attapur
-
లారీకి రూ.25 వేలు తీసుకుని కెమికల్స్ ను మూసీలోకి వదులుతున్న ముఠా
-
అత్తాపూర్ లో ఘోర అగ్ని ప్రమాదం
-
పిస్తా హౌస్‌లో రౌడీ షీటర్ల వీరంగం.. కస్టమర్లపై దాడి
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని ఓ హోటల్లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించి భోజనం చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. హోటల్లో సామాగ్రి ధ్వంసం చేసి భోజనం చేస్తున్న యువకులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో భయంతో బయటకు యువకులు పరుగులు తీశారు. పార్కింగ్ వద్ద హంగామా సృష్టించిన రౌడీషీటర్లు టూ వీలర్స్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బంది పై దాడికి దిగారు. సీసీ టీవీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. హోటల్లోకి మొత్తం 17 మంది గ్యాంగ్ సభ్యులు వచ్చారు. మొబైల్ ఫోన్లో వీడియోలు తీస్తూ రెచ్చిపోయారు. ఒక్కసారిగా కస్టమర్స్ భయబ్రాంతులకు గురయ్యారు. అత్తాపూర్ పోలీసులకు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గాలిపటం ఎగురవేస్తూ 11 ఏళ్ల బాలుడు మృతి
-
HYD: సంక్రాంతి పండుగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ..
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కైట్ ఎగరవేస్తూ విద్యుత్ తీగలకు బాలుడు తాకాడు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. గాలి పటాలు ఎగుర వేయడానికి తన స్నేహితులతో కలిసి మేడపైకి వెళ్లిన తనిష్క్.. పతంగి ఎగరేస్తూ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతిచెందాడు. బాలుడు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లిఫ్టులో ఇరుక్కొని.. రెండు కాళ్లు పోగొట్టుకున్న మెకానిక్
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్‌లోని ఓ హోటల్ లిఫ్టులో ఇరుక్కొని ఓ మెకానిక్ రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. లిఫ్టులో ఇరుక్కున్న పోలీస్ అధికారిని రక్షించేందుకు వచ్చి మెకానిక్ ప్రమాదవశాత్తు లిఫ్టులో ఇరికి రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం అత్తాపూర్‌లోని ఎస్వీఎం గ్రాండ్ బాంకెట్ హాల్లో సోమవారం రాత్రి విందును ఏర్పాటు చేసింది. ఈ విందు కోసం స్నేహితులను బంధువులను ఆహ్వానించారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ పోలీసు అధికారి సత్యనారాయణ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విందుకు హాజరయ్యేందుకు వచ్చారు. మొదట కుటుంబ సభ్యులు లిఫ్ట్ ద్వారా పైకి వెళ్లిన అనంతరం కిందికి వచ్చింది. పోలీసు అధికారితో పాటు మరో నలుగురు లిఫ్టులో ఎక్కారు. మొదటి అంతస్తుకు వెళ్ళగానే ఆ లెఫ్ట్ కాస్త చెడిపోయింది. దీంతో నిర్వాహకులు ఒరిస్సాకు చెందిన నిరంకర్ అనే లిఫ్ట్ మెకానిక్‌ను హోటల్ వద్దకు రప్పించి మరమ్మతులు ప్రారంభించారు. పోలీసు అధికారిని బయటకు తీశాడు. అనంతరం మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో ఇరికిపోయాడు. దీంతో రెండు కాళ్లు కాస్త అందులో నుజ్జు నుజ్జు అయ్యాయి. అప్పటికే చేరుకున్న ఇతర ఎలక్ట్రీషియన్లు మరమ్మతులు చేపట్టి గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చదవండి: హైదరాబాద్: మియాపూర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం -
డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త.. లేకపోతే ఇలానే ప్రమాదానికి గురవ్వాల్సిందే!
-
బతుకులు బుగ్గి! అప్పుడు క్రాకర్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికిల్స్..
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని దుకాణాలు, కంపెనీలు, సంస్థలు, గోదాముల్లో అగ్ని ప్రమాదాలు కలవరం రేపుతున్నాయి. నాటి కార్తికేయ లాడ్జి, నేటి రూబీ లాడ్జీ ఉదంతాల్లో మాత్రం ఓ సారూప్యత ఉంది. మొదట అగ్ని ప్రమాదం ఈ రెండింటిలోనూ ప్రారంభంకాలేదు. వీటికి కింది అంతస్తుల్లో ఉన్న దుకాణాల్లో మొదలైన అగ్గి లాడ్జీలో బస చేసిన వారి ఉసురు తీసింది. ప్రమాదాలు ఎలా జరిగాయంటే.. ఉస్మాన్‌గంజ్‌లోని ప్రధాన రహదారిపై ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్లో శాంతిఫైర్ వర్క్స్ ఉంది. దీని మొదటి అంతస్తులో కెనరా బ్యాంక్ శాఖ ఉండగా... రెండు, మూడు అంతస్తుల్లో కలిపి కార్తికేయ లాడ్జి నడిచేది. ఈ రెండు ఉదంతాల్లోనూ మృతులు బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఘరానా దొంగ మారుతి నయీం 2002 అక్టోబర్ 23న శాంతి ఫైర్ వర్క్స్‌లో చోరీ చేయడానికి వచ్చాడు. తన కారును అడ్డంగా పెట్టి షట్టర్ పగులకొట్టిన నయీం దుకాణంలోకి ప్రవేశించాడు. అందులో నగదు లభించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడ ఉన్న క్రాకర్స్‌ను నిప్పు పెట్టాడు. అలా మొదలైన మంటలు పై అంతస్తులకు పాకాయి. బ్యాంక్ దగ్ధం కాగా.. కార్తికేయ లాడ్జీలో బస చేసిన వాళ్లు, సిబ్బందితో సహా మొత్తం 12 మంది చనిపోయారు. తాజాగా సోమవారం రాత్రి జరిగిన రూబీ లాడ్జి ఉదంతమూ ఈ కోవకు చెందినదే. దీని సెల్లార్లో ఉన్న ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్‌లో అగ్గి రాజుకుంది. ఈ ధాటికి విడుదలైన మంటలు, పొగ.. పైన ఉన్న లాడ్జీలో బస చేసిన ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. మరో 10 మంది క్షతగాత్రులుగా మారారు. (క్లిక్ చేయండి: చివరి నిమిషంలో రూబీ లాడ్జీలో దిగి.. మృత్యువు పిలిచినట్టు..) నగరంలో భారీ అగ్ని ప్రమాదాల్లో మరికొన్ని.. ► 21.10.2006: సోమాజిగూడలోని మీన జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో పెయింటింగ్ పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిద్రిస్తున్నారు. కింది ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంతో పెయింట్లు కాలి, విడుదలైన విష వాయువులతో ముగ్గురు చనిపోయారు. ► 24.11.2012: పుప్పాలగూడలోని బాబా నివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. వాచ్‌మన్‌తో పాటు స్థానికుల అప్రమత్తత కారణంగా దాదాపు మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ► 22.02.2017: అత్తాపూర్‌లోని పిల్లర్ నెం.253 సమీపంలో ఉన్న చిన్నతరహా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల పరిశ్రమలో మంటలు చెలరేగి ఆరుగురు ఒడిశాకు కార్మికులు చనిపోయారు. ► 23.03.2022: న్యూ బోయగూడ వద్ద శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో ఉన్న స్క్రాప్ గోదాంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 11 మంది బిహార్ కార్మికులు మృత్యువాత పడ్డారు. (క్లిక్ చేయండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: నిప్పుల్లో నిబంధనలు) -
హైదరాబాద్‌లో ఎంజీ మోటార్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభం!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ హైదరాబాద్‌లో సరికొత్త సర్వీస్ సెంటర్ ప్రారంభించింది. ఈ సర్వీస్ సెంటర్ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. నగరంలో కస్టమర్ల మొబిలిటీ అవసరాలను తీర్చడానికే ఈ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించినట్లు ఎంజీ మోటార్స్ ప్రతినిధులు తెలిపారు. ఇక ఎంజీ మోటార్స్ దేశ వ్యాప్తంగా 310 టచ్ పాయింట్ కేంద్రాలు ఉండగా..తెలంగాణలో 13టచ్పాయింట్లను నిర్వహిస్తుంది. 2022 చివరి నాటికి రాష్ట్రంలో 18 టచ్పాయింట్లకు విస్తరించాలని యోచిస్తుంది. ఈ సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ఉదిత్ మల్హోత్రా మాట్లాడుతూ అత్తాపూర్ లో ఎంజీ మోటార్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభంతో తన ఉనికిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు చేరువయ్యే ప్రణాళికలకు అనుగుణంగా ఉందన్నారు. తద్వారా ఈ సదుపాయం సర్వీసు, విడి భాగాలతో పాటు ఇతర అవసరాలను అందిస్తుందని స్పష్టం చేశారు. -
రోడ్డు దాటుతున్న మహిళలపైకి దూసుకెళ్లిన బైకిస్ట్
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ పిల్లర్ నంబర్ 143 వద్ద రోడ్డు ప్రమదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను బైక్ ఢీ కొట్టడంతో వారికి గాయాలయ్యాయి. ఆ వివరాలు.. రాజేంద్రనగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తుండగా అత్తాపూర్ వద్ద ఇద్దరు మహిళలను బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. (చదవండి: విందుకు వెళ్తుండగా మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్) ప్రమాదానికి కారణమైన బైక్ ఓనర్ రాజు తన ఫ్రెండ్ అయిన శివ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజు బైక్ తన లైసెన్స్ ఆర్సీ ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం మహిళల ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. చదవండి: బాచుపల్లి: తీరని శోకాన్ని మిగిల్చిన ‘ఓవర్టేక్’ -
సిల్వర్ ఫాయిల్ సిస్టర్స్
సాధారణంగా గోల్డ్ ఫాయిల్‌ను ఉపయోగించి తంజావూరు పెయింటింగ్స్‌ను డిజైన్ చేస్తారు. అయితే హైదరాబాద్ అత్తాపూర్‌లో ఉంటున్న నిఖిత, అల్కాలు సిల్వర్ ఫాయిల్‌ను ఉపయోగించి, కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. వైకుంఠపాళీ, అష్టాచెమ్మా, లూడో వంటి గేమ్ బోర్డులను సిల్వర్ ఫాయిల్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. దేవతామూర్తులు, ఫోటో ఫ్రేమ్‌లు, వాల్ క్లాక్‌లు, వాల్ ఫ్రేమ్స్, హ్యాంగింగ్స్.. ప్రతీ డిజైన్ వెండివెన్నెలలా చూపరులను ఆకట్టుకునేలా డిజైన్ చేస్తూ, వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇద్దరూ దూరపు బంధువులు. వరసకు అక్కాచెలెళ్లు. ఇద్దరూ గృహిణులుగా తమ తమ ఇంటి బాధ్యతలను చక్కబెట్టుకుంటూ, పిల్లల పనులు చూసుకుంటున్నారు. ‘ఎన్ని పనులున్నా మనలోని అభిరుచికి మెరుగులు దిద్దుకోవాల్సింది మనమే. అందుకే, కొంత సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాం’ అని వివరించారు ఈ కజిన్స్. రోజూ ఎనిమిది గంటలు నిఖిత, అల్కా ఇద్దరూ బి.కామ్ డిగ్రీ పూర్తి చేశారు. ‘ఆసక్తి కొద్దీ ఆభరణాల తయారీ కోర్సు చేశాను’ అని చెప్పిన నిఖిత పదేళ్ల పాటు అందమైన ఆభరణాలను రూపుకట్టారు. ‘దాదాపు వందకు పైగా ఎగ్జిబిషన్లలో నా ఆభరణాలను ప్రదర్శించాను. కరోనా సమయంలో మాత్రం కొత్తగా ఆలోచించాలనుకున్నాను. ఇంటి నుంచే కొత్త వర్క్ తో నా ప్రెజెంటేషన్ ఉండాలనుకున్నాను. అప్పుడే సిల్వర్ ఫాయిల్ ఐడియా వచ్చింది. ఈ విషయాన్ని అల్కాతో చర్చించినప్పుడు మంచి ఆలోచన అంది. తంజావూర్ పెయింటింగ్స్‌లో గోల్డ్ ఫాయిల్‌ను ఉపయోగిస్తారు. అది ఖర్చుతో కూడుకున్నది కూడా. అందుకే మేం సిల్వర్ ఫాయిల్ గురించి ఆలోచించాం. దీంతో ఇద్దరం సిల్వర్ ఫాయిల్‌తో రకరకాల ఫ్రేమ్స్ తయారు చేశాం. వీటిని మిగతా వేటి వేటికి జత చేయచ్చో ఒక ప్లాన్ వేసుకున్నాం. కలపకు సిల్వర్ ఫాయిల్‌ను జత చేస్తూ చాలా ప్రయోగాలే చేశాం. జ్యువెలరీ బాక్సులు, వాచీలు, గేమ్ బోర్డులు.. ప్రతీది ప్రత్యేకం అనిపించేలా డిజైన్ చేశాం’ అని వివరించింది నిఖిత. ‘ఈ వర్క్ లో ఇద్దరం గంటల గంటల సమయం కేటాయించాం. అందుకు మా కుటుంబాలు కూడా సపోర్ట్‌గా ఉన్నాయి. ఫ్రేమ్స్‌కు నాలుగైదు రోజుల సమయం సరిపోతుంది. కానీ, గేమ్ బోర్డులకు పది నుంచి ఇరవై రోజులైనా సమయం పడుతుంది. దాదాపు రోజూ ఎనిమిది నుంచి పది గంటలైనా వీటి తయారీకి కేటాయిస్తాం’ అని తమ వర్క్ గురించి వివరించింది అల్కా. ప్రత్యేకమైన కానుకలు ‘మేం చేసే డిజైన్స్‌లో మరోదాన్ని పోలిన డిజైన్ ఉండదు. దేనికది ప్రత్యేకం. పెళ్లి్ల, పుట్టినరోజు, గృహప్రవేశాలు వంటి వేడుకలకు ఏదైనా కానుక తీసుకెళ్లాలనుకుంటారు. అదే సమయంలో కానుక తీసుకున్నవాళ్లు ఇంట్లో తీపి జ్ఞాపకంగా అలంకరించుకోవాలనుకుంటారు. ఎన్నేళ్లయినా ప్రత్యేకంగా ఉండే సిల్వర్ ఫాయిల్‌తో డిజైన్స్ తీసుకు రావాలనుకున్నాం. మేం ‘నకాషి’ పేరుతో మా బ్రాండ్‌ను పరిచయం చేస్తున్నాం. ఈ డిజైన్స్‌లో స్వరోస్కి, జెమ్స్ కూడా ఉపయోగిస్తాం. డిజైన్, సైజును బట్టి ధరలు ఉంటాయి. పెట్టుబడి ఇద్దరిది, రాబడి ఇద్దరిదీ’ అంటూ కలిసి పనిచేస్తే కలిగే లాభం గురించి, పంచుకున్న పని రోజుల గురించి ఆనందంగా తెలిపారు ఈ సిల్వర్ ఫాయిల్ సిస్టర్స్. – నిర్మలారెడ్డి -
మాయమైపోతున్న మనిషి!
సాక్షి, హైదరాబాద్: రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో పట్టపగలు, నడిరోడ్డుపై ఇద్దరు హైకోర్టు న్యాయవాదులను వేట కొడవళ్లతో నరికి చంపుతుండగా వంద మందికిపైగా ప్రత్యక్ష్యంగా చూశారు. అయినా ఈ పాశవిక ఘటనను ఒక్కరంటే ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం సమాజంలో మానవ విలువలు మృగ్యం అవుతున్నాయనేందుకు నిదర్శనం. పాత కక్షల కారణంగా జరిగిన జంటహత్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పట్టపగలు, నడిరోడ్డు మీద కాపుకాసి, దాడి చేసి అత్యంత పాశవికంగా హతమార్చిన తీరు చాలా ఆందోళనకరం. మంథని డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సుల నిండా జనం ఉన్నారు. ఆ బస్సులు హత్య జరుగుతున్నంత సేపు హత్యోదంతాన్ని చూసి, నిందితులు పరారయ్యాక అక్కడి నుంచి కదిలారు. అంతేకాకుండా కల్వచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు, ఆ దారి వెంబడి వెళ్తున్న వారు, బైక్‌పై వెళ్తున్నవారు దాదాపు 100 మందికిపైగా అక్కడే ఆగిపోయారు. దారుణం జరుగుతున్నంత సేపు తమ జేబుల్లో ఉన్న సెల్ఫోన్లకు పనిచెప్పారే తప్ప.. ఎవరూ కూడా వారిని ఆపేందుకు సాహసించలేదు. నిందితులు అక్కడ నుంచి వెళ్లిపోయారని నిర్ధరించుకున్నాక.. కొన ఊపిరితో ఉన్న వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తూ వీడియోలు తీశారు. పట్టపగలు జరిగిన ఈ ఘోరాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు వంద మంది. వీరిలో చాలామంది వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అప్పటి నుంచి సోషల్‌మీడియాలో పోస్టులు, స్టేటస్లు పెడుతూ సమాజాన్ని, పోలీసులను, రాజకీయ నేతలను నిందిస్తున్నారు. ఘటనాస్థలంలో ఉన్నప్పుడు హత్యోదంతాన్ని వేడుకలా చూసి, తీరా అక్కడి నుంచి వెళ్లిపోయాక బాధ్యత, సమాజం, అన్యాయం అంటూ సోషల్ మీడియాలో ఖండిస్తున్నారు. అసలు ప్రత్యక్ష సాక్షులు అంతమంది ఉన్నా.. వారిలో ఎంతమంది కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతారన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిందే. హేయమైన చర్యలు.. రాజకీయ నేతలే ఇలాంటి హత్యలకు దిగడం అత్యంత హేయమైన చర్చగా చెప్పొచ్చు. అందులోనూ హైకోర్టు లాయర్లయిన గట్టు వామనరావు, పీవీ నాగమణిలను వేటాడి వేట కొడవళ్లతో నరకడం చాలా దారుణం. రాష్ట్రంలో ఇలాంటి ఘటన మొదటిది కాదు. గతంలోనూ పలు ఉదంతాలు జరిగాయి. అయితే, అందులో బాధితులు, నిందితులు సామాన్యులు. కానీ ఈ ఘటనలో సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న వ్యక్తుల హస్తం ఉండటం అన్ని వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలో పట్టపగలు జరిగిన దారుణ హత్యలన్నీ కూడా హైదరాబాద్‌లోనే చోటు చేసుకున్నాయి. ఈ వికృత సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ విస్తరించడం ఆందోళన కలిగించే పరిణామం. రాళ్లతో నుజ్జునుజ్జుగా.. (రాజేంద్ర నగర్ హత్య జనవరి11, 2021) రాజేంద్రనగర్‌లో జనవరి 11వ తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన ఖలీల్‌ను అత్తాపూర్‌లో నడిరోడ్డు మీద ప్రజలంతా చూస్తుండగా అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్లతో దాడి చేస్తూ, తరుముతూ గాయపరిచారు. కిందపడిన వెంటనే వ్యక్తి చనిపోయాడు. రాళ్లతో శవాన్ని కొడుతూ, నుజ్జునుజ్జుగా చేస్తూ తమ పాశవికతను ప్రదర్శించారు. ఈ హత్యను పలువురు వాహనదారులు వీడియోలు తీసి వైరల్ చేశారు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ ముందే.. (జూన్ 26, 2019) హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజగుట్ట ఠాణా ముందు జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. సయ్యద్ అన్వర్ అనే ఆటోడ్రైవర్‌పై మరో ఆటోడ్రైవర్ రియాసత్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ ప్రాణ భయంతో పంజగుట్ట స్టేషన్లోకి పరిగెత్తాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అన్వర్ కన్నుమూశాడు. ఈ హత్యోదంతం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. దగ్గరికి వెళ్లేందుకు జంకిన పోలీసులు.. (నయాపూల్ మర్డర్.. 2018, నవంబర్ 28) ఆటోడ్రైవర్ గొంతుకోసి, పోలీసుల ముందే 2018 నవంబర్‌లో నయాపూల్ వంతెన పక్కన జరిగిన మరో హత్య కూడా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. షకీర్ ఖురేïÙ, అబ్దుల్ ఖాజా ఇద్దరూ ఆటోడ్రైవర్లు. ఆటో అద్దెల విషయంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అవి తీవ్రమవడంతో షకీర్ ఖురేïÙని అబ్దుల్ ఖాజా కత్తితో పొడిచి చంపాడు. షకీర్‌ను చంపాక, ఖాజా అక్కడే కత్తి పట్టుకుని హల్చల్ చేశాడు. ఈ హత్య అనంతరం నిందితుడిని పోలీసులు కనీసం ప్రతిఘటించలేకపోవడం, కనీసం అతడిని సమీపించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. పోలీసుల ముందే హత్య.. అత్తాపూర్ మర్డర్ (సెప్టెంబర్ 26, 2018) 2018 సెపె్టంబర్ 26న అత్తాపూర్ పిల్లర్ నంబర్ 138 వద్ద రమేశ్ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. మహేశ్ అనే యువకుడి హత్య కేసులో రమేశ్ నిందితుడిగా ఉన్నాడు. ఇదే కేసులో కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా.. మహేశ్ తండ్రి రమేశ్‌ను అత్తాపూర్ వద్దకు రాగానే మరో వ్యక్తి సాయంతో గొడ్డళ్లతో నరికి చంపాడు. ఈ హత్య జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు, పెట్రో కార్ సిబ్బంది కనీసం స్పందించలేదు. మనకెందుకులే అన్న ధోరణి సమాజంలో తోటి మనిషి పట్ల జాలి చూపే గుణం రోజురోజుకూ తగ్గిపోతుంది. ముఖ్యంగా గతంలో రోడ్డుపై ఎవరైనా దాడి చేస్తుంటే.. దారిన వెళ్లేవాళ్లు నచ్చజెప్పేవారు, వారిని నిలువరించేవారు. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. జరుగుతున్న దాడిని ఆపాల్సింది పోయి జేబులోని సెల్‌ఫోన్ తీసి వీడియోలు తీసే సంస్కృతి ఆందోళన కలిగిస్తోంది. కనీస బాధ్యతగా రక్షించాల్సిన తోటిపౌరులే ప్రేక్షకులుగా మారడం శోచనీయం. ‘ఎవరిని ఎవరు చంపితే మనకెందుకులే మనం బానే ఉన్నాం కదా’అనే సంకుచిత ధోరణి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారే తాము ఎలాంటి సాయం చేయకపోగా.. వ్యవస్థలను నిందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. –వీరేందర్, సైకాలజిస్టు చదవండి: న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు -
హైదరాబాద్: సునామీ వచ్చిందా ఏంటి?
సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి మెహదీపట్నం దగ్గర వాటర్ పైప్‌లైన్ లీకైంది. దీంతో రోడ్డు మొత్తం జలమయమైపోయింది. పిల్లర్ నంబరు 53 దగ్గర పైప్ పగిలి నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. గ్యాలన్ల కొద్దీ నీరు వృథాగా పోయింది. రేతిబౌలి- అత్తాపూర్ మార్గంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ(హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మరమతులు చేపట్టింది. కాగా పైప్‌లైన్ లీకేజీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘‘మొన్నటి దాకా వరదలు.. ఇప్పుడు ఇక్కడ సునామీ కూడా వచ్చిందా ఏంటీ.. నీళ్లు వృథాగా పోనివ్వకండి. అధికారులు కాస్త శ్రద్ధ వహించండి’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: వచ్చే నెల నుంచి ఉచిత తాగునీరు : కేటీఆర్) మన అత్తాపూర్ లో.. పిల్లర్ నంబర్ 53 దగ్గర.. వాటర్ పైప్ లైన్ పగిలి ఇలా అన్నమాట.. pic.twitter.com/GDICsF3xmV — Phani Kandukuri (@buduggadu) December 19, 2020 -
రియల్టర్ దారుణ హత్య
సాక్షి, అత్తాపూర్: భూతగాదాలతో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఏసీపీ ఆశోకచక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన జావిద్(40) రియల్టర్‌గా ఉన్నాడు. బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులకు జావిద్‌కు గత కొంతకాలంగా ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ నేపధ్యంలో మంగళవారం రాత్రి శివరాంపల్లి ప్రాంతానికి జావిద్‌ను భూమి విషయమై మాట్లాడుకుందామని రప్పించారు. ఈ నేపధ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆవేశంలో సదరు వ్యక్తులు శివరాంపల్లి ప్రజాభవన్ వద్ద జావిద్‌ను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి పరారైయ్యారు. దీంతో తీవ్రగాయాలైన జావిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రెండు సెల్ఫోన్లు, ఐ–10 కారు, నంబరు లేని పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. సెల్ఫోన్ల కాల్ డేటాలను సైతం పరిశీలిస్తామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైన్స్‌కు కన్నం.. నగదు, మద్యం మాయం!
సాక్షి, హైదరాబాద్: వైన్స్ షాపులు నిత్యం రద్దీగా ఉంటాయి. వీటిలో మద్యానికి, కాసులకు కొదువ ఉండదు. అందుకే దొంగలు వినూత్నంగా ఆలోచించారు. ఇళ్లకు కాకుండా ఈసారి ఏకంగా మద్యం దుకాణానికి కన్నం వేశారు. అర్ధరాత్రి ఎవరూలేని వేళ మద్యం దుకాణానికి పైకప్పు నుంచి రంధ్రం చేసి.. అందులోకి దూరిపోయారు. వైన్స్ షాపులోని డబ్బుతోపాటు అందినకాడికి మద్యం బాటిళ్లు ఎత్తుకుపోయారు. రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని మంజు వైన్స్షాపులో ఈ చోరీ జరిగింది. మంజు వైన్స్‌కు పైనుంచి రంధ్రం చేసి.. అందులోకి దూరిన దొంగలు.. భారీగా నగదు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
గొడవ చేయొద్దన్నందుకు.. దారుణంగా హత్య
సాక్షి, హైదరాబాద్: ఫంక్షన్ వద్ద తాగి గొడవ చేయొద్దు అనడంతో ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సులేమాన్‌నగర్ ప్రాంతానికి చెందిన ఇక్బాల్ కుమారుడు ఫిరోజ్ (22) శనివారం రాత్రి చింతల్మెట్లోని ఉర్దూ మాధ్యమం పాఠశాల వద్ద ఓ వివాహ విందుకు హాజరయ్యాడు. అయితే విందు సమీపంలో స్థానిక యువకులు సర్వర్, మోసీన్ మద్యం తాగి గొడవ పడుతున్నారు. అక్కడకు వెళ్లిన ఫిరోజ్ గొడవపడొద్దని వారిని వారించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది మనసులో పెట్టుకున్న సర్వర్, మోసీన్ ఫిరోజ్‌పై దాడి చేయాలని పథకం పన్నారు. అర్ధరాత్రి సమయంలో ఫిరోజ్‌ను ఇంటి నుంచి బయటకు పిలిచి కత్తులతో పొడిచారు. తీవ్ర గాయాలపాలవడంతో ఫిరోజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సర్వర్, మోసిన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి చింతల్మెట్లో హత్య జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. -
హైదరాబాద్ అత్తాపూర్‌లో ఘనంగా కుస్తీ పోటీలు
-
అత్తాపూర్ మహిళల హత్య కేసులో పురోగతి
-
పోలీసులు ఉన్నా.. హత్యను ఆపలేకపోయారు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అత్తాపూర్‌లో బుధవారం పట్టపగలు జరిగిన రమేష్ దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులే కాదు.. సామాన్యులనూ ఉలిక్కిపడేలా చేసింది. రమేష్‌ను ఇద్దరు వ్యక్తులు వెంటాడి మరీ నరుకుతుంటే పోలీసులు సమీపంలో ఉండి కూడా స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏ కష్టమొచ్చినా, ముప్పు ఎదురైనా ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులే. అలాంటి ఖాకీలే చేష్టలుడిగి చూస్తుంటే తమకు ఇక రక్షణ ఎక్కడన్నది ఇప్పుడు ప్రతి వ్యక్తి మదినీ తొలుస్తున్న ప్రశ్న. ‘ఆధునికత’ అంటూ దూసుకుపోతున్న పోలీసింగ్‌లో ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయని పోలీస్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వచ్చినా ఉపయోగమేంటి? అత్తాపూర్‌లో జరిగిన ఉదంతాన్నే తీసుకుంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు నడిరోడ్డుపై ఛేజింగ్ జరిగింది. ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు వెంటాడుతూ చంపడానికి ప్రయత్నించారు. ‘డయల్–100’కు ఫోన్ చేసినా.. ఐదు నిమిషాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉది.. అయితే అలా వచ్చిన పోలీసుల స్పందన ఏంటన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. రమేష్‌ను హత్య చేస్తున్న సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసు వాహనంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అందులోంచి దిగిన ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు ప్లాస్టిక్ లాఠీలతో హతుడు, హంతకుల సమీపం నుంచి తిరిగారే తప్ప అడ్డుకోవడానిగాని, హంతకులను బంధించడాని గాని ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఫోన్ వచ్చాక ఎంత తక్కువ సమయంలో స్పందించినా ఉపయోగమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయుధం ఉంటే తప్పేంటి? రమేష్ హత్య ఉదంతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్, క్రైమ్ కానిస్టేబుళ్లు సరిగ్గా స్పందించక పోవడానికి ప్రధాన కారణం వారు నిరాయుధులై ఉండడం. ఆయుధం అవసరం లేని ట్రాఫిక్ పోలీసులు.. అవసరమైన క్రైమ్ పోలీసులు సైతం ‘ఒట్టి చేతుల తో’ ఉండాల్సి వచ్చింది. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాలు అమల్లోకి వచ్చాక ఆయుధాలు అటకెక్కాయి. ఒకప్పుడు ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు రివాల్వర్స్ లేదా పిస్టల్స్, ఆ కింద స్థాయి సిబ్బంది వద్ద 303 లేదా ఎస్ఎల్ఆర్లు ఉండేవి. ఆయుధం పోలీసులకు యూనిఫాంలో భాగమే కాదు.. శరీరంలో భాగం లాంటిదని వారికి శిక్షణ నుంచే చెబుతుంటారు. అలాంటిది ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఈ ఆయుధాలను పక్కన పెట్టేశారు. చంపైనా ప్రాణాలు కాపాడుకునే అవకాశం.. సమాజంలో ప్రతి వ్యక్తికీ ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉంటుంది. దాడి చేస్తూ ప్రాణహాని తలపెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చంపైనా తనను తాను కాపాడుకునే అవకాశాన్ని చట్టం సామాన్య ప్రజలకే కల్పించింది. పోలీసులకు కూడా కళ్ల ముందు దారుణం జరుగుతుంటే దుండగులను కాల్చడమో, గాల్లోకి కాల్పులు జరిపి నిలువరించి పట్టుకోవడమో చేసే అధికారం ఉంటుంది. అత్తాపూర్ ఉదంతంలో ఆ కానిస్టేబుళ్ల వద్ద తుపాకీ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని నిపుణులు చెబుతున్నారు. రాజధానిలోనూ ఇదే పరిస్థితా? ‘సాఫ్ట్ టార్గెట్’గా పేరున్న హైదరాబాద్ అనునిత్యం ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉంటుంది. స్థానిక ఉగ్రవాదుల నుంచి జాతీయ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థల వరకు అదను చూసి గురిపెడుతుంటాయి. నిత్యం కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి రాజధాని నగరంలో నిరాయుధులతో పోలీసింగ్ సురక్షితం కాదని పోలీస్ శాఖకు చెందిన నిపుణులు చెబుతున్నారు. బృందాలుగా రంగంలోకి దిగడం, బాంబు పేలుళ్ల వంటివి కాకుండా తుపాకులతో జనసమర్థ ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు. సామాన్యులపై విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఉదంతమే పోలీసులకు ఎదురైతే పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాలు తెచ్చుకోవడమో, ‘ఇంటర్సెప్షన్’ వాహనాన్ని పిలవడమో చేయాలి. (ఈ వాహనాల్లోనే ఆయుధాలతో పోలీసులు ఉంటారు. ఇలాంటివి 17 వెహికల్స్ సిటీలో మాత్రమే ఉన్నాయి) ఈ లోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. బ్యాంకుల వద్ద కాపలా కాసే సెక్యూరిటీ గార్డుల వద్దే తుపాకీ ఉండగా పోలీసుల వద్ద ఉండకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మూడు కమిషనరేట్లలో పరిస్థితి ఇదీ.. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో కలిపి 140 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటిని మినహాయించినా మిగిలిన వాటిలో ప్రతి ఠాణాకు కనిష్టంగా ఒకటి, గరిష్టంగా 3 చొప్పున పెట్రోలింగ్ కోసం ఇన్నోవా వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనంలో డ్రైవర్ సహా నలుగురు నుంచి ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరికి హెడ్–కానిస్టేబుల్ లేదా ఏఎస్సై నేతృత్వం వహిస్తారు. ఆ వాహనంలో ప్రాథమిక చికిత్స చేసే కిట్లు, రెయిన్కోట్లు, కోన్స్లతో పాటు ప్లాస్టిక్ లాఠీలే ఉంటున్నాయి. అతి తక్కువ వాహనాల్లో మాత్రమే ‘స్టోన్ గార్డ్’ (రాళ్లు తగలకుండా ధరించే కోట్లు) వంటివి ఉంటున్నాయి. ప్రతి ఠాణాకు 2 నుంచి 4 వరకు పెట్రోలింగ్ బైక్‌లు (బ్లూకోల్ట్స్) ఉన్నాయి. దీనిపై ప్రతి షిఫ్ట్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున తమ పరిధుల్లో గస్తీ నిర్వహిస్తుంటారు. వీరి వద్ద వాకీటాకీ, ట్యాబ్, సెల్‌ఫోన్ మినహా కనీసం లాఠీ కూడా ఉండదు. అవసరమైనప్పుడే లాఠీలు పట్టుకెళతారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని డివిజన్‌కు ఒకటి చొప్పున మొత్తం 17 ‘ఇంటర్సెప్టార్’ వాహనాలు ఉన్నాయి. ఒక్కో డివిజన్లో 3 నుంచి 5 ఠాణాలు ఉండగా.. ఈ వాహనాల్లోని సిబ్బంది వద్ద మాత్రమే తుపాకులు ఉంటున్నాయి. అదుపు తప్పిన సందర్భాల్లేవ్.. చేతిలో తుపాకీ ఉన్నంత మాత్రాన ఫ్రెండ్లీ పోలీసింగ్ అటకెక్కుతుందని భావించడం సమంజసం కాదన్నది నిపుణుల మాట. నాలుగేళ్ల కిందటి వరకు అన్ని స్థాయిల అధికారుల వద్దా ఆయుధాలు ఉండేవి. దోపిడీ, బందిపోటు ముఠాల కదలికల నేపథ్యంలో ఉమ్మడి సైబరాబాద్‌లో కానిస్టేబుళ్లు ఎస్ఎల్ఆర్లతో పెట్రోలింగ్ చేసేవారు. ఇప్పటి వరకు పోలీసులు అదుపు తప్పిన, విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన సందర్భాలు లేనేలేవు. గడిచిన 15 ఏళ్లలో చూసినా మక్కా మసీదులో పేలుడు జరిగిన 2007 మే 18న మాత్రమే పోలీసు తూటా పేలింది. అది కూడా అల్లరిమూకలు పెట్రోల్ బంక్‌కు నిప్పు పెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికే కాల్పులు జరిపారు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఎలాంటి కాల్పులు జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుల వెంట తుపాకులు ఉంటే తప్పేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
వీడని భయం
సాక్షి, సిటీబ్యూరో: అత్తాపూర్ పీవీఎన్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్–140 పరిసరాలు ఇంకా భయం గుప్పిట్లోనుంచి తేరుకోలేదు. బుధవారం మధ్యాహ్నం ఇక్కడ రమేశ్ అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన సంఘటనతో స్థానిక వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌లు నడిరోడ్డుపై రమేశ్‌ను గొడ్డలితో నరికి చంపిన ఉదంతం వారిని కలచివేసింది. ఈ సంఘటనపై స్థానికులు కొందర్ని సాక్షి మాట్లాడించే ప్రయత్నం చేయగా..వారెవరూ ఇష్టపడలేదు. తాము ఏమీ చూడలేదని పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఘటనాస్థలిలో రమేశ్‌ను గొడ్డలితో నరుకుతున్న కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌లను నిలువరించబోయిన ఇద్దరు వ్యక్తుల ఆచూకీ లభించ లేదు. అయితే వీరి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వారి చిరునామా దొరకబుచ్చుకొని నిందితులను నిలువరించే సాహసం చేసినందుకు సత్కారం చేయాలనుకుంటున్నామని రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి తెలిపారు. నిందితులు కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించామన్నారు. గతేడాది డిసెంబర్ 24న మహేష్గౌడ్ను హత్య చేసినందుకు ప్రతీకారంగా కిషన్‌గౌడ్, లక్ష్మణ్ గౌడ్లు రమేశ్‌ను హతమార్చిన సంగతి తెలిసిందే. ఘటనాస్థలిలో సాయుధపోలీసుల బృందం... బుధవారం హత్య జరుగుతుండగానే పెట్రోలింగ్ వెహికల్ వెళ్లినా నిందితులను నిలువరించేందుకు పోలీసుల వద్ద ఆయధాలు లేకపోవడంతో ప్రేక్షకపాత్రను పోషించారనే విమర్శలు వచ్చాయి. దీంతో భద్రత పెంపుపై పోలీసులు దృష్టిసారించారు. ఘటనాస్థలిలోనే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సాయుధ పోలీసుల బృంద ఇంటర్‌సెప్టర్ వెహికల్‌ను నిలిపి అక్కడే విధులు నిర్వహించడం కనిపించింది. అక్కడే జీహెచ్ఎంసీ సహకారంతో నిర్వహిస్తున్న రూ.5 భోజన కేంద్రం వద్ద అన్నం తినేవారు కరవయ్యారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ కేంద్రం గురువారం బోసిపోయిందని నిర్వాహకులు తెలిపారు. బుధవారం ఘటనాజరిగిన సమయంలో మా కేంద్రం తెరవలేదని చెప్పారు. పోలీసుల అదుపులో మూడో వ్యక్తి..? రమేశ్ బుధవారం ఉప్పర్‌పల్లి కోర్టుకు వచ్చి తిరుగు పయనమవుతున్న సమాచారాన్ని నిందితులకు అందించినట్టుగా భావిస్తున్న విక్రమ్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారి ప్రతి కదలికను నిందితులు కిషన్‌గౌడ్, లక్ష్మణ్గౌడ్లకు చేరవేయడంతో పక్కా ప్లాన్‌తోనే అత్తాపూర్ పిల్లర్ నంబర్ 140 వద్ద అంతమొందించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్నుఅభినందించిన సైబరాబాద్ సీపీ అత్తాపూర్‌లో బుధవారం రమేష్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అభినందించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో లింగమూర్తిని రివార్డుతో సత్కరించారు. ఇలాంటి దారుణమైన ఘటనలు జరిగిన సందర్భంలో పోలీసులతో పాటు పౌరులు కూడా ముందుకు వచ్చి దుశ్చర్యలను అడ్డుకుంటే నేరాలు అదుపులోకి వస్తాయని సజ్జనార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
నడిరోడ్డుపై నరికేస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: గత బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలు... ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ ప్రాంతం... ఇష్టంలేని పెళ్లి చేసుకున్న కుమార్తె మాధవి, అల్లుడు సందీప్‌ను విచక్షణా రహితంగా కొబ్బరిబొండాల కత్తితో నరికిన మనోహరాచారి. ఈ బుధవారం ఉదయం 11.30 గంటలు... అత్తాపూర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నం.140... తన కుమారుడిని చంపిన రమేశ్‌ను వెంటాడి గొడ్డలి, కత్తితో నరికి చంపిన కిషన్‌గౌడ్, సహకరించిన లక్ష్మణ్‌గౌడ్. ఈ రెండు ఉదంతాలు వారం వ్యవధిలో పట్టపగలు నడిరోడ్డుపై చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు ఫ్రెండ్లీ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్‌పై నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల వారు చేష్టలుడిగి చూడటమే గాక సెల్ఫోన్లలో చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రమేశ్ హత్య జరిగిన ప్రాంతంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్, ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు ఉన్నా ఆపలేకపోయారు. ప్లాస్టిక్ లాఠీలతో ఉన్న క్రైమ్ కానిస్టేబుళ్లు, కనీసం అదీ లేని ట్రాఫిక్ కానిస్టేబుల్ మారణాయుధాలతో ఉన్న హంతకుల వద్దకు వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయారు. అంతా అయిన తర్వాత క్రైమ్ కానిస్టేబుళ్లు నిందితుల్ని వాహనంలో ఎక్కించుకుని ఠాణాకు తీసుకు వెళ్లగలిగారు. వెంటే వెళుతూ చిత్రీకరించారు... రమేశ్ హత్య జరిగిన హైదర్‌గూడ ప్రాంతం నిత్యం రద్దీ గా ఉంటుంది. రమేశ్‌ను పిల్లర్ నం.134 వద్ద అడ్డగించిన నిందితులు దాడి చేయడం ప్రారంభించారు. కిషన్ గొడ్డలితో, లక్ష్మణ్ కత్తితో విచక్షణారహితంగా నరకడం, పొడవటం ప్రారంభించారు. ప్రాణభయంతో రమేశ్ పరుగు తీస్తున్నా ఎవరూ ముందుకు రాకపోగా ఇదంతా సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తూ ఉండిపోయారు. ఈ వీడియో లు బుధవారం వైరల్‌గా మారాయి. ఓ షోరూమ్ మేనేజర్ హంతకులను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. నడిరోడ్డుపై జరుగుతున్నా అడ్డుకునే వారు లేకపోవడంతో కిషన్, లక్ష్మణ్‌లు విచక్షణారహితంగా రమేశ్ ను నరికి చంపేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి లక్ష్మణ్‌ను ఎగిరి తన్నినా ఫలితం దక్కలేదు. మాధవి ఉదంతంలోనూ ఓ వ్యక్తి మనోహరాచారిని వెనుక నుంచి తన్నిన విషయం తెలిసిందే. ఆయుధం లేక చేష్టలుడిగిన పోలీసులు... హత్య జరుగుతున్నప్పుడు హైదర్‌గూడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తి విధుల్లో ఉన్నారు. ఆయన ఓ దశ లో హంతకుల్ని అడ్డుకోవడానికి తన చేతిలో ఉన్న హెల్మెట్ విసిరారు. విజిల్ తప్ప ఏ ఆయుధంలేని ట్రాఫిక్ కానిస్టేబుల్ అంతకుమించి ధైర్యం చేయలేకపోయారు. హత్య పూర్తయిన తర్వాత.. హంతకులు అక్కడే ఉండి అరుస్తున్న సమయంలో ఓ దొంగను పట్టుకోవడానికి పెట్రోలింగ్ వాహనంలో ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. వారి వద్దా ప్లాస్టిక్ లాఠీలే ఉండటం... హంతకుల వద్ద మారణాయుధాలు ఉండటంతో పట్టుకునేందుకు ధైర్యం చేయలేదు. గతంలో పెట్రోలింగ్ వాహనంలో ఒకటైనా తుపాకీ ఉండేది. ఫ్రెండ్లీ పోలీ సింగ్ పుణ్యమాని ఆయుధాలన్నీ బెల్ ఆఫ్ ఆరమ్స్గా పిలిచే ఆయుధాగారాలకే పరిమితమయ్యాయి. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులూ వాటిని పట్టుకుని తిరగకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ హత్యనే కాదు.. ఎవరైనా తమను హత్య చేయడానికి వచ్చినా పారిపోవడం మినహా ఎదిరించలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఎవరైనా స్పందించినా ఇబ్బందులే... ఈ ఉదంతం ఇలాఉంటే.. ఎవరైనా కింది స్థాయి పోలీసు సిబ్బంది చాకచక్యంగా స్పందించి, తమకు తోచిన సాయం చేసినా అధికారుల నుంచి మద్దతు లభించట్లేదు. కొన్ని రోజుల క్రితం ఫలక్‌నుమా పరిధిలో జరిగిన వ్యవహారమే దీనికి ఉదాహరణ. అక్కడి ప్రధాన రహదారి పక్కన ఓ వ్యక్తి మరో వ్యక్తిని బండరాయితో మోది చంపడానికి యత్నించాడు. అక్కడే 200 మంది ఉన్నా ఆపలేదు. పెట్రోలింగ్ వాహనం కానిస్టేబుల్ ధైర్యంతో బండరాయి ఎత్తిన వ్యక్తిని అడ్డుకుని, బాధితుడి ప్రాణం కాపాడాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చేతిలోని ట్యాబ్ కిందపడి డిస్ప్లే పోయింది. విషయాన్ని తన అధికారికి చెప్తే... అభినందించాల్సిందిపోయి దూషించారని తెలిసింది. దీంతో సదరు కానిస్టేబుల్ తన సొంత డబ్బుతో ట్యాబ్ బాగు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ సందేశం కొందరు కానిస్టేబుళ్లకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడంతో తొందరెందుకు అనే దోరణిలో కొందరు ఉన్నారు. -
పోలీసుల కళ్లెదుటే నడిరోడ్డుపై.. నరికి చంపారు
సాక్షి, హైదరాబాద్ : కన్న కొడుకును హతమార్చాడని పగబట్టిన ఓ తండ్రి బావమరిదితో కలసి రంగంలోకి దిగాడు. దాదాపు 9 నెలలుగా అదను కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. పరోక్షంగా హతుడి అన్న ఇచ్చిన సమాచారంతో బుధవారం ఉదయం అత్తాపూర్ వద్ద కాపుకాశారు. అందరూ చూస్తుండగానే పోలీసుల కళ్ల ఎదుటే దారుణంగా నడిరోడ్డుపై పరిగెత్తించి నరికి చంపారు. హతుడి ఒంటిపై కత్తి, గొడ్డలికి సంబంధించి 17 బలమైన గాయాలను పోలీసులు గుర్తించారు. పట్టపగలు 11.30 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ఎర్రగడ్డలో తండ్రి కత్తివేటుకు తీవ్రంగా గాయపడిన మాధవి ఉదంతం జరిగిన వారానికే రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. నగరంలోని జుమ్మేరాత్‌బజార్‌కు చెందిన మహేశ్‌గౌడ్ ఓ వివాహితకు సంబంధించిన వివాదంలో గత ఏడాది డిసెంబర్ 24న నగర శివార్లలో దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో జుమ్మేరాత్ బజార్‌కే చెందిన జె.రమేశ్ (24) ప్రధాన నిందితుడు. హతుడు, నిందితుడు పక్కపక్క ఇళ్లవారే. ఆ కేసులో బెయిల్‌పై వచ్చిన తర్వాత రమేశ్ తన మకాం మార్చేశాడు. తన కదలికల్ని మహేశ్ సంబంధీకులకు తెలియనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అప్పటి నుంచి మహేశ్ తండ్రి వి.కిషన్‌గౌడ్ (వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్) తన కుమారుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని పగతో రగిలిపోయాడు. ఇతనికి బావమరిది ఎ.లక్ష్మణ్ గౌడ్ (టెంట్‌హౌస్ నిర్వాహకుడు) కూడా తోడయ్యాడు. ఇద్దరూ రమేశ్‌ను హత్య చేయడానికి అదును కోసం ఎదురు చూశారు. రమేశ్ ఆచూకీ కోసం అతడి అన్న, సోదరి ఇళ్ల వద్ద కాపుకాసినా ఫలితం దక్కలేదు. మాటల్లో పెట్టి వివరాలు ఆరా... ఇటీవల ఓ సందర్భంలో రమేశ్ అన్న ఇంటికి వెళ్లిన కిషన్ మాటల సందర్భంలో అతని వివరాలు ఆరా తీశాడు. అతడు ఎక్కడ ఉంటున్నాడో తనకు తెలియదని చెప్పిన అన్న... 26న కోర్టు వాయిదా ఉండటంతో ఉప్పర్‌పల్లి న్యాయస్థానానికి వస్తాడని చెప్పాడు. దీంతో బుధవారం హత్య చేసేందుకు కిషన్, లక్ష్మణ్ సిద్ధమయ్యారు. మద్యం సేవించి గొడ్డలి, కత్తి తీసుకుని ద్విచక్ర వాహనంపై వచ్చి అత్తాపూర్ ప్రాంతంలో కాపుకాశారు. ఉప్పర్‌పల్లి కోర్టులో విచారణకు మిగిలిన నిందితులు నరేశ్, శివతో కలసి రమేశ్ హాజరయ్యాడు. తర్వాత రెండు బైక్‌లపై ఎస్బీఆర్ గార్డెన్ నుంచి హైదర్‌గూడ చౌరస్తా మీదుగా వెళుతున్నారు. కిషన్, లక్ష్మణ్ బైక్‌పై అతడిని అనుసరించారు. అత్తాపూర్‌లోని హైదర్‌గూడ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నం.134 వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో రమేశ్ వాహనం స్పీడు తగ్గింది. ఇదే అదునుగా భావించిన కిషన్ వాహనం దిగి రమేశ్‌ను పట్టుకోబోయాడు. ఇది గమనించిన రమేశ్ వాహనం దిగి పారిపోయే ప్రయత్నం చేశాడు. ‘నన్ను చంపేందుకు వస్తున్నారు.. కాపాడండి’అంటూ నడిరోడ్డుపై పరుగు ప్రారంభించాడు. అప్పటికే రమేశ్‌పై కత్తితో కిషన్, గొడ్డలితో లక్ష్మణ్ దాడి చేయడంతో కొంత వరకు గాయాలయ్యాయి. రమేశ్‌తో ఉన్న మిగిలిన ముగ్గురూ ప్రాణభయంతో అక్కడ నుంచి ఉడాయించారు. అడ్డుకోవడం మానేసి... చిత్రీకరణ... కాగా అటుగా వచ్చిన ఆటోలో ఎక్కిన రమేశ్ కాస్త ముందుకువెళ్లి అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగమూర్తి వద్దకు చేరుకున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ కిషన్, లక్ష్మణ్‌ను నిలువరించే ప్రయత్నం చేయబోయి వారి చేతుల్లో గొడ్డలి, కత్తి కనిపించడంతో వెనక్కి తగ్గాడు. ఈలోపు రమేశ్ పిల్లర్ నం.140 వద్దకు పరిగెడుతూ వెళ్లాడు. సమీపంలోని బాంటియా షోరూమ్ మేనేజర్ సురేశ్ అప్రమత్తమై హంతకుల్ని పట్టుకునే ప్రయత్నం చేసినా... ఫలితం దక్కలేదు. లక్ష్మణ్ తన చేతిలోని కత్తితో బెదిరిస్తూ వారించాడు. కాస్త ముందుకు వెళ్లిన సురేశ్ ఓ వాహనం అడ్డురావడంతో కింద పడిపోయారు. దీంతో కిషన్, లక్ష్మణ్‌లు రమేశ్‌ను చంపడానికి ముందుకు వెళ్లారు. లక్ష్మణ్ అదుపు తప్పి కిందపడగా... కిషన్ గొడ్డలితో రమేశ్ కాలు మీద బలంగా నరికాడు. తర్వాత లేచిన లక్ష్మణ్ అదే గొడ్డలితో కిందపడిన రమేశ్ మెడపై 3 వేట్లు వేశాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్, మరొకరు కిషన్‌పై హెల్మెట్ విసిరినా.. మరో వ్యక్తి ఎగిరి కిషన్ తన్నినా.. మళ్లీ తేరుకొని ఇద్దరూ కలసి మరో 7 వేట్లు వేశారు. నిందితులు రమేశ్‌ను గొడ్డలితో నరుకుతుండటంతో లింగమూర్తి కూడా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. ఇంత జరుగుతున్నా ఓవైపు వాహనాలు యథావిధిగా వెళ్లగా.. మరోవైపు చుట్టూ ఉన్న వారు సెల్ఫోన్లలో చిత్రీకరించే చేశారే తప్ప ఆపేందుకు ముందుకు రాలేదు. బేటా.. నీతానికి పంపించేసిన... అదే సమయంలో ఓ దొంగ అత్తాపూర్ వైన్స్ వద్ద ఉన్నాడన్న సమాచారంతో పెట్రోలింగ్ వాహనం అటు వచ్చింది. ఈ హత్యను చూసి ఇద్దరు కానిస్టేబుళ్లు అందులోంచి దిగారు. వాహనం రోడ్డుపై పడి ఉన్న రమేశ్‌ను దాటుకుంటూ ముందుకు వెళ్లిపోగా... ప్లాíస్టిక్ లాఠీలు మాత్రమే ఉన్న ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు.. నిందితులు గొడ్డలితో నరుకుతుండటంతో దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు. రమేశ్ చనిపోయాడని నిర్ధారణకు వచ్చాక కిషన్, లక్ష్మణ్‌లు ‘బేటా... పంపించేసిన... నీతానికి పంపించేసిన’అంటూ గట్టిగా అరిచారు. కొనఊపిరితో ఉన్న రమేశ్ వద్దకు వెళ్లిన కిషన్ సమీపంలో పడి ఉన్న గొడ్డలిని తీసి అతడికి చూపించాడు. రక్తం మరకలు అంటిన చొక్కాను విప్పిన లక్ష్మణ్... రమేశ్‌పై పడేశాడు. ఆపై ఇద్దరూ పోలీసుల వాహనంలో రాజేంద్రనగర్ స్టేషన్‌కు వెళ్లారు. రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆ వెంటనే రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, ఇన్స్పెక్టర్ సురేశ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్‌టీమ్ కూడా శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. కాగా ఫొటోలు, వీడియోల్లో ఇద్దరు మాత్రమే కనిపిస్తుండగా, నిందితులు మొత్తం నలుగురు వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. నన్ను... చంపేందుకు వస్తున్నారు... కాపాడండి అంటూ... యువకుడు వచ్చాడు. వెనకే ఇద్దరు గొడ్డలి పట్టుకొని దాడి చేసేందుకు వచ్చారు. వారిని నిలువరించే ప్రయత్నం చేశా. ఒకరిని పట్టుకొని పక్కకు తప్పించగానే మరొకరు దాడి చేస్తున్నారు. యువకుడు అలా పరిగెత్తి కుప్పకూలాడు. వద్దని వారించినా.. అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే సెట్ ద్వారా సమాచారాన్ని అందించాను. – లింగమూర్తి కాపాడండి అన్న అరుపులు విని బయటికి చూశా. వెంటనే వచ్చి అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా.. ఒకరి తరువాత ఒకరు దాడి చేస్తుండటంతో నివారించలేకపోయా. నా శాయశక్తులా కృషి చేసినా ఫలితం దక్కలేదు. నాతో పాటు ఈ దారుణాన్ని ఆపేందుకు ఒకరిద్దరు వచ్చినా ముందుకు వచ్చినా హంతకుల్ని పట్టుకునేవాళ్లం.. రమేశ్ బతికేవాడు. –సురేశ్ ఇద్దరు దొంగలను తీసుకొని మరో దొంగ అత్తాపూర్ వైన్స్ వద్ద ఉన్నాడన్న సమాచారంతో పట్టుకునేందుకు పెట్రోలింగ్ వాహనంలో బయలుదేరాం. పిల్లర్ నంబర్ 143 వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు ప్రమాదం జరిగిందేమో అనుకుని సైరన్ వేసుకొని ముందుకు వచ్చాం. ఒక యువకుడు కిందపడి ఉండగా మరో వ్యక్తి గొడ్డలితో నరుకుతున్నాడు. వెంటనే కిందకు దిగి ముందుకు వచ్చాం. అప్పటికే గొడ్డలితో నరుకుతున్న వ్యక్తి దాన్ని పడేసి అరుస్తూ మరో వ్యక్తి వద్దకు వచ్చాడు. తర్వాత నిమిషం వ్యవధిలోనే ఇరువురిని పట్టుకుని బంధించాం. – శేఖర్ (క్రైమ్ కానిస్టేబుల్). నా కుమారుడిని దారుణంగా చంపేశాడు. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి రమేశ్ కోసం వెతుకుతున్నం. ఇంటి పక్క నుంచి ఖాళీ చేసి ఎక్కడో ఉంటున్నడు. వాళ్ల అన్నా, చెల్లి ఇళ్లకు వెళ్లి చూసినా దొరకలేదు. 26న కోర్టుకు వస్తడని రమేశ్ వాళ్ల అన్న నర్సింహ్మ చెప్పిండు. దీంతో ఉదయమే అతడిని చంపాలని సిద్ధమైనం. రోడ్డుపై దొరికాడు.. చంపేశా. దీంతో లెక్క సమానమైంది. నా కొడుకును చంపాడు... నేను రమేశ్‌ను చంపా అంతే. ఎలాంటి శిక్షకైనా సిద్ధమే. –కిషన్‌గౌడ్, మహేశ్ తండ్రి అల్లుడు చనిపోయినప్పటి నుంచి బావ మనిషిలో మనిషి లేడు. రమేశ్ కోసం అంతా తిరిగాం. ఇవాళ వస్తడని వాళ్ల అన్న చెప్పిండు. ఉదయమే బావ కిషన్‌గౌడ్ గొడ్డలి తీసుకొని వెళ్తుండటంతో నేనూ వెంట వచ్చా. బావ రమేశ్‌ను పట్టుకునేందుకు వెళ్లగా.. పరిగెత్తాడు. నేను కూడా పరిగెత్తి పట్టుకొని కొట్టాం. మాపై కత్తితో దాడి చేశాడు. దీంతో గొడ్డలితో నరికేశాం. – లక్ష్మణ్‌గౌడ్, మహేశ్ మామ ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ హత్య కేసులో నిందితుడి ఉన్న రమేశ్‌గౌడ్ కోర్టు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో నడిరోడ్డుపై విచక్షణారహితంగా హత్య చేసిన నిందితులపై రౌడీషీట్‌తో పాటు పీడీ యాక్ట్ నమోదు చేశామని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. నిందితులు 3 రోజుల పాటు రెక్కి చేసి పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డారన్నారు. హత్య చేస్తున్న సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లింగయ్య కాపాడే ప్రయత్నం చేశారన్నారు. వీడియోల్లో కనిపిస్తున్న రక్షక్ వాహనం.. మఫ్టీలోని ఇద్దరు కానిస్టేబుళ్లు దిగిన తర్వాతే ఆ వాహనం ముందుకు వెళ్లిందన్నారు. వారే నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. పోలీసు వాహనం పట్టించుకోకుండా పోతున్నట్లుగా చూపిస్తున్నది అవాస్తమన్నారు. హత్య చేసిన కిషన్‌గౌడ్, లక్ష్మణ్‌గౌడ్ పోలీసుల అదుపులోనే ఉన్నారన్నారు. ఇందులో కిషన్‌గౌడ్ మానసిక స్థితి సరిగ్గా లేదని ఆయన చికిత్సపొందుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
అమానుషం..అందరూ చూస్తుండగానే దారుణ హత్య
-
నడిరోడ్డు పై యువకుడిని నరికిన దుండగులు
-
అందరూ చూస్తుండగానే అత్తాపూర్‌లో దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : అత్తాపూర్‌లో పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ ముందే జుమెరాత్ బజార్‌కు చెందిన రమేష్‌ని గొడ్డలితో నరికి అతిదారుణంగా చంపారు. అత్యంత రద్దీగా ఉండే పిల్లర్ నంబర్ 138 వద్ద నలుగురు వ్యక్తులు కలిసి రమేష్‌ని హత్య చేశారు. స్థానికులు, పోలీసులు కలిసి హత్య చేసిన వ్యక్తిని, అతనికి సహకరించిన మరో వ్యక్తిని పట్టుకుని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కాగా ఈ హత్యతో ప్రమేయమున్న మరో ఇద్దరు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పాత కక్షల నేపథ్యంలో రమేష్ హత్య జరిగినట్టు తెలుస్తోంది. పది నెలల కిందట శంషాబాద్‌లో జరిగిన మహేష్ గౌడ్ హత్య కేసులో రమేష్ ప్రధాన నిందితుడు. ఈ కేసు విషయమై ఉప్పరపల్లి కోర్టుకు వస్తుండగా నిందితులు అతనిపై దాడి చేశారు. కాగా, మహేష్ గౌడ్ తండ్రే రమేష్‌ను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.