D. Suresh Babu
-
ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన రుహానీ శర్మ
రుహాణీ శర్మ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ‘హర్’. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో రఘు సంకురాత్రి, దీపాసంకురాత్రి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఈ సినిమా జూలై 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత డి. సురేష్‌బాబు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: పవన్. -
వేసవి తర్వాత...
వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ సినిమా తెరకెక్కించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై డి. సురేశ్ బాబు నిర్మించనున్నారు. ఆ మధ్య స్టోరీ లైన్ చెప్పిన తరుణ్ భాస్కర్ ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ను పూర్తి చేశారట. వెంకటేశ్, సురేష్ బాబులకు కథ వినిపించగా వారు పచ్చజెండా ఊపారని టాక్. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ నటిస్తున్న ‘నారప్ప’ షూటింగ్ పూర్తయిన తర్వాతనే తరుణ్ భాస్కర్ సినిమాలో జాయిన్ అవుతార ట వెంకీ. ఈ సినిమా హార్స్ రేసింగ్ నేపథ్యంలో సాగుతుందట. -
‘ఏబీసీడీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
పెళ్లి చూపులు అంతటి హిట్ అవ్వాలి
– డి. సురేశ్‌బాబు ‘‘మెంటల్ మదిలో’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్లో కథ గురించి చెప్పిన విషయాలు ఆసక్తిగా ఉన్నాయి. వివేక్ ఆత్రేయ సరికొత్త ప్రయత్నంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘పెళ్లి చూపులు’లానే ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించాలి’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం ‘మెంటల్ మదిలో’. ఈ చిత్రం ట్రైలర్‌ను సురేశ్‌బాబు విడుదల చేశారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘షార్ట్ ఫిల్మ్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకొన్న వివేక్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది. మా టీమ్ అంతా సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ట్రైలర్ రిలీజ్ చూసి, మమ్మల్ని సురేశ్‌గారు అభినందించడం హ్యాపీగా ఉంది. త్వరలోనే పాటలను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
నాన్నగారి కలలు నెరవేరుస్తా
‘‘నాన్నగారు ఈ లోకాన్ని విడిచి అప్పుడే రెండేళ్లు అయ్యిందంటే నమ్మలేకపోతున్నా. ఈ రెండేళ్లల్లో నాన్నగారిని తలచుకోని రోజు లేదు. ఇంట్లో, ఆఫీసులో, స్నేహితులతో, చుట్టాలతో నాన్న గురించి మాట్లాడని రోజు లేదు. ఆయనెప్పుడూ మా మనసుల్లోనే ఉన్నారు’’ అని ప్రముఖ నిర్మాత, స్వర్గీయ డి. రామానాయుడి పెద్ద కుమారుడు డి. సురేశ్‌బాబు అన్నారు. నేడు రామానాయుడుగారి ద్వితీయ వర్ధంతి. ఈ సందర్భంగా డి. సురేశ్‌బాబు ‘సాక్షి’ సినిమాతో మాట్లాడారు. ‘‘నాన్నగారు చాలా మంచి మనిషి. జీవితంలో ఆయనకు ఒక్క శత్రువు కూడా లేరు. అందరూ స్నేహితులే. ప్రతి ఒక్కరితో బాగుండేవారు. ఒకవేళ ఎవరితోనైనా ఏదైనా ఉంటే... ‘ఫర్గివ్ అండ్ ఫర్గెట్’ అనేది ఆయన పాలసీ. ‘నేను వెళ్లిన తర్వాత నా గురించి తెలుస్తుంది రా’ అని అనేవారు. ఆయన మాటలు అక్షర సత్యాలు. ఇప్పుడు అచ్చంగా అలానే ఉందని చెప్పాలి. మంచి విషయం ఏంటంటే... గతేడాది నాన్నగారి జ్ఞాపకంగా మా రామానాయుడు స్టూడియోలో మెమోరియల్ నిర్మించాం. ఈ ఏడాది ఆ మెమోరియల్‌కి ఇండియాలో స్టోన్ ఆర్కిటెక్చర్ విభాగంలో స్పెషల్ అవార్డు వచ్చింది. మరణించిన తర్వాత కూడా నాన్నకు అవార్డులు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ఈ ఏడాది నాన్నగారి జయంతి (జూన్ 6) లోపు మా మెదక్‌లో ‘డాక్టర్ డి. రామానాయుడు కృషి విజ్ఞాన కేంద్రం’ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని సురేశ్‌బాబు తెలిపారు. ‘‘ఆల్రెడీ ప్రభుత్వానికి అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. రాగానే కృషి విజ్ఞాన కేంద్రం ప్రారంభిస్తాం’’ అన్నారు. సినిమాల విషయానికి వస్తే... ‘రాముడు–భీముడు’ చిత్రాన్ని రంగుల్లోకి మార్చాలనేది నాయుడి గారి కల. అలాగే, మీ ఫ్యామిలీ హీరోలు వెంకటేశ్, నాగచైతన్య, రానాలతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ఆయన కలలను నిజం చేస్తారా? అని సురేశ్‌బాబును అడిగితే... ‘‘తప్పకుండా. సరైన సమయంలో వెంకటేశ్– చైతు–రానా సినిమా ప్రకటిస్తాం. త్వరలో ‘రాముడు– భీముడు’ని రంగుల్లోకి మార్చే ప్రక్రియ మొదలవుతుంది’’ అన్నారు. ‘‘రానా దగ్గర నాన్నగారు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు – ‘త్వరలో చేసుకుంటా తాతా’ అనేవాడు. ‘ఘాజీ’ సినిమా ఆయన చూస్తే మనవణ్ణి చూసి గర్వపడేవారు’’ అన్నారు. -
‘ప్రేమనగర్’ రీమేక్ చేయాలనుంది
– సురేశ్‌బాబు ‘‘ఇప్పడు కొత్తవాళ్లతో సినిమా చేయడం రిస్క్. రామ్మోహన్ ఓ ఫ్యాషన్‌తో కొత్త వాళ్లతోనే చిత్రాలు చేస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నారు’’ అని ‘పిట్టగోడ’ చిత్ర సమర్పకులు డి.సురేశ్‌బాబు అన్నారు. విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం జంటగా అనుదీప్ కె.వి.దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్ పి. నిర్మించిన ‘పిట్టగోడ’ ఈనెల 24న రిలీజవుతోంది. సురేశ్‌బాబు మాట్లాడుతూ... నలుగురు కుర్రాళ్లు తమ కలల్ని ఎలా నిజం చేసు కున్నారన్నదే ‘పిట్టగోడ’ కథ. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ఈ చిత్రం చూసినవారందరికీ తమ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ∙ తేజ దర్శకత్వంలో మా అబ్బాయి (రానా) హీరోగా ఓ మూవీ చేస్తున్నా. రవిబాబు దర్శకత్వంలో నేను నిర్మించిన ‘అదుగో’ చిత్రం పూర్తయింది. వేసవిలో విడుదల చేస్తాం. ∙నాగచైతన్య, రానా కాంబినేషన్లో ఓ చిత్రం నిర్మించనున్నాం. ‘పెళ్లిచూపులు’ ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త వాళ్లతో తీయనున్న చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు ‘ప్రేమనగర్’ చిత్రం రీమేక్ చేయాలని ఉంది’’ అన్నారు. చిత్ర నిర్మాత రామ్మోహన్, దర్శకుడు అనుదీప్, చిత్రబృందం తదితరులు పాల్గొన్నారు. -
జెండర్‌ని బట్టి అంచనా వేయడం తప్పు!
ప్రతి డెరైక్టర్‌కీ స్ట్రగుల్స్ ఉంటాయి. అయితే, లేడీ డెరైక్టర్ని కావడం నాకు ఎడ్వాంటేజ్, డిజ్ ఎడ్వాంటేజ్ - రెండూ అయింది. నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నట్లు ‘అంచనాలేవీ ఉండకపోవడం’ ఒక ఎడ్వాంటేజ్. అమ్మాయిని కాబట్టి, ఏ డాక్యుమెంటరీ కథో, లేడీ ఓరియంటెడ్ కథో చెబుతాననుకొంటారు. అయితే, కొంచెం మంచి కథ చెప్పినా, భలే చెప్పిందనుకుంటారు. అది ప్లస్ పాయిం టని సురేశ్‌బాబు అన్నారు. ఏది ఎలా ఉన్నా, కొండ ఎక్కాలి తప్పదు అనుకుంటే అందులో వచ్చే కష్టనష్టాల గురించి ఆలో చిస్తూ కూర్చోకూడదు. నేను ట్రెక్కింగ్‌కు వె ళ్లినప్పుడు ఫస్ట్ రోజు కొండ ఎలా ఎక్కాలా అని భయపడ్డా. కానీ ‘ఎక్కాలి, తప్పదు’ అనుకున్నాక, ఎప్పుడూ తరువాత వేసే నాలుగు అడుగుల మీదే దృష్టి పెట్టేదాన్ని. ఆ నాలుగూ కాగానే, మళ్ళీ నాలుగే అడుగులు అనుకుంటూ ముందుకెళ్ళేదాన్ని. అలా డెరైక్టర్ కావడానికి ఆరేళ్ళపాటు పడని కష్టం లేదు. చుక్కలు చూశా. నా మొదటి సినిమా ‘అలా మొదలైంది’ (2011) నిర్మాణం, రిలీజ్‌కి కూడా అంతే! ఆ సినిమా రిలీజయ్యాక ఊహించని సక్సెస్ అవడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ ఇప్పుడు మూడో సినిమా ‘కళ్యాణ వైభోగమే’ సక్సెస్ అయింది. ఏ ఫీల్డ్ అయినా టాలెంట్ మీద బేస్ అయి ఉంటుంది. జెండర్‌తో ముడిపడిన వ్యవహారం కాదు. ప్రతిభను స్త్రీనా, పురుషుడా అనే జెండర్‌ను బట్టి అంచనా వేయడం తప్పు. ఒక వ్యక్తి ఓ స్థాయికి రీచ్ అయ్యాడంటే అతను పడిన కష్టాలు, అనుభవాలు అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ మానేసి మనం జెండర్ ఒకటే చూస్తాం! జెండర్ బట్టి మహా అయితే టెంపర్మెంట్ డిసైడ్ అవుతుంది. అంతే! ‘వాళ్లు అమ్మాయిలు కాబట్టి సాఫ్ట్’ అని అంటూ ఉంటారు. కానీ, బేసిగ్గా మనస్తత్వానికీ, జెండర్‌కూ ఎలాంటి సంబంధమూ లేదు. ఇంటిని మొత్తం మేనేజ్ చేసే ఆడవాళ్లకి సినిమా నిర్మాణంలోని 24 క్రాఫ్ట్లూ హ్యాండిల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కాంప్లికేషన్స్ అనేవి నువ్వు ఎలా వాటిని ఫేస్ చేయగలుగుతున్నావనేది పాయింట్ గానీ అక్కడ జెండర్ ఉండదు. నా మటుకు నేను -కెమేరా పక్కకు జరపడం దగ్గర నుంచి ఏదైనా సరే -ఒక పని జరగాలీ అంటే, అందరినీ గట్టిగా పిలుస్తూ, అరుస్తూ, హుషారెత్తిస్తూ నేనూ ఓ చెయ్యేసి, పనిచేసేస్తా. ఇతరుల మీద ఆధారపడను. పని జరగడం ముఖ్యమే తప్ప, ఎవరు చేశారన్నది కాదు. క్లాప్ కొట్టడం దగ్గర నుంచి ఏదైనా అసిస్ట్ చేసేస్తా! నన్నడిగితే, ఇంకొన్నేళ్లలో ‘లేడీ డెరైక్టర్స్’ అనే మాటే ఉండదు. కేవలం ‘డెరైక్టర్’ అనేదే ఉంటుంది. ఇప్పటికే ఆ మార్పు వచ్చేస్తోంది. ఇవాళ ఇండియాలో అగ్రశ్రేణి డెరైక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో గౌరీ షిండే, అంజలీ మీనన్, జోయా అఖ్తర్ లాంటి మహిళల పేర్లు ఉన్నాయి. - నందినీ రెడ్డి, సినీ దర్శకురాలు (‘అలా మొదలైంది’, ‘కళ్యాణ వైభోగమే’ ఫేమ్) -
ఏషియన్ సినిమాస్ ని లాంచ్ చేసిన రామ్ చరణ్,సమంత
-
ఏషియన్ సినిమాస్ ప్రారంభించిన చెర్రీ, సమంత
హైదరాబాద్ : హీరో రాంచరణ్, హీరోయిన్ సమంత గురువారం అత్తాపూర్‌లోని ఏషియన్ సినిమాస్ థియేటర్‌ను ప్రారంభించారు. ఏషియన్ సినిమాస్ అధినేతలు నారాయణదాస్ నరేన్, సునీల్ నారాయణ్, భరత్ నారాయణ్, డి.సురేష్‌బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో ఐమాక్స్, ఐనాక్స్ తరహాలో ఏషియన్ సినిమాస్ కూడా తన వ్యాపారాన్ని విస్తరించుకుంటోంది. నగర శివారులో కూడా సౌకర్యవంతమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించేందుకు ఏషియన్ సినిమాస్ థియేటర్‌ను అత్తాపూర్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా రాంచరణ్, డి సురేష్ బాబు తదితరులు థియేటర్లో కొద్దిసేపు సినిమాను తిలకించారు. -
బెజవాడలోనైనా సినిమా తీయొచ్చు
నిర్మాత డి.సురేష్‌బాబు విజయవాడ : టెక్నీషియన్స ఉంటే బెజవాడలోనైనా చలనచిత్రాన్ని నిర్మించవచ్చని ప్రముఖ సినీ నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. ‘దృశ్యం’ చిత్రం విడుదల సందర్భంగా శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ర్టం విడిపోవడం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు ఎటువంటి నష్టం ఉండదన్నారు. సరైన టెక్నీషియన్స్ ఉంటే బెజవాడలోకూడా సినిమా తీసే అవకాశాలు ఉన్నాయన్నారు. కేరళలో ఏప్రాంతంలోనైనా సినిమాలు తీస్తారని చెప్పారు. దృశ్యం సినిమా యూత్, ఫ్యామిలీని ఆకట్టుకుంటుందన్నారు. చిత్రం బావుందని చాలంమంది ప్రశంసిస్తున్నారని చెప్పారు. వెంకటేష్, పవన్ కల్యాణ్ కలిసి నటిస్తున్న గోపాలా..గోపాలా చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపారు.