Drag case
-
HYD: పంజాగుట్టలో కారు బీభత్సం.. హోంగార్డును ఈడ్చుకెళ్లి..
సాక్షి,హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం(నవంబర్ 8) ఉదయం కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కారు ఆపకుండా దూసుకెళ్లాడు. కారు ఆపిన హోంగార్డును కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాగుట్టలో కారు బ్లాక్ ఫిల్మ్ చెకింగ్‌లో భాగంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భాగంగా నాగార్జున సర్కిల్ వద్ద హోంగార్డ్ రమేష్ ఓ కారును ఆపాడు. అయితే కారును ఆపకుండా హోం గార్డు రమేష్‌ని కారు డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ట్రాఫిక్ పోలీసులకు భయపడి ఆపకుండా ఈడ్చుకెళ్లాడు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో చోరీ.. పోలీస్‌స్టేషన్‌కు ప్రయాణికులు -
సీఎఫ్ఎస్ఎల్ రిపోర్టు: నటీమణులు రాగిణి, సంజనకు షాక్
Sandalwood Drug Case: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతితో సినీ పరిశ్రమలో డ్రగ్ వ్యవహరం కలకలం సృష్టించింది. బాలీవుడ్, శాండల్‌వుడ్‌లో డ్రగ్ కేసు సంచలనం సృష్టించింది. బాలీవుడ్లో పలువురు సినీ నటీనటులు, స్టార్ హీరోయిన్స్ పేర్లు ఈ కేసులో వినిపించాయి. ఇక శాండల్‌వుడ్‌కు వస్తే సంజన గల్రానీ, రాగిణీ ద్వివేది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరికి డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని, తరచూ డ్రగ్ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీసీబీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వారి తలవెంట్రులను సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) సాంపుల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: నెటిజన్ రూ. కోటి డిమాండ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సోనూసూద్ తాజాగా సీఎఫ్ఎస్ఎల్ ఈ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ రిపోర్టులో రాగిణి, సంజనలు డ్రగ్స్ సేవించినట్లు తేలింది. 2020 అక్టోబర్‌లో వీరిద్దరి వెంట్రకల నమూనాలను సేకరించిన బెంగళూరు పోలీసులు ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. ఈ రిపోర్టులో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడవ్వడంతో బెంగళూరు పోలీసులు మరోసారి రాగిణి, సంజనలకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సంజనా ప్రభాస్ బుజ్జీగాడు మూవీతో పాటు పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రాగిణి కన్నడలో స్టార్నటిగా గుర్తింపు పొందింది. కాగా ఈకేసులో జైలుకు వెళ్లిన సంజనా, రాగిణిలు ఇటీవల బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు రాగానే సంజన తన స్నేహితుడైన డాక్టర్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. చదవండి: హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? -
హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో డ్రగ్స్ మాఫియా తోక ముడిచిందని అంతా భావించారు. కానీ అది ఇంకా విస్తరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో నల్లజాతీయుని వద్ద ఎక్సైజ్ శాఖ (ఎస్టీఎఫ్) అధికారులు 100 గ్రాముల కొకైన్‌ను సాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల... ప్రకారం రిపబ్లిక్ (ఆఫ్రికా)కు చెందిన పీటర్ అనే వ్యక్తి మెహిదీపట్నంలోని మక్తాలో డ్రగ్స్ అమ్ముతుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర నుంచి 100 గ్రాముల కొకైన్ తో పాటు లక్ష రూపాయల నగదును స్వాధీనం చెసుకున్నారు. -
‘డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా వదిలి పెట్టం’
సూర్యపేట: ప్రస్తుతం డ్రగ్స్ కేసు చక్కర్లు కొడుతోంది. ఈ కేసులో కొంతమంది సినీ నటులకు ఎక్సెజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై హోం మంత్రి నాయిని నరసింహరెడ్డి రెడ్డి స్పందించారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సెలవుపై వెళ్లడంలో ఎటువంటి ఒత్తిడి లేదని మంత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధం ఉన్న ఎవర్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని నాయిని తెలిపారు.