home gaurd
-
బంజారాహిల్స్ సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్, హోంగార్డుకు 41-ఏ నోటీసులు
-
‘దొంగ’ తెలివి! ఏకంగా హోంగార్డు బైక్‌నే దొంగిలించి...వెళ్తు..వెళ్తూ..
సాక్షి, బంజారాహిల్స్: చోరాగ్రేసరుల తెలివే వేరు. విభిన్నంగా ఆలోచించడమే వీరికున్న అదనపు అర్హత. ఏకంగా హోంగార్డు బైక్‌నే దొంగిలించి.. దానిపైనే వెళుతూ ఓ ద్విచక్ర వాహన చోదకుడి మొబైల్‌నే కొట్టేశారు. ఆ తర్వాత ఎట్టకేలకు దొరికిపోయిన ముగ్గురు యువకుల ‘దొంగ’ తెలివి బయటపడిన ఉదంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ధర్మ అనే హోంగార్డు పని చేస్తున్నారు. కారి్మకనగర్‌లో ఆయన నివసిస్తున్నారు. రోజువారీలాగే బుధవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచి్చన ధర్మ.. తన బైక్‌ను బయట పార్కింగ్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు యువకులు సదరు బైక్‌ను అపహరించారు. ఆ వాహనంపైనే రహమత్‌నగర్ మీదుగా యూసుఫ్‌గూడ వైపు దొంగతనానికి బయల్దేరారు. కొట్టేసిన వాహనంపైనే వెళుతూ.. అదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీకి చెందిన మల్లారెడ్డి అనే స్విగ్గి డెలివరీ బాయ్ ఓ ఆర్డర్ కోసం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వద్ద వేచి చూస్తున్నాడు. బైక్‌పై వచి్చన దొంగలు సదరు మల్లారెడ్డిని లైటర్ ఉందా అని అడుగుతూనే మల్లారెడ్డి చేతుల్లోని మొబైల్ ఫోన్‌ను క్షణాల్లో లాక్కుని ఉడాయించారు. బాధితుడు అప్రమత్తమై తన బైక్‌పై వారిని వెంబడిస్తూ దొంగా.. దొంగా అంటూ అరిచాడు. చుట్టుపక్కల వారు సైతం ఆయనతో పాటు దూసుకెళ్లారు. సందుల్లోకి వెళ్లిన ముగ్గురు దొంగలు ఆ ప్రాంతం కొత్తది కావడంతో అటు తిరిగి... ఇటు తిరిగి మళ్లీ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంవైపే వచ్చారు. అప్పటికే వీరి కోసం వెంట పడుతున్నవారికి కనిపించారు. వీరందరిని చూడగానే దొంగలు ముగ్గురు మొబైల్ ఫోన్‌తో పాటు బైక్‌ను అక్కడే పడేసి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: స్పాల ముసుగులో వ్యభిచారం.. ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా..) -
‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’
సాక్షి, ఘట్కేసర్: ‘మేము పోలీసులం.. కేసు నుంచి తప్పిస్తాం’అని లంచం తీసుకున్న వారిని ఘట్కేసర్ పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 25న కాళేశ్వరం నుంచి ఘట్కేసర్కు (టీఎస్ 07యూఈ 5355) లారీ ఇసుక లోడుతో వస్తుండగా ఎన్‌ఎఫ్‌సీనగర్ వంతెన వద్ద కారును ఢీకొట్టింది. సంఘటన స్థలానికి ఘట్కేసర్ ప్యాట్రోలింగ్ మొబైల్ వ్యాన్–1 వెళ్లింది. ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్యాట్రోలింగ్ డ్రైవర్ హోంగార్డు శివ లారీని పక్కకు జరపాలని ఆదేశించారు. లారీ డ్రైవర్ జాజుల నర్పింహ లారీని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లాడు. అదే సమయంలో వనస్థలిపురంలో 2010లో హోంగార్డుగా విధుల్లోకి చేరి 2014 నుంచి గైర్హాజరు అవుతున్న ఏ–1 బాల్‌రాజ్(35), ఏ–2 శ్రీను (డైవర్)తో కలిసి ఓ ఆటోను విడిపించాలని మాట్లాడడానికి ఏ–3 హోంగార్డు శివకు ఫోన్ చేశాడు. వెంటనే లారీ దగ్గరికి వెళ్లి వివరాలు సేకరించాలని వారిద్దరికి శివ ఆదేశించారు. వారిరువురు లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్లి ఘట్కేసర్ పోలీసులమంటూ వివరాలు సేకరించి శివకు అందించారు. చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్ ఆన్ చేసి.. డ్రైవర్ ఫిర్యాదుతో హోంగార్డు సస్పెండ్.. ప్రమాదాన్ని ఎవరూ గమనించలేదని డబ్బులు ఇస్తే తప్పిస్తామని వారు లారీ డ్రైవర్‌ను డిమాండ్ చేశారు. డ్రైవర్ రూ.20వేలు బాల్‌రాజ్‌కు ఇచ్చాడు. అనంతరం శివకు రూ.15 వేలు అందజేసి మిగిలినవి తన దగ్గర ఉంచుకున్నాడు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు సెల్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసి ఘట్కేసర్కు చెందిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా ఉన్నతాధికారులు హోంగార్డు శివను (ఏ–3) విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన హోమ్ గార్డ్
-
Assam Home Guard: నిజాయితీకి దక్కిన సత్కారం
గువాహటి: కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాల సరఫరాలో తమకు సహకరిస్తే భారీ నజరానా ఇస్తామని డ్రగ్ డీలర్లు ఆశజూపినా.. నిజాయితీకే కట్టుబడ్డాడు ఆ హోం గార్డు. అతని నిజాయతీకి, నిఖార్సయిన విధి నిర్వహణకు ప్రతిఫలంగా అస్సాం ప్రభుత్వం ఆయనను కానిస్టేబుల్ ఉద్యోగంతో సత్కరించింది. శనివారం ఆ హోంగార్డు బోర్సింగ్ బేకు కానిస్టేబుల్ నియామక పత్రాన్ని రాష్ట్ర సీఎం హిమంత స్వయంగా అందజేశారు. జూన్ 21న కార్బి అంగ్లాంగ్ జిల్లాలోని ఓ చెక్‌పోస్టు వద్ద మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది. అక్కడే విధుల్లో ఉన్న హోం గార్డు బస్సులో అక్రమ రవాణాను పసిగట్టాడు. అయితే, పోలీసులను ఏమార్చేందుకు, తమకు సాయపడేందుకు ఒప్పుకుంటే భారీ స్థాయిలో లంచమిస్తామని హోం గార్డు బోర్సింగ్కు డ్రగ్ డీలర్లు ఆశపెట్టారు. అందుకు బోర్సింగ్ ససేమిరా ఒప్పుకోలేదు. బస్సులో ఉన్న రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులకు సాయపడ్డాడు. దీంతో, హోం గార్డు నిజాయతీకి మెచ్చి సీఎం అతనికి కానిస్టేబుల్ ఉద్యోగనియామక పత్రం అందజేశారు. -
నాగోల్‌లో కారు బీభత్సం.. హోంగార్డుకు తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాగోల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉన్న నేపథ్యంలో నాగోల్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న TS08AA0117 నంబర్ గల కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ కారు ఆపకుండా అతివేగంతో అక్కడి నుంచి దూసుకెళ్లాడు. దీంతో అక్కడ తనఖీలు చేస్తున్న పోలీసులు సెట్ ద్వారా అలర్ట్ చేయడంతో ఎల్బీనగర్లో కారును ఆపేందుకు అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డ్ రమేష్ ప్రయత్నించాడు. అయితే అతి వేగంతో దూసుకొచ్చిన కారు డ్రైవర్ రమేష్‌ను ఢీకొట్టి క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటనలో హోంగార్డు రమేష్‌కు తీవ్రగాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలసుకున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆస్పత్రికి వెళ్లి హోంగార్డును పరామర్శించి, ఘటనపై ఆరా తీశారు. -
శభాష్ పోలీస్..
సాక్షి, నాంపల్లి: కదులుతున్న రైలు నుంచి దిగుతూ కిందపడిన ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్లాట్ఫారం-రైలుకు మధ్యన ఇరుక్కుపోయే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు శ్రవణ్ చాకచక్యంగా ప్రమాదపు అంచుల్లో ఉన్న ప్రయాణికుడిని కాపాడాడు. ఈ సంఘటన నాంపల్లి ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట రైల్వే స్టేషన్లో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రయాణికుడిని హోంగార్డు కాపాడుతున్న సీపీ పుటేజి (దృశ్యాలు) పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే... నగరంలో నివాసం ఉంటున్న ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ బంధువు రాహుల్(23) హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై నుంచి నగరానికి బయలుదేరాడు. ఈ నెల 17న మధ్యాహ్నం 11.20 గంటల సమయంలో రైలు బేగంపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. సెకండ్ ఏసీలో ప్రయాణిస్తున్న రాహుల్ (దిగాల్సిన స్టేషన్లో) దిగకుండా రైలు ఆగి కదిలే సమయంలో దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్లాట్ఫారం, రైలు బోగీల మధ్యన ఉండే ఖాళీ ప్రదేశంలో కింద పడబోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న నాంపల్లి ఆర్పీఎఫ్ హోంగార్డు శ్రవణ్ అప్రమత్తమై రాహుల్‌ను ఒక్కసారి పట్టుకుని పక్కకు లాగడంతో అతను ప్రమాదం నుంచి బయటపడ్డారు. రెప్పపాటు కాలంలో ప్రాణాలు కాపాడిన హోంగార్డు శ్రవణ్‌కు రాహుల్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రయాణికుడిని కాపాడిన హోంగార్డు శ్రవణ్‌ను జీఆర్పీ ఇన్స్పెక్టర్ జనార్దన్ చౌదరి అభినందించారు. విధుల పట్ల, ప్రయాణికుల పట్ల అతడికి ఉన్న బాధ్యతను మెచ్చుకున్నారు. -
బాలికపై హోంగార్డు లైంగిక దాడి
సాక్షి, మచిలీపట్నం: ప్రేమపేరుతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 15 ఏళ్ల బాలికను గర్భవతిని చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఖాకీ ముసుగులో ఏడాదిగా ఆ కామాంధుడు సాగిస్తున్న లైంగిక దాడి వ్యవహారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హోంగార్డుగా పనిచేస్తున్న బి.ఫణీంద్రబాబు (హెచ్‌జీ –254) స్థానిక బైపాస్ రోడ్డులోని టెంపుల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. డీఎస్పీ జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాను ఉంటున్న కాలనీలోనే 15 ఏళ్ల బాలికపై కన్నేశాడు. తల్లిదండ్రులు స్థానిక రైతుబజార్లో కూరగాయలు వ్యాపారం చేసుకుంటుండగా ఆ బాలిక అదే కాలనీలో కూల్‌డ్రింక్ షాపు నడుపుకుంటూ జీవనం పోషించుకునే అక్క వద్ద ఉంటోంది. షాపులో ఉన్న సమయంలో ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఫణీంద్రబాబు ఆ బాలికను లోబర్చుకున్నాడు. ఆ బాలిక ఒంటరిగా ఉంటున్న సమయంలో ఇంటికి వెళ్లి తన అవసరాలు తీర్చుకునే వాడు. కొంత కాలంగా తరచూ కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పీహెచ్సీ వద్దకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా ఐదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో బాలిక తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఫణీంద్రపై 49/2020 అండర్ సెక్షన్ 376, ఐపీసీ, పోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి చిలకలపూడి సీఐ ఎం.వెంకటనారాయణ ఇచ్చిన నివేదిక ఆధారంగా హోంగార్డును విధుల నుంచి తొలగిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. నేరానికి పాల్పడితే సామాన్యులకైనా, పోలీసు శాఖలో పనిచేసే సిబ్బందికైనా చట్టం సమానంగా వర్తిస్తుందని, చట్టం దృష్టిలో అందరూ సమానమేనని ఎస్పీ రవీంద్రబాబు స్పష్టం చేశారు. -
ఉప్పల్‌లో అర్థరాత్రి హంగామా సృష్టించిన హిజ్రాలు
-
ప్రేమను తిరస్కరించిందని చంపేసాడు
-
పోలీస్ వాహనంలోకే మద్యం సఫ్లై
-
కర్నూలులో హోంగార్డు ఆత్మహత్యాయత్నం
-
హోంగార్డుల పర్మనెంట్ను పరిశీలించండి
సాక్షి, హైదరాబాద్: హోంగార్డుల పర్మనెంట్ అంశాన్ని ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని హోంగార్డుల గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మను శ్రీనివాస్‌గౌడ్ బృందం సోమవారం కలసి వివిధ రాష్ట్రాల్లోని హోంగార్డు రిక్రూట్మెంట్ ప్రక్రియను నివేదిక రూపంలో అందజేసింది. దీనిపై రాజీవ్ శర్మ స్పందిస్తూ.. హోంగార్డులకు న్యాయం జరిగేలా ఓ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తానని హామీనిచ్చారు. -
విశ్రాంత హోంగార్డుకు వితరణ
శ్రీకాకుళం సిటీ : ఈ ఏడాది జూలై 31వ తేదీన పదవీ విరమణ చేసిన విశ్రాంత హోంగార్డు టి.రమణారావుకు సహచర హోంగార్డు ఉద్యోగులు వారి ఒక రోజు వేతనాన్ని రూ.2,38,800 లను వితరణగా మంగళవారం అందజేశారు. ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి చేతుల మీదుగా చెక్కు రూపంలో రమణారావుకు ఈ ఆర్థిక సాయాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పని చేస్తున్న హోంగార్డులను ఎస్పీ అభినందించారు. ఇది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందన్నారు. కార్యక్రమంలో హోంగార్డు ఆర్ఐ కె.రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పిడుగు పాటుకు గురైన హోంగార్డు మృతి
దేవుదల (రేగిడి) : మండలంలోని దేవుదల గ్రామానికి చెందిన హోంగార్డు ఇనుమల యోగనాధరావు (35) గురువారం రాత్రి మృతి చెందాడు. గత నెల 29న పొలంలో పని చేస్తున్న సమయంలో సాయంత్రం పూట పిడుగుపాటుతో తీవ్ర అస్వస్థతకు గురైన యోగనాధరావును రాజాం కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. యోగనాధరావు పరిస్థితి పూర్తిగా విషమించడంతో కేజీహెచ్ వైద్యులు యోగనాథరావును ఇంటికి తీసుకువెళ్లమని చెప్పడంతో గురువారం రాత్రి కుటుంబ సభ్యులు తీసుకువస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్టు హెచ్‌సీ భాస్కరరావు శుక్రవారం తెలిపారు. యోగనాధరావు రాజాం పోలీసుస్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య కృష్ణ, తల్లిదండ్రులు మొయ్యమ్మ, సత్యన్నారాయణ ఉన్నారు. ఘటనకు సంబంధించి పాలకొండ సీఐ ఎన్.వేణుగోపాలరావు సూచనలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ భాస్కరరావు తెలిపారు.