
సాక్షి,హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం(నవంబర్ 8) ఉదయం కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కారు ఆపకుండా దూసుకెళ్లాడు. కారు ఆపిన హోంగార్డును కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాగుట్టలో కారు బ్లాక్ ఫిల్మ్ చెకింగ్‌లో భాగంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా నాగార్జున సర్కిల్ వద్ద హోంగార్డ్ రమేష్ ఓ కారును ఆపాడు. అయితే కారును ఆపకుండా హోం గార్డు రమేష్‌ని కారు డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ట్రాఫిక్ పోలీసులకు భయపడి ఆపకుండా ఈడ్చుకెళ్లాడు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో చోరీ.. పోలీస్‌స్టేషన్‌కు ప్రయాణికులు
Comments
Please login to add a commentAdd a comment