jublihills police station
-
‘హే రాజన్.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా!’
సాక్షి, బంజారాహిల్స్: తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని భర్తకు సెల్ఫీ తీసుకుని ఫొటో పెట్టిన స్పందించలేదని మనస్తాపానికి గురైన ఓ యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన రాజన్ పర్వార్, పూజ(19) దంపతులు ఏడాదిన్నర క్రితం నేపాల్ నుంచి నగరానికి వలసవచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10 లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఇంట్లో పని చేస్తున్నారు. రాజన్ కాపలాదారుగా పని చేస్తుండగా, పూజ వంట పని చేసేది. టిక్‌టాక్‌లు చేస్తున్న పూజను రాజన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా గత కొంత కాలంగా భర్త తనను పట్టించుకోవడం లేదని పూజ ఆరోపిస్తూ ఉండేది. అతను మరొకరితో ఫోన్లో మాట్లాడుతున్నాడని సన్నిహితుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో తనకు బతకాలని లేదంటూ ఇంటి యజమాని వద్ద కూడా వాపోయింది. ఆదివారం సాయంత్రం రాజన్ గేటు వద్ద విధుల్లో ఉండగా బాత్రూమ్లోకి వెళ్లిన పూజ మెడకు చున్నీ చుట్టుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సెల్పీ తీసి భర్తకు పంపింది. అయితే రాజన్ ఆ ఫొటో చూసుకోలేదు. రెండు గంటలు గడిచినా భర్త స్పందించకపోవడంతో మనస్తాపానికి లోనైన ఆమె బెడ్రూమ్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. భార్య ఎంతకూ బయటికి రాకపోయేసరికి అనుమానం వచ్చిన రాజన్ కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఇంటి యజమాని సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. జూబ్లీహిల్స్ పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తెలంగాణ: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఐటీ సోదాలు) -
భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్: అదనపు కట్నం కోసం వేధించి భార్య ఆత్మహత్యకు కారకుడైన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లవరం గ్రామానికి చెందిన భవానీ వివాహం నెల్లారి సురేష్‌తో 2019లో జరిగింది. పెళ్ళి జరిగిన కొద్ది రోజుల నుంచే సురేష్ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. వీరికి మూడేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. వీరు వెంకటగిరి సమీపంలోని భగవతి నగర్లో అద్దెకుంటున్నారు. వివాహ సమయంలో మూడు లక్షల కట్నం, రూ.5 లక్షలు విలువ చేసే బంగారం, రెండెకరాల వ్యవసాయ భూమి ఇచ్చారు. అయితే ఉద్యోగం పోగొట్టుకొని పలు వ్యాపారాలు పెట్టి తీవ్రంగా నష్టపోయిన సురేష్ కట్నం కింద ఇచి్చన రెండెకరాల స్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలంటూ కొంత కాలంగా వేధించసాగాడు. అప్పటికే బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టారు. రూ. 8 లక్షల వరకు అప్పు చేసి ఇచ్చారు. అయినాసరే నిందితుడి వేధింపులు రోజురోజుకు శృతి మించడంతో గత నెల 30వ తేదీన భవానీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఏలూరి ఝాన్సీ అల్లుడితో పాటు అత్తమామలపై చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సురేష్‌పై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నిజామాబాద్‌లో కేటుగాడు!.. 250 మందిని షార్జాకి తీసుకెళ్లి.. పత్తా లేకుండా పోయి..) -
‘దొంగ’ తెలివి! ఏకంగా హోంగార్డు బైక్‌నే దొంగిలించి...వెళ్తు..వెళ్తూ..
సాక్షి, బంజారాహిల్స్: చోరాగ్రేసరుల తెలివే వేరు. విభిన్నంగా ఆలోచించడమే వీరికున్న అదనపు అర్హత. ఏకంగా హోంగార్డు బైక్‌నే దొంగిలించి.. దానిపైనే వెళుతూ ఓ ద్విచక్ర వాహన చోదకుడి మొబైల్‌నే కొట్టేశారు. ఆ తర్వాత ఎట్టకేలకు దొరికిపోయిన ముగ్గురు యువకుల ‘దొంగ’ తెలివి బయటపడిన ఉదంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ధర్మ అనే హోంగార్డు పని చేస్తున్నారు. కారి్మకనగర్‌లో ఆయన నివసిస్తున్నారు. రోజువారీలాగే బుధవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచి్చన ధర్మ.. తన బైక్‌ను బయట పార్కింగ్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు యువకులు సదరు బైక్‌ను అపహరించారు. ఆ వాహనంపైనే రహమత్‌నగర్ మీదుగా యూసుఫ్‌గూడ వైపు దొంగతనానికి బయల్దేరారు. కొట్టేసిన వాహనంపైనే వెళుతూ.. అదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీకి చెందిన మల్లారెడ్డి అనే స్విగ్గి డెలివరీ బాయ్ ఓ ఆర్డర్ కోసం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వద్ద వేచి చూస్తున్నాడు. బైక్‌పై వచి్చన దొంగలు సదరు మల్లారెడ్డిని లైటర్ ఉందా అని అడుగుతూనే మల్లారెడ్డి చేతుల్లోని మొబైల్ ఫోన్‌ను క్షణాల్లో లాక్కుని ఉడాయించారు. బాధితుడు అప్రమత్తమై తన బైక్‌పై వారిని వెంబడిస్తూ దొంగా.. దొంగా అంటూ అరిచాడు. చుట్టుపక్కల వారు సైతం ఆయనతో పాటు దూసుకెళ్లారు. సందుల్లోకి వెళ్లిన ముగ్గురు దొంగలు ఆ ప్రాంతం కొత్తది కావడంతో అటు తిరిగి... ఇటు తిరిగి మళ్లీ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంవైపే వచ్చారు. అప్పటికే వీరి కోసం వెంట పడుతున్నవారికి కనిపించారు. వీరందరిని చూడగానే దొంగలు ముగ్గురు మొబైల్ ఫోన్‌తో పాటు బైక్‌ను అక్కడే పడేసి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: స్పాల ముసుగులో వ్యభిచారం.. ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా..) -
గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా నటి ధర్నా
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత బోయ ధర్నాకు దిగింది. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర45లో ఉన్న గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా ధర్నా చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సముదాయించి మహిళా పోలీసులు దుస్తులు వేయించారు. అనంతరం సునీతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ నుంచి తనకు డబ్బులు రావాలని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ధర్నాకు దిగినట్టు వెల్లడించింది. కాగా గతంలోనూ సునీత గీతా ఆర్ట్స్ ముందు పలుమార్లు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. చదవండి: రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే.. -
ప్రభాస్‌పై ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీమ్
హీరో ప్రభాస్ కారుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారంటూ వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ ఫిలింతో పాటు కాలం చెల్లిన ఎంపీ స్టిక్కర్‌ను వేసుకున్నందుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ. 1600 జరిమానా విధించారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అసలు విషయం బయటికి వచ్చింది. నిజానికి అది ప్రబాస్ కారు కాదంట. ఈ మేరకు ప్రభాస్ పీఆర్ టీం స్పష్టతనిచ్చింది. హైదరాబాద్ రోడ్ నెంబర్ 36లో ప్రభాస్ కారుకి పోలీసులు ఫైన్ వేశారని వార్తలు వస్తున్నాయి. ఆ కారుకి, ప్రభాస్‌కి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేస్తున్నాం. దయచేసి గమనించగలరు అని పీఆర్ టీం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ ఫేక్ న్యూస్‌పై ప్రభాస్ వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. కారు ప్రభాస్ పేరు మీద లేదని, ఆయన బంధువు నరసింహరాజు పేరు మీద ఉందంటూ దానికి సంబంధించిన పత్రాలను సమర్పించారు. దీంతో రూమర్స్‌కి చెక్పెట్టినట్లయ్యింది. కాగా సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్ త్వరలోనే భారత్‌కు రానున్నారు. అనంతరం ఆయన సలార్ షూటింగ్లో పాల్గొంటారు. చదవండి: పెళ్లిపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు -
'సర్కారువారి పాట' సాంగ్ లీక్.. ఇద్దరు అరెస్ట్
Two Persons Arrested For SVP Song Leak: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కళావతి పాట ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. వాలంటైన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న మూవీ టీంకు లీకువీరులు భారీ షాకిచ్చారు. దీంతో రిలీజ్‌కు ఒకరోజు ముందుగానే కళావతి పాట సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. దీంతో షాక్‌కి గురైన మేకర్స్ రంగంలోకి దిగారు. పాటను లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా వాలైంటైన్స్ డే సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా ఆన్లైన్ లీక్ నేపథ్యంలో నేడు(ఆదివారం)అధికారికంగా పాటను విడుదల చేస్తున్నారు. -
‘పుష్ప’ ప్రీరిలీజ్ ఈవెంట్‌పై పోలీసులు ఫైర్, కేసు నమోదు
Police Case Filed On Pushpa Pre Release Event: అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై మేనేజర్లకు పోలీసులు షాక్ ఇచ్చారు. నిన్న గ్రాండ్‌గా జరిగిన పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు మండిపడుతున్నారు. కేవలం 5000 పాస్‌లకు మాత్రమే అనుమతి తీసుకుని ఎక్కువ పాసులు జారీ చేశారని నిర్ధారించిన పోలీసులు శ్రేయాస్ క్రియేషన్స్ మీడియాతో పాటు ఈవెంట్ ఆర్గనైజేషన్‌పై కేసు నమోదు చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్ కిశోర్‌పై ఐపీసీ సెక్షన్ 143, 341, 336, 290 కింద కేసులు నమోదు చేశారు. చదవండి: కాజల్‌పై బిగ్‌బాస్ నిర్వాహకులు సీరియస్! ఆ రూల్ బ్రేక్ చేసిందా? కాగా డిసెంబర్ 12వ తేదీ ఆదివారం సాయంత్రం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ఉదయం నుంచే…యూసుఫ్ గూడ ప్రాంతానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. వేల సంఖ్యలో ప్రజలు ఈ వేడుకకు పోటెత్తారు. దీంతో గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. యూసుఫ్ గూడ రహదారులన్నీ బ్లాక్ అవ్వడంతో ట్రాఫీక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. చదవండి: ‘తగ్గేదే లే’ డైలాగ్‌తో తండ్రి మ్యానరిజం చూపించిన అయాన్, ఆర్హ అభిమానులంతా ఉత్సాహాంతో అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకుని రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఈవెంట్ మేకర్స్ సీరియస్ అయ్యి ఫ్యాన్స్ అదుపుచేసే ప్రయత్నం చేశారట. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ‘తగ్గేదే లే’ అన్నట్లు వ్యవహరించారు. ఇది తెలిసి పోలీసులు ఈవెంట్‌కు ఎంతమంది వచ్చారనేది ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. 5 వేల పాస్‌లకే అనుమతి ఉండగా.. అంతకంటే ఎక్కువ పాస్‌లు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఈవెంట్ నిర్వహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లో నివాసం ఉంటున్న రసమోని మీనాక్షి(19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈనెల 11న మీనాక్షి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి వెంకటయ్య తన కూతురు కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకి తెలిసిన వారు 81858 55212, 9346249416 లలో తెలియజేయాలని పోలీసులు కోరారు. (చదవండి: భూ వ్యవహారంలో రూ.2కోట్ల మోసం) -
మాజీ డీజీపీ ‘సారూ’ దొరికింది
బంజారాహిల్స్: మాజీ డీజీపీ అప్పారావు ఇంటి ముందు పెంచుకుంటున్న ఖరీదైన, అరుదైన బోన్సాయ్ మొక్కను దొంగిలించిన కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 18 లో నివసించే మాజీ డీజీపీ అప్పారావు, శ్రీదేవి దంపతులకు బోన్సాయ్ మొక్కల పెంపకంపై ఆసక్తి. కొన్నేళ్లుగా వీరు తమ ఇంటి ఆవరణలో అరుదైన బోన్సాయ్ మొక్కలను పెంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఎస్పీఆర్హిల్స్, ఓంనగర్‌కు చెందిన గొల్లపూడి ప్రసన్నాంజనేయులు తరచూ వాటిని చూస్తుండేవాడు. వీటి ప్రత్యేకతను తెలుసుకున్న అతను ఖరీదైన వాటిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆశించాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడు అభిషేక్‌తో కలిసి గతంలో రెండుసార్లు ఇంటి ముందున్న బోన్సాయ్ మొక్కలను దొంగిలించి అమ్ముకున్నాడు. ఒక్కో మొక్క రూ. 25 వేల వరకు ధర పలికాయి. దీంతో వారు మరోసారి ఇంకో మొక్కను దొంగి లించి అమ్ముకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 10న ఉదయం ఇద్దరూ బైక్‌పై వచ్చి ‘సారూ’ జాతికి చెందిన బోన్సాయ్ మొక్కను దొంగిలించారు.(చదవండి: జ్యువెలరీ షాపులో భారీ చోరీ) దీంతో ఉదయం మొక్క కనిపించకపోవడంతో అప్పారావు భార్య శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సీసీ టీవీలను పరిశీలించారు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ వైపు నుంచి బైక్‌పై మొక్క తీసుకుని వెళ్తున్న నిందితులను గుర్తించారు. రెండు రోజుల గాలింపు అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆంజనేయులు గతంలోను ఇక్కడ బోన్సాయ్ మొక్కలు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అభిషేక్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు డీఐ రమేష్ తెలిపారు. -
ఫేక్ ప్రొఫైల్‌తో ఎన్నారైకి వల
సాక్షి, హైదరాబాద్ : ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఎన్నారైకు వల వేసి మోసం చేసిన మహిళను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన మాళవిక అనే మహిళ ఫేక్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి భారత్ మాట్రిమోనిలో షేర్ చేసి ఎన్నారైలను మోసం చేయడం టార్గెట్‌గా పెట్టుకుంది. దీనికి మాళవిక కుమారుడు ప్రణవ్ సహాయం చేస్తుండేవాడు. తాజాగా మాళవిక కాలిఫోర్నియాకు చెందిన వరుణ్ అనే ఎన్నారైకి వల వేసి దాదాపు రూ. 65 లక్షలు వసూలు చేసింది. (ప్రియుడితో పారిపోయిందని చితకబాదారు) తాను ఒక డాక్టర్‌నంటూ.. తనకు చాలా ఆస్తులు ఉన్నాయని పేర్కొంది. మా నాన్న చనిపోయాడని.. ఆస్తులన్నీ తన పేరు మీద రాయాలని తన తల్లి హింసిస్తున్నట్లు తెలిపింది. ఆస్తులను కాపాడుకోవడానికి తన తల్లిపై లీగల్‌గా ఫైట్ చేయడానికి తనకు సహాయం చేయాలని కోరింది. పరిస్థితి చక్కబడిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటానని.. అప్పుడు తన ఆస్తులన్నింటికి యాజమాని అవుతావంటూ మాయ మాటలు చెప్పింది. మాళవిక చెప్పినవన్నీ నిజమేనని నమ్మిన వరుణ్ ఆమె అకౌంట్లోకి రూ. 65 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం పెళ్లి విషయమై మాళవిక నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన వరుణ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాళవికతో పాటు ఆమె కొడుకు ప్రణవ్ను అరెస్టు చేశారు. కాగా గతంలోనూ మాళవిక తన భర్త, అత్తతో కలిసి ఇదే విధంగా ఓ ఎన్నారైను మోసం చేసినందుకు కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. (ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..) -
కూతురుని లవ్ చేశాడని..
-
హైటెక్ పేకాట ముఠా గుట్టు రట్టు
-
హైటెక్ పేకాట.. కోట్లు దండుకుంటున్న వైనం
సాక్షి, హైదరాబాద్: నగరంలో హైటెక్ పేకాట ముఠా గుట్టు రట్టయింది. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో పేకాట నిర్వహిస్తూ.. ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్న మోసగాళ్లను జుబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మైక్రో సెన్సార్లు, డిజిటల్ కనెక్షన్లు, ముబైల్ ఫోన్లతో ట్యాగింగ్ చేసి అత్యాధునిక రీతిలో ఈ ముఠా పేకాట నిర్వహిస్తోంది. ఈ హైటెక్ బాగోత ద్వారాకోట్ల రూపాయలు నిర్వాహకులు దండుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. హైటెక్ పేకాట నిర్వహిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. -
టీడీపీ నేత ప్రదీప్ చౌదరిపై గురి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ నియోజక వర్గం శ్రీనగర్ కాలనీ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రధాన అనుచరుడైన వి.ప్రదీప్ చౌదరిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో గతంలో బెదిరింపుల కేసు నమోదైంది. ఈ కేసును ఇప్పుడు పోలీసులు తిరగదోడుతున్నారు. ఈ కేసులో ప్రదీప్ చౌదరి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ప్లాట్ నెం.697లో 7069 గజాల స్థలాన్ని కె.రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి 1995లో జూబ్లీహిల్స్‌కు చెందిన జగదీశ్వర్‌రావుతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 2005 జనవరి 13న ప్రదీప్‌చౌదరి, జగదీశ్వర్‌రావు, మాగంటి గోపినాథ్, అమర్‌గౌడ్‌లతో పాటు 25 మంది రౌడీలు ఈ ప్లాట్‌ను ఆక్రమించడమే కాకుండా అక్కడ ఉన్న రవీందర్‌రెడ్డి మనుషులను బెరించి తరిమికొట్టారు. దీంతో రవీందర్‌రెడ్డి మేనేజర్ జి.తిరుమల్‌రెడ్డి అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ప్రదీప్‌చౌదరితో పాటు రౌడీలంతా అక్కడి నుంచి పరారయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసులో ఏ-1గా జగదీశ్వర్‌రావు, ఏ-2గా మాగంటి గోపినాథ్, ఏ-3గా ప్రదీప్‌చౌదరి, ఏ-4గా అమర్‌గౌడ్‌తో పాటు 22 మందిపై ఐపీసీ సెక్షన్ 147, 148, 452, 506, 7(1) ఆఫ్ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్స్ కింద కేసులు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో వీరంతా ముందస్తు బెయిల్ పొందారు. ఇప్పటికీ ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు ఈ కేసును తిరగదోడాలని నిర్ణయించుకున్న పోలీసులు వివరాల సేకరణ మొదలెట్టారు. ఏ ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయని ఆరా తీస్తున్నారు. -
దర్శకుడు పూరీజగన్నాథ్ ఇంట్లో చోరీ
-
దర్శకుడు పూరీజగన్నాథ్ ఇంట్లో చోరీ
హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ నివాసంలో భారీ చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 31లో నివసించే పూరి జగన్నాథ్ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బెడ్రూమ్లో ఉన్న అలమరా తాళాలు తీసి బంగారు ఆభరణాలు తస్కరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలమరాలోని సుమారు రూ.15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, అరుదైన డిజైన్లు, వజ్రాలు పొదిగిన నెక్లెస్ ఉన్నట్లు పేర్కొన్నారు.