
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): అందరి ముందు మందలించినందుకు మనస్థాపానికి గురైన ఓ యువతి ఇంట్లో చెప్పకుండా అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం...యూసుఫ్‌గూడ లక్ష్మినరసింహనగర్ బస్తీలో నివసించే ఇ.శివకుమార్ ఈ నెల 3వ తేదీన రాత్రి తన సోదరుడు కృష్ణయ్య ఇంట్లో ఫంక్షన్‌కు కూతురు మానస(19)ని తీసుకొని వెళ్లాడు.
బంధువుల ముందే మానస అవసరం లేకున్నా అటూ.. ఇటూ.. తిరుగుతుండటంతో తండ్రి మందలించాడు. మనస్థాపానికి గురైన ఆ యువతి తెల్లవారుజామున 5.30 గంటలకు ఇంట్లో చెప్పకుండా అదృశ్యమైంది. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment