సాక్షి, బంజారాహిల్స్: చోరాగ్రేసరుల తెలివే వేరు. విభిన్నంగా ఆలోచించడమే వీరికున్న అదనపు అర్హత. ఏకంగా హోంగార్డు బైక్‌నే దొంగిలించి.. దానిపైనే వెళుతూ ఓ ద్విచక్ర వాహన చోదకుడి మొబైల్‌నే కొట్టేశారు. ఆ తర్వాత ఎట్టకేలకు దొరికిపోయిన ముగ్గురు యువకుల ‘దొంగ’ తెలివి బయటపడిన ఉదంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ధర్మ అనే హోంగార్డు పని చేస్తున్నారు. కారి్మకనగర్‌లో ఆయన నివసిస్తున్నారు. రోజువారీలాగే బుధవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచి్చన ధర్మ.. తన బైక్‌ను బయట పార్కింగ్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు యువకులు సదరు బైక్‌ను అపహరించారు. ఆ వాహనంపైనే రహమత్‌నగర్ మీదుగా యూసుఫ్‌గూడ వైపు దొంగతనానికి బయల్దేరారు.
కొట్టేసిన వాహనంపైనే వెళుతూ..
అదే సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీకి చెందిన మల్లారెడ్డి అనే స్విగ్గి డెలివరీ బాయ్ ఓ ఆర్డర్ కోసం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వద్ద వేచి చూస్తున్నాడు. బైక్‌పై వచి్చన దొంగలు సదరు మల్లారెడ్డిని లైటర్ ఉందా అని అడుగుతూనే మల్లారెడ్డి చేతుల్లోని మొబైల్ ఫోన్‌ను క్షణాల్లో లాక్కుని ఉడాయించారు. బాధితుడు అప్రమత్తమై తన బైక్‌పై వారిని వెంబడిస్తూ దొంగా.. దొంగా అంటూ అరిచాడు.
చుట్టుపక్కల వారు సైతం ఆయనతో పాటు దూసుకెళ్లారు. సందుల్లోకి వెళ్లిన ముగ్గురు దొంగలు ఆ ప్రాంతం కొత్తది కావడంతో అటు తిరిగి... ఇటు తిరిగి మళ్లీ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంవైపే వచ్చారు. అప్పటికే వీరి కోసం వెంట పడుతున్నవారికి కనిపించారు. వీరందరిని చూడగానే దొంగలు ముగ్గురు మొబైల్ ఫోన్‌తో పాటు బైక్‌ను అక్కడే పడేసి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: స్పాల ముసుగులో వ్యభిచారం.. ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా..)
Comments
Please login to add a commentAdd a comment