ఏషియన్ సినిమాస్ ప్రారంభించిన చెర్రీ, సమంత | Ram Charan, Samantha launches Asian Cinemas theatre at Attapur | Sakshi
Sakshi News home page

ఏషియన్ సినిమాస్ ప్రారంభించిన చెర్రీ, సమంత

Published Thu, Oct 2 2014 1:16 PM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

ఏషియన్ సినిమాస్ ప్రారంభించిన చెర్రీ, సమంత

ఏషియన్ సినిమాస్ ప్రారంభించిన చెర్రీ, సమంత

హైదరాబాద్ : హీరో రాంచరణ్, హీరోయిన్ సమంత గురువారం అత్తాపూర్లోని ఏషియన్ సినిమాస్ థియేటర్ను ప్రారంభించారు. ఏషియన్‌ సినిమాస్‌ అధినేతలు నారాయణదాస్‌ నరేన్‌, సునీల్‌ నారాయణ్‌, భరత్‌ నారాయణ్‌, డి.సురేష్‌బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో ఐమాక్స్, ఐనాక్స్ తరహాలో ఏషియన్ సినిమాస్ కూడా తన వ్యాపారాన్ని విస్తరించుకుంటోంది.

 

నగర శివారులో కూడా సౌకర్యవంతమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించేందుకు ఏషియన్ సినిమాస్ థియేటర్ను అత్తాపూర్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా రాంచరణ్, డి సురేష్ బాబు తదితరులు థియేటర్లో కొద్దిసేపు సినిమాను తిలకించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement