
అత్తాపూర్: ఆడపిల్ల పుడుతుందని గర్భవతిగా ఉన్న భార్యను పుట్టింటికి పంపించిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హసన్‌నగర్‌కు చెందిన అక్బర్‌ఖాన్‌కు ఐదేళ్ల క్రితం హుమేరా బేగంతో వివాహం జరిగింది. మొదటి సంవత్సరం ఒక ఆడపిల్లకు జన్మనిచి్చనప్పుడే ఆడపిల్లను కన్నావంటూ ఆమెపై దాడి చేశారు.
ఆ సమయంలో బాధితురాలు రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో అక్బర్‌ఖాన్‌తో పాటు అత్తమామలపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చడంతో ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో హుమేరా బేగంను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీనిపై బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.