
బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ పోలీస్‌లైన్స్‌లో నివాసం ఉంటున్న రసమోని మీనాక్షి(19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈనెల 11న మీనాక్షి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి వెంకటయ్య తన కూతురు కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఆచూకి తెలిసిన వారు 81858 55212, 9346249416 లలో తెలియజేయాలని పోలీసులు కోరారు.
(చదవండి: భూ వ్యవహారంలో రూ.2కోట్ల మోసం)