విశ్రాంత హోంగార్డుకు వితరణ | hands risen for retired homegaurd | Sakshi
Sakshi News home page

విశ్రాంత హోంగార్డుకు వితరణ

Published Tue, Oct 4 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

రమణారావుకు చెక్కును అందజేస్తున్న ఎస్పీ బ్రహ్మారెడ్డి

రమణారావుకు చెక్కును అందజేస్తున్న ఎస్పీ బ్రహ్మారెడ్డి

శ్రీకాకుళం సిటీ : ఈ ఏడాది జూలై 31వ తేదీన పదవీ విరమణ చేసిన విశ్రాంత హోంగార్డు టి.రమణారావుకు సహచర హోంగార్డు ఉద్యోగులు వారి ఒక రోజు వేతనాన్ని రూ.2,38,800 లను వితరణగా మంగళవారం అందజేశారు. ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి చేతుల మీదుగా చెక్కు రూపంలో రమణారావుకు ఈ ఆర్థిక సాయాన్ని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పని చేస్తున్న హోంగార్డులను ఎస్పీ అభినందించారు. ఇది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందన్నారు. కార్యక్రమంలో హోంగార్డు ఆర్‌ఐ  కె.రవికుమార్, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement