచీరకట్టులో మహాలక్ష్మిలా కనిపిస్తున్న బిగ్ బాస్ ప్రియాంకగ్లామర్ ట్రీట్ ఇచ్చిన రాగిణి ద్వివేది.. చూస్తే మెంటలే View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Karishma Kotak (@karishmakotak26) View this post on Instagram A post shared by Rathika Ravinder (@rathikaravinder) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by ESSHANYA S MAHESHWARI (@esshanya_s_maheshwari) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya) View this post on Instagram A post shared by Pragya Nayan Sinha (@pragyanayans) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Sanchana Natarajan (@sanchana.natarajan) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Ragini Dwivedi (@rraginidwivedi) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Tarun Koliyot (@tarunkoliyot) -
Ragini Dwivedi: వైట్ అవుట్ ఫిట్ తో రాగిణి ద్వివేది అందాలు (ఫొటోలు)
-
ఈ-మెయిల్ మూవీ టీజర్
-
కొత్త సినిమా టీజర్.. యాక్షన్‌తో అదరగొట్టేసిన ఆ హీరోయిన్
ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలో నటించిన కొత్త మూవీ 'ఈ-మెయిల్'. మురుగ అశోకన్ హీరోగా చేశాడు. ఇందులో హిందీ, భోజ్‌పురి మూవీస్ ఫేమ్ ఆర్తి శ్రీ, ఆదవ్ బాలాజీ, అక్షయ్‌కుమార్, తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఎస్సార్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) ఈ క్రమంలోనే చిత్ర టీజర్‌ను ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. ఇక మూవీ గురించి మాట్లాడిన దర్శకుడు... ప్రస్తుతం ఎందరో ప్రాణాలను బలిగొంటున్న ఆన్లైన్ గేమ్స్ మోసాల కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇదని అన్నాడు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్.. అన్ని అంశాలను ఉంటాయని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
చీరకట్టుతో కనికట్టు చేస్తున్న రాగిణి ద్వివేది అందమైన ఫోటోలు
-
షూటింగ్లో గాయపడ్డ ప్రముఖ హీరోయిన్
ప్రముఖ కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది షూటింగ్లో గాయపడింది. వివరాల ప్రకారం.. రాగిణి ద్వివేది ప్రస్తుతం ‘‘నన్నొబ్బ బరతియా’’ అనే కన్నడ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదవశాత్తూ ఆమె ఎడమ చేతికి గాయమైంది. దీంతో వెంటనే షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన మూవీ టీం ఆమెను ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా కోలుకున్నాక తిరిగి ఆమె షూటింగ్లో పాల్గొననుంది. ఇక తన గాయానికి సంబంధించిన ఫోటోను రాగిణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. మీ శరీరం దేన్నైనా తట్టుకోగలదు. మీరు ఒప్పించాల్సింది మీ మనస్సు. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అంటూ రాసుకొచ్చింది. కాగా 2009లో వచ్చిన ‘వీర మడక్కరి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాగిణి‘‘జెండాపై కపిరాజు’’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. View this post on Instagram A post shared by Ragini dwivedi (@rraginidwivedi) -
రియల్ దండుపాళ్యం బ్యూటీ రాగిణి ద్వివేది బ్యూటిఫుల్ పిక్స్
-
‘రియల్ దండుపాళ్యం’ చూసి మహిళలు ఇన్స్పైర్ అవ్వాలి
`మగాడి దాష్టీకానికి ఆడవారు ఎలా బలవుతున్నారో దండు పాళ్యం గత సిరీస్ లో చూపించారు. కానీ మహిళలు వారిపై జరిగే అకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే ఎలా ఉంటుందో ‘రియల్ దండుపాళ్యం’లో చూపించారు’అని అన్నారు టియఫ్‌పిసి సెక్రటరి టి. ప్రసన్నకుమార్. రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. శ్రీ వైష్ణో దేవి పతాకంపై, సి.పుట్టస్వామి నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టియఫ్‌పిసి సెక్రటరి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ‘రియల్ దందుపాళ్యం’ట్రైలర్ చూశాక ఒక కర్తవ్యం, ప్రతిఘటన, మౌనపోరాటం చిత్రాలు గుర్తొచ్చాయి. ఈ సినిమా ప్రతి మహిళ చూడాలి. ఇన్ స్పైర్ అవ్వాలి. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలి’అన్నారు. నిర్మాత సి పుట్ట స్వామి మాట్లాడుతూ..‘సొసైటీలో మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ ‘రియల్ దండుపాళ్యం’ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నో సంఘటనలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. అన్ని సెంటర్స్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది’అన్నారు. ‘ఈ చిత్రాన్ని ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను. గతంలో వచ్చిన సిరీస్ కన్నా రియల్ దండుపాళ్యం అద్భుతంగా ఉండబోతుంది. తెలుగులో తొలి సారి విడుదలవుతోన్ననేను నటించిన యాక్షన్ సినిమా ఇది. ఎంతో ఎగ్జైయిటింగ్ గా ఉంది. అన్నారు హీరోయిన్ రాగిణి ద్వివేది. ఇంకా ఈ కార్యక్రమంలో సురేశ్ కొండేటి, సంజీవ్ చౌహాన్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రామా నాయక్, మానస. శ్యామ్ సన్, శేఖర్ నాయక్, సందీప్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ కేసు: ఆస్పత్రిలో చేరిన హీరోయిన్ సంజన
Sandalwood Drug Case: డ్రగ్స్ కేసులో నిందితురాలైన సంజనా గల్రాని అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆమె తల్లీ రేష్మా గల్రాని ఈ విషయం తెలిపారు. అన్నింటికీ తలరాత బాగుండాలి. అయితే మేం ఎలాంటి తప్పు చేయలేదు. పేదలకు రోజూ అన్నదానం చేస్తున్నాం అని చెప్పారు. సంజన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తాము డ్రగ్స్ సేవించినట్లు సీసీబీ పోలీసులు చార్జిషీటులో పేర్కొనడంపై శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో నిందితురాలు, అందాల నటి రాగిణి ద్వివేది స్పందించారు. దేవుడు వేసిన ప్లాన్‌పై మనకు భరోసా ఉండాలి. అనుకున్నట్లు నడవకపోయినా కోపం ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటేనే గెలవడం సాధ్యం అని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇంటికే పరిమితమైన రాగిణి మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. ఈ కేసులో ఏం చేయాలనేదానిపై లాయర్‌తో సంప్రదిస్తున్నారు. డ్రగ్స్‌పై కఠిన చర్యలు: హోంమంత్రి రాష్ట్రంలో మత్తు దందాను నియంత్రిస్తామని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. బుధవారం కోరమంగళ్‌లోని కేఎస్ఆర్పీ మైదానంలో పోలీసు పబ్లిక్ స్కూలును ప్రారంభించి విలేకర్లతో మాట్లాడారు. మత్తు పదార్థాలతో యువత జీవనం నాశనమవుతోందన్నారు. పోలీసుల పిల్లలకు ఉత్తమ విద్యను అందించడానికి పబ్లిక్ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐపీఎస్ రజనీశ్ గోయల్, డీజీపీ ప్రవీణ్ సూద్ పాల్గొన్నారు. చదవండి : Drugs Case: శాండల్‌వుడ్ నటీమణులు రాగిణి, సంజనకు షాక్ నటుడిగా 12ఏళ్లుగా కష్టపడుతున్నా: సందీప్ కిషన్ -
సీఎఫ్ఎస్ఎల్ రిపోర్టు: నటీమణులు రాగిణి, సంజనకు షాక్
Sandalwood Drug Case: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతితో సినీ పరిశ్రమలో డ్రగ్ వ్యవహరం కలకలం సృష్టించింది. బాలీవుడ్, శాండల్‌వుడ్‌లో డ్రగ్ కేసు సంచలనం సృష్టించింది. బాలీవుడ్లో పలువురు సినీ నటీనటులు, స్టార్ హీరోయిన్స్ పేర్లు ఈ కేసులో వినిపించాయి. ఇక శాండల్‌వుడ్‌కు వస్తే సంజన గల్రానీ, రాగిణీ ద్వివేది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరికి డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని, తరచూ డ్రగ్ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీసీబీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వారి తలవెంట్రులను సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) సాంపుల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: నెటిజన్ రూ. కోటి డిమాండ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సోనూసూద్ తాజాగా సీఎఫ్ఎస్ఎల్ ఈ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ రిపోర్టులో రాగిణి, సంజనలు డ్రగ్స్ సేవించినట్లు తేలింది. 2020 అక్టోబర్‌లో వీరిద్దరి వెంట్రకల నమూనాలను సేకరించిన బెంగళూరు పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఈ రిపోర్టులో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడవ్వడంతో బెంగళూరు పోలీసులు మరోసారి రాగిణి, సంజనలకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సంజనా ప్రభాస్ బుజ్జీగాడు మూవీతో పాటు పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రాగిణి కన్నడలో స్టార్నటిగా గుర్తింపు పొందింది. కాగా ఈకేసులో జైలుకు వెళ్లిన సంజనా, రాగిణిలు ఇటీవల బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు రాగానే సంజన తన స్నేహితుడైన డాక్టర్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? -
డ్రగ్స్ కేసు: నటి రాగిణి, సంజనాపై చార్జిషీట్
సాక్షి, బెంగళూరు : సంచలనాత్మక డ్రగ్స్ వాడకం– రవాణా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన శాండల్‌వుడ్ నటీమణులు రాగిణి ద్వివేది (30), సంజనా గల్రాని (31)తో పాటు 25 మందిపై సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ), కాటన్‌పేటే పోలీసులు మంగళవారం ఎన్డీపీఎస్ కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. డ్రగ్స్ ముఠాలు, వాటి దందాలకు సంబంధించి సుమారు 2,900 పేజీల చార్జిషీట్లో సమాచారం పొందుపరిచారు. 180 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఇంకా పరారీలో ఉన్న వారిపేర్లు కూడా చార్జిషీట్లో ప్రస్తావించారు. డ్రగ్స్ కేసులో 2020 సెప్టెంబరు మొదటివారంలో రాగిణి, ఆ తరువాత కొన్నివారాలకు సంజనను అరెస్టు చేసి 3 నెలలకు పైగా జైల్లో ఉంచడం తెలిసిందే. రాగిణి మత్తు పార్టీలు ఇలా ► 2019 మే 26 న నటి రాగిణి పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వద్ద గల హోటల్లో ప్రియుడు రవిశంకర్‌తో రాగిణి పార్టీ నిర్వహించడం, ఎక్స్టసీ డ్రగ్ మాత్రల సేవనంతో పాటు ఇతరులకూ సరఫరా చేసినట్లు చార్జిషీట్లో ప్రస్తావించారు. ► 2020 జూలై 5 న యలహంక లెరోమా హోటల్లో పార్టీలో డ్రగ్స్ సేవించారు. ► 2020 జనవరి నుంచి ఆగస్టు వరకు ముఖ్య నిందితుడు లూమ్పెపే సాంబాకు ఫోన్ చేసి డ్రగ్స్ కొనుగోలు చేశారు. నైజీరియా పర్యాటకుడు నుంచి రాగిణి డ్రగ్స్ తీసుకుంది. ► ఆమె ఇతర నిందితులకు వాట్సాప్ ద్వారా డ్రగ్స్ కావాలని అడిగారు. ఆమె ఐఫోన్ 11 ప్రోమ్యాక్స్ మొబైల్‌ఫోన్‌ను సోదా చేయగా కీలక సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. సంజన గురించీ పెద్దసంఖ్యలో అభియోగాలు ఉన్నాయి. ► ప్రియుడు రవిశంకర్‌తో రాగిణి డ్రగ్స్ డీల్ గురించి ఏమేం మాట్లాడారు అనేది ప్రస్తావించారు. 69వ పేజీలో 2018 డిసెంబర్ 8వ తేదీన నటి రాగిణికి వ్యతిరేకంగా రవిశంకర్ భార్య చేసిన చాటింగ్‌ను పొందుపరిచారు. -
లైవ్‌లో ఏడ్చేసిన హీరోయిన్
తన జీవితంలో కొన్ని సంఘటనలు తనను బాధ పెట్టాయని, తనపై జరిగిన దుష్ప్రచారంపై మాట్లాడుతూ లైవ్‌లోనే హీరోయిన్ ఏడ్చేసింది. జరిగిన దాని గురించి బాధపడకుండా కోలుకుని చివరకు మిమ్మల్ని అలరిస్తానని ప్రకటించింది. ఆమెనే కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది. ఆమె డ్రగ్స్ కేసులో అరెస్టయి 145 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్‌పై విడుదలై ఇంటికొచ్చింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె లైవ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా తన అభిమానులతో మాట్లాడింది. ఈ క్రమంలో ఆవేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకుంది. క్లిష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన వారికి ఈ సందర్భంగా రాగిణి కృతజ్ఞతలు తెలిపింది. తనపై జరిగిన దుష్ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేసింది. 19.43 నిమిషాల పాటు ఆమె మాట్లాడింది. ఈ సందర్భంగా తనపై, తన కుటుంబంపై వచ్చిన ప్రచారం.. వివాదాస్పద వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ కామెంట్స్ ఒకసారి మీరే చదువుకోండి అని సూచించింది. ‘మీ కుటుంబసభ్యులపై ఎవరైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అని రాగిణి హితవు పలికింది. దాని గురించి పెద్దగా ఆలోచించకపోయినా ఆ బాధ తనను వెంటాడుతూనే ఉందని కన్నీటి పర్యంతమైంది. కాలం ప్రతి గాయాన్ని నయం చేస్తుందని తనకు తాను ధైర్యం చెప్పుకుంది. అయితే కొన్నాళ్లకు అన్ని విషయాల గురించి మాట్లాడుతానని చెప్పింది. ప్రస్తుతం తాను క్లిష్ట దశలో ఉన్నానని చెప్పింది. ‘ఇక మిమ్మల్ని నవ్విస్తాను.. ఫీల్ గుడ్ చేస్తానని.. వంట, ఫన్నీ వీడియోలతో మీ ముందుంటా’ అని రాగిణి తెలిపింది. మోడల్‌గా ఉన్న రాగిణి ద్వివేది సినిమాల్లోకి వచ్చారు. కన్నడలో వీర మడకరి, కెంపెగౌడ, శివ, బంగారి, రాగిణి ఐపీఎస్ సినిమాలతో గుర్తింపు పొందింది. View this post on Instagram A post shared by Ragini dwivedi (@rraginidwivedi) -
డ్రగ్స్ కేసు: సీసీబీ ఆఫీసుకు నటి రాగిణి
యశవంతపుర: గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నటి రాగిణి ద్వివేది జైలు నుంచి బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మొదటిసారిగా ఆదివారం సీసీబీ ఆఫీసులో హాజరయ్యారు. 15 రోజులకు ఒకసారి సీసీబీ ముందు హాజరు కావాలని బెయిలు షరతుల్లో ఉంది. దీంతో చామరాజపేటలోని సీసీబీ ఆఫీసుకు వచ్చి అధికారులు సూచించిన పుస్తకంలో సంతకం చేసినట్లు ఆమె విలేకర్లకు తెలిపారు. త్వరలో మీడియా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని, చిత్రపరిశ్రమలో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కారణంతో గత సెప్టెంబర్‌లో రాగిణి, సంజనాలను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
రాగిణి విడుదల ఆలస్యం
యశవంతపుర: డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రాగిణికి సుప్రీంకోర్టులో బెయిల్ లభించిన విషయం తెల్సిందే. అయితే రూ.2 లక్షల బాండ్ ఇవ్వటంలో జాప్యం జరగడంతో ఆమె విడుదల ఆలస్యమవుతోంది. కరోనా నేపథ్యంలో జామీనుదారుడు ష్యూరిటీ నగదు నేరుగా చెల్లించడానికి వీలు కావడం లేదు. వీడియో ద్వారా విచారణ జరుపుతున్నందున బాండ్‌ను జడ్జికి చూపించాలి. జడ్జి బాండ్‌ను పరిశీలించిన తరువాతనే రాగిణిని విడుదల చేయనున్నారు. మంగళవారం రిపబ్లిక్‌డే ఉండటంతో బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: డ్రగ్స్ కేసులో సినీ నటి ద్వివేదికి బెయిల్ -
డ్రగ్స్ కేసులో సినీ నటి ద్వివేదికి బెయిల్
బెంగళూరు: గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నటి రాగిణి ద్వివేదికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని, చిత్రపరిశ్రమలో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కారణంతో గత సెప్టెంబర్‌లో రాగిణి, సంజనాలను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ద్వివేది, ఇతరులకు బెయిల్ ఇవ్వడానికి నవంబర్ 3న కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి తనను ఈ కేసులో తనను ఇరికించారని పిటిషన్ లో పేర్కొంది. నేడు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార కేంద్ర జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంది.( చదవండి: మిషన్ ఫ్రంట్‌లైన్.. ఆర్మీలో రానా) -
బాత్రూమ్లో కిందపడ్డా.. ఆస్పత్రికి తీసుకెళ్లండి
సాక్షి, బెంగళూరు : డ్రగ్స్ కేసులో పరప్పన జైల్లో ఉంటున్న నటి రాగిణి ద్వివేది బాత్ రూమ్‌లో కిందపడి గాయపడినట్లు తెల్సింది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు అనుమతించాలని సోమవారం ఆమె తరఫున న్యాయ వాది ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. జారిపడటంతో వెన్ను నొప్పి తీవ్రంగా ఉందని, జైలు ఆస్పత్రిలో మెరుగైన వైద్యం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. అదే సమయంలో కుటుంబ సభ్యులను కలవటానికి అవకాశం కల్పించాలని పిటిషన్లో కోరారు. అభ్యంతరాలు ఉంటే నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను న్యాయమూర్తి శీనప్ప ఆదేశించారు. ఇటీవల బెయిల్ పిటిషన్లు తిరస్కరించడంతో రాగిణి, సంజనలు పరప్పన జైల్లో ఉంటున్నారు. నటి ప్రణీత పేరుతో వంచన బహుభాషా నటి ప్రణీత పేరుతో వంచకులు ఎస్వీ.గ్రూప్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కంపెనీని మోసం చేసిన ఘటనపై ఇక్కడి హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. వివరాలు.. బెంగళూరు ప్రైవేటు హోటల్‌కు ఎస్వీ.గ్రూప్ మేనేజర్‌ను పిలిపించుకున్న వంచకులు తాము నటి ప్రణీత మేనేజర్లమని పరిచయం చేసుకున్నారు. అంతేగాక సదరు నటిని సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ చేస్తామని డీల్ కుదుర్చుకున్నారు. రూ.13.5 లక్షలు చెల్లిస్తే ప్రణీత మరో గంటలో వచ్చి ఒప్పందంపై సంతకం చేస్తారన్నారు. వీరి మాటలు నమ్మిన సదరు సంస్థ ఉద్యోగి వారికి నగదు ఇచ్చేశాడు. క్షణాల్లోనే వంచకులు అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు మహమ్మద్ జునాయత్, వర్షాపై కేసు నమోదు చేశారు. -
వారికి అండర్‌వరల్డ్ డాన్లతో సంబంధాలు..!
సాక్షి, బెంగళూరు : శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు అనుమతితో నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిలను పరప్పన జైలులో ఐదు రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆదివారం ముగించారు. సినిమాల ద్వారా ఎంతెంత సంపాదించారనే వివరాలను సేకరించారు. రాగిణి తండ్రి రిటైర్డు మిలిటరీ అధికారి కాగా, ఆయన పలు వివరాలను ఈడీకి అందజేశారు. రాగిణిపై అధిక అనుమానాలు మరో నటి సంజన విచారణలో అనేకసార్లు ఆవేదనతో విలపించినట్లు తెలిసింది. ఎన్ని సినిమాలు నటించారు. ఎంత డబ్బులు సంపాదించారు. పిత్రార్జితం ఎంత?, ఇటీవల కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఏమిటి అని ఈడీ అధికారులు సంజనపై ప్రశ్నలవర్షం కురిపించారు. పలు భాషల్లో 42 సినిమాలలో నటించిన సంజన సినిమా రంగంలో పెద్ద పేరును సంపాదించలేకపోయినా ఆదాయానికి మాత్రం ఢోకా లేదని గుర్తించారు. ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో సమాచారం కోసం ఈడీ ఇప్పటికే ఐటీశాఖకు లేఖ రాసింది. రాగిణి, సంజన ఆస్తులు, వారి సంపాదన తీరుపై ఈడీ అవగాహనకు వచ్చింది. సంజన బెయిల్ దొరికి బయటకు వచ్చినప్పటికీ విచారణ కోసం మళ్లీ అదుపులోకి తీసుకువాలని ఈడీ భావిస్తోంది. (అనుశ్రీకి అండగా మాజీ సీఎం.. ఎవరా గాడ్‌ఫాదర్ ?) బెయిల్ కోసం ఆరాటం రాగిణి, సంజనల విచారణలో పలు ముఖ్యమైన అంశాలను సీసీబీ అధికారులు సేకరించారు. వాటి ఆధారంగా మరికొన్ని రోజులు ఇద్దరినీ ప్రశ్నించాలని నిర్ణయించారు. సీసీబీ విచారణలో రౌడీలు, అండర్‌వరల్డ్ డాన్లతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. బెంగళూరులో వారికి సహకారం అందించిన కొందరు రౌడీలపై నిఘా పెట్టారు. ఇక హైకోర్టులో బెయిలు కోసం నటీమణులు లాయర్లను సంప్రదిస్తున్నారు. (డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!) ఇద్దరు డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్ డాలర్స్ కాలనీలోని అపార్ట్మెంట్లో గంజాయి సేవిస్తున్న వరుణ్, వినోద్ అనే డ్రగ్ పెడ్లర్లను బెంగళూరు సంజయ్‌నగర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారిని విచారించగా బెంగళూరులో జరిగే పార్టీలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిందితులు వెల్లడించారని తెలిసింది. -
డ్రగ్స్ కేసు: బ్యాంకు లావాదేవీలపై ఈడీ విచారణ
సాక్షి, యశవంతపుర: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో జైలుపాలైన నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిలను ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. ఇటీవల సంజనకు చెందిన 11 బ్యాంక్ ఖాతాల నుంచి నగదు వివిధ ఖాతాలకు బదిలీ అయిన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అన్ని ఖాతాలలో కలిపి 40 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. సంజన బ్యాంక్ ఖాతాకు విదేశాల నుండి నగదు బదిలీ అయిందా అనే కోణంలో సీసీబీ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరెవరి ఖాతాల నుంచి ఆమె ఖాతాకు డబ్బులు వచ్చేవి, వెళ్లేవి అని ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. బెంగళూరులో ఐఎంఏ అధినేత మన్సూరుఖాన్ సంస్థలో తాను భారీగా డిపాజిట్లు కట్టి మోసపోయినట్లు సంజన ఈడీ ముందు చెప్పినట్లు తెలిసింది. గతేడాది ఐఎంఏ సంస్థ బోర్డు తిప్పేయడంతో వేలాది మంది డిపాజిటర్లు మోసపోయిన సంగతి తెలిసిందే. అధిక వడ్డీలు ఇస్తారని స్నేహితుల మాట విని లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు సంజన తెలిపారు. ముగిసిన వీరేన్‌ఖన్నా విచారణ డ్రగ్స్ కేసులో ముఖ్య నిందితుడు వీరేన్‌ఖన్నా పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. అతని నుంచి సీసీబీ పోలీసులు అనేక విషయాలను సేకరించారు. 2018లో బాణసవాడి పోలీసులు ప్రతీక్ శెట్టిని అరెస్ట్ చేసిన సమయంలో వీరేన్‌ఖన్నా తెరపైకి వచ్చినట్లు తెలిసింది. ఖన్నాను 14 రోజుల పాటు కస్టడీలో ప్రశ్నించి డ్రగ్స్ రాకెట్లో కీలక అంశాలను సేకరించారు. తను పార్టీలను మాత్రమే నిర్వహించేవాడిని, డ్రగ్స్‌తో సంబంధం లేదని తెలిపాడు. రాగిణి, సంజన, రవిశంకర్ల ముఖం కూడా తాను చూడలేదని చెప్పాడు. విచారణ తరువాత జడ్జి ముందు హాజరుపరిచి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. -
డ్రగ్స్ కేసు: ఆ ఇద్దరి ఫోన్లలో నీలి ఫోటోలు, వీడియోలు!
యశవంతపుర: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు రోజురోజుకో మలుపు తిరుగుతోంది. విచారణలో తవ్వేకొద్దీ కొత్త నిజాలు బయటపడుతున్నాయి. ఈ బాగోతంలో అరెస్టయి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల మొబైల్ఫోన్ల నుంచి సీసీబీ అధికారులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ఇద్దరి మొబైల్ఫోన్లలో సెక్స్ రాకెట్ బయటపడినట్లు సీసీబీ వర్గాల కథనం. వారి మొబైళ్లలో నీలి వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు కొందరు సీసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతో డ్రగ్స్ కథలో మరో మరో దందా వెలుగుచూసినట్లయింది. నీలి స్కాంతో సంబంధమున్నవారందరికీ నోటీసులిచ్చి విచారణ చేయాలని నిర్ణయించారు. ఇద్దరి మొబైల్ ఫోన్లలో నీలి దందా కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఉందని, డ్రగ్స్ కేసు బయటపడగానే ఆ గ్రూపును డిలిట్ చేశారని సీసీబీ కథనం. మరో ఇద్దరు అరెస్ట్ మత్తు బాగోతంలో మంగళూరు పోలీసులు ఇద్దరు నిందితులను బెంగళూరులో అరెస్ట్ చేశారు. కెంగేరికి చెందిన ఒకరు, నైజీరియాకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి మంగళూరుకు తరలించారు. మంగళూరుకు చెందిన సీసీబీ బృందం వీరిని పట్టుకొంది. వీరు ముంబై, గోవాల నుంచి డ్రగ్స్‌ను తెచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లు వెల్లడైంది. పోలీసుల అదుపులో ఉన్న డ్యాన్సర్ కిశోర్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. (3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?) మరికొందరి విచారణ పరప్పన అగ్రహార జైల్లో ఉన్న నటి రాగిణి, సంజనలు ఇచ్చిన సమాచారం అధారంగా సీసీబీ పోలీసులు మూడు రోజుల నుండి కొందరిని ఆఫీసుకు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. రాగిణి సన్నిహితులిద్దరిని చామరాజపేటలోని సీసీబీ ఆఫీసులో విచారించారు. వీరిద్దరూ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. మాఫియా డాన్‌తో సంబంధాలున్న ఒక యువకున్ని సీసీబీ అదుపులోకి తీసుకొని విచారించింది. ఇటీవల సస్పెండయిన ఒక ఏసీపీతో ఇతనికి సంబంధాలున్నట్లు తెలిసింది. -
డ్రగ్స్ కేసులో కన్నడ హీరోయిన్లకు షాక్
బెంగుళూరు: సినీ హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదిలకు ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షాక్ ఇచ్చింది. శాండిల్‌వుడ్ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వీరిద్దరు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా స్పెషల్‌కోర్టు వీరి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక వేరు వేరు ప్రాంతాల నుంచి డ్రగ్స్ సేకరించి వాటిని ఫైవ్ స్టార్ హోటలల్లో, క్లబ్స్‌లో, పబ్‌లలో సంజన టీం అమ్మేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మొదట తయారు చేసిన ఎఫ్ఐఆర్లో సంజనా పేరు లేదని ఆమె తరుపు న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు. కేవలం డ్రగ్స్ అమ్మే వారి పేర్లనే రిపోర్టులో ఉంచారని తెలిపారు. ఇక రాగిని ద్వివేదిని రిమాండ్‌లోకి తీసుకొని 24 రోజులు అవుతుండగా ఇప్పుడు ఆమె తరుపు న్యాయవాది కల్యాణ్‌కుమార్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఇక మరోవైపు కర్ణాటకలో డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమనే కాకుండా, బుల్లితెరను కూడా తాకింది. కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి, విచారించారు. సీసీబీ పోలీసుల విచారణలో మరికొంత మంది సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో కన్నడ సినీ పరిశ్రమలో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. ఇక బాలీవుడ్‌లోనూ సుశాంత్ మరణానంతరం డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే లాంటి ప్రముఖ కథనాయకుల పేర్లే కాకుండా ఇంకా మరికొంత మంది పేర్లు ఆ డ్రగ్స్ కేసు వ్యవహారంలో బయటకు వస్తున్నాయి. చదవండి: రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే -
రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే
సాక్షి, కర్ణాటక: డ్రగ్స్ కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార జైలులో రిమాండులోనున్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల బెయిల్ పిటిషన్ల విచారణను బెంగళూరు ఎస్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది. ఇద్దరికీ బెయిల్‌పై సీసీబీ న్యాయవాది అభ్యంతరాలు తెలిపారు. రాగిణి బెయిల్ అర్జీపై 12 పేజీల అభ్యంతరాలలో ఎన్నో అంశాలను కోర్టుకు వివరించారు. నిందితులు బలమైనవారు విచారణకు ఆటంకాలు ఎదురవుతాయి, కాబట్టి బెయిల్ ఇవ్వరాదు, రాగిణి ఐదేళ్ల నుంచి బెంగళూరుతో పాటు వివిధ నగరాలలో జరిగిన డ్రగ్స్ పాలలో పాల్గొన్నారు. ఆంధ్ర, గోవా, ముంబైతో పాటు విదేశాల నుంచి డ్రగ్స్‌ను కోనుగోలు చేశారు. ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేసినప్పుడు సాక్ష్యాలను నాశనం చేశారు అని అందులో ఆరోపించారు. హోటళ్లు, రిసార్టులకు నోటీసులు శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పార్టీలు నిర్వహించిన హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్స్‌లకు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని అనేక ప్రతిష్టాత్మక హోటల్స్‌లో అర్ధరాత్రి వరకు నటి రాగిణి ద్వివేది, సంజన గల్రాని, ముఖ్య నిందితుడు వీరేన్ ఖన్నాలు నిర్వహించినట్లు సీసీబీ గుర్తించారు. ఆ విందు వినోదాల సీసీ కెమెరాల చిత్రాలను తమకు అందజేయాలని హోటళ్లను పబ్‌లను కోరారు. సీసీబీ అరెస్ట్ చేసిన పలువురు నిందితులు ఏయే హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్‌లలో మజా చేసిందీ వెల్లడించారు. (డ్రగ్స్ కేసు: సీసీబీ ఎదుట గ్లామర్‌జంట) కింగ్‌పిన్ శివప్రసాద్ ఎక్కడ డ్రగ్స్ బాగోతంలో ప్రధాన నిందితుడు, ఎ1గా ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్న శివప్రసాద్ కోసం సీసీబీ గాలిస్తోంది. ఇతని గురించి ఆసక్తికరమైన విషయాలను సీసీబీ సేకరించింది. రాగిణికి చాలా సన్నిహితుడు. అతడు దొరికితే కేసు మిస్టరీ అంతా వీడిపోతుందని సీసీబీ పోలీసులు భావిస్తున్నారు. విచారణ బాగా లేదు: లంకేశ్ కాగా, డ్రగ్స్ కేసు విచారణ తూతూ మంత్రంగా జరుగుతోందని దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ అన్నారు. ఈ బాగోతంలో నటీమణులేకాదు. నటులు, రాజకీయనాయకుల పుత్రులు ఉన్నారు. కేసును సీబీఐకీ అప్పగించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస సుబ్రమణ్యన్ విచారణ బెంగళూరులో పార్టీలు నిర్వహిస్తున్న శ్రీనివాస సుబ్రమణ్యన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సంతోష్, వైభవ్ జైన్‌లతో కలిసి పార్టీలు చేసుకున్న ఫోటోలను అందజేశాడు. ఇక ఒక నటి అన్నా తమ్ముళ్లు, సంగీత దర్శకులను సీసీబీ విచారణకు పిలవనుంది. -
డ్రగ్స్ కేసు: తెరపైకి ప్రముఖుల పేర్లు..
యశవంతపుర: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల బెయిల్ పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు ఆవరణలోని 33వ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు శనివారం విచారించింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాల నమోదుకు రెండురోజులు గడువు కోరడంతో జడ్జి విచారణను 21వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు. దీంతో నటీమణులకు నిరాశ ఎదురైంది. డ్రగ్స్ విక్రేతలతో నటులకు లింక్ ఉందని, బెయిలును మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీసీబీ తరఫు న్యాయవాది వాదించారు. రాగిణి, సంజనల సన్నిహితులు రవిశంకర్, రాహుల్‌తో పాటు మరో ఇద్దరి బెయిల్ పిటిషన్లు కూడా సోమవారం కోర్టు ముందుకు వస్తాయి. సీసీబీ విచారణకు ఆ ముగ్గురు డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్, నటుడు అకుల్ బాలాజీ, నటుడు సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే దేవరాజ్ కొడుకు యువరాజ్లు శనివారం సీసీబీ విచారణకు హాజరయ్యారు. వీరు సీసీబీ ఆఫీసులోకి వస్తుండగానే మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు డ్రగ్స్ పార్టీలలో పాల్గొని మత్తు పదార్థాలను సేవిస్తున్నారా, పార్టీల నిర్వాహకులు ఎవరు, డ్రగ్స్‌ను ఎవరు సప్లై చేసేవారు తదితర కోణాల్లో ప్రశ్నించారు. ఎన్ని ఏళ్లు నుంచి డ్రగ్స్ పారీ్టలకు వెళ్తున్నారు అని ప్రశ్నించారు. ఎక్కడెక్కడ పారీ్టలను ఏర్పాటు చేసేవారో ఆరా తీశారు. యాంకర్ అకుల్ బాలాజీకి ముఖ్య నిందితుడు వీరేన్ ఖన్నా ఎన్నేళ్ల నుంచి పరిచయం. మీ ఫాం హౌస్‌ను ఎన్నికాలం వరకు లీజుకు ఇచ్చారు అని అకుల్‌ను ప్రశ్నించారు. ప్రముఖులతో జాబితా డ్రగ్స్ కేసులో పెద్ద పెద్ద అధికారుల పుత్రులు, స్టార్ నటులు, ప్రైవేట్ టీవీ చానల్స్‌కు చెందిన యాంకర్ల పేరు బయటకు వస్తున్నాయి. వీరేన్‌ఖన్నా తనకు పరిచయమైన వారందరి పేర్లను సీసీబీకి వివరించినట్లు తెలిసింది. విలాసంతమైన హోటల్స్, పబ్, అపార్ట్మెంట్లలో జరిగే విందు వినోదాల్లో పోలీసు అధికారు, యాంకర్లు, రాజకీయ నాయకుల తనయులు పాల్గొనేవారి జాబితాను సీసీబీ సిద్ధం చేసింది. వారికి కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్‌పంత్ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. -
డ్రగ్స్ కేసు.. హీరోయిన్లకు షాక్
బెంగళూరు: శాండల్‌వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు శనివారం బెయిల్ మీద బయటకు వస్తామని భావిస్తుండగా.. వారి ఆశ కాస్త నిరాశ అయ్యింది. వీరికి సంబంధించిన బెయిల్ విచారణ ఈ రోజు జరగాల్సి ఉండగా అది కాస్తా సెప్టెంబర్ 21 కి వాయిదా పడింది. సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) అధికారులు తమ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని కనుక బెయిల్ పిటిషన్ విచారణని వాయిదా వేయాలని కోరారు. వారి అభ్యర్థన మేరకు బెంగళూరులోని ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) ప్రత్యేక కోర్టు రాగిణి, సంజనా బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే సోమవారానికి(సెప్టెంబర్ 21) వాయిదా వేసింది. రాగిణి, సంజనలు ఇద్దరికి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని.. వారు పార్టీలలో మాదకద్రవ్యాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లకు, పెడ్లర్లకు మధ్య జరిగిన మెసేజ్‌లను కూడా రిమాండ్ కాపీలో పొందు పర్చారు అధికారులు. (చదవండి: డ్రగ్స్‌కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు?) డ్రగ్స్ రాకెట్ కేసుకు సంబంధించి సీసీబీ రాగిణి ద్వివేదిని సెప్టెంబర్ 4 న అరెస్ట్ చేయగా.. సెప్టెంబర్ 8 న సంజన గల్రానిని అరెస్టు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పరపన అగ్రహార జైలులో ప్రత్యేక సెల్లో ఉన్నారు. శాండల్‌వుడ్ డ్రగ్ రాకెట్‌కు సంబంధించి ఇప్పటికే 10 మందికి పైగా అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల సెలబ్రిటీ జంట ఐంద్రితా రే, దిగంత్‌లను సీసీబీ విచారణకు పిలిచింది. ఒక రోజు ప్రశ్నించమే కాక వారి గాడ్జెట్లను స్వాధీనం చేసుకుని తరువాత పంపించింది. ఈ రోజు నటులు అకుల్ బాలాజీ, సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు యువరాజ్‌లను సీసీబీ విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. -
సెంట్రల్ జైలుకు నటి రాగిణి
సాక్షి, బెంగళూరు : శాండల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. మరో నటి సంజన గల్రాని, రాహుల్, ప్రశాంత్ రంకా, లూమ్ పెప్పర్, నియాజ్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టులో హాజరు పరిచారు. సంజనకు మినహా మిగతా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. నటి సంజనకు 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు. సంజనను మరింతగా ప్రశ్నించాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించినట్లు సీసీబీ పోలీసులు తెలిపారు. బెయిల్ కష్టం రాగిణితో పాటు 14 మంది నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపిఎస్) చట్టం కింద కేసులు నమోదు చేయడంతో ఇప్పట్లో బెయిల్ దొరకటం కష్టమని తెలిసింది. మరో నటి సంజనను విచారణకు సహకరించటంలేదని సీసీబీ పేర్కొనగా, మరో 2 రోజుల పాటు వారి కస్టడీకి అనుమతించడంతో మంగళ, బుధవారాలు ప్రశ్నించనున్నారు. అంతకుముందు నిందితులకు కేసీ జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ టెస్టులను, ఇతర వైద్య పరీక్షలను చేయించారు. రాగిణి, సంజనలకు కరోనా నెగిటివ్‌గా వచ్చింది. ప్రముఖులతో నిందితుడు డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ బీబీఎంపీ కార్పొరేటర్ కేశవమూర్తి కొడుకు యశస్ కోసం ఎన్సీబీ పోలీసులు ముంబై నుంచి బెంగళూరుకు వచ్చి గాలిస్తున్నారు. ఈ నెల 7న విచారణకు పిలవగా ఒకసారి వచ్చి వెళ్లాడు. తరువాత విచారణకు పిలవగా అదృశ్యమయ్యాడు. త్వరలో వీఐపీలకు నోటీసులు? రాగిణి, సంజన, ఇతర నిందితులు విచారణలో వెల్లడించిన సమాచారం ప్రకారం సీసీబీ పోలీసులు అనుమానితుల జాబితాను రూపొందించారు. ఇందులో నటులతో పాటు రాజకీయ నేతల పుత్రులు, ప్రముఖ కుటుంబాల వ్యక్తులూ ఉన్నట్లు తెలిసింది. విచారణకు రావాలని వారికి నోటీసులు పంపనున్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేల సన్నిహితులు, వ్యాపారవేత్తల పుత్రులు కూడా జాబితాలో ఉన్నారు. అనేకమంది ప్రముఖులు తాము నిర్వహించే డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనేవారని రాగిణి, సంజనలు విచారణలో వెల్లడించారు. నేను దొంగ అవుతానా: జమీర్ డ్రగ్స్ కేసులో తనను ఇరికించి రాజకీయంగా అంతం చేయడానికి కుట్ర జరుగుతోందేమోనని కాంగ్రెస్ మాజీ మంత్రి, చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్‌ఖాన్ ఆరోపించారు. ఆయన సోమవారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. నిందితుడు ఫాజల్‌తో నాకు పరిచయం లేదు. ఒక దొంగ నాతో కలిసి ఫోటో తీయించుకుంటే నేను దొంగను ఎలా అవుతానని ప్రశ్నించారు. వీఐపీలతో రాహుల్ చెట్టాపట్టాల్ డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన డ్రగ్స్ డీలర్ రాహుల్‌తో రెవెన్యూశాఖ మంత్రి ఆర్.ఆశోక్, నిర్మాత కె.మంజు కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. నటి సంజనకు అత్యంత సన్నిహితుడైన రాహుల్ సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులతో స్వీట్లు తింటూ దిగిన ఫోటోలు కలకలం సృష్టిస్తున్నాయి. నటుడు ఉపేంద్ర, క్రికెటర్ శ్రీశాంత్, శ్రీనగర కిట్టి, రఘు ముఖర్జీ, సంగీత దర్శకుడు గురుకిరణ్, నటీ ఐంద్రితా రై, ప్రియాంక, హర్షికా పూణచ్చ, ఒక రిటైర్డ్ ఐజీలతో కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. వీరితో ఇతనికి గల సంబంధాలు ఎలాంటివన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
డేటా మొత్తం డిలీట్ చేసిన సంజనా, రాగిణి
బెంగళూరు : డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన శాండల్‌వుడ్ అందాల తారామణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానిల మొబైల్‌ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలను సీసీబీ పోలీసులు సేకరించారు. ఇందులో డ్రగ్స్ దందాతో అనేక మంది ప్రముఖులకు లింకులు ఉన్నట్లు సీసీబీ గుర్తించింది. డ్రగ్స్ కేసు బయటపడగానే రాగిణి, సంజనలు వారి మొబైల్ ఫోన్లోని డేటాను మొత్తం డిలీట్ చేశారు. అందులో పార్టీల నిర్వహణ, డ్రగ్స్‌తో మజా చేస్తున్న వ్యక్తుల ఫోటోలు, కాల్ రికార్డ్స్ ఉన్నాయి. వారు జరిపే పార్టీల్లోకి డ్రగ్స్ తీసుకొనేవారిని మాత్రమే లోనికి అనుమతించేవారని సీసీబీ పోలీసులు చెబుతున్నారు. నిందితులు పార్టీల్లో కాకుండా, నివాసం ఉండే అపార్టుమెంట్లలో వాడే డ్రగ్స్ వేరేగా ఉండేవని తెలిసింది. దీంతో వారి ఫ్లాట్లలో మళ్లీ సోదాలు జరిపే అవకాశం ఏర్పడింది. మళ్లీ కస్టడీ కోరతారా? సోమవారం సాయంత్రంతో రాగిణి, సంజనల పోలీసు కస్టడీ ముగియనుంది. దీంతో వారిని కోర్టులో హాజరుపరుస్తారు. పోలీసులు మరింత కాలం కస్టడీ కోరతారా?, లేదా జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. వారిద్దరూ బెయిలు అర్జీలు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రాగిణిని మూడుసార్లు, సంజనను రెండుసార్లు కస్టడీకీ తీసుకుని ప్రశ్నించారు. ఇద్దరూ మహిళా సాంత్వన కేంద్రంలో ఎంతో దిగులుగా ఉంటున్నారు. ( సంజన ఫ్లాట్స్‌కు నటులు, సంగీత దర్శకులు ) సంజనపై డ్రగ్స్ సప్లై కేసు నటి సంజన గల్రానిపై డ్రగ్స్ సేవించడంతో పాటు డ్రగ్స్ సరఫరా చేసినట్లు కూడా పోలీసులు నమోదు చేశారు. సంజన తన వ్యాపార లావాదేవీలను ఎక్కువగా ఒకే సముదాయం చెందిన వ్యక్తులకు అప్పగించటంపై కూడా సీసీబీ దృష్టి సారించింది. సీసీబీకీ పూర్తి అధికారం: హోంమంత్రి డ్రగ్స్ కేసు దర్యాప్తుకు సీసీబీకి పూర్తి అధికారం అప్పగించిన్నట్లు హోంమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. అయన ఆదివారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. సీసీబీకి సిబ్బంది కొరతను నివారించి వసతులను కల్పిస్తామని చెప్పారు. డ్రగ్స్‌తో యువత జీవనం నాశనం కాకూడదన్నారు. ఎమ్మెల్యే జమీర్‌కు నోటీసు? డ్రగ్స్ దందా కేసులో చామరాజపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్‌కు నోటీసులు ఇవ్వాలని సీసీబీ నిర్ణయించింది. జమీర్ అహ్మద్, నటి సంజనలు శ్రీలంకలో క్యాసినోలో పాల్గొన్నట్లు సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి ఆరోపించటం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సంబరగి నుంచి సీసీబీ సమాచారాన్ని సేకరించింది. జమీర్ అహ్మద్‌ను కూడా ప్రశ్నించవచ్చని తెలిసింది. ( డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం ) కొలంబో క్యాసినోకు తారల ప్రచారం శ్రీలంకలో క్యాసినో జూదాల్లో పాల్గొనడం గురించి నటీనటులు బహిరంగ ప్రచారం చేసిన వ్యాపార ప్రకటనలు బయటపడుతున్నాయి. క్యాసినోకు మేం వెళ్లాం, మీరూ వెళ్లండి అని ఐంద్రితారై, కాజల్, బిపాసా బసు, ఊర్వశి రౌటేలా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోను సూద్ తదితర అనేకమంది నటీనటులు పాల్గొన్న ప్రకటన అది. ఈ పార్టీని ఏర్పాటు చేసిన షేక్ ఫాసీల్‌కు వీరు ధన్యావాదాలు చెప్పడం గమనార్హం. వివిధ బాషలకు చెందిన నటీనటులను డ్రగ్స్ నిందితులు కావలసిన నజరానాలు ఇచ్చి క్యాసినోకు తీసుకెళ్లినట్లు సీసీబీకీ బలమైన సాక్ష్యాధారాలు దొరికాయి. దీంతో మరికొందరు నటీనటులకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. -
డ్రగ్స్ కేసు: రాగిణి ద్వివేదీ చీటింగ్
బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో నటి సంజన గల్రానీతో పాటు ఆమె తల్లి, మరో నటి రాగిణి ద్వివేదీలు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ వారిని అరెస్టు చేసి విచారిస్తున్న నేపథ్యంలో ఇవాళ(శనివారం) వీరిని పరీక్షల నిమిత్తం బెంగళూరులోని కేపీ జనరల్ ఆసుపత్రికి పంపారు. ఈ క్రమంలో డోప్ టెస్టు కోసం ఇచ్చిన యూరిన్ శాంపిల్‌లో తన గుట్టు రట్టు కాకుండా ఉండేదుందుకు రాగిణి నీరు కలిపినట్లు తెలుస్తోంది. తన యూరిన్ శాంపిల్స్‌లో నీరు కలిసినట్లు డాక్టర్లు గుర్తించారు. (చదవండి: నటి రాగిణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు) దీంతో రాగిణి నుంచి మరోసారి వైద్యులు శాంపిల్స్ తీసుకున్నట్లు సమాచారం. అయితే మరోవైపు సుశాంత్ మృతి కేసులో బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కూడా వెలుగు చూసిన క్రమంలో కన్నడ పరిశ్రమలో కూడా ఈ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. దీనిపై ఇటీవల కన్నడ చిత్రనిర్మాత, జర్నలిస్ట్ ఇంద్రజిత్ లంకేష్ మాదకద్రవ్యాల గురించి బెంగళూరు సీసీబీకి ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. అంతేగాక ఇండస్ట్రీలో కనీసం 15 మంది ఈ డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం) -
డ్రగ్స్ కేసు; బయటపడిన కొత్త విషయం
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసులో అరెస్టయిన బహుభాషా నటి సంజన గల్రానికి పెళ్లయిందా, లేదా? అని సీసీబీ పోలీసులు విచారించగా కొత్త విషయం బయటపడింది. తనకు పెళ్లికాలేదని అరెస్ట్ చేసినపుడు మంగళవారం పోలీసులకు సంజన చెప్పారు. అయితే ఏడాది క్రితం ఆమె పెళ్లి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విచారణలో ఆ ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు. అజీజ్ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అతడు బెంగళూరులో ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. పోలీసులు సాక్ష్యాలన్నీ చూపడంతో సంజన పెళ్లయిందని ఒప్పుకోక తప్పలేదు. మత్తు గుట్టురట్టు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసులో సీసీబీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేసులో అరెస్టయిన నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానిలను వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. వారి సన్నిహితులు, మిగతా నిందితులు ముఖ్య సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ను డెబిట్, క్రెడిట్, బిట్ కాయిన్ల ద్వారా కొనుగోలు చేసినట్లు సీసీబీ పోలీసులు ఆధారాలను సేకరించారు. డార్క్ వెబ్‌లో డ్రగ్స్ ముఠాలు, ఆఫ్రికన్ల నుంచి కొనుగోలు చేసేవారని తెలిసింది. (ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన) మరికొందరు నటీమణులు? కొందరు నటీమణులు డ్రగ్స్ పార్టీలలో పాల్గొనేవారని సీసీబీ విచారణలో బయటపడింది. రవిశంకర్, రాహుల్, వీరేన్ఖన్నాలు ముగ్గురూ విచారణలో రాగిణి, సంజనల పేర్లు చెప్పినట్లు తెలిసింది. మరికొందరు నటీమణులకు కూడా డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్లు నిందితులు తెలిపారు. నటి సంజనా గతంలో కారు నడుపుతూ సెల్ఫీ తీసుకుంటున్న వీడియో సీసీబీ పోలీసులకు చిక్కింది. డ్రగ్స్ కేసులో 13వ నిందితుడు నియాస్ అహమ్మద్ కారులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులు బెయిలు కోసం ప్రయత్నాలు చేస్తుండగా సీసీబీ పోలీసులు మరింతకాలం విచారించాల్సి ఉన్నందుకు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరికీ విడి విడి గదులు డ్రగ్స్ కేసులో మహిళా సాంత్వన కేంద్రంలో ఉంటున్న రాగిణి, సంజనా గల్రానీలకు ప్రత్యేక గదులను కేటాయించారు. ఐదు పడకలు ఉన్న హాల్‌ను ఇద్దరికీ ఉమ్మడిగా ఇవ్వగా, ప్రత్యేక గదులు కావాలని పట్టుబట్టారు. వారిద్దరి మధ్య విభేదాలున్నందున ప్రత్యేక గదులను కేటాయించి భద్రతను పెంచారు. ల్యాబ్‌కు ఇద్దరి మొబైళ్లు సీసీబీ పోలీసులు రాగిణి, సంజనాల మొబైల్ఫోన్ల నుంచి వాట్సాప్, అవుట్ గోయింగ్ కాల్ డేటాను సేకరిస్తున్నారు. సుమారు 100 మందితో వీరు నిత్యం ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. అరెస్ట్ చేస్తారని తెలియడంతోనే వీరు మొబైళ్లలోని సమాచారాన్ని తొలగించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వారి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి సమాచార పునరుద్ధరణ చేస్తున్నారు. రాగిణికి అస్వస్థత రాగిణి తల తిరుగుతున్నట్లు, ఊపిరి ఆడడం లేదని చెప్పడంతో ఆమెను కేసీ జనరల్ ఆస్పత్రికీ తీసుకెళ్లి పరీక్షలు చేయించగా లో బీపీతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లు బయట పడింది. రక్తపరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పగా రాగిణి వ్యతిరేకించారు. కోర్టు ఆదేశాల మేరకు రక్త పరీక్షలను నిర్వహిస్తున్నట్లు సీఐ అంజుమాల చెప్పగా, సరేనన్నారు. -
ఇదంతా నా కర్మ : బోరున ఏడ్చిన సంజన
బెంగళూరు : డ్రగ్స్ కేసులో అరెస్టయిన శాండల్‌వుడ్ నటీమణి సంజనా గల్రానిని బుధవారం 10 గంటల సమయంలో సీసీబీ పోలీసులు మడివాళ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయానికి తీసుకురాగా, మహిళా సీఐ అంజుమాల బృందం సంజనాను విచారించారు. మహిళా సాంత్వన కేంద్రంలో రాగిణి ద్వివేదిని మహిళా సీఐ కాత్యాయని ప్రశ్నించారు. నిందితుడు రాహుల్ ఇచ్చిన సమాచారంతో పాటు వివిధ కోణాల ద్వారా సేకరించిన వివరాలపై సంజనాను విచారించారు. 34 మంది పెద్ద పెద్ద వ్యక్తుల పుత్రుల పేర్లను సంజనా సీసీబీకి వెల్లడించిన్నట్లు సమాచారం. ఆమె చెబుతున్నదాంట్లో నిజమెంతో తెలుసుకొంటున్నారు. బెంగళూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో పాటు సినిమా, బుల్లితెర, వ్యాపారవేత్తల పుత్రులున్నట్లు తెలిసింది. మంగళూరు, యలహంక, కమ్మనహళ్లిలో జరిగిన హై–ఫై పార్టీలలో ఎవరెవరు పాల్గొన్నారనేది ఆరా తీస్తున్నారు. సంజనా, రాగిణి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. ఇతర నిందితులు వీరేన్ ఖన్నా, రాహుల్ నిర్వహించిన పార్టీలలో రాజకీయ, వ్యాపార, సినిమా రంగాల బడాబాబులు పాల్గొనేవారని సంజనా తెలిపింది. తను తప్పు చేశానని సంజన ఆవేదన చెందినట్లు సమాచారం. తనను మీడియా ముందు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సంజన పట్టుబట్టగా అధికారులు ఒప్పుకోలేదు. ( ఫోన్లో మెసేజ్‌లను తొలగించిన నటి ) సంజన కంట నీరు నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రాని కేసుల గొడవతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. బెంగళూరు డైరీ సర్కిల్లోని మహిళా సాంత్వన కేంద్రంలో వీరిద్దరినీ ఉంచారు. మంగళవారం రాత్రి వీరికి ఐదు బెడ్లు ఉన్న ఒకే గదిని కేటాయించారు. ఇద్దరి మధ్య మాటలు లేకుండా గడిపారు. ఆ చివర, ఈ చివర బెడ్లను ఇద్దరికీ కేటాయించగా, మధ్యలో మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. తనకు రాత్రి భోజనం వద్దని చెప్పిన సంజనా ఇదంతా నా కర్మ అంటూ బోరున విలపించినట్లు తెలిసింది. రాగిణి, సంజనకు కేపీఎల్‌లో విభేదాలు వచ్చాయి. అప్పటినుంచి మాటలు లేవు. మహిళలే దొరికారా? డ్రగ్స్ దందాలో రాగిణి, సంజనా పేర్లను మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారని మరో నటీమణి పారూల్ యాదవ్ ఆక్రోశించారు. వారికి మద్దతుగా ఆమె గళమెత్తారు. దేశంలో డ్రగ్స్‌ను సేవిస్తున్నదీ, అమ్ముతున్నదీ ముగ్గురు (రియా చక్రవర్తి, రాగిణి, సంజనా) మాత్రమేనా, ఇంక ఎవరూ ఈ దందాలో లేరా? అని ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ సిబ్బంది, క్రీడాకారులు, నటులు డ్రగ్స్ వ్యవహారంలో లేరా? అని ఆమె సోషల్ మీడియాలో భగ్గుమన్నారు. -
ఫోన్లో మెసేజ్‌లను తొలగించిన నటి
బెంగళూరు: డ్రగ్స్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాగిణి ద్వివేదిని మరో ఐదురోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ స్థానిక కోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ వాడకంపై బెంగళూరు పోలీసులకు చెందిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. రాగిణితో సహా ఆరుగురిని అరెస్టు చేసిన సీసీబీ మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసింది. శుక్రవారం అరెస్టయిన రాగిణి విచారణకు సహకరించడం లేదని పోలీసువర్గాలు వెల్లడించాయి. అందుకే మరో ఐదురోజుల కస్టడీ కోరాల్సి వచ్చిందని వివరించాయి. ఆధారాలు దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో రాగిణి తన మొబైల్ ఫోన్లోని అన్ని మెసేజ్‌లను తొలగించింది. అయితే సీసీబీ ఈ డాటాను తిరిగి పొందింది. కాగా ఇదే కేసులో నిందితుడైన ఆదిత్య అల్వా (మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు) కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదిత్య ముంబైలో తలదాచుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. కొనసాగుతున్న విచారణ శాండల్‌వుడ్ డ్రగ్స్ స్కాంలో సీసీబీ అదుపులో ఉన్న నటి రాగిణి ద్వివేదిని మూడోరోజు సోమవారం కూడా విచారించారు. నిందితులు ప్రశాంత్ రంకా, రాహుల్, లూమ్ పెప్పర్, రవిశంకర్‌లను సీసీబీ పోలీసులు అదివారం అర్ధరాత్రి వరకు విచారించి ముఖ్య సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. రాగిణి, రవిశంకర్, వీరేన్ ఖన్నాల కస్టడీ ముగియంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు ఎసీఎంఎం 1వ కోర్టు జడ్జి ముందు హాజర్ పరిచి మళ్లీ ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. రాగిణి అలర్జీ, వెన్నునొప్పి ఉన్నాయని చెప్పడంతో ఆమెకు మహిళా సంరక్షణ కేంద్రంలో చికిత్స చేయించారు. అనారోగ్యం పేరుతో విచారణకు సహకరించడం లేదని పోలీసులు జడ్జికి ఫిర్యాదు చేశారు. రాగిణి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ఆమె ఎక్కడెక్కడకు ప్రయాణించిందో విచారిస్తున్నారు. (8 గంటలు ప్రశ్నల వర్షం) విందు, వినోదాలపై దృష్టి తాజా విచారణలో రాగిణి మిత్రబృందం ఎక్కడెక్కడ పార్టీలను జరిపేవారు, ఎవరెవరు పాల్గొనేవారు తదితర అంశాలను సేకరించారు. నిందితులు– పార్టీ నిర్వాహకుల మధ్య నడిచిన ఫోన్ చాటింగ్‌లను సేకరించారు. కొన్ని సందేశాలు ఆఫ్రికన్ భాషలో ఉన్నట్లు ప్రధాన నిందితుడు లూమ్ పెప్పర్ నాటకం ఆడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. రాగిని సన్నిహితుడు, ఆర్టీఓ ఉద్యోగి రవిశంకర్ మొబైల్‌కు వచ్చిన ఇంగ్లిష్ సందేశాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. వీరు నిర్వహించే విందు వినోదాల్లో పాల్గొని డ్రగ్స్ సేవించేవారిలో కాలేజీ విద్యార్థులు, టెక్కీలు ఉన్నట్లు గుర్తించారు. మహదేవపురకు చెందిన ఒక టెక్కీతో నిత్యం సంప్రదించినట్లు గుర్తించారు. కార్పొరేటర్ ఇంట్లో సోదాలు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలపై బీబీఎంపీ కార్పొరేటర్ కేశవమూర్తి కొడుకు యశస్కు ఎన్సీబీ అధికారులు విచారణకు రావాలని నోటీసులు పంపినా రాలేదు. దీంతో అధికారులు కార్పొరేటర్ ఇంటికి ఆదివారం సాయంత్రం వెళ్లి సోదాలు చేశారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. యశస్‌ను అక్కడే విచారించినట్లు సమాచారం. నిష్పాక్షపాతంగా విచారణ: హోంమంత్రి డ్రగ్స్ దందా కేసును నిష్పాక్షపాతంగా విచారించాలని హోంమంత్రి బసవరాజ్ బొమ్మై అధికారులను ఆదేశించారు. అధికారులపై ఒత్తిళ్లు లేవు, ఈ కేసుతో డ్రగ్స్ మాఫియా లేకుండా పోవాలని సోమవారం ఆర్‌టీనగరలోని తన నివాసంలో మాట్లాడుతూ అన్నారు. ఈ కేసులో ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదని చెప్పారు. డ్రగ్స్ విచారణపై ఒత్తిడి లేదు: సీపీ బనశంకరి: సోమవారం నగరపోలీస్ కమిషనర్ (సీపీ) కమల్‌పంత్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసుకు సంబందించి తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు. ఈ కేసు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని, సాక్ష్యాధారాల్ని సేకరించి నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ కేసులో నేరుగా అరెస్ట్ చేయడం సాధ్యం కాదని, ఆధారాల ప్రకారం దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆఫ్రికన్ అరెస్టు
బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు శనివారం ఈ కేసులో ఆఫ్రికా దేశం సెనెగల్ కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. లౌమ్ పెప్పర్ సాంబా అనే ఇతడు సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నటి రాగిణి ద్వివేదిని సహా మొత్తం ఆరుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద మొత్తం 12 మందిపై కేసులు నమోదయ్యాయి. రాగిణిని శుక్రవారం అరెస్టు చేయగా, జయనగర్ ఆర్టీవోలో క్లర్క్‌గా పనిచేస్తున్న రవిశంకర్, రియల్టర్ రాహుల్ షెట్టిలను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతవర్గాల పార్టీలను నిర్వహించే వీరేన్ ఖన్నాను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ డీలర్ సాంబా... రవిశంకర్‌కు, సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని సీసీబీ పోలీసులు తెలిపారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇటీవల బెంగళూరులో కొన్ని అరెస్టులు చేíసినప్పుడు... కన్నడ నటులు, సంగీతకారులతో డ్రగ్ డీలర్లకు ఉన్న సంబంధాలు వెలుగు చూశాయి. నటి రాగిణిని అరెస్టు చేయడం ప్రకంపనలు రేపింది. కొందరు బడా నేతల కుమారుల ప్రమేయం ఉండటంతో ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పోలీసుల అదుపులో నటి రాగిణి ద్వివేది
బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. డ్రగ్స్ సప్లయర్స్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) నటి రాగిణి ద్వివేది నివాసంలో శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీసీబీ అధికారులు ఆమెను శుక్రవారం వారి ముందు హాజరు కావాలని నోటీసులు పంపారు. సోమవారం అయితే తాను విచారణకు వస్తానని లాయర్ ద్వారా నటి సమాధానం ఇచ్చింది. అయితే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం ఒక్కసారిగా నటి ఇంటిపై, ఆస్తులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. సీసీబీ బృందం ఉదయం 6 గంటలకు రాగిణి ద్వివేది నివాసానికి చేరుకొని సోదాలు నిర్వహించారు. Karnataka: Kannada actress Ragini brought to Central Crime Branch (CCB) office in Bengaluru after she was detained earlier today in connection with a drug case in the state. pic.twitter.com/s4Ap8q0fBZ — ANI (@ANI) September 4, 2020 మరో టీమ్ నటి రాగిణి ద్వివేదిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. నటిని విచారించేందుకు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసుకు తమ వాహనంలో తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరోవైపు డ్రగ్స్ కేసుకు సంబంధించి కన్నడ చిత్ర పరిశ్రమలో సన్నిహితులున్న రవి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయిదు రోజుల పాటు కోర్టు అతన్ని పోలీసు కస్టడీకి పంపింది. చిత్రనిర్మాత, జర్నలిస్ట్ ఇంద్రజిత్ లంకేష్ శాండల్‌వుడ్‌లో మాదకద్రవ్యాల గురించి సీసీబీకి ఫిర్యాదు చేశాడు. ఇండస్ట్రీలో కనీసం 15 మంది డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. -
డ్రగ్స్ కేసు: నటికి నోటీసులు
బెంగళూరు: కన్నడ పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు నటి రాగిణి ద్వివేదికి సమన్లు జారీ చేశారు. నేడు రాత్రిలోగా సీసీబీ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఈ కేసులో నటి స్నేహితుడు రవిని పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నటి రాగిణికి కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలున్నట్లుగా సంకేతాలు అందడంతో ఆమెను విచారణకు ఆదేశించారు. దీని గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నేడు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. కాగా కన్నడ చిత్రపరిశ్రమలో నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఆగస్టు 20న ఎన్సీబీ(నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరి డైరీని స్వాధీనం చేసుకోగా అందులో సెలబ్రిటీలు, నటులు, మోడల్స్ లిస్టు పేర్లు రాసి ఉన్నాయి. (చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!) మరోవైపు ఈ వ్యవహారంలో పాలుపంచుకుంటున్న సెలబ్రిటీల పేర్లు వెల్లడించేందుకు సిద్ధమేనని దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ప్రకటించడం చర్చంనీయాంశంగా మారింది. దీంతో సీసీబీ అధికారులు ఆయనను పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ సందీప్ పటేల్ మాట్లాడుతూ.. లంకేశ్‌కు తాము మరోసారి అవకాశం ఇస్తామన్నారు. డ్రగ్స్ కేసులో మరిన్ని వివరాలు అందిస్తే దానికనుగుణంగా సాక్ష్యాలను సేకరిస్తామని తెలిపారు. ఇప్పటికే కొంత మంది పేర్లను కూడా ఆయన బయటపెట్టినట్లు పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని మరికొద్దిమంది నటులకు కూడా నోటీసులు అందించేందుకు సీసీబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై బుధవారం సమావేశమైన కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ కేసులో దోషులుగా తేలిన నటులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. (చదవండి: తనను వ్యభిచారిగా చిత్రీకరించి..) -
బీజేపీలో చేరిక ఆఖరిలో వాయిదా
యశవంతపుర: ప్రముఖ హీరోయిన్ రాగిణి ద్వివేది బీజేపీలో చేరిక అనూహ్యంగా వాయిదా పడింది. ఆమె ఆదివారం బీజేపీ ఎమ్మెల్యే సీఎస్ ఆశ్వర్థ నారాయణ కార్యాలయంలో బీజేపీలో చేరతారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఆమె ఈ విషయమై గత వారం బీజేపీ ముఖ్య నేతలతో చర్చించినట్లు సమాచారం. వారి నుంచి ఆమోదం వచ్చిందని, ఆమె కాషాయ కండువా వేసుకోవడమే ఆలస్యమని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద హంగామా మొదలైంది. ఇంతలో ఏమైందోకానీ సాయంత్రానికి పార్టీలో చేరిక వాయిదా పడిందని తెలిసింది. పార్టీ నాయకుడు అరవింద లింబావళి, మురళీధర్రావ్లు అందుబాటులో లేనందున వాయి పడిన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
హీరోయిన్ కోసం బాయ్‌ఫ్రెండ్స్ ఫైట్
బనశంకరి : హీరోయిన్ రాగిణి ద్వివేది కోసం ఆమె ఇద్దరు స్నేహితులు పరస్పరం దాడి చేసుకున్న ఘటన ఆదివారం వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి నగరంలోని రిట్జ్ కార్టన్ హోటల్‌కు హీరోయిన్ రాగిణి ఆర్టీఓ శాఖలో అధికారిగా పని చేస్తున్న రవి అనే వ్యక్తితో కలసి వెళ్లారు. అదే సమయంలో అదే హోటల్లో రాగిణి మాజీ స్నేహితుడు, వ్యాపారి శివప్రకాశ్ స్నేహితులతో కలసి పార్టీ చేసుకుంటున్నాడు. కాగా తమ మధ్య తలెత్తిన మనస్పర్థలతో తనను వదిలేసిందనే కారణంగా రాగిణిపై ద్వేషం పెంచుకున్న శివప్రకాశ్, రాగిణి అదే హోటల్‌కు రవితో రావడాన్ని చూసి కోపాన్ని అదుపు చేసుకోలేక రాగిణితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో రవి, శివప్రకాశ్ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఇరువురి మధ్య వాగ్వాదం శృతి మించడంతో శివప్రకాశ్ బీర్ బాటిల్‌తో రవిపై దాడి చేశాడు. గమనించిన హోటల్ సిబ్బంది ఇరువురిని విడిపించడంతో గొడవ సద్దుమణిగింది. గొడవపై రాగిణి, రవిలు అశోకనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి తనకు కనపడితే చంపేస్తానంటూ శివప్రకాశ్ బెదిరించాడంటూ రవి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్లో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి శివప్రకాశ్‌ను అరెస్ట్ చేశారు. వెలుగు చూసిన కొత్తకోణం.. కాగా హోటల్‌కు వెళ్లే సమయంలో రవి భార్య రవికి ఫోన్ చేసి రాగిణితో తిరుగుతుండడంపై గొడవ పడినట్లు తెలుస్తోంది. ‘నువ్వు రాగిణితో తిరుగుతున్నావనే విషయం నాకు తెలిసిపోయింది రాగిణి కోసం నా జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను ఏంచేసినా నీకు బుద్ధి రాదు. ఇప్పుడు రాగిణితో కలసి ఎక్కడున్నావనే విషయం కూడా తెలుసు. చూస్తుండు ఎవరో ఒకరు వచ్చి నిన్ను కసితీరా కొడతారు. నిన్ను ఊరికే వదిలేసే ప్రసక్తే లేదు. నువ్వు ఉన్న చోటుకే వచ్చి నిన్నుకొట్టి మరీ బుద్ధి చెబుతార’ంటూ రవి భార్య రవిని బెదిరించినట్లు తెలుస్తోంది. ఇది జరిగిన కొద్ది సేపటికే రవిపై హోటల్లో రాగిణి మాజీ స్నేహితుడు శివప్రకాశ్ బాటిల్‌తో దాడి చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
హీరోయిన్స్ ఇన్ యాక్షన్
మేఘనా రాజ్, రాగిణి త్రివేది, దీప్తి, సంయుక్త వర్నాడ్ ముఖ్య పాత్రల్లో మహేశ్ తెరకెక్కించిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. శ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకంపై సి. పుట్టు స్వామి నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఏ’ సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత పుట్టు స్వామి మాట్లాడుతూ – ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. హీరోయిన్లు మేఘన, రాగిణి, దీప్తి, సంయుక్తల యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ నెలాఖరున సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీధర్. వి. సంబ్రమ్. -
రియల్ దండుపాళ్యం
1980లో కర్ణాటకలో జరిగిన ఓ యథార్థ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. రాగిణీ ద్వివేది, మేఘనా రాజ్, దీప్తి, ప్రథమ ప్రసాద్, సంయుక్త హొర్నాడ్ ముఖ్య తారలుగా నారాయణ భట్ సమర్పణలో మహేశ్ దర్శకత్వంలో రూపొందింది. సి.పుట్టుస్వామి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. మహేశ్ మాట్లాడుతూ– ‘‘కన్నడలో వచ్చిన ‘దండుపాళ్యం’ చిత్రకథకు, మా ‘రియల్ దండుపాళ్యం’ కథకు ఏమాత్రం సంబంధం లేదు. శ్రీధర్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్ట పరంగా ఎదురైన సమస్య ను ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే కథ. ఈ నెలాఖరున విడుదల చేయనున్నాం’’ అన్నారు పుట్టుస్వామి. -
షూటింగ్లో నటి రాగిణి ద్వివేదికి గాయాలు
బొమ్మనహళ్లి : సినిమా షూటింగ్ సమయంలో ఓ ఫైటింగ్ సన్నివేశంలో నటి రాగిణి ద్వివేది స్వల్పంగా గాయపడింది. దీంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాలు... ముస్సంజె మహేష్ దర్శకత్వంలో ఎం.ఎస్.సి.హెచ్ అనే కన్నడ సినిమాలో నటి రాగిణి నటిస్తోంది. ఈ సినిమాలో రాగిణి పోలీసు అధికారి పాత్ర పోషిస్తోంది. ఇక్కడి మినర్వమిల్‌లో షూటింగ్ జరుగుతుండగా ఓ ఫైటింగ్ సన్నివేశంలో సహాయ నటుడు చేయి తగిలి రాగిణి చెవికి గట్టిగా తగలడంతో ఆమె చెవి నుంచి రక్తం కారింది. హుటాహుటిన ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు. -
అమ్మ మరణంతో మరోసారి రీ షూట్
కన్నడ నటి రాగిణీ ద్వివేది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం అమ్మ. ఈ సినిమా జయలలిత జీవితకథ ఆదారంగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని అంగీకరించకపోయినా.. లీడ్ యాక్ట్రస్ రాగిణీ మాత్రం ఇది అమ్మ జీవిత చరిత్రే.. తను అమ్మ పాత్రలోనే నటిస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటోంది. కన్నడ వివాదాస్పద దర్శకుడు ఫైసల్ సైఫ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జయ మరణం తరువాత రీ షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారట. గతంలోనూ జయ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సమయంలో అమ్మ సినిమాను రీషూట్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆమె మరణం తరువాత రీషూట్‌కు వెళుతుండటంతో ఇది నిజంగానే జయలలిత బయోపిక్ అన్న వాదనకు బలం చేకూరుతోంది. తన్వీ ఫిలింస్ బ్యానర్‌పై సీఆర్ మనోహర్ నిర్మిస్తున్న ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మళయాల, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాండల్‌వుడ్‌లో హాట్ ఇమేజ్ ఉన్న రాగిణీ.., అమ్మ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా మరిన్ని వివాదాలకు తెర తీసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
హీరోయిన్ రాగిణి ద్వివేదిపై కేసు నమోదు
బెంగళూరు : ప్రముఖ కన్నడ సినీనటి రాగిణి ద్వివేదిపై మంగళవారం జేపీ నగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. రాగిణి ద్వివేదితో పాటు ఆమె సోదరుడుపై నిర్మాత వెంకటేశ్ ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే....'నాటికోలి' సినిమాలో రాగిణి ద్వివేది నటించేందుకు ఆమె సోదరుడు రుద్రాక్షి దీక్షిత్‌కు రూ.16 నుంచి రూ.17 లక్షలు చెల్లించానని, సినిమా చిత్రీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో డబ్బు తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరగా స్పందన లేదని నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బు తిరిగి ఇచ్చేది లేదని, అవసరమైతే మరో సినిమాలో నటిస్తానని రాగిణి చెప్పడంతో పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు నిర్మాత తెలిపాడు. వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా నాని హీరోగా వచ్చిన 'జెండాపై కపిరాజు' చిత్రంలో రాగిణి నటించిన విషయం తెలిసిందే. -
ఐసీయూలో 'నెక్ట్స్ సీఎం'
బెంగళూరు : 'నానే నెక్ట్స్ సీఎం' (తదుపరి ముఖ్యమంత్రి నేనే) అనే కన్నడ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి రాగిణి ద్వివేది తలకు తీవ్ర గాయమై ఐసీయూలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మైసూరు వద్ద ఆమెపై ఓ ఫైట్ సీన్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫైటర్ విసిరిన హాకీ స్టిక్ నుంచి తప్పించుకునే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో అది బలంగా రాగిణి తలకు తాకింది. దీంతో తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే ఆమెను స్థానికంగా ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న రాగిణి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు ప్రకటించారు. కాగా ప్రీమియర్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న నానే నెక్ట్స్ సీఎం చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. -
శివప్రకాష్పై విరుచుకుపడ్డ రాగిణి ద్వివేది
టీనగర్: తనను గర్ల్ ఫ్రెండ్ అనడంపై నటి రాగిణి త్రివేది నిర్మాత శివప్రకాష్పై విరుచుకుపడ్డారు. అరియాన్, నిమిరిందు నిల్ చిత్రాలలో నటించారు రాగిణి ద్వివేది. కన్నడంలో అనేక చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నాట్టికోలి కన్నడ చిత్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం ఏర్పాట్లు జరిగాయి. ఆ సమయంలో కన్నడ చిత్ర నిర్మాత శివప్రకాష్ రాగిణి బాయ్‌ఫ్రెండ్ తానేనని, ఆమె తనకు గర్ల్ ఫ్రెండ్ అంటూ షాకింగ్ న్యూస్ విడుదల చేశారు. దీంతో రాగిణి షాక్‌కు గురై షూటింగ్‌కు కూడా వెళ్లకుండా మానుకుందట. దీంతో నాట్టికోలి చిత్ర నిర్మాతకు ఐదున్నర లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం. దీంతో శివప్రకాష్పై నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. దీనిగురించి రాగిణి మాట్లాడుతూ తాను ఎవరితోను డేటింగ్ చేయలేదని, శివప్రకాష్ అభాండాలు వేశారన్నారు. అతనిపై ఫిర్యాదు చేయాల్సిందిగా సంబంధిత నిర్మాతలకు సూచించింది తానే నన్నారు. ఒక మహిళపై వేలెత్తి చూపే ముందు వారి కుటుంబీకుల గురించి ఆలోచించాలని, చౌకబారు పనులకు పాల్పడడం తప్పని గ్రహించండంటూ పరోక్షంగా శివప్రకాష్పై దాడిచేసింది. ఇదివరకే రాణాకు, రాగిణికి ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పుకార్లు వ్యాపించి సంచలనం సృష్టించాయి. వీటిని కూడా రాగిణి తోసిపుచ్చడం గమనార్హం. -
జెండా ఎగరేస్తారట!
ప్రతి వ్యక్తి.. తనను తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్లే అనే అంశానికి వినోదాన్ని మేళవించిన రూపొందించిన చిత్రం ‘జెండాపై కపిరాజు’. నాని తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో అమలాపాల్, రాగిణీ ద్వివేదీ కథానాయికలు. సముద్రఖని దర్శకుడు. మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై రజత్ పార్థసారథి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘నాని రెండు పాత్రల్లో అద్భుతమైన వైవిధ్యం కనబరిచారు. శరత్‌కుమార్ పోషించిన సీబీఐ అధికారి పాత్ర సినిమాకు హైలైట్’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, కెమెరా: సుకుమార్. -
'రానా దగ్గుబాటితో డేటింగ్ చేయడం లేదు'
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటితో తాను డేటింగ్ చేయడం లేదని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో కన్నడ తార రాగిణి ద్వివేది ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. రానాతో జత చేసి సిల్లీగా రూమర్లను రాయకండి అని ఆమె తెలిపింది. ప్రొఫెషనల్ గా బిజీ, సంతోషంగా ఉన్నాను అని రాగిణి అన్నారు. ఇలాంటి రూమర్లు ఎలా పుడుతాయో అర్ధం కావడం లేదన్నారు. రానా అఫైర్ బ్రేక్ కావడానికి తాను కారణం కాదని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రానా అఫైర్ వ్యవహారంలోకి తనను లాగవద్దని రాగిణి సూచించారు. I am not dating RANA DAGUBATTI..... I'd really like people 2 stop talking n writin silly ...Doin fantastic work n very hapy in this space Follow @sakshinews -
రాణా.. త్రిషల మధ్య ఆ రాగిణి ఎవరు?
ఎన్నాళ్ల నుంచో స్నేహంగా ఉంటున్న రాణా.. త్రిషలు ఎందుకు విడిపోయారు? వాళ్లిద్దరి మధ్య విభేదాలకు కారణం ఎవరు? అనధికారికంగా వస్తున్న కథనాల ప్రకారం, కన్నడ సుందరి రాగిణీ ద్వివేది కారణంగానే ఇలా జరిగిందని వినిపిస్తోంది. బాహుబలిలో నటిస్తున్న రాణా గతంలో రాగిణితో కలిసి ఉన్నట్లుగా ఉన్న ఫొటోలు సైతం కొన్ని వెబ్సైట్లలో దర్శనమిచ్చాయి. అయితే, రాగిణి మాత్రం.. ఇవన్నీ ఒట్టి వదంతులేనని రాగిణి చెబుతోంది. ఏదో అవార్డు కార్యక్రమానికి జరిగిన రిహార్సల్స్‌లో తాము పాల్గొన్న ఫొటోను తీసుకుని ఇలా అంటగట్టేస్తున్నారని రాగిణి వాపోయింది. అసలు రాణాతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసింది. ఈ వ్యవహారాలపై రాణా కూడా తీవ్రంగానే స్పందించాడు. ఏదో ఒక ఫొటో తీసేసుకుని.. దాన్నుంచి వార్తలు వండటం చాలా దారుణమైన విషయమని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. త్రిష, రాణా కలిసి ఇటీవల సైమా అవార్డుల కార్యక్రమంలో కనిపించారు. -
జెండాపై కపిరాజు మూవీ స్టిల్స్