Sandalwood Drug Case: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతితో సినీ పరిశ్రమలో డ్రగ్ వ్యవహరం కలకలం సృష్టించింది. బాలీవుడ్, శాండల్‌వుడ్‌లో డ్రగ్ కేసు సంచలనం సృష్టించింది. బాలీవుడ్‌లో పలువురు సినీ నటీనటులు, స్టార్ హీరోయిన్స్ పేర్లు ఈ కేసులో వినిపించాయి. ఇక శాండల్‌వుడ్‌కు వస్తే సంజన గల్రానీ, రాగిణీ ద్వివేది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరికి డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని, తరచూ డ్రగ్ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీసీబీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వారి తలవెంట్రులను సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) సాంపుల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: నెటిజన్ రూ. కోటి డిమాండ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సోనూసూద్
తాజాగా సీఎఫ్‌ఎస్‌ఎల్ ఈ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ రిపోర్టులో రాగిణి, సంజనలు డ్రగ్స్ సేవించినట్లు తేలింది. 2020 అక్టోబర్‌లో వీరిద్దరి వెంట్రకల నమూనాలను సేకరించిన బెంగళూరు పోలీసులు ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపించారు. ఈ రిపోర్టులో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడవ్వడంతో బెంగళూరు పోలీసులు మరోసారి రాగిణి, సంజనలకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సంజనా ప్రభాస్ బుజ్జీగాడు మూవీతో పాటు పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రాగిణి కన్నడలో స్టార్‌నటిగా గుర్తింపు పొందింది. కాగా ఈకేసులో జైలుకు వెళ్లిన సంజనా, రాగిణిలు ఇటీవల బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు రాగానే సంజన తన స్నేహితుడైన డాక్టర్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment